|
|
Articles: Short Stories | స్వర్గ యాతన - Site Administrator
| |
ఎలిపొస్తన్నాయి గేపకానికెలిపొస్తున్నాయి. దశిమికి ముందు పదిరోజుల్నుంచి సరదాలు మొదలయ్యేవి. ఒకరోజు పొద్దుపోయేక - 5-9 చిన్నచిన్న దివ్వెలు గంపలో అమిర్చి, ఊరిచివర అమ్మోరు చెట్టు మొదట్న దివ్వెల్ని దింపీ, ఊరుమ్మడిగా కొన్న పెద్ద మేకపోతుతో ఆ వూరి భూసోమి చేత అమ్మోరికి బలి ఇప్పించేవాళ్ళు... ఆ మాంసాన్ని పిసర పిసరంత ప్రతి ఇంటికీ పంపేవారు. చిన్నా చితక కుటుంబాలు కోడినో గొర్రినో బలిచ్చి సొంతంగా సంబరం చేసుకొనేవాళ్ళు. బలిచ్చిన మేకపోతు రక్తాన్ని ఊడిక కొమ్మలకు పట్టించి... 'పొలి పొలో.. పొలి! పొలి' అని అరుచుకుంటూ వెనక్కి తిరగకుండా పరుగులెత్తి పొలాల్లో పాతేవాళ్ళు.
ఆ వారం సంతల్లో - వెదురు బద్దలకు రంగు ముంచి కాగితాలంటించి, వాటిని వంచి బాణాలు కట్టి... బాణంపుల్ల చివర పువ్వులు కూరేందుకు డొప్పలు (శంకువు ఆకారం) కట్టి, నులక (కొబ్బరి పీచుతో అల్లిన సన్ననితాడు)తో బాణాన్ని బిగించి... అణాకి, బేడకీ... సైజునూ రంగుల్ని బట్టి పావలాకి అమ్మేవాళ్ళు. ఊరి బడిసాలల్లో పిల్లలకి చదువు చెప్పే మేస్టర్లు (టీచర్స్) పిల్లల చేత ఈ దసరా బాణాలు కొనిపించి, దసరా పాటలు నేర్పించి... పిల్లలందర్నీ తీసుకొని ఇంటింటికీ తిప్పి పాటలు పాడించి డబ్బులు వసూలు చేయించేవారు... వారికవే జీతాలు పాపం... ఇలా పాడి, మేం - డబ్బులు వసూలు చేసేవాళ్ళం.
'పావలా యిస్తే పట్టీది లేదు
అర్దు రూపాయిస్తే అంటీది లేదు
మచ్చపక యిస్తే ముట్టీది లేదు
ఇచ్చు రూపాయి యిస్తేనే చెల్లుబడి మాకు...' ఇలా బాణాలు ఎక్కుపెట్టి రూపాయి ఇచ్చేవాళ్లపై పువ్వుల్ని రువ్వేవాళ్ళం... ఆ ఇంటి తల్లులు పళ్ళేలతో పప్పుబెల్లాలు తెచ్చి వాకిట్లో వరుసగా పిల్లల్ని నిలబెట్టి పంచిపెట్టేవారు. ఎందరు పంతుళ్ళు మాతో వస్తే అందరికీ తలో రూపాయి పెట్టేవాళ్ళు... అక్కడి నుండి ఆ పొరుగింటికీ... అలాగలాగ... ఊరంతా తిరిగీసరికి మధ్యాహ్నమయ్యేది... పప్పుబెల్లాలు తిని కడుపులుబ్బి పోయేవి. మధ్యాహ్నం తిండి తినుబుద్దేసేది గాదు... ఈ విషయం గ్రహించిన అమ్మ - దగ్గరకు హత్తుకొని... నా బాణం పుల్లా... నా పాటా.. ఆమె ముఖాన తుళ్ళగొట్టిన పువ్వుల స్పర్శలూ గుర్తుకుతెచ్చుకొని... 'ఓరి నాయమ్మే... ఇప్పుడేమీ తినొద్దులేరా... మాపిటికి తిందువుగాని... పో... ఆడుకో!' అని వదిలీసిది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|