|
|
Articles: Short Stories | పాలమ్మ - Site Administrator
| |
సుజాత కండ్లల్ల నీల్లు తిరిగినయ్...
'దాని పాలు తాగక ఎన్నేండ్లాయె బిడ్డా... ఓ పారి ఎప్పుడో.... మూడో ఈత బర్రెయి గిలాసెడు పాలు తాగిన నోట్లో అముర్తం పోసుకున్నట్లు... ఇది తొమ్మిదో ఈత బర్రెనాయె' అన్నది.
తల్లి గోస చూడడానికి రాజేశానికైతే మనసొప్పతలేదు... ఎందుకో.. దగ్గరికి రాలేకపోతున్నడు... కోడి కూయక ముందు రాయేశా... పాలు పిండి వాడుకాలు పోసిరా పో బిడ్డా... అని మంచంకెల్లి అంటది. నిద్ర లేపుతది.
రాజేశం లేసి సైకిలేసుకోని పోతడు...
సుజాతని పిలిచి 'ఒక్కోసారి బర్రెకు నాలుక మీద ముండ్లత్తయి బిడ్డా... ఉప్పు, పసుపు కలిపి నాలుక మీద బాగ రాయాలె... రేపోసారి రాయమని రాజేశానికి చెప్పు...' అని నాల్రోజులకోసారి యాజ్జేత్తది.
రోజురోజుకు లస్మవ్వ పానం ఎండుకపోతంది...
'గింసోటి రాత అడక్కచ్చుకున్న... కడుపుల పుట్టినోల్లకన్న ఎక్కువనే అర్సుకోవడ్తివి...'అని రోజంత భారతం పెట్టినట్టు పాతులాడతది. రాజేశమైతే పిల్లిపిల్లోలె మంచం సుట్టు తిరిగిపోతడు.
'బర్రెకు తెల్కపిండి తెచ్చిపెట్టుండ్రి బిడ్డా... యాడాది పొడుగూత పసిగడుగులు, పచ్చగడ్డి తింటె నేరు చేదెక్కుతది' అనేది.
సుజాత మంచం దగ్గర కదలాడినప్పుడల్లా ఏదో మాట అంటనే ఉంటది. 'మనువన్నో, మనుమరాల్నో చూసి పోతననుకున్న... కుచ్చుల కుల్ల, జిట్టిపూసలు దెచ్చి సందుగుల పెట్టిన...' అని కండ్లనీల్లు తీసుకుంటది.
'దాలిల పాలకుండ పెట్టినంక షిబ్బి బోర్లేత్తున్నవా బిడ్డా... పిల్లి మూతి పెడ్తది. దాలికాన్నే కూసుంటుండె... మన బర్రెది పాలగోకు రుచిగుంటది... సల్లనైతే అడుక్కపోనోల్లు లేరు...'
ఇట్ల ఎప్పుడో మాట చెప్పే లస్మవ్వ నాల్రోజుల్నించి ఏం తింటలేదు. జావకాసి పోత్తే నాలుగు చెంచాలు తాగుతంది. బేదాన తినతిపిస్తే రెండు, మూడు తింటది.
నోటి మాట బందయింది...
రేపో... మాపో... అన్నట్టు అందరూ వచ్చి చూసి పోతుండ్రు...
ఓ రోజు పొద్దుగాల్నే... మంచంల గెక్ గెక్ మంటున్న అత్తని చూసి..
'అయ్యో.. మా అత్త ఎట్లనో చేత్తుందల్లో...' అని ఏడ్సుకుంట అందర్ని పిలిచింది సుజాత.
అయిదారుగురు ఆడోల్లు, మొగోల్లు బిరాన్నే ఉరికచ్చిండ్రు.
'పానాలు పోయేటట్టున్నయ్... కిందెయ్యిండ్రి... కిందెయ్యిండ్రి' అన్నరు. సుజాత ఏడ్సుకుంటనే జెట్టన తుంగచాప దెచ్చి పర్సింది... రాజేశం బొచ్చె గుద్దుకుంట ఉరికచ్చిండు...
లస్మవ్వను కిందేసిండ్రు...
కండ్లల్ల నీల్లతోని అందరికి దండం పెట్టింది...
'కొన్నన్ని తులసినీల్లు పొయ్యిండ్రి' అన్నారెవరో
పందిట్ల తులసాకులు తెంపి నీల్లల్ల వేసుకచ్చిండ్రు... చెంచతోని రాజేశంను నోట్లె పొయ్యిమన్నరు.
లస్మవ్వ ఏదో చెప్పాలని బల్మీటికి నోరు తెరిసింది...
'న్నా...కు...మ్...న...బర్...ర్రె...పా...లు...పొ...య్యిం...డ్రి...' అన్నది నాలికె పెకిలిచ్చుకుంట... గొంతెత్తలేదు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|