|
|
Articles: Short Stories | చదువూ సంస్కారం - Site Administrator
| |
ఇంత సుళువైనది, మరొకటి ఉండదని, ఏకంగా బడి ఎగ్గొట్టేసి, గ్యాంగు కూలీల్లోజేరి, క్రమంగా ఇళ్ళనిర్మాణ పనుల్లో చొరబడి తాపీ పరికరం తిప్పడం నేర్చుకొని ఎక్కువ కూలిడబ్బులు తెచ్చి తల్లి చేతిలో పెట్టేవాడు. చదువూ - సంపాదనకే గాదా! అది లేకుండా నైపుణ్యం సంపాదించుకుని, అంతస్తులే కట్టి - ఆ మేడ నేను కట్టిందే, ఈ 5 అంతస్తులు నేను కట్టిందే అని చెబుతుంటే... వీడిదగ్గర ఏ ఇంజనీరు పనికొస్తాడని పిస్తాది... అలాంటి నిపుణుడైనందునే, బాగా (ఇంటరు) చదువుకున్న రాములమ్మను పెళ్లిచేసుకోవడానికి భయపడలేదు. చదువెందుకూ... సత్యాన్ని తెలుసుకోవడానికీ, అందులోని సౌందర్యాన్ని గుర్తించడానికీ, ఆ సౌందర్య నిర్మాణంలోని సొగసుల్ని అనుభవించడానిక గదా చదువు.... అనిపిస్తుంది. సీతప్పడును అర్థం చేసుకుంటున్నప్పుడు.
ఉదయం ఇంకా ఎనిమిది కాలేదు. ఆ వాడలోకి టీవీల వాళ్ళు - సకల షూటింగు సరంజామాతో వచ్చిపడ్డారు. 'ఉదయం పనుల్లో' మునిగివున్న కుటుంబాల వాళ్ళు వీధినప్డడారు. టీవీ చానళ్ళవాళ్ళు ఏదో చెప్పి... ఆ విషయంపై మాట్లాడమని, వీధిలోకొచ్చిన ఆడామగా వెంటబడుతుంటే, సిగ్గుబడి, భయపడి గుడిశల్లో దూరిపోతున్నారు. ఇలాక్కాదని... కొందరు... రాములమ్మ దగ్గరకెళ్ళి, బతిమిలాడి ఆమెను టీవీ వాళ్ళ దగ్గరకు తీసుకొచ్చి నిలబెట్టారు. ఆమె మూతి దగ్గర 10 'మౌతులు' పెట్టి-
'ఈ పట్టణంలో... గుర్తింపు పొందలేదని చెప్పి... 70 ప్రయివేటు పాఠశాలలు మూసివేశారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?' టీవీ వాళ్ళ ప్రశ్న.
'పీడా విరగడైపోయింది...' అంది రాములమ్మ. అవాక్కయ్యారు. షూటింగు జరుగుతునే ఉంది. ఒక్క ఆకాశవాణి (రేడియో) వాడి దగ్గరే మౌతు తప్ప కెమేరా లేదు.
మరో ప్రశ్న 'మీ పిల్లల్నీ ప్రయివేటు బడుల్లో పెట్టారు కదా... మరి పిల్లల భవిష్యత్తేంటి?' అడిగారు.
'ఆశకొద్దీ పెట్టాం. ఆ - ఆశలు అడియాసలవుతున్నాయి. సర్కారు బడులు ఖాళీ అవుతున్నాయి... అందులో మా పిల్లల్ని చేర్పించుకుంటాం' అంది.
'సర్కారు బడుల్లో పిల్లలులేరనీ, టీచర్లను తీసేసారు గదా... ఒక్కరో అరో ఉన్నారంతే గదా.. మరెలా? పిల్లల్ని చేర్చి ఏం జేయగలరు?' ప్రశ్న.
'పిల్లల్ని చేర్చి, ఆఫీసర్లను ఈడ్చుకొచ్చి చూపి, టీచర్లను వెయ్యమంటాం. వెయ్యకపోతే, రాజకీయనాయకుల్ని నిలదీస్తాం...' అంది రాములమ్మ.
'అప్పటికీ... టీచర్లను వెయ్యకపోతే!' ప్రశ్నించారు. ఎలక్షన్లు ఎప్పుడూ వస్తునే ఉంటాయి గదా...ఓటు మీకే వేస్తామని అందర్నీ అన్ని పార్టీవాళ్ళనీ నమ్మించి వేలూ, లక్షలకొలదీ డబ్బులు గుంజి మేమే టీచర్లని వేసుకుంటాం' అంది రాములమ్మ. అవాక్కయ్యారు మళ్ళీ టీవీ వాళ్ళు.
ఇలాక్కాదని, మరోలా ప్రశ్నించారు టీవీ వాళ్ళు. 'ఓహో... మధ్యాహ్న భోజనాలున్నాయని ఆశపడుతున్నారు గదా?' అడిగారు.
'మేం అడుక్కుతినేవతాళ్ళం గాదు. డిమాండు చేసేవాళ్ళం. శ్రమచేసే వాళ్ళం. మమ్మల్ని చులకనగా చూసేహక్కు ఎవరిచ్చారు మీకు? 'అడుక్కు'తినేవాళ్లనూ, 'దోచుకు'తినేవాళ్ళను అడగండి అలాంటి ప్రశ్నల్ని కళ్ళెర్రగించి' చెప్పింది రాములమ్మ. 'అదే... మా అందరిమాటా... ' అన్నారు జనం! టీవీవాళ్ళు అక్కడినుండి ఉడాయించారు.
రాములమ్మకు జై కొట్టారు. ఆవాడాలో ప్రజలందరూ జ్ఞానంలోంచి తిరుగుబాటు, ఆ తిరుగుబాటులో ఆనందం పుట్టి ఊరుకోదు - నాయకత్వ లక్షణాలు పుడతాయన్నమాట!
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|