|
|
Articles: Short Stories | పొయెట్రీ ఆఫ్ లైఫ్ - Miss vijayalakshmi vijayalakshmi
| |
'వద్దు డాక్టర్! ఇంక నేను వినలేను' అన్నాను.
ఫర్వాలేదు. వినండి. ఇవన్నీ సజెషన్స్ మాత్రమే!' అంటూ మళ్లీ ఫార్వర్డ్ చేసిన సీ.డీ.ని ఆన్ చేశాడు.
'సోమూ! విన్నావుగా! ఇప్పుడు చెప్పు. ఈ దేశంలో మగాడు సుఖపడుతున్నాడా? ఆడది సుఖపడుతోందా? దూరపు కొండలు నునుపు. ఎవడికీ తాను చేస్తున్న ఉద్యోగం కానీ, తాను సంపాదించే సంపాదన గానీ సంతృప్తికరంగా ఉండవు. ఇంకా ఏదో వెలితి అనిపించి ఇతరులు బాగున్నారని అనుకుని అసూయపడతారు. మగాళ్లు ఆడవాళ్ల జీవితం సుఖమనుకుంటే, ఆడవాళ్లు మగవాళ్ల జీవితం సుఖమనుకుంటారు. దిస్ ఈజ్ పొయిట్రీ ఆఫ్ లైఫ్! సైకాలజీ!! అంతే. నిజానికి ఎవళ్లకు గానీ మగాళ్లుగా పుట్టడం గానీ ఆడవాళ్లగా పుట్టడం గానీ తమ చేతుల్లో ఉండదు. నాణెం ఎగరేస్తే బొమ్మ - బొరుసు పడటంలో ఫిఫ్టీ - ఫిఫ్టీ ఛాన్సు ఎలాగో అలాగే మగ ఆడ పుట్టుకలకు ఫిఫ్టీ - ఫిఫ్టీ ఛాన్సు. మనం మనకి తెలియకుండానే మగ గానో ఆడగానో పుడతాం. దట్సాల్. ఏ జెండరులో పుట్టినా మనిషిగా పుట్టినందుకు అది ఒక వరంగా భావించి ఆనందించాలి. ఇప్పుడు నిన్ను ఆ దేవుడు మగాడిగా పుట్టించినందుకు నువ్వెంతో గర్వపడాలి. అర్ధరాత్రి నడి రోడ్డు మీద బోర విరుచుకుని నడిచే ధైర్యం నీకుంటుంది. నీకున్న భద్రత ఆడదానికుండదు. ఇంక ఉద్యోగం మాటంటావా? ఆఫ్టరాల్! ఉద్యోగం వస్తే వస్తుంది. లేకుంటే లేదు. ప్రపంచంలో అందరూ ప్రభుత్వోద్యోగాలే చేస్తున్నారా? ప్రయివేటు సంస్థల్లోనూ ఉద్యోగాలు దొరకని నిరుద్యోగులెందరు లేరు. వాళ్లందరూ బతకటల్లా? ఏదో స్వయం ఉపాధి పెట్టుకుని, మరికొందరికి తన దగ్గర ఉపాధిని కల్పించటల్లేదా? జీవితాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలి. మగాడిగా పుట్టానా ఆడదానిగా పుట్టానా అని కాదు మనం ఆలోచించవలసింది. 'జీవితాన్ని ఒక గేమ్ అనుకుంటే, ఆ గేమ్‌ని మనం ఎంత చాకచక్యంగా ఆడామా?' అన్నది ఆలోచించాలి. జీవితంలో వీలైనన్ని గోల్స్ సాధించాలి. అండర్ స్టుడ్!!'
'ఇంక ప్రయివేట్ కంపెనీ ఉద్యోగాలంటావా? అవి మాత్రం ఏం సుఖమని? అవి బానిస బతుకులు. చాలీ చాలని జీతాలు. ఎంతసేపూ సలాం కొడుతూ ఊడిగం చేసే జీవితాలు. అసలు గొప్పవాళ్లంతా స్వశక్తిపై, పైకొచ్చిన వాళ్లే. వాళ్లు ప్రభుత్వోద్యోగాలు చేసుంటే చాలా మందిలా మామూలుగా రిటైరై అనామకులుగా మరణించే వారు. ఎన్నటికీ కోటీశ్వరులుగా గాని, పదుగురికీ ఆదర్శప్రాయులుగా అయ్యుండేవారు కారు. నువ్వు తలుచుకోలేదు సోమూ! నువ్వే కనక తల్చుకుంటే పదిమందికి నీ దగ్గర ఉద్యోగమివ్వగలిగే వాడివి. ధైర్యం చేసి స్వయం ఉపాధిని సాధించు. బ్యాంకులు నీకు అండగా నిలుస్తాయి. ప్రభుత్వమెప్పుడూ నీకు సాయం చేస్తుంది. తప్పకుండా నువ్వు పేరు ప్రఖ్యాతులు వచ్చేటంతటి గొప్ప వాడివౌతావు. లే! ధైర్యంగా ఓ కుటీర పరిశ్రమ పెట్టు. పది మందికి ఉపాధి కల్పించు.'
సైకియాట్రిస్టు సీ.డీ. ప్లేయర్ ఆఫ్ చేశాడు. 'ఈ విధమైన సజెషన్స్ మీ అబ్బాయికి ఇచ్చుకుంటూ పోయాను. లక్కీగా త్వరలోనే మామూలు మనిషయ్యాడు. ఇంకేం ఫరవా లేదు అన్నాడు.
ఇంకా నేనా గదిలో కూచుంటే, నాకూ పిచ్చెక్కి ఆయన దగ్గర సజెషన్స్ తీసుకోవల్సి ఉంటుందనిపించి భయపడి త్వరగా లేచాను.
'థాంక్స్ డాక్టరు గారూ, వెరీ మెనీ థాంక్స్!' అని చెప్పి బయటికొచ్చి ఇంటి దారి పట్టాను.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|