|
|
Articles: My Thoughts | మాతృభాషకు దిక్కెవరు? - Site Administrator
| |
ప్రజలు ఈ పరిస్థితులను ప్రజాతంత్ర ఉద్యమాల ద్వారాను, విప్లవోద్యమాల ద్వారాను మార్చుకుంటారు. మానవ చరిత్ర ఇదే చెబుతోంది. ప్రజలభాషనూ, వారి సంస్కృతినీ నాశనం చేయబూనుకున్న శక్తులను ప్రజలే ధ్వంసం చేస్తారు. దేశమంతటా ఉద్యమాలు పుడతాయి. తెలుగుభాషను రక్షించుకోవడం కోసం తెలుగు ప్రజలు విప్లవకారులైముందుంటారు.
'మాతృభాషలో విద్యాబోధ అన్నది చాలా మంచిదేగాని, మాతృభాష పటిష్టం కావడానికి కృషి ముందు జరగాలి' అంటారు కొ.కు.
ఈ 'కృషి' ఎవరు చెయ్యాలి? ప్రభుత్వం చెయ్యదని తేలిపోయింది. మనం ఆలోచించుకొని కార్యాచరణకు దిగుదాం.
మన విద్యావిధానంలో (ప్రస్తుతం కిందినుండి పైకి) తెలుగు పాఠ్యాంశాలు సంస్కృతీకరింబపడే తెలుగులోనే వున్నాయిగానీ, తల్లి తెలుగుభాషలో లేవు. (ఇటీవల కొన్ని పాఠ్యపుస్త్కాల్లో కొన్ని పాఠ్యాంశాలు వాడుకభాషలో ఉన్నా) గ్రంథాలలోని భాష ఏ తెలుగు వారికీ వారి మాతృభాష కాదని విద్యార్థులకు ముందు తెలియజేసి ధైర్యమివ్వాలి.
ఏ ప్రాంతంవారి తెలుగుభాషను ఆ ప్రాంతం విద్యార్థులకు (వారి యాస భాషను) ఆ ప్రాంతం విద్యార్థులకు (వారి యాస భాషను) బోధించి, తల్లిబాసను నేర్చుకుంటున్నామనే సంతోషాన్ని కలుగుజేయాలి.
ప్రాంతీయ తెలుగుభాషలను సామాన్యీకరించే పనిచేట్టడానికి నిర్మాణయుతమైన ఒక భాషా సంఘాన్ని ఏర్పాటుచేసుకోవాలి.
ఇప్పటికే వ్యవహారిక భాషా ఉద్యమాల ఫలితంగా వాడుకలోనికి వచ్చిన వ్యవహారిక భాషలో బోధన జరిపించడానికి ప్రయత్నించాలి.
వ్యాకరణానికి అధిక ప్రాధాన్యత తగ్గించాలి. మాతృభాషా బోదనకు ఆ భాషలో పాండిత్యం కాదు కావాల్సింది. భాష మవులిక స్వరూప స్వభావాలను, దాని అభివృద్ధిక్రమాన్నీ తెలిసి, తెలుగు ఆ జాతి జీవిక అని గుర్తించగలిగే బోధకులను తయారుచేసుకోవాలి. అంటే, 'పండితు'లనబడే నేటి భాషోపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించాలి. ఈ పని ప్రభుత్వం ససేమిరా చెయ్యబూనుకోదని మనం గుర్తించాలి.
జానపద సాహిత్యాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తేవాలి. జానపద సహజ సాహిత్యాన్ని గ్రాంథికం చేసే రచయితలను హెచ్చరించాలి.
తెలుగుభాషలో రాయడం, చదవడం నేర్పాలి... వారికి తెలిసినంతమేరకు. అధికంగా దిద్దుబాట్లు రాయడానికి పూనుకుంటే విద్యార్థే కాదు, వయోజనుడు కూడా 'చదువు' నేర్చుకోవడానికి ఇష్టపడడు.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|