|
|
Articles: TP Features | భాషా ప్రాచీనత: కొత్త కోణాలు - Site Administrator
| |
అపూర్వంగా తానొక్కటే ఇంకా భాషా సంస్కృతులతో సంబంధం లేకుండా ఏ భాషా, ఏ సంస్కృతి వర్ధిల్లవనేది చరిత్ర అధ్యయనంలో ఒక ముఖ్యమైన స్ఫూర్తి. అది వైదిక పరిభాషక్కూడా వర్తిస్తుంది. అందులో ద్రవిడ పదాలున్నాయి. వాటిలో కొన్ని నేటికీ తెలుగులో సజీవంగా ఉన్నాయి. అదీ మనకు గర్వకారణం. అంతమాత్రాన వైదిక భాషని గాని, వైదిక సంస్కృతిని గాని అవమానించటంగా ఎవరూ ముద్రవేసే ప్రయత్నాలు చెయ్యనవసరం లేదు. అధ్యయనం అన్ని కోణాల్లోంచీ జరగాలి! ఎస్.ఆర్.రావు సింధూ లిపిలో కన్పించే పదాలు ఋగ్వేద పరమేనని నిరూపిస్తూ ఎన్నో వ్యాసాలు రాశారు. మైకేల్ విజ్జల్ ఇండస్ నగరాలలో ప్రజలు 2 లేక 3 భాషలు మాట్లాడేవారని (Bi-or Tri - Lingual) అంటాడు. వాణిజ్యపరమైన, పాలనాపరమైన భాషగా ద్రవిడ భాషని ఉపయోగించి ఉండవచ్చు కూడా! అయితే ఇవన్నీ నిరూపితం కావలసిన అంశాలు, చరిత్రవేత్తల మధ్య ఏకాభిప్రాయం కుదిరే వరకూ నిరూపణ అయ్యే అవకాశం లేని విషయాలు కూడా!
ఋగ్వేదంలో ఒక తెలగు పదం :
'బల' అనే వైదిక పదాన్నే తీసుకోండి - ఋగ్వేదంలో దాదాపు అన్ని మండలాలలోనూ ఈ పదం కన్పిస్తుంది - Strength force - అనే అర్థంలో! ఇది 'Belo' అనే ఇండో యూరోపియన్ మూలంలోంచే వచ్చిందని భాషావేత్తలు చెప్పారు. తెలుగులో 'బలం' అనే మాటని శక్తి అనే అర్థంలో వాడుతున్నాం. కానీ, ఇది 'వల' అనే ద్రవిడ పదం అని, వైదిక భాషలోకి చేరిన అరువు (Loan word) పదం అనీ మనకు తేలికగా అర్థం అవుతుంది... ఈ నిరూపణలు పరిశీలించండి!
ఈ అధ్యయనం కోసం ఎమెనో బర్రోలు రూపొందించిన DEDR (5276)ని ఆన్ లైన్లో మీరు గమనించండి. 'వల' అనే రూపం తెలుగు తమిళ తదితర భాషల్లో 'బల' అనే అర్థంలో ఎలా ఇమిడి ఉందో పోల్చుకుని చూడవచ్చు.
వలను : Skill, excellence, Possibility, right, Convenient,
వలము : Largeness, stoutness
వలాటి : Clever person, expert
వల : Right
వలచేయి : Right Hand
వలడు : Much
వలన : Instrumental Post Position
వలూద : Stout, big, large
వల్ల : Possible
వల్లడి : Violence, Oppression
ఆచార్య లకంసాని చక్రధరరావు రూపొందించిన తెలుగు వ్యుత్పత్తి పద కోశంలో ఇంకొన్ని 'వల' కు సంబంధిత రూపాలు కన్పిస్తాయి.
వలకడ : దక్షిణదిక్కు
వలకన్ను : కుడికన్ను
వలమురి : దక్షిణావర్త శంఖం
వలకేలు : కుడిచేయి
వలచూక్కి : కుడిచేయి
వలచే : కుడిచేయి
వలరెక్క : కుడిరెక్క
వలవంక : కుడివైపు
వలపల : కుడివైపు (వలపట, దాపట = కుడి, ఎడమ)
వలతీరు : కుడివైపుగా వెళ్ళటం
వలతిరుగు : కుడిచేయి ముందుగా (Clockwise) గుండ్రంగా (ప్రదక్షిణంగా) తిరగటం.
వలగొను : ప్రదక్షిణం చేయు, పరివేష్టించు, చుట్టుకొను
వలనం : గుండ్రంగా తిరగటం.
వలంగుండు : తాపీ పనివాళ్ళు గోడ వంకరని సరిచూసుకోవటానికి బరువుగా, గుండ్రంగా ఉండే పరికరం వాడతారు. అదే వలంగుండు. ఇలా వెదికితే 'వల' అనే పేరుతో పదబంధాలు మనకు దొరుకుతాయి. పూర్వకాల ప్రయోగాలూ దొరుకుతాయి. విరాటపర్వంలో భీముడి పేరు 'వలలుడు'. ఈ వల శబ్దం ద్రవిడ భాషలోంచి సంస్కృతంలోకి వెళ్లిందే గాని, సంస్కృతంలోంచి మనకు వచ్చింది కాదు.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|