|
|
Articles: Drama | ప్రేమ దొంగలు... - Mr. GodDevendra GodDevendra
| |
ప్ర:- ఏవిట్రా ఇది? విమల పక్కన నువ్వు నటిస్తున్నావా? నువ్వు కృష్ణుడూ-ఆమె సత్య భామా?!
సుం:- ఒరే! ప్లీజ్!!నన్నుకూడా తీసికెళ్లరా నాటకానికి.
శే:- ఏడ్చినట్లుంది. అదేం అల్లా-టప్పా నాటకం కాదు. టిక్కెట్టు డ్రామా! టిక్కెట్టు వంద రూపాయలు.ఇవాళ రాత్రికే నాటకం!
సుం:- ఏరా! మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా?
ప్ర:- ప్రేమించుకున్నవారు పెళ్లి చేసుకుంటారో - గంగలో దూకుతారో, అదంతా నీ కనవసరం.ఒరే! అవతారం! ఇలా రా రా! మనిద్దరం పోదాం.
శే:- నే నెవర్నీ తీసి కెళ్లను. మీరు నాటకం చూడాలనుకుంటే చెరో వందా పుచ్చుకుని రండి. నాకు టయిము లేదు. నేను పోవాలి. భామా! .. ఓ సత్య భామా!!(పాటలా పాడుకుంటూ వెళ్లి పోవును.)
సుం:-అయ్య బాబోయ్! శేషావతారానిక్కూడా గ్రీన్ సిగ్నలే!
ప్ర:- ఒరే సుందరం! మనిద్దరికీకూడా గ్రీన్ సిగ్నల్స్ వచ్చేవేరా! కాని, నువ్వు అనవసరంగా నాతో దెబ్బలాడి, నాకూ-నీకూ కాకుండా చేశావీ వ్యవహారమంతా!
సుం:- నువ్వే వ్యవహారం పాడు చేశావు. నేను లేకుండా చూసి అస్తమానూ తాయారుకి ఫోన్లు చేశావు.
ప్ర:- నువ్వు మాత్రం ఏం తక్కువ తిన్నావా? నువ్వూ ఫోన్లు చేసే వాడివిగా?
సుం:- అఫ్ కోర్స్! నేను ప్రేమిస్తున్న అమ్మాయి తాయారుకే నువ్వెందుకు ఫోను చెయ్యాలి?
ప్ర:- అదే మాట నేనూ నిన్నడిగితే? అందుకే ఒక రాజీకొద్దాం.
సుం:- ఏవిటది?
ప్ర:- అన్ సివిలైజ్డ్ లో ఇలాటి గొడవలొస్తే, కొట్టుకు ఛస్తారు. మనం సివిలైజ్డ్ కాబట్టి - ఓ పని చేద్దాం! 'టాస్', వేద్దాం!
సుం:- నో!టాస్ కి నేనొప్పుకోను. అలనాటి ధర్మ రాజు తన భార్యని జూదంలో ఓడి పోయినట్లు-ఇల నేడు నేను నా ప్రియురాల్ని టాస్ వేసి ఓడిపోలేను.
ప్ర:- అదిగో- మళ్లీ గొడవ మొదలెటావు. పూర్తిగా విను. ఆ తర్వాతే ఓ నిర్ణయం తీసుకో. టాస్ లో ఎవరు గెలిస్తే వారు మొదట తాయారుకు ఫోను చేసుకో వచ్చు. రెండో వాళ్లు గదిలోంచి బైటకెళ్లి పోవాలి. మొదటి వాళ్లు ఫోను చేసుకుందుకు అయిదు నిముషాలు గడువు. రెండవ వాళ్లకి పది నిముషాలు. ఎందుకటే-రెండోవాడు మొదటివాడు ఫోను చేశాక ఆలస్యంగా ఫోను చేస్తాడు. ఎవరికి దొరికిన సమయంలో వారేమి మాటాడుకున్నా-ఎంత మాటాడుకున్నా అది రెండో వారికి అనవసరం. తాయారు నీ మాటలకు లొంగి నిన్ను ప్రేమిస్తే అది నీ అదృష్టం.అలా కాక నన్ను ప్రేమిస్తే అది నా అదృష్టం! ఏమంటావు?
సుం:- సరే! అయితే నువ్వు టాస్ వెయ్యి నేను కోరుకుంటాను.
(ప్రకాశం జేబు లోంచి కాయిన్ తీసి పట్టుకుంటాడు. సుందరం - 'బొమ్మ ' అంటాడు. ప్రకాశం టాస్ వేస్తాడు. బొరుసు పడుతుంది.)
ప్ర:- బొరుసు! నేనే గెల్చాను. ముందు నేను ఫోను చేసుకోవాలి.
[కిటికీ లో బయట ఫోను చేస్తున్నాడు బవ్య.)
బవ్య:- (ఫోను డయల్ చేసి) హలో!-రాంగ్ నంబర్!! హాఁ! హతవిథీ నీ దృక్కులు ఎంత కౄరంబులయ్యెడిన్?
(ఫోను క్రెడిల్ చేసి పక్కకి తప్పుకుంటాడు)
[ ప్రకాశం దేవుడికి దణ్ణం పెట్టుకుంటాడు.ఆ తరవాత ఫోనందుకుని డయల్ చేస్తాడు]
ప్ర:- (ఫోనులో)హలో! హలో!!- (ఫోను పెట్టేసి) ఛచ్చాంపో! ఎంగేజ్డ్! ఇప్పట్నించీ సుందరం గాడు టైము లెక్కెడతాడులాగుంది. ముందీ విషయం గురించి ఏమీ అనుకోలేదే? ఇప్పుడేం చెయ్యాడం?
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|