|
|
Articles: TP Features | శ్రీలంక తెలుగువారి తపన - Mr. Ramesh Sa.Ven.
| |
వాఖడీబోలీ అనే బాస ఒకటి ఉండేదట అని మనం చెప్పుకోవడానికి ఇంకొక తరం గడిస్తే చాలు. పెద్దలారా, అంతకన్నా గొప్పగా ఏమీ లేదు 18 కోట్ల తెలుగు పరిస్థితి, ఒక తరం కాకపోతే పది తరాలు, ఒక పాతిక కాకపోతే పది పాతికలు అంతే.
చివరిగా అహికుంటికలు సుబ్బారెడ్డిని కోరిన నాలుగు కోరికలను మీ ముందుంచుతున్నాను.
1. టీవీల్లో తమిళ పటాలు వచ్చినట్లు తెలుగు పటాలు వచ్చేటట్లు చేస్తారా? (అంటే ఒక తెలుగు ఛానెల్ ని అడుగుతున్నారు)
2. పాముకాటుకు పనికివచ్చే మందుచెట్లు మన సీమలో ఉంటే ఆ విత్తులు పంపిస్తారా?
3. తెలుగు ఆకృతుల (అక్షరాల)ను మాకు చెప్పిస్తారా?
4. మా పిళ్లలను తోడుకొనిపోయి మన సీమను సూపిచ్చి పంపతారా?
గమనించినారా... తెలుగునేలను వాళ్లింకా 'మన సీమ' అంటున్నారు, ఆ మనదనాన్ని వదలలేదు. ఆ 'మన సీమ'లో చస్తే పూడ్చిపెట్టుకోవడానికి చేరెడు నేలను కూడా వాళ్లడగలేదు. మన సీమను కండ్లారా ఒకసారి వాళ్ల బిడ్డలకయినా చూపమంటున్నారు. మన ఆకృతులను వాళ్లు వాళ్లలో నిలుపుకోవాలనుకొంటున్నారు. మన సీమలోని ఆటపాటలలో మాటలలో బతుకులలో - అది టీవీ ద్వారానైనా సరే - మునిగి తేలాలనుకొంటున్నారు, ఒకటి కావాలనుకొంటున్నారు.
మనం ఆపాటి కూడా చేయలేమా?
మనం ఆపాటి అయినా చేయగలమా!?
| Read 3 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|