|
|
Articles: Drama | తెలుగు విలువల ఉగాది - Editor
| |
ఆమె : 'అల్లుడుకన్నా ముందు - తోప తినాలనుంది నీకు
చేసిపెడతానుండయ్యా - పొయ్యి దగ్గరల్లరేల?
కుక్కీ మంచంమీద - పిల్లీ తొంగుంది లేపు
దోరానికి అడ్డంగా - బేపీ తొంగుంది చూడు
చూరుమీద వాలింది గెద్ద - అదురదురు మగోడ
పట్టెమంచం మీద - పిల్లీ తొంగుంది చూడు
విత్తనాల కింద సుంచెలకలు చూడు చూడు
గాదికింద పందికొక్కు - గడబిడ చేస్తుంది చూడు'
ఇంతలో ఒక కాకి వచ్చి జంగిడిలోనున్న బూరెను ముక్కున గరచి తుర్రున అల్లంత దూరంపోయి, అక్కడ నేలపై పెట్టి తింటూ గుణింతం వల్లిస్తున్నట్టు కావుకావుమని అరచి 'చుట్టాలొస్తున్నారని' చాటి చెబుతోంది.
ఆమె : 'అర్రెర్రే... ఏం మగోడివి నువ్వు
తిండి యావలోపడీ - కాకినైనా అదరవూ'
ఇంతలో కుక్కపిల్ల చల్లగా వంటింట్లో దూరి రెండు అరిసెల్ని నోట గరచి, వాకిట్లోకి పారిపోయింది.
అతడు : 'కబుర్లులోన పడీ - కుక్కల నక్కలకెట్టీకే వంటలు
కోడలు వస్తేగానీ - నీ నాలుక కోసినోళ్ళెవ్వరు లేరు
పాలు పొంగి పొయిలోకి - పారుతున్నయి చూడు
కూటికుండ ఎసరుపొంగి - అగ్గిని ఆర్పేస్తుంది చూడు
పాయసం అడుగంటి - మాడిపోతుంది చూడు'
ఆమె : 'ఏనాడూ లేదు నువ్వు - వంటిల్లూ పట్టినావు
పనినీ పడనివ్వవు - పల్లకెల్లి పోవనువ్వు'
అతడు : 'ఊరుకోవ ఆడదాన - వంటిల్లే నీ రాజ్యం
కొడుకు పెళ్ళాం వచ్చి -కూల్చీదా రాజ్యాన్ని
అత్తాకోడళ్ళు కలబడి - జుత్తులొట్టుకోర
వేరు కుంపట్లు వెలిసి - అస్తమించదా రాజ్యం'
ఆమె : 'ఏటయ్యిందయ్యా - ఈ మగోడికీయేల
తాగొచ్చిన మగోడైన - పేలుదాడ? ఇలాగ
పాడు ఊసులేటయ్యా - ఉగాదిపూట యెల్లవయ్యా
యెల్లు యెల్లు ముసిలోడ - మిగత పనులు చూడవతల'
కయ్యం ముదిరిపోతుందని గ్రహించి కల్లంవేపు మీసం మెలేసుకుంటూ వెళ్ళిపోయాడు రైతు... బెదుతురుతున్న ఎడం కనురెప్పల్ని రుద్దుకుంటూ, వేన్లూ, జీప్ లు హారల్ను వినబడుతున్న వేపు చూస్తూ -
'మాపటికి నాటుకోడి మాంస వండించి అమెరికా కూతురికి పెట్టాలి. అల్లుడికి మేకమాంసమంటే ఇష్టం... పొద్దున్నే మేకను నరికించాల... వీడు 'మందు'కు అలవాటుపడ్డాడేటో డవుటు..
సాఫ్టువేరోడు గదా, సొమ్ములు దండీగుంటాయి మరి. అమెరికాలో ఇల్లు ఎందుకర్రా అంటే 'ఎపార్టుమెంటు' కొన్నామన్నారు. ఒక కారు చాలదా అంటే, రెండు అవసరమంటారు! కూతురూ కారు నడుపుతుందని తెలిసి సంతోషించినాను కాదా. ఈ గుంట కడుపున ఇంకా ఒక కాయ కాయలేదు. ఏమర్రా అని అడిగితే 'ఎంజాయిమెంటు' అంటున్నారు. ఏంటో వీళ్ళ జీవితమక్కడ. అర్థం కాదు. రెండుబార్ల పొద్దెక్కింది. ఇంకా ఊరు చేరలేదు వీళ్ళు.'
రైతు ఆలోచనల్లో పడ్డాడు -
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|