|
|
Articles: Short Stories | ఎంజాయ్ - Site Administrator
| |
కానీ ఇద్దరికీ ఏమిటో వెలితిగానే ఉంది. వెళ్ళారు, వచ్చారు తప్పితే వాళ్ళక్కావలసినదేదో దొరకలేదని ఇద్దరికీ అనిపించింది.
మరింకేం చెయ్యడం... ఆ రోజు సుమతికి మరీ విసుగ్గా ఉంది. ఎంత వద్దనుకున్నా మనవళ్ళ ముద్దుముచ్చట్లు దగ్గరుండి చూసుకోలేకపోతున్నామనే బాధ సుమితిని తినేస్తోంది. ఎంచక్కా టీవీ చూసి ఆనందించేవాళ్ళంతా ఎంత అదృష్టవంతులో అనుకుంది. సినిమాలకెళ్ళేవాళ్ళని చూసి అసూయపడింది. ఆధ్యాత్మిక ఉపన్యాసాలకు వెళ్ళేవాళ్ళను చూసి తనకా చింత లేనందుకు తనను తాను తిట్టుకుంది. ఏమీ తోచక హాల్లో కూర్చుని ఎప్పుడో మొదలు పెట్టిన ఎంబ్రాయిడరీ చేస్తున్న చీర కళ్ళు మండుతుండడంతో చేతిలో అలాగే పట్టుకుని ఆలోచిస్తోంది.
ఇంతలో శంకర్రావు పిలిచాడు... సుమతీ, బయల్దేరు అంటూ.... `ఎక్కడికి'? వెంటనే అడిగింది.
`ఎంజాయ్ చెయ్యడానికి...' ఉత్సాహంగా అన్నాడు.
అతని ఉత్సాహం చూసి ఆనందపడుతూ బయల్దేరింది సుమతి.
`ఎక్కడికండీ' కుతూహలం ఆపుకోలేకపోయింది.
`చెప్పాగా ఎంజాయ్ చెయ్యడానికి...' పావుగంటలో సిటీలో ఉన్న నిజామ్ కాలేజ్ గ్రౌండ్స్ చేరుకున్నారిద్దరూ. ఆపైన కట్టిన బ్యానర్ చూసింది. `బుక్ ఎగ్జిబిషన్' సుమతి మొహం మందారంలా విచ్చుకుంది. ఇద్దరూ లోపలికెళ్ళారు. శంకర్రావు ఇంగ్లీషు పుస్తకాలవైపు నడిస్తే సుమతి తెలుగు పుస్తకాలవైపు నడిచింది. `ఓహ్... ఎన్ని పుస్తకాలు... అసలీ సంసారజంజాటనలో పడి ఈ మధ్య పుస్తకాలు చదవడమే లేదు. ఎప్పుడో చదివిన పుస్తకాలు మళ్ళీ కళ్ళ ముందు కనపడుతుంటే అవి చదివినప్పుడు తనకి కలిగిన అనుభూతిని తల్చుకుంది. ఈ మధ్య విడుదలయిన పుస్తకాలలో మంచి రచయితలు రాసినవి తను చదవనివి ఉండడం చూసి తెల్లబోయింది. విశ్వనాధ, చిలకమర్తి, గురజాడ, చలం, శ్రీశ్రీ తరం వాళ్ళ పుస్తకాలు చూడగానే ఆ రోజుల్లోకి వెళ్ళిపోయింది. మునిమాణ్యకంగారి కాంతం కథలు చూడగానే సుమతి పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. తనివితీరా ఒక్కొక్కటీ చూసి కావల్సినవి తీసుకుంటోంది.
ఇంతలో అక్కడే వేసిన కుర్చీలలో కొంత మంది కూర్చుని ఏదో వింటూండడం కనిపించి అటు నడిచింది. అక్కడ వేసిన షామియానా క్రింద ఒక ప్రముఖ రచయిత అతను రాసిన కథ గురించి చెబుతూ, ఆ కథ రాయడానికి అతనికి కలిగిన ప్రేరణ, దాని నేపథ్యం గురించి వివరిస్తుంటే అలా వింటూ కూర్చుండిపోయింది.
ఎంతటి సృజన.. ఒక విషయాన్ని తీసుకుని దానిని జనరంజకంగా మలచడానికి ఆ రచయిత పడిన మానసిక శ్రమ వింటున్నకొద్దీ సుమతికి ఆ కథ చదివినప్పటికంటే ఇప్పుడు ఇంకా ఇష్టమైంది.
అలా సుమతీ, శంకర్రావు ఇద్దరూ సుమారు రెండు గంటలపైన ఆ పుస్తకసముద్రంలో కొట్టుకొనిపోయి నెమ్మదిగా తీరాన్ని చేరారు. ఇద్దరికీ విందుభోజనంతో కడుపు నిండినట్లైంది. కావల్సిన పుస్తకాలు కొనుక్కొని' ఇద్దరూ ఇంటికి వచ్చారు.
ఆ రోజు ఆదివారం. శంకర్రావు పొద్దున్నే తన పనులన్నీ ముగించుకుని శామ్యూల్ హంటింగ్ టన్ రాసిన `క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్' పుస్తకం పట్టుకుని ముందుగదిలో కూర్చున్నాడు.
| Read 5 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|