|
|
|
|
Articles: Drama | నరకానికి పూలదారి!? - Mr. pyyetisrinivasarao srinivasulu
| |
వి : ఏమండీ! ఏమిటండీ మీరు మాట్లాడుతున్నది? మీరిప్పుడు పొందుతున్నది ఆనందమా? ఇలా చూడండీ! కామమనేది ఒక వికారమండీ! అది ఒక మనిషి మీంచి మరో మనిషి మీదకు మారిపోవచ్చు... ఆశలకు అంతు ఉండదండీ! మనిషై పుట్టాక జీవితంలో ఆత్మ సంతృప్తి అనేది ఉండాలండీ! అది మనసులో ఉంటుందండీ! నా మాట విని మీరీ పాడుపనులు మానెయ్యండి. నేనింకా మిమ్మల్ని ఆరాధించగలను. దయచేసి నన్ను క్షోభ పెట్టకండి!
చం : నేనేం నిన్ను క్షోభ పెట్టలేదు. కావాలనే నువ్వు క్షోభ పడిపోతున్నావు. ఆడదానికి ఈర్ష్య ఎక్కువట! పరాయి స్త్రీతో భర్త సుఖపడితే చూడలేదు... ఓర్వలేదు.
వి : ఏం? మగాళ్లకు ఈర్ష్య ఉండదాండీ? భార్యలు పరాయి పురుషులతో తిరిగితే చూసి ఆనందిస్తారాండీ?!
చం : (కోపంగా) ఛిఛీ! మగాడికీ ఆడదానికీ తేడా లేదూ?
వి : హుఁ! ఏమీ తేడా లేదు. మగవాడు పుట్టినట్టే ఆడదీ పుడుతుంది. ఆమెక్కూడా కోర్కెలుంటాయి. అయితే ఆడది ఆ కోర్కెలనన్నిటినీ, తన భర్త మీదకే మళ్లించుకుని, తన భర్తనే దైవంగా ఆరాధిస్తుంది.
చం : ఆఁ! బాగానే ఆరాధిస్తున్నారీ కాలం ఆడవాళ్లు. ఇతర దేశాల్లో ఆడవాళ్లు ఎన్నో పెళ్లిళ్లు చేసుకుని అందర్నీ దైవాలుగానే ఆరాధిస్తున్నారు.
వి : ఇతర దేశాల గొడవ మనకొద్దండీ! మన దేశం, మన సంప్రదాయం ఆలోచించండీ! మా అన్నయ్య చెప్పేవాడు- 'కొన్ని దేశాల్లో పుట్టిన పిల్లలకి తమ తండ్రెవరో కూడా ఎలీదట', ఆ దేశాల్లో పుట్టిన వాళ్లకి ఆత్మసంతృప్తి లేక, ఒక భార్య - ఒక భర్త అనే కట్టుబాటు లేక, మనో నిబ్బరం కోల్పోయి, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికీ, హత్యలు చేసే పరిస్థితికీ, నిషాలో ఒరిగిపోయి హిప్పీలుగా మారి జీవచ్ఛవాల్లా బ్రతికే పరిస్థితికీ దిగజారిపోయారు. దయచేసి మీరు మాత్రం మారిపోకండీ!
చం : (ఫకాలున నవ్వి) ఆఁ! ఆఁహాఁ!! దంచేశావు లెక్చరు. ఒసేవ్! ఇల్లా రావే! ఊ (!! రమ్మంటూంటే!! ఇంతవరకూ నాతో తిరిగిన ఆడవాళ్లను లెక్కపెట్టాలంటే.... ఊ... నా వేళ్లు కూడా సరిపోవు. ఏదో ఈ నాడు నా ఖర్మ కాలి నీ కళ్ల ముందు పడబట్టి ఇంత రాద్దాంతం చేస్తున్నావు.
వి : అయితే ..మీరు?!...?!
చం : మారిపోయాను. మారిపోయాను విశాలా! (టేబులు దగ్గరకెళ్లి సీసాలోని బ్రాందీని మరి కొంచెం తాగి) పూర్తిగా మారిపోయాను. కాలానికి అనుగుణంగా మారిపోయాను. పైగా ఇప్పుడు నా దగ్గరకొచ్చింది బజారు స్త్రీయేం కాదు. నా దగ్గర పనిచేస్తున్న గుమాస్తాగాడి పెళ్లాం. తన ప్రమోషన్ కోసం గురవయ్య ద్వారా వాడే నా దగ్గరకు పంపాడు. సంసార స్త్రీలు కూడా మారిపోతున్న ఈ రోజుల్లో, నన్ను నీతిగా నడవమంటే ఎలా కుదురుతుంది విశాలా?
వి : (కోపంగా) సంసార స్త్రీయా అది? ఒక సంసార స్త్రీని పాడుచేశానని చెప్పుకోవడానికి నీకు సిగ్గు లేదూ?! (మొదటిసారి భర్తను ఏకవచన ప్రయోగంతో సంబోధించింది.)
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|