|
|
Articles: Drama | తొలకరి పలకరింపులు - Site Administrator
| |
సీతప్పడు : ఏం కూరలుంటాయప్పా... కడల్లా పప్పుతోటి తినీగల్ను
సినుకులు పడొద్దా... కూరలు సిగురెట్టొద్దా
సూరన్న : ఒసే... కొంచెం తలుపుతీయ్యిమీ... పంచాంగం తెచ్చుకుంటాను
సూరప్ప : పంచాంగంతోంటి ముడెట్టుకుంతావు. పురిటింట్లోకి రాకూడదుండు...
తెచ్చిగడపల పడేస్తాను...
సూరన్న : రామాయణమో...
సూరప్ప : యాసపీఠం (వ్యాసపీఠం) తో సహా తెచ్చి పడేస్తాను
సూరన్న : నా కమీజూ, వాణీ, బనీనో...
సూరప్ప : అవిన్నూ...
సూరన్న : కడకి... నన్ను గడపకి గెంటీసినట్టుగున్నావు
సూరప్ప : సాల్లోన మంచి వేసినాను. కంచంతోటి తిండెట్టాస్తానక్కడ. తినీసి కొంచెం కునుకు తియ్యక్కడ... తెలివేసుంటే... పనిపడనివ్వవు
సూరన్న : సీతప్ప ఈరకాడ్ని సాగనంపీ మెళ్ళిక. రేపో ఎళ్ళుండో కోడల్ని పలకరించడానికొస్తానని సెప్పు... ఆఁ.. పాపన్నను సాల్లోనికి రానీకు. వికటాల్తోటి తొంగోనివ్వడు
ఎల్లు బావ, ఎళ్ళెళ్ళు. ఇంటినిండా ఆడగుంటలు పుట్టీసి తీసుకుబోతారు. మా ఆడగుంటల్ని... అంతగా మిగిలిపోతే... మీకే ముడెట్టీసి... ఆ మిగిలిన చక్కాముక్కా (మడులు) మీకే దకలు (అప్పగించడం) పెట్టేస్తాను. నా ఇల్లు ఇకన గుల్లే... ఆహా...వికటాలు
సూరప్ప : పాపన్నా! అవునుగానీ... కాశీకి యెల్లి... గంగలో మునగాలనుంది...
ఎప్పుడవుద్దో... యేటో...
పాపన్న : కోడలు పురుడవ్వనీ...
సూరన్న : అవ్వనీ... అప్పుడు నీ పని చెబుతాను... మా వంశం నాశనమైపోద్దని అనుకోకు... మా పొలం దొబ్బడానికి ....
మళ్ళీ తొలకరి చినుకులు పలకరింపులు ఆరంభం. గేదె బారెడు నాలుక చాపింది. దాని నాలుక రసాంకురాల మీద నాలుగు చినుకులు రాలి పేగుల్ని పలుకరించినట్టుగుంది. తోక లయబద్ధంగా ఊపుతోంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|