|
|
Articles: Short Stories | స్వర్గ యాతన - Site Administrator
| |
'ఓలి ముసిలీ... సన్నాసమ్మ కూతురా... ఆడు తిండికి దొంగో... ఇలాటి యిద్దిలే (విద్యలు) నేరుపు. ఇప్పటికే ఆడు పిట్టగుంటెతోటి ఎండు (పీలగావున్న) నక్కలాగున్నాడు' అన్నాడు ముసలోడు.
కాకమ్మా నోటదూరి కావుకావుమంటుందీ
పావురాయి రెక్కమీద పడుకుందీ వెన్నెల
బంగరుకొని వస్తంది పడతు లేస్తు వస్తంది
పాయిచీకి వస్తుంది పకపకమని నవ్వతంది
రామనా సెందనాలో యెన్నిలా - రాజా నీకొందనాలో... అల్లంత దూరంలోంచి ఈ పట వినపడుతోంది. ఎక్కడెక్కడో కొందరు చిందులేస్తుండాల మరి.
ఇరుగింటి ఆడపడుచు అంట్లు తోముతూ-
కొబ్బరీ రేకులపై కూకుందీ యెన్నెల
పిట్లా గోడెక్కి పిలుస్తోంది యెన్నెల
కాకరా పాదెక్కీ కాలుజారిపడ్డాది
కాలు జారిపడీ - నా కాలిమీదికి పాకిరింది
యేం కానిదమ్మో ఈ యెన్నీల
ఏం ముండ యెన్నెలమ్మ యెన్నీల.. యేల కాని యేలొచ్చీ యెన్నీల...
'అవునమ్మీ! ఓలమ్మీ! ఎక్కడే యింత యెన్నిలా? మబ్బుల మాటున నల్లగ కనబడుతుంటే... మసక చీకటెక్కడైనా వెన్నెలవుతాదేటి? పండువెన్నెలొచ్చిందాకా, ఆగే - ఇంక ఇవాల దశిమి... పున్నం రావొద్దా మరి...' అని అంటే...
'పున్నం వచ్చిందాక ఆగుద్దేటి పాట? పాడే తల్లీ... ఆ దుర్గమ్మ తల్లి నిన్ను సల్లగ చూస్తాది... ఇతగాడి ఇకటాలకేటి గానీ... ఆఁ...' అంది ముసిల్ది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|