|
|
Articles: Short Stories | పాలమ్మ - Site Administrator
| |
అందరు మొకాలు చూసుకున్నరు. అందరి కండ్లల్ల నీల్లు దునికినయ్...
సుజాత ఏడ్సుకుంట సాయివాన్లకు ఉరికింది. పది నిమిషాల్ల గిలాసల పాలు దెచ్చింది.
'అత్తా... మన బర్రె పాలు దెచ్చిన... నోరు తెరువ్ అత్తా' అన్నది ఏడ్సుకుంట ఎక్కిల్లుపడంగ...
చెవులు గెడెలు పడ్డట్టు... లస్మవ్వకు వినారలేదు. గిలాస చూపిచ్చుకుంట... మల్ల అన్నది సుజాత.
లస్మవ్వ నోరు తెరిచింది.
సుజాత చెంచతోని రెండు చెంచాల పాలు పోసింది.
లస్మవ్వ పాలు మింగలేదు.
కోపంగా... దు:ఖంగా... ఊంచింది. అవి చెంప కింద నుంచి పక్కకు కారిపోయినయ్...
'బర్రె...నమ్ము...కున్నార్రా.... ఇవి... మన... బర్రె... పా...లు...కా...వు...'
లస్మవ్వ తల పక్కకి వాలింది.
అందరు ఒక్కసారి పిడుగుపడ్డట్టే ఏడ్సిండ్రు...రాజేశం, సుజాత... లస్మవ్వ మీద పడి... గుండెలు పగిలేటట్టు ఏడ్తండ్రు...
సుజాత నెత్తంత కొట్టుకుంటంది...
'అత్తా... మన బర్రె నీకన్నా ముందే సచ్చిపోయిందే అత్తా... ఎర్రికుక్క కరిచి సచ్చిపోయి రెన్నెల్లయిందే అత్తా... బర్రె చచ్చిపోయిందని తెలిత్తే... నువ్వు బతకవని చెప్పలేదే అత్తా...'
సుజాత ఏడ్పు తరమైతలేదు...
ఆ మాటలు విని అందరి గుండెలూ అలిసిపోతున్నయ్...
'ఊర్లెకచ్చిన ముర్రెజాతి దున్నపోతు పొడిత్తేనే... రాజేశడు రెండు వేలు ఖర్చుపెట్టుకోని బర్రెను బతికిచ్చుకున్నడు... అది చచ్చిపోతే మా అవ్వ చచ్చిపోతదని.... గాశారం చాలక మల్ల ఎర్రికుక్క పాడుగాను ఊర్లె మూడు బర్రెల్ని కరిసింది...
అంత దు:ఖంలోనూ... జ్ఞాపకాలు నెమరేసుకుంటంది ఊరు'.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|