|
|
Articles: Short Stories | చదువూ సంస్కారం - Site Administrator
| |
అందుకే... జ్ఞానాన్ని నాశనం చేసే విద్యావిధానాన్ని సంపన్నుల రాజ్యాంగం ప్రవేశపెడుతుందన్నమాట! ఇలాగమనిపించకపోయినా, (భార్య అందంలో - అంతెత్తు ఆనందపు పై ఎత్తులకు కారణభూతమైన జ్ఞానాన్ని చూసి) రాములమ్మ తెలివితేటలకు ఆశ్చర్యపోయి ఆమెకు చెయ్యిందించి గట్టిగా నొక్కినప్పుడు - అందుబాటులో 'బల్బు' లేదుగాని - అతని శరీరంమీద ఆన్చితే ఆ బుడ్డీ వెలిగిపోను. అంత 'ఇదే'పోయాడు సీతప్పడు.
'లేకపోతే... ఆళ్ళ (టీవీ.వాళ్ళు) పెంకితనమేంటి!' అన్నాడు సీతప్పడు. కొన్ని విషయాలింకా బోధపడక సీతప్పడు అడిగాడు భార్యను - 'తెలుగుబడుల్లో ఇంగ్లీసు తరగతులు పెట్టేసీనారు గదామరి, మన కోర్టులు కూడా ఇంగ్లీషు మప్పమనీ... తల్లి భాషాబోధన నిర్బంధం చెయ్యొద్దని తీర్పులిచ్చినాయట గదా... దీని సంగతేంటి! అడిగాడు.
'నా ముద్దుల మగడా! ఇంగిలీసు సెక్షనులోని పిల్లలందరూ, తిరిగి తెలుగు సెక్షనులోకి వచ్చేసారుగా. మరి కోర్టులు ఎవరివి? సామాన్య ప్రజలవా? పాపం... గుమస్తాలుగా పనిచేసేవారు.... వారికీ, వారిపైవారికీ కరువవుతారేమోననే బెంగ' కోర్టు వాళ్ళకు. ఈ 'బెంగ' వారి తల్లిభాషలో ఆలోచిస్తే కలగలేదు సుమా. అయినా, ప్రజల అభిప్రాయాలు 'న్యాయచట్టాల' కన్నా బలమైనవి కదా!' అని సంస్కరింపబడిన తెలుగుభాషలో మాట్లాడుతున్న రాములమ్మను చూసి తలవంచుకున్నాడు సీతప్పడు.
ఇప్పుడు సీతప్పడు - భార్య రాములమ్మ దగ్గర, తనకు అవసరమైన చదువును నేర్చుకోవాలనుకుంటున్నాడు. లెక్కల్లో తనకున్న అనుమానాలు - చక్కగా విడమరిచి తెలుగు పలుకులుతో చెప్పించుకొని - తీర్చుకోవాలనుకున్నాడు. ఈ సంస్కారవంతురాలైన 'అందగత్తె'ను తనకిచ్చీసినందుకు - ఆమె తల్లితండ్రులకెంతో రుణపడిపోయినట్లు భావించాడు సీతప్పడు. అదేమాట, రాములుతో అంటే, ఆమె ఏమందంటే... - 'ఓరి! నా సీతూ! నీ 'అమాయకత్వం' అనిపించే జ్ఞానంలోనూ, సంస్కారంలోనూ ఉన్న విలువల్నే - నేనందుకుని నా ఆనందంలో చేర్చుకొని, అందెగత్తనయ్యానయ్యా. నువ్వే నాకు అయ్యవూ, అమ్మవూ. ఇప్పుడు నా రెండో జన్మకు. అందుకు.... నిన్ను పొందినందుకు... నేనే నీ తల్లితండ్రులకు రుణపడి ఉంటాను...' అంది. ఈ మంత్రభాషలోని తీపికి, మత్తుడై... ఆ భాషను ఈమె దగ్గరే నేర్చుకొని అనుభవిస్తాననుకున్నాడు సీతప్పడు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|