|
|
Articles: My Thoughts | అజాగ్రత్తకు మందు - Site Administrator
| |
అజాగ్రత్త విషయంలో అన్ని వృత్తులతో సమానంగా వైద్యవృత్తిని కూడా పరిగణించి, వైద్యుల తప్పుల్ని మానవ దోషాలుగా పరిగణించి తీర్పుల్నివ్వడం కొన్ని సందర్భాల్లో తగినట్టనిపించదు. నాడిని చూసి వైద్యం చేసే రోజులు పోయి, యంత్రం మీద ఆధారపడి రోగికి వైద్యం చేసే రోజులు వచ్చాయి. వైద్యుడు దేవుడి రూపం చాలించి వ్యాపారవేత్త రూపం దాల్చుకున్న రోజులివి. కార్పొరేటు వైద్యం పేరిట వ్యాపార దృక్పథం పెచ్చు పెరిగిన రోజుల్లో న్యాయస్థానాలు తమ దృక్పథాన్ని మార్చుకొని రోగికి ఎక్కువ రక్షణ కల్గించే తీర్పులివ్వలసిన అవసరం ఉంది. అజాగ్రత్త విషయంలో వైద్యులు ఎక్కువ బాధ్యతతో ఉండేట్టటు వారి వారి సంఘాలు జవాబుదారీతనం వహించాలి. ప్రతికూల సాక్ష్యవాతావరణం, సంవత్సరాల తరబడిసాగే న్యాయపోరాటాలు, న్యాయమూర్తులకు అర్ధంకాని పరిస్థితుల్లో రోగుల న్యాయపోరాటాలు సాహసం, ఓర్పుతో కూడుకున్నవే.
అందుకే 1975-85 మధ్య వైద్యుల అజాగ్రత్త పై వేసిన కేసులు 3 మూత్రమే. కోర్టు ఫీజులేని కారణాన వినియోగదారుల రక్షణచట్టం వచ్చిన తర్వాత వైద్యుల పై కేసులెక్కువయ్యాయి. వీటిలో ఎక్కువ అవగాహనా రాహిత్యంతో వేసినవే. అందుకే వైద్యులు రోగికి అవగాహన కల్పించే ప్రయత్నం ఎక్కువ చేయాలి. ప్రతి రోగినీ అర్థం చేసుకోలేని వ్యక్తిగా చూడడం మానుకొని, రోగుల సంఖ్య కాస్త తగ్గించుకొని, ఎక్కువ సమయం రోగుల అవగాహనకు వెచ్చించిన రోజున వైద్యుడిపై దురభిప్రాయం ఉండదు. ప్రశాంత్ లాంటి పోరాటం చేసే వ్యక్తులు అరుదుగా ఉంటారు. మనిషి జీవితానికి డబ్బు తగిన వెలకాదు. అందుకే వేరే కేసులో కోర్టు చేసిన ఈ క్రింది సూచనలు ఆచరణయోగ్యం.
ప్రతి ఆసుపత్రిలో తగినంత సామాగ్రి, పర్యవేక్షణ సిబ్బంది, ప్రస్తుత చికిత్సా పరిస్థిలు పట్ల అవగాహన, శుభ్రత ఉండేటట్లు ఏర్పాట్లు చేయాలి.
రోగిని స్వయంగా పరీక్షించకుండా మందులు సిఫారసు చేయకూడదు. అత్యవసర పరిస్థితుల్లో తప్పితే, టెలిఫోను ద్వారా మందులు సూచించడం మానుకోవాలి.
రోగి చెప్పిన వ్యాధి లక్షణాలను బట్టి వైద్యుడు చికిత్స చేయడం కాకుండా, వైద్యుడు తన పద్ధతుల ద్వారా నిర్దారణ చేసుకునే చికిత్స చేయాలి.
తప్పని పరిస్థితుల్లో తప్పితే వైద్యుడు ప్రయోగం చేయకూడదు. అప్పుడు కూడా రోగికి పూర్తి సమాచారాన్నిచ్చి రాత పూర్వంకగా అనుమతి తీసుకోవాలి.
సందేహం వచ్చినపుడు ఆ శాఖలోని నిపుణుడ్ని సంప్రదించాలి.
రోగికి సంబంధించిన పూర్తి సమాచారం లిఖిత రూపకంగా తయారు చేసుకొని ఉంచుకోవాలి.
భారత మెడికల్ కౌన్సిల్ 2002లో తయారు చేసిన నీతిసూత్రాల్నితప్పకుండా పాటించాలి.
రోగుల సంఖ్యను పెంచుకొనే దిశగా కాకుండా ఉన్న రోగులకు చక్కని వైద్యం అందించే దిశగా వైద్యులు ప్రయత్నించాలి.
వైద్యులు వ్యాపార దృక్పథంతో కాకుండా వారొక విలువైన, గౌరవప్రదమైన వృత్తిసంఘంలో సభ్యులన్న భావనతో మెలగాలి.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|