|
|
Articles: My Thoughts | మాతృభాషకు దిక్కెవరు? - Site Administrator
| |
ప్రభుత్వ విధానాలను మామూలుగా అడ్డుకోలేం. అట్లాంటప్పుడు - ఇప్పుడున్న ప్రభుత్వ ప్రయివేటు విద్యాసంస్థలకు ప్రత్యామ్నాయంగా తెలుగు పాఠశాలలను నెలకొల్పి, వాటికి ప్రజల గుర్తింపును పొందడానికి కృషిచెయ్యాలి. ఏ ఉద్యోగాన్నీ పొందలేని, పొందే కోరికలేని అశేష ప్రజానీకం మన వెనుకతట్టున (అనాగరికులకు దూరంగా) ఉన్నారని గమనించాలి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇలాంటి కృషి చేయడం సాధ్యమా అనిపించవచ్చును. ఆరంభిస్తే దీర్ఘకాలం కొనసాగిస్తే ఫలితాలుంటాయని చరిత్ర చెబుతోంది. సంఘసంస్కరణలు ఉద్యమాలకు స్ఫూర్తి నిచ్చాయి. పెనుమార్పులు తెచ్చాయి పునాది ఉపరితలాంశాలలో. ఉద్యమాలూ, విప్లవోద్యమాలు పెల్లుబకడానికి స్ఫూర్తినిచ్చాయి. వ్యవస్థలే మారాయి. ప్రజలే నిజవీరులు. ప్రజలే నిర్మాతలు. ప్రజలను మించిన మహనీయులు మరొకరుంటారా!
ఇంతజెప్పడానికేంగాని, ఇప్పుడున్న సామ్రాజ్యవాద ప్రపంచీకరణ పరిస్థితులలో ఇది సాధ్యమా అన్పిస్తుంది కూడా. అయితే, ప్రపంచ దేశాలలో, ముఖ్యంగా వెనుకబడిన 'మూడోప్రపంచ దేశాలలో' ఈ సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు ఊతమిచ్చే శక్తులు ఫ్యూడల్ భూస్వామ్య, దళారీ ధనస్వామ్య వర్గాలని గుర్తిస్తున్నారు ప్రజలు. సామ్రాజ్యవాదులకూ ప్రపంచ ప్రజలకూ మధ్య పెరిగివున్న వైరుధ్యం పరిష్కారమయ్యేందుకు భూస్వామ్య, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలలోకి ప్రజలు వచ్చే సూచనలున్నాయి. వర్గ శత్రువులతో బేరమాడి సమస్యలను పరిష్కరించుకుంటామనుకోవడం లేదు ప్రజలు. 'డిమాండు' చేస్తే లక్ష్యపెట్టేట్టు లేవు - ప్రభుత్వాలూ, రాజ్యాంగ 'అంగాలు' - నోళ్ళు మూయించేందుకు ఆశలుగొల్పే ప్రకటనలు చేస్తుంటాయి పాలకవర్గాలు.
తెలుగు ప్రజలు మూర్ఖులుకారు. సహించినంత కాలం సహిస్తారు. దేశ ప్రజలందరికన్నా ముందుగానే సహనం కోల్పోయే చైతన్య వంతులు తెలుగు ప్రజలు. మాతృభాష రక్షణకు దీక్షబూని ఉన్నారు. తల్లిభాష అభివృద్ధికి జరుగుతున్న కృషిలో పాల్గొంటారు. భాషాభివృద్ధిని ఆటంకపరచి, నాశనం చేయదలచి, ఆ భాషాజాతిని నిర్వీర్యం చేయబూనిన ఏ వ్యవస్థా మనుగడ సాగించలేదు నిశ్చయంగా.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|