TeluguPeople
  are the trend-setters

 
Articles: TP Features
భాషా ప్రాచీనత: కొత్త కోణాలు
- Site Administrator
< < Previous   Page: 8 of 9   Next > >  
'వల' అనేది ద్రవిడ పదమే అనడానికి జి. బ్రొన్నికోల్ రూపొందించిన 'ద్రవిడియన్ ఎటిమాడీ'లో కొన్ని సాక్ష్యాలు కన్పిస్తాయి. 'వల్' అనే మూల రూపానికి దాదాపు 8 అర్థాలు ఉన్నాయి. వల్ : Net, వల్ : big, much, very, వల్ : tired, atenuate, వల్ : Stone, వల్ : To cut, to be sharp, వల్ : To turn, to surround, వల్ : Creeper, వల్ : wind. వలన అనే పదం పంచమీ విభక్తి ప్రత్యయం. సంస్కృతం 'వలయం' (circle) కూడా కుడి అనే అర్థం కారణంగానే ఏర్పడిందేమో ఆలోచించాలి. ఆవల, ఈవల కూడా వల శబ్దానికి పరాయి రూపంగానే ఏర్పడింది. ద్రావిడ 'V' ఋగ్వేదంలో 'B' గా మారిందని దీన్ని బట్టి మనం తొందరపడి నిర్ధారించనవసరం లేదు. ప్రోటో నార్త్ ద్రావిడ రూపం 'బల్', బ్రాహుయీ భాషలో బలుమ్, కురుఖ్ భాషలో 'బలె'గా కన్పిస్తున్నాయి కాబట్టి వైదిక సంస్కృత 'బల' అనేది ఉత్తర ద్రవిడ 'బల్' లోంచి వెళ్ళిన అరువు పదంగా విజ్జల్ సృష్టీకరిస్తున్నాడు. దక్షిణ, మధ్య ద్రవిడ రూపాలలో 'బల్' అనేది 'వల్'గానే కన్పిస్తోంది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ, ఉత్తర ద్రవిడ రూపంతో నిమిత్తం లేకుండా నేరుగా దక్షిణ భారతదేశంలోకి ఇరాన్ నుంచి ద్రావిడులు సముద్రమార్గాన ప్రవేశించి ఉంటారనే వాదనకు ఒక చిన్న సాక్ష్యం ఇప్పుడు మీ పరిశీలనకిస్తున్నాను. 'వల్' శబ్దానికి బలంతో పాటు బలమైన హస్తం 'కుడి', అనే అర్థాన్ని కూడా మనం గమనించాం. ఆఫ్రో ఏసియాటిక్ ఎటిమాలజీ మనకు ఆన్ లైన్లో దొరుకుతోంది. డేటాబేస్ లో 'కొర్రీ' లోంచి గానీ 'వ్యూ' లోంచి గానీ వెదికితే ఈ పదాలు కన్పిస్తాయి. Proto Afro Asiatic : War - (వర్) Meaning : be big, strong Semetic : wVrVy : be fat Egyptian : Wr : big, Strength Western chaudic : War - strength Central chadic : WVr, Vr - big, old, great, Increase East hadic : Lele, Wele : Lougenen South Cerhitic : Ur : big, large Omotic : Urari : all ప్రోటో ఆఫ్రో ఆసియాటిక్ 'war' (వర్) అనేది తెలుగు, కన్నడ, తమిళ దక్షిణాది ద్రవిడ భాషలలో 'వల్' రూపంలో కన్పిస్తోంది. ఉత్తర ద్రవిడంలో 'బల్' రూపంలో 'బల'గా సంస్కృతంలో చేరినట్లు అర్థం అవుతోంది. ఈ చేరిక ఎలా సాధ్యమో భాషాశాస్త్రపరంగా విశ్లేషణ జరగవలసి ఉంది. భాషావేత్తలు దృష్టి సారించి తేల్చవలసి ఉంది. ఇలాగే 'కుడి' అనే అర్థం ఎలా వచ్చిందో గమనించండి. Proto Afro Asiatic : Walyan Meaning : Right (Side) Egyptian : wnmy : to the right eastchadic : walyam, to the right దీన్ని బట్టి వల్యం అనే పదం నేరుగా తెలుగు, తమిళ భాషల్లో కుడి అనే అర్థంలోనే చేరినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

Be first to comment on this Article!

< < Previous   Page: 8 of 9   Next > >  



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.