|
|
Articles: Short Stories | ఎంజాయ్ - Site Administrator
| |
సుమతి చకచకా పూజ, వంట ముగించేసుకుని మునిమాణిక్యంగారి కాంతం కథల్లో మునిగిపోయింది. చదివినదే మళ్ళీ చవిది నవ్వుకుంటోంది. కథలో కాంతమ్మగారి భర్త భార్య పట్ల ఎంత ఉదారత ప్రకటించి, పిల్లల బాధ్యత తను తీసుకుని కాంతాన్ని తెల్లవారుఝామునే కార్తీకస్నానానికి పంపుతాడు. ఆవిడ కార్తీకస్నానం ముగించుకుని వచ్చేలోపల పిల్లలు అమ్మ కావాలంటూ ఆయన్ను పెట్టిన అవస్థ చూస్తే, నిజంగా పిల్లల్ని సముదాయించడమన్నది ఒక్క తల్లి తప్పితే మరెవ్వరూ చెయ్యలేరన్న పరమసత్యాన్ని ఎంతో హృద్యంగా చెప్పిన మునిమాణిక్యంగారి ప్రతిభ చూస్తే ఎటువంటివారికైనా మనసుని గిలిగింతలు పెట్టగలదనిపించింది. నిత్యం జీవితంలో జరిగే సంఘటనలలో ఎంత హాస్యం నిండి ఉందో, దానిని గుర్తించి అనుభవించడమన్నది మరెంత గొప్ప విషయమో ఎంతో గొప్పగా చెప్పారాయన. సుమతి కళ్ల ముందు ఆ దృశ్యాన్ని ఊహించుకుంటోంది.
కార్తీక స్నానం పూర్తిచేసి ఇంటికి చేరిన కాంతమ్మగారికి ఇంటి ముందు చిన్న కాలవలో వంటి మీద బురదతో నిలబడి ఉన్న భర్త, ఆ భర్త చంకలో చంటిపిల్లాడు, గుమ్మాల మీద నిలబడి చోద్యంలా చూస్తున్న పిల్లలు కనిపించగానే నిస్సహాయంగా తనవైపు చూస్తున్న భర్త చూపుల్లోని అసహాయతని పట్టించుకోకుండా, గభాలున చంటిపిల్లాణ్ణి ఎత్తేసుకుని, ఎడపిల్లాణ్ణి దగ్గరికి తీసుకుని ముద్దులు పెట్టేసుకుని, `నే చచ్చిపోయానే... పాపిష్టిదాన్ని... నిన్నొదిలేసి వెళ్ళిపోయానే...' అంటూ, యుగాల తర్వాత కలుసుకున్నట్టు పిల్లల్ని ముద్దుల మీద ముద్దులు పెట్టుకుంటున్న కాంతమ్మగారు భర్తగారి వేపైనా చూడకపోవడం, అప్పటిదాకా పిల్లల్ని పట్టుకున్నందుకు ఆయన పడిన శ్రమని అస్సలు గుర్తించకబోవడం కాంతమ్మగారి భర్తని అక్కడే అలాగే నిలబెట్టేసాయి.
వర్ణనని బట్టి కథలో దృశ్యాన్ని ఊహించుకుంటున్న సుమతికి కళ్ళ ముందు పాపం కాంతమ్మగారి భర్త బేల ముఖం వేసుకుని ఇంటి ముందు కాలవలో నడుందాకా నీళ్ళు నిలబడి ఉండడం, కాంతమ్మగారు అసలాయన్ని ఏమాత్రమూ పట్టించుకోకుండా ఒకరి తర్వాత ఒకరుగా పిల్లల్ని ముద్దాడుతుండడం కళ్ళకు కట్టినట్టు కనిపించింది.
ఆ దృశ్యాన్ని తలచుకుంటున్నకొద్దీ సుమతికి తెరలు తెరలుగా నవ్వు వస్తోంది. నిజంగా పుస్తకపఠనంలో ఎంత ఆనందముంది. చదివిన ప్రతి వాక్యాన్నీ తమ ఊహలో చిత్రించుకునే స్వతంత్రం, ఆ ఊహలో మాధుర్యాన్ని ఆస్వాదించే ఆనందం... ఒక్క పుస్తకపఠనంలో తప్ప మరెందులో ఉంది... ఇంతలో ఫోన్ మోగింది. అది పిల్లల దగ్గర్నుంచే... `అమ్మా ఏం చేస్తున్నారు?' కొడుకు కుశల ప్రశ్నలు వేశాడు.
`ఎంజాయ్ చేస్తున్నాం...' సుమతి సంతోషంగా చెప్పింది. ఫోన్ శబ్దం విని ముందు గదిలోంచి హాల్లోకి వచ్చిన శంకర్రావు సుమతి సమాధానం విని నవ్వుకున్నాడు.
| Read 5 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|