| 
 | 
  | 
	
| 
Articles: Drama |  నరకానికి పూలదారి!?  - Mr. pyyetisrinivasarao srinivasulu
  |  |
 
చం : దానికిష్టమై నా దగ్గరకొస్తే నేనెందుకు సిగ్గుపడాలి?
వి : నువ్వు కాదు సిగ్గుపడాల్సింది. నీ లాంటి భర్త దొరికినందుకు నేను సిగ్గుపడాలి. సంసార స్త్రీలెందరో నీ లాంటి పురుషుల వల్లే పతనమౌతున్నారు. ప్రపంచంలో అందరు మగాళ్లూ నీ లాంటి వాళ్లే అయితే, ఇంకా కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకునే వారికి కన్నెపిల్లలే కరువైపోతారు.
చం : అవునవును. పురుషులందరూ దుర్మార్గులూ, స్త్రీలందరూ సన్మార్గులూను నీ దృష్టిలో.
వి : తప్పకుండా! అసలు మా స్త్రీ జాతి పాడవటానికి కారణం మీ పురుషులే!
చం : మహా పతివ్రతవు బయల్దేరావుగా! నువ్వీ లోకాన్నంతట్నీ ఉద్ధరించెయ్యి. అలా స్త్రీలు పతనం కాకుండా కాపాడు. అసలు ఆ అమ్మాయికి నేనంటే ఎంత మోజో నీకేం తెలుసే?
వి : ఎందుకుండదు మోజు?! పంది బురదను మెచ్చినట్లుగా దానికి నీ మీద మోజు, నీకు దాని మీద మోజు!!
చం : ఏం కూశావే రాస్కెల్! మొగుడ్ని... మొగుడ్ని పందంటావుటే? (దగ్గరకెళ్లి కొట్టడానికి చెయ్యెత్తుతాడు)
వి : (కోపంగా సీరియస్ గా) దించు చెయ్యి! ఇంత గొడవయ్యాక నువ్వు నాకు భర్తవూ కావు. నేను నీకు భార్యనూ కాను. ఒకానొకప్పుడు నీ మీద నాకూ, నా మీద నీకూ పూర్తి స్వతంత్రాలుండేవి. నువ్వు పూర్తిగా నావాడివనుకునే దాన్ని. కాని, నువ్విప్పుడు పరాయివాడివి. ఊరందరి వాడివి. పక్కా తిరుగుబోతు కుక్కవి. భ్రష్టుడివి!!
చం : (గట్టిగా పీక నొక్కేస్తూ) వెధవ పుస్తకాలు చదివి భర్తనెదిరించటం నేర్చుకున్నావు. ఆడదానికుండే అణకువ నీలో లేదు.
వి : (కీచుగా) అబ్బే! వేశ్యల్లో అణకువ ఉంటుంది.
చం : ఇంతవరకూ నీతో మాట్లాడ్డం నాదే బుద్ధి తక్కువ. నా దోవన నేను బతుకుతాను. నీ ఇష్టమొచ్చినట్టు నువ్వు చావు. (విశాలను గట్టిగా గెంటేస్తాడు. విశాల విసురుగా వెళ్లి టేబులు దగ్గర కుర్చీలో పడుతుంది.)
వి : (టేబులుకేసి తల బాదుకుంటూ ఏడుస్తూ) నన్ను కొట్టెయ్యండి! నన్ను చంపెయ్యండి! అప్పుడు మీరానందంగా ఊరందరితో తిరగచ్చు లేకపోతే నా కళ్లు రెండూ పీకెయ్యండి. అప్పుడిదంతా నా కళ్ల ముందు పడకుండా ఉంటుంది. నన్ను చంపెయ్యండి! నరికెయ్యండి! చంపెయ్యండి!! (భోరున ఏడుస్తూ ఉంటుంది)
చం : ఛి! ఛీ!! వెధవ ఏడుపూ నువ్వూను. ఈ కొంపలో మనశ్శాంతి లేదు. (చిరాగ్గా వీధిలోకి వెళ్లిపోతాడు)
[ఒక్క క్షణం విశాల అలాగే ఏడుస్తుంది. ఇంకా భర్త గదిలోనే ఉన్నాడనీ, అతను వచ్చి తనను ఓదారుస్తాడనీ తను పడుతున్న ఆశ నిరాశ కాగా, తలెత్తి వీధి వేపు చూసి, భర్త కనిపించకపోగా ఆవేశం కోపం మిళితం కాగా ఏడుస్తూ బ్రాందీ సీసాను ఎత్తి విసిరేయబోయి ఆగి సీసా ఎత్తి అందులో మిగిలి ఉన్న బ్రాందీని గటగటా తాగేస్తుంది. ఆ తరువాత ఎమ్.బి. లోకి వెళ్లిపోతుంది.]
.... క్షణం విరామం ....
[చంద్రం ఆర్.ఎఫ్.లోంచి (డ్రెస్సు మార్పు ఇంకా నిక్కరులోనే బితుకు బితుకుమనుకుంటూ వచ్చి, వాళ్ల నాన్న అంతకు ముందు పారేసిన సిగరెట్టు పీక తీసి నోట్లో పెట్టుకుని పొగ పీల్చేందుకు తంటాలుపడుతూ ఉత్సాహాన్ని చూపిస్తాడు. ఇంతలో ఎమ్.బి.లో గిన్నెలూ చెంబులూ విసిరేస్తున్న చప్పుళ్లు వినిపిస్తాయి. చంద్రం కంగారుగా టేబులుపై తండ్రి వదిలేసిన సిగరెట్టు పెట్టె, అగ్గి పెట్టెతో ఆర్.ఎఫ్.లోని తన తండ్రి గదిలోకి పరిగెడతాడు.]
[విశాల ఎమ్.బి.లోని తన గదిలోనించి ప్రవేశించి కోపంగా టేబులుపై ఉన్న పుస్తకాలన్నిటినీ చిందర వందరగా విసిరేస్తుంది. అప్పుడు ఆమెకి సచిత్ర కామశాస్త్రం పుస్తకం కనిపిస్తుంది. కోపంగా ఆ పుస్తకాన్ని చింపెయ్యబోయి ఆగి, ఒక్కొక్క పేజీ తిప్పుతుంది. symbolic music starts! ఆమెలో ఉద్వేగం ప్రస్ఫుటమౌతోంది. పేజీలు తిరుగుతున్నాయి. ఆమెలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు పెరుగుతున్నాయి. విశాలలో కామ వికారం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ పుస్తకాన్ని అలాగే చేతులతో నలిపేస్తూ, గుండెలకు హత్తుకుని ఎమ్.బి.లోకి వెళ్లిపోతుంది.]
Symbbolic music ends!
.... క్షణం విరామం ....
[చంద్రం చేతిలో కాలుతున్న సిగరెట్టుతో ప్రవేశించి, భయం భయంగా అటూ-ఇటూ చూస్తూ, టేబులు దగ్గర కెళ్లబోతుండగా సిగరెట్టువల్ల చెయ్యి చురుక్కు మనగా, వదిలేసి కోపంగా సిగరెట్టును కాలుతో తొక్కి, కాలు కూడా కాల్చుకుని కాలిన వేళ్ల ప్రదేశంలోనూ - కాలి ప్రదేశంలోనూ ఉమ్ము తడితో చల్లార్చుకుని, ఆ తరువాత టేబుల్ వద్దకు వెళ్లి, బ్రాందీ సీసాలోని బ్రాందీని నోట్లో పోసుకుని ఉక్కిరి బిక్కిరై దగ్గుతూ, ఆ సీసాతో లోపలికి ఆర్.ఎఫ్.లోని తన గదిలోనికి పరిగెత్తుతాడు)
... LIGHTS OFF ...
[ఈ టైమ్ లోనే స్టేజి పూర్తిగా సర్దాలి. వెనకనున్న తెల్ల కర్టెన్ పై సిల్ హౌట్ పడుతుంది. అయినా స్టేజి చీకటిగానే ఉంటుంది. అప్పుడే టేబుల్ మీద మరో బ్రాందీసీసా సగం వాడినది గ్లాసూ ఉంచాలి. సిల్ మాటలు వినిపిస్తున్నా స్టేజి ఈ టైములో చీకటిగా ఉంటుంది. కాబట్టి సర్దడం అవీ చేస్తే బాగుంటుంది. టైము కలిసొస్తుంది.]
 
  |  Be first to comment on this Article!
 
  |  |
 
 
 
  |  
 
		
 | 
  | 
  |  
| Advertisements |  
| 
 |  
  |  
 
  |  
| Advertisements |  
 
 |