|
|
Articles: Short Stories | చదువూ సంస్కారం - Site Administrator
| |
భావావేశాలను భాషలో వ్యక్తీకరించేటప్పుడు పదాల, చివరా, పదబంధాలా, వాటి సముదాయాలా చివరా, వాక్యాలలోని భావోద్వేగాల పలకరింపులు అదుపు కోసం ఉపయోగించే గుర్తులు (పంక్చుయేషన్ మార్క్స్) మాదిరిగా, గొప్పగా, శ్రమలలో భాగంగా పెరుగుతున్న పిల్లలకు - ఈ తల్లి ఒడికన్నా 'గొప్పబడి' ఎక్కడా ఉండదు. అందులోకీ - ఆ చిన్న, ఆఖరు పిల్ల ఉందే - అది ఈ జీవపరిణామం మొత్తానికీ, సమాజ పరిణామం చివరికీ కొనకీ ఒక 'ప్రకంపన' (వైబ్రేషన్)లాగ ఉంటుంది. ఆ పెద్దాడున్నాడే - వాడు ఈ గురుత్వాన్ని అదుపులో పెట్టుకొని, అకాశమంత ఎత్తు ఎదగ్గలడు. రెండవాడున్నాడే - సామాన్యుడు కాదు, ఈటెల్లాగ, విల్లమ్ములాగ, రెండు వైపులా పదునున్న కత్తిలాగ, మందుగుండు లాంటివాడు. వీరికి ఏ బడి? ఏం బడి? ఎలాంటి బడి పుట్టాల! ఇలాంటి శక్తి మూలకాలకి చదువుచెప్పే బడి ఎలాగుండాలో చెప్పడానికి శ్రమ విజయంలో మళ్ళీ పుట్టాల! వికాశాల్లోంచి, విజయాల్లోంచి, పరిమళాలలోంచి నిర్మితం కావాల్సి ఉంది పాఠశాలలు.
ఇప్పుడు - ఏ విలువలూ లేని విద్యకన్నా, శ్రమ విలువలూ, సంపదలూ సమీకరించే పనిలో ఉండే ప్రజాతంత్ర ఉద్యమం కావాలి. ఈ ఉద్యమ కార్యకర్తల కవసరమైన విద్యనందించే పాఠశాలలను ఉద్యమాలే నిర్మించుకుంటాయి. ప్రారంభంలో - విద్యను ఉద్యమ అనుభవాలే అందిస్తాయి - అనుభవాలే లిపులూ, నైపుణ్యాలు గల - అపరిమిత విజ్ఞాన కేంద్రాలూ, విశ్వవిద్యాలయాలు ప్రస్తుతానికి ఉద్యమాలే.
రాములమ్మా, సీతప్పడులు చేతులు కలిపి, ఒకే పిడికిలిగా పైకి లేపారు. ఆ నీడనే విద్యార్థులు కావాల్సి ఉన్న పిల్లలు చప్పట్లు చరుస్తున్నారు. ఆ శబ్దాలలోంచి కొత్త లిపులు పుడతాయి. సరికొత్త భావాలు పరిమళిస్తాయి. పలుకు పలుకో! తెలుగు పలుకు! ఇది నా ప్రియమైన తల్లి పలుకు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|