|
|
Articles: TP Features | భాషా ప్రాచీనత: కొత్త కోణాలు - Site Administrator
| |
వలను, వలపల, (కుడి) వలపవించు (కుడిచేతి మీదుగా తిరుగు) అనే అర్థాలకు మూలరూపం ఇక్కడ కన్పిస్తోంది. ఆవల, ఈవల శతాబ్దాలు ఈ 'కుడి' అనే అర్థాన్ని బట్టే ఏర్పడ్డాయి. ఈ నిరూపణల్ని బట్టి మనకు కొన్ని కొత్త ఆలోచనలు కలుగుతున్నాయి.
1. ఆఫ్రికాలో 'ద్రావిడులు' తొలుత అవతరించారు. మధ్య ఆసియా అంతా విస్తరించారు.
2. ఇరాన్ కేంద్రంగా కొందరు భూ మార్గాన సింధూ నగరాలలో ప్రవేశించారు. ఇంకొందరు సముద్ర మార్గాన బంగాళాఖాత తీరానికి చేరి డెక్కన్ కేంద్రంగా స్థిరపడ్డారు.
3. డెక్కన్ లోంచి గుజరాత్ దాకా వ్యాపించి సింధు నాగరికతకు శ్రీకారం చుట్టారు.
4. సింధు సరస్వతీ తీరంలో కూడా వ్యాప్తి చెంది తమ ఉనికిని చాటుకున్నారు.
5.ఉత్తర ద్రవిడులు ముందా? మధ్య ద్రవిడులు ముందా? దక్షిణ ద్రవిడులు ముందా? ఎవరు ఈ దేశంలో తొలుత నాగరికులు ఎవరనేది ఈ దిశలో ఆలోచన సారిస్తే గానీ తేలని విషయం. ఇంకా అనేక వాదోపవాదాలు సాగుతాయి. కొత్త పరిశోధనాంశాలు వెలుగులోకి త్వరలోనే వస్తాయి.
6. ఈ చరిత్ర గురించి ఇప్పటి వరకూ మన బుర్రల్లో నాటుకున్న అంశాలకు భిన్నమైన విశేషాలు వెలుగు చూడబోతున్నాయి వాటిని ప్రస్తావించే వారిని ఎవరు ఎంత ఎకసెక్కం ఆడినా ఒక చారిత్రక దృష్టిని ఒక క్రొత్త కోణాన్ని ఆవిష్కరించి ఈ పరిశోధనల్ని జనసామాన్యంలోకి తొలిసారిగా చేరుస్తున్న సంతృప్తి మాకుంది.
7. భవిష్యత్తులో ద్రావిడ భాషా కుటుంబం (Dravidian family of language) అనేది ఆఫ్రో ఏసియాటిక్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజ్ లో అంతర్భాగంగా అయిపోతుంది. ఆఫ్రికన్ భాషలు ద్రావిడ భాషా రూపాలుగా గుర్తింపు పొందుతాయి.
8. తెలుగు భాష గురించి తెలుగు పరిశోధకులు బయటి ప్రపంచానికి తెలియజెప్పవలసింది చాలా ఉంది. ఎంత ఆసక్తిని కనబరిస్తే జాతికి అంత ఉపకారం చేసినవారు అవుతారు. కనీసం 'DEDR' ని తెలుగు పదాల వరకూ సర్వసమగ్రం చేయగలిగితే గొప్ప మేలు చేసినట్టే! ఇదన్నా మన విశ్విద్యాలయాలు పట్టించుకోకపోతే ఇంక ఈ జాతిని ఎవరు రక్షించాలో... మరి!
9. ఇండో యూరోపియన్ భాషల మీద కూడా ద్రవిడ భాషా ప్రభావం ఉంది. అందుకు గల చారిత్రక కారణాల అన్వేషణ జరగాలి.
10. ఈ మొత్తం చారిత్రక పరిణామ క్రమంలో 'తెలుగు భాష'కు మూలభాష (ప్రోటో తెలుగు) ఈ దేశంలో అత్యంత ప్రాచీన భాషలలో ఒకటి అనీ, దాన్నే'అంధ(క)' భాషగా పిలిచారనీ, మన దృష్టి కోణాన్నీ అటువైపు సారించి గుర్తించాలి!
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|