TeluguPeople
  are the trend-setters
Videos
Cinema Gallery
News in Pix
Events and Parties
Sports
Travel / Leisure


Commissioning of Frigate INS Taragiri

Cape Size Bulk Carrier at Vizag port

AP MPS meet President Droupadi Murmu

HUDCO two day workshop on UiWIN

Nara Lokesh with Palla and Ganta
 
Articles: TP Features
నవ రసాల శ్రీశ్రీ
- Site Administrator
  Page: 1 of 6   Next > >  
(కొత్తపల్లి రవిబాబు) శ్రీశ్రీ ఇంటిపేరు మహాకవి. కవి అంటున్నాం కదా అని ఆయన ఒక్క కవిత్వమే రాశారా అంటే కాదు - కవిత్వం కంటే ఎన్నో రెట్లు వచన రచనలు చేశారాయన. మహాకవి అంటే కేవలం కవే కాదు, మహా రచయిత అనే అర్థంలో అది వాడుతున్నామనుకోవాలి. ఎవరిచ్చారీ మహాకవి ఇంటి పేరు? ప్రజలే ఇచ్చారు. నిరక్షరాస్యులిచ్చారు. సాహిత్యం అంటే ఎరగని వాళ్ళిచ్చారు. ఎప్పుడో 1930లో వివిధ పత్రికలలో రాసిన ఆయన కవితలు 1950 దాకా పుస్తక రూపంలోకి రాలేదు. అయినా ఆ గేయాలు ప్రజల్లోకి వెళ్ళిపోయాయి. తమ తమ సొంత భావనాలోకంలో విహరిస్తున్న కవుల కంటే, ఈ కవి తమకు దగ్గరయ్యాడని ప్రజలు గ్రహించారు. నీరాజనాలిచ్చారు. శ్రీశ్రీని కేవలం `మహాప్రస్థానం' , `ఖడ్గసృష్టి', `మరోప్రస్థానం' మొదలైన కవితల రచయితగా చూడటం సరైంది కాదు. ఆయన రాసిన వచన రచనలు - వ్యాసాలు, ఉపన్యాసాలు, కథలు, నాటికలు, సమీక్షలు, అనువాద నాటకాలు, స్వీయచరిత్ర మొదలైన వాటి గురించి విశ్లేషణాత్మకమైన రచనల ద్వారా ఆయన వచన రచనలోని సొగసులను, వచన రచనలోని విశిష్టతను తెల్సుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శ్రీశ్రీ 1965లోనే ఒక రేడియో ప్రసంగంలో ఇలా అన్నారు `వచనానికీ, కవనానికీ మధ్య గల సన్నని రేఖ తుడుచుకుపోయిన ఈ రోజుల్లో ఏది వచనం, ఏది కవనం అని మనం వింగడించనక్కరలేదు. వెనకటికొకాయన బోధపడేదంతా వచనం, బోధపడనిదంతా కవనం అని సూక్ష్మంలో తేల్చిపారేశాడు. కాని ఇప్పుడు వచనమే కవనమై బోధపడని రూపం ధరిస్తోంది. దీన్ని బోధపరచుకోవాలంటే మనం పాత సులోచనాలను పారవెయ్యక తప్పదు' - ఆయన జేమ్స్ జాయిస్ రాసిన `యులిసిస్' నవల గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు. `జేమ్స్ జాయిస్ అఖండ శబ్దార్థ సంపన్నుడు... ఆయన 1914-18లలో ఒక మహాయుద్ధ కాలంలో ఒక మహా కావ్యరచనలో నిమగ్నుడయ్యాడు. ఆ యుద్ధ ఫలితంగా రష్యాలో వచ్చిన సామ్యవాద విప్లవానికి ఎంత ప్రాముఖ్యం ఉందో సాహిత్య ప్రపంచంలో `యులిసిస్' నవలకు అంత ప్రాబల్యం ఉంది' (ఆంధ్రశిల్పి-1947 సెప్టెంబరు) అన్నారు. అంతేకాదు ఆ నవల రచిస్తున్న కాలంలో జేమ్స్ జాయిస్ ఒకే ఒక్క వాక్యం రాయడానికి, దాన్ని మెరుగులు దిద్దటానికి ఒక రోజంతా కృషిచేసిన ఉదంతం వివరించారు. (నవోదయ 31-8-47) జేమ్స్ జాయిస్ కొత్త పదాలను, కొత్త పదబంధాలను సృష్టించినట్లుగా శ్రీశ్రీ కూడా సృష్టించారు. భాషపై ఆయన ఎంత అధికారం సంపాదించారో ఈయనా అంత సంపాదించారు.

Be first to comment on this Article!

  Page: 1 of 6   Next > >  



News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2026 TeluguPeople.com, All Rights Reserved.

 
SAS Training