TeluguPeople
  are the trend-setters
Videos
Cinema Gallery
News in Pix
Events and Parties
Sports
Travel / Leisure


Commissioning of Frigate INS Taragiri

Cape Size Bulk Carrier at Vizag port

AP MPS meet President Droupadi Murmu

HUDCO two day workshop on UiWIN

Nara Lokesh with Palla and Ganta
 
Articles: TP Features
భాష మూలాలను హత్తుకుందాం
- Site Administrator
  Page: 1 of 3   Next > >  
(ఆచార్య జయధీర్ తిరుమలరావు) నానా రకాల అతి పాత, అతి కొత్త భాషలు ఆంగ్లంలో ఇట్టే కలిసిపోతాయి. అందుకే అది నిరంతరం అభివృద్ధి చెందుతుంది. ఎన్ని భాషలు కలుపుకున్నా తన సహజ వాక్యాన్ని, పరిమళాన్ని అది కోల్పోలేదు. అలనాటి గ్రీకు, హీబ్రూ వంటి గొప్ప భాషలు కొన్ని కాలక్రమేణా అంతరించిపోయాయి. సంస్కృత భాష మన కళ్ళ ముందు నుండే జారిపోతున్నది. గిరులు గీసుకుని చాలావరకు పరభాషలను పక్కకు పెట్టడం వల్ల లేదా తనలో కలుపుకునే సహజ స్వభావం లేకపోవడం వల్ల సంస్కృతంలో పరభాషా పదాలు లేవని కాదు. లౌకిక సంస్కృత రచనల్లో కొన్ని పదాలు కలిసిపోయినా అవి స్వాభావికం కాలేకపోయాయి. కాని చాలా భాషలు సంస్కృతపదాలను పెద్దమొత్తంలో స్వీకరించి ఏపుగా ఎదిగాయి. మరికొన్ని భాషలు తమ మూల పదాల కన్నా ఎక్కువగా సంస్కృతపదాలనే వాడుకలోకి తెచ్చాయి. వివిధ కారణాల వల్ల సంస్కృతం ఇతర భాషలపై అజమాయిషీ చెలాయించింది. ఆధిపత్యం కూడా వహించింది. కాని తన వరకు వచ్చేసరికి ముడుచుకుపోయింది. అందుకే ఆ భాషని మృత సమాన భాషగా భాషా శాస్త్రజ్ఞులు గుర్తిస్తారు. ఏదేమైనా భాషకు పరభాషా పదజాలాన్ని స్వీకరించే గుణం ఉండాలి. అలా ఉండకపోవడం అనారోగ్య లక్షణం. తెలుగుభాషకి ఈ సమస్య లేదు. అయితే తెలుగు విషయంలో మరో ప్రత్యేకత కనిపిస్తుంది. అదేమిటంటే... తెలుగుభాష ఒక్కటి కాదు. కొన్ని తెలుగుల సమాహారం. ఈ తెలుగులని మాండలికాలుగా, విలక్షణమైన తీరుతెన్నుల భాషలుగా గుర్తించవచ్చు. చరిత్ర పొడవునా రకరకాల తెలుగు భాషలను గుర్తించవచ్చు. ఈ స్వభావం లేదా భాషా దశలు అన్ని భాషలకీ ఉండవచ్చు. కాదనలేం. కాని తెలుగుకి చాలా ఎక్కువ పాళ్ళలో కనిపిస్తాయి. అందుకు చాలా కారణాలున్నాయి. అందులో ఒకటి చారిత్రక కారణం. నిజానికి ప్రాచీన చరిత్రక భౌగోళిక హద్దులను చూస్తే కన్నడం, మరాఠీ, ఒరియా వంటి భాషలు అఖండ తెలుగు నేలలోనే పురుడుపోసుకున్నట్లు తెలుస్తున్నది. తమిళభాష నుండి విడివడిన ఒక మాండలికం మలయాళీ భాష అయినట్లుగా పై భాషలలో కొన్ని చారిత్రక కాలం, హద్దులు, పరిపాలన, ప్రభావాలు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు తెలుగు వ్యవస్థ నుండి విడివడి తదుపరి ఏర్పడిన భాషలుగానే చెప్పవచ్చు. ఇక్కడ భాషా వ్యవస్థ అన్న పదం ఉపయోగించడం లేదు. తెలుగు వ్యవస్థ అని మాత్రమే అంటున్నాను. ఈ విషయం గమనించాలి. అందుకే ఆయా భాషలపైనే కాదు ఆయా ప్రాంతాల్లో ఇప్పటికీ తెలుగు మాట్లాడే అనేక కులాలు, బృందాలు, తెగలు ఆ భాషా వ్యవస్థలో, సాంస్కృతిక సంబంధాలలో విడదీయరాని భాషలుగా ఉన్నాయి. వాళ్ళ చరిత్ర, సాహిత్య చరిత్ర, భాషా పరిణామంలో తెలుగు ప్రభావం ఎంతో కనిపిస్తుంది. అనాదిగా ఎక్కువ పాళ్ళలో ఉండి ఉంటుంది కూడా. రానురాను ఆ ప్రభావం తగ్గిపోయింది. అయినా కొద్దిపాటి పరిశీలనల వల్ల, పరిశోధన వల్ల ఈ అంశాలను చాలా బలంగానే నిరూపించవచ్చు. ఈ సందర్భంగా మరోసారి చెప్పేదేమంటే దక్షిణం వైపు మన దృష్టినంతా కేంద్రీకరించడం వల్ల మనం చాలా చరిత్రని, భాషని పోగొట్టుకుంటున్నాం. ఇకనైనా మధ్యభారతం వైపు మన దృష్టికోణాలను ప్రసరింపచేయవలసి ఉంది. అప్పుడే ఆనాటి పాళీ, ప్రాకృతం - మధ్యకాలాల మరాఠీ, ఒరియా వంటి భాషా వ్యవస్థలు `తెలుగులు' మన కంటి ముందు వెలుగుతాయి. అంతేకాదు...

Be first to comment on this Article!

  Page: 1 of 3   Next > >  



News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2026 TeluguPeople.com, All Rights Reserved.

 
SAS Training