TeluguPeople
  are the trend-setters
Videos
Cinema Gallery
News in Pix
Events and Parties
Sports
Travel / Leisure


Commissioning of Frigate INS Taragiri

Cape Size Bulk Carrier at Vizag port

AP MPS meet President Droupadi Murmu

HUDCO two day workshop on UiWIN

Nara Lokesh with Palla and Ganta
 
Articles: TP Features
కర్త, కర్మ, క్రియ కేసీయారే
- Site Administrator
  Page: 1 of 4   Next > >  
(రాజేశ్ కర్రా) తెలంగాణ రాష్ట్ర సమితిలో ప్రస్తుతం ఏర్పడిన గందరగోళ పరిస్థితికి ఆ పార్టీ సుప్రీం కె. చంద్రశేఖరరావు మాత్రమే కర్త, కర్మ, క్రియ అనిపించకమానదు. ఇటీవలి ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చవిచూసిన తెరాసపై తెలంగాణ ప్రజల నుంచి ఎదురవుతున్న నిరసన, పార్టీలో అంతర్గతంగా పెల్లుబుకుతున్న అసమ్మతి చూస్తుంటే తెలంగాణ ప్రజల నుంచి ఒకప్పుడు బ్రహ్మరథం పట్టించుకున్న కెసిఆర్ ఈయనేనా అనిపించే వాతావరణం నెలకొంది. 'పూలమ్మిన చోటే కట్టెలమ్మాల్సిన పరిస్థితి' అంటే ఇదేనేమో! అలాంటి పరిస్థితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావుకూ ఎదురైనట్లు కనిపిస్తోంది. ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఓటమి చవిచూసినంత మాత్రాన తెలంగాణవాదమూ అంతమైపోయినట్లే కాదని ఒకవైపు తెలుగుదేశం నాయకులు, మరోవైపు కాంగ్రెస్ నాయకులు అంటున్న తరుణంలోనే తెలంగాణ సాధనే ధ్యేయంగా ఆవిర్భవించిన తెరాసకు ఇలాంటి గతి పట్టడం వెనుక కారణాలేవై ఉంటాయన్న ప్రశ్న ఉదయించడం సహజం. గతంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితికి వచ్చిన ఊపు, అది సాధించిన ఫలితాలు ప్రధాన రాజకీయ పార్టీల నాయకులకు దిమ్మతిరిగేలా చేశాయనడంలో సందేహం లేదు. వరంగల్ జిల్లాలోని చేర్యాల నుంచి మొదలుపెడితే నల్లగొండ జిల్లాలోని భువనగిరి వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి తప్ప మరో పార్టీ కనిపించలేదు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో `ఎవరికి ఓటేస్తావు?' అని అక్షరజ్ఞానం కూడా తెలియని ఒక గ్రామీణ మహిళను అడిగితే `నీళ్ళొస్తాయంటున్నాడు కదా, బిడ్డా!' అంది. దాన్ని బట్టి ఆమె ఎవరికి ఓటు వేసిందో స్పష్టంగానే చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిన కొత్తలో వరంగల్ జిల్లా జనగాంలో జరిగిన సభలో ఒక మేధావి `మర్రి చెన్నారెడ్డి లాగా కెసిఆర్ చేయరనే నమ్మకమేమిటి?' అంటూ వేదిక మీది నుంచే ప్రశ్నించినప్పుడు - `అట్లా చేసిన రోజు నన్ను రాళ్ళతో కొట్టండి' అని కెసిఆర్ చెప్పారు. కెసిఆర్ పూర్తిగా మర్రి చెన్నారెడ్డి మాదిరిగా చేయలేదు గానీ, తెలంగాణ ఉద్యమాన్ని తన ఉక్కు పిడికిలిలో బిగించి దాదాపు పదేళ్ళ కాలంలో పూర్తిగా నిర్వీర్యం చేసే పనికి మాత్రం ఒడిగట్టినట్లు అనిపించక మానదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెరాస సాధించిన ఫలితాలు నిజానికి తెలంగాణ మేధావులు సాధించి పెట్టిన విజయాలు. అప్పుడు కెసిఆర్ వెన్నంటి ఉన్న కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ బియ్యాల జనార్థనరావు కాలికి బలపం కట్టుకుని ఊరూరా, ఇల్లిల్లూ తిరిగారు. ఆయనతో తెరాసతోనూ, కెసిఆర్ తోనూ సంబంధాలు లేని తెలంగాణ మేధావులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెరాసకు ఎందుకు ఓటు వేయాలన్న దాన్ని ప్రజల్లో విశ్వాసం కల్పంచే విధంగా ఆయన చెప్పారు. వరంగల్ జిల్లా కడివెండిలో రాజకీయ పార్టీకి చెందిన రాజకీయ నాయకులను కూడా ప్రజలు విశ్వసించేవారు కాదు. అది ఎన్ కౌంటర్ లో మరణించిన అప్పటి పీపుల్స్ వార్ రాష్ట్ర కార్యదర్శి మహేష్ స్వగ్రామం. ఆ గ్రామ ప్రజలకు దగ్గరైన ఒక మేధావి వారిని నమ్మించి తెరాసకు అక్కడ చోటు కల్పించారు. అలా ఎక్కడికక్కడ తెలంగాణ మేధావులు తెలంగాణ రాష్ట్ర సమితి విజయానికి కృషి చేశారు.

Be first to comment on this Article!

  Page: 1 of 4   Next > >  



News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2026 TeluguPeople.com, All Rights Reserved.

 
SAS Training