ఈ సంభాషణంతా వింటున్న కొడుకు బుర్ర (తల) గోక్కునేసరికి ఏదో గొప్ప ఆలోచన తట్టింది. (ఏం తట్టిందో పాఠకుడు చెప్పుకోగలడా? కష్టం!)
చిటపటా చినుకులు - పలకరింపుకొచ్చినాయి
తొలకరి చినుకులు - మొనగొలకుల చినుకులు
చినుకులు, చిటపటలు, మొకలకలు, పలకరింతలు, పుట్టుకలు - ఆనందమంతా సౌందర్యల గందరగోళం, శాస్త్ర సాంకేతిక భాషలో `ఖయాస్!' ఉప్పొంగు. అంత ద్రవ్యరాశితో, చచ్చినంత భారంతో తాత్కాలికమైన దు:ఖంతో, అనంతమైన సంతోషంతో విస్ఫోటనంతో వికాసంతో పుట్టి పుట్టి, పలకరించి పలకరించి, పంటవచ్చి, జీర్ణమైన శక్తినిచ్చి - అది పేలిపోనిచ్చి, విశ్వగర్భకోశంలో అండం పిగిలి - విరుద్ధ జీవరసోత్పత్తులనూ విత్తనాలనూ, ఈ విశ్వసౌందర్యం, ఈ నేలన రాల్చినట్టుంది - జీవరాశికి జన్మనిచ్చే శింగారం పుడుతుంది, ప్రసవిస్తుంది. పదార్థం ఆడదై వుంటుందా! దాన్ని నాశనం చెయ్యలేం, సృష్టించలేం, వికసింపజేయగలం.... నాశనం చేసి సొంతం చేసుకోవడం కుదరుదు - అంత `బిగ్ బ్యాంగు'ను భరించగలుగుతామనుకోవడం ఒక భ్రమ!
శక్తి విస్ఫోటించి అంలకరిస్తూ ఉంటుంది. ఆ విస్ఫోటనంలోంచి తుళ్లివచ్చిన రసాయనిక గొలుసులను అతికించుకొని, జీవించుకొని, సమసమంగా బతకడానికి శ్రమపడడమే మన పని. ఏ వైరుధ్యంతోనైనా వర్గంతో నైనా యుద్ధం చెయ్యడానికి సన్నద్ధం చేయడానికి అందరినీ మాతృభాషతో పలుకరిద్దాం. యుద్ధం చేయడానికి అవసరమైన సంజనశక్తులు పెంచుకుందాం.
తెలుగులో తొలకరి - పలకరింపు కొచ్చింది
పలకరింపుకొచ్చాయి - తెలుగుయాస చినికులు
ఆడది పురిటికొస్తే - ఆడామగా ఇంటిల్లిపాదీ మగబిడ్డే పుట్టాలని కోరుకుంటారు. కానీ, ఆడబిడ్డ పుడితే, సంతోషిస్తారు. ఎందుకు? `కొడుకు' పదే పదే బుర్ర కోక్కునేసరికి `బుద్ధి పుట్టి' కారణం దొరికింది. ఈ విషయాన్నే పరిశోధనా (రిసెర్చి) పత్రం తయారుచేసి ఆంధ్ర విశ్వకళా పరిషత్తుకు సమర్పించి `డాక్టరేటు' కొట్టేయాలనుకున్నాడు. `కొడుక్కి' తట్టింది అదీ సంగతి.
అయితే - ఈ విషయమై `డాక్టరేటు' చేయడానికి కనీసం మూడేళ్ళయినా పడుతుంది. ఈ మూడేళ్ళు ఖర్చు? ఎంతో కొంత పొలమో పుట్రో అమ్మాలి. తండ్రి సూరన్న - ఈ ఖర్చును భరించడానికి ఒప్పుకుంటాడా? లేదా? అన్నదే సమస్య. వేచిచూద్దాం. మళ్ళీ చిటపటా చినుకులు ఆరంభమైనాయి.
పలకరింపు కొచ్చినాయి - తొలకరి చినుకులు
తొలకరి చినుకులు - పలకరింపు కొచ్చినాయి.
|