TeluguPeople
  are the trend-setters
Videos
Cinema Gallery
News in Pix
Events and Parties
Sports
Travel / Leisure


Commissioning of Frigate INS Taragiri

Cape Size Bulk Carrier at Vizag port

AP MPS meet President Droupadi Murmu

HUDCO two day workshop on UiWIN

Nara Lokesh with Palla and Ganta
 
Articles: TP Features
భావం పరాయీకరణ
- Site Administrator
< < Previous   Page: 2 of 6   Next > >  
అధికార భాషా సంఘం, ప్రభుత్వశాఖలలో తెలుగుభాష అమలును సమీక్షిస్తున్నది. గత రెండు, మూడు దశాబ్దాలుగా తెలుగు పత్రికారంగం బాగా పుంజుకుంటున్నది. జర్నలిజం కళాశాలలు పెరిగిపోతున్నవి. `ప్రెస్ అకాడమీ'ని ప్రభుత్వం స్థాపించింది. పత్రికా నిఘంటువులు వెలువడుతున్నాయి. అనువాద విధానాల మీద కూడా చాలా వరకు రచనలు వస్తున్నాయి. ఆ ప్రమాణాలకు దీటుగా ఇతర ప్రాంతీయ భాషల కంటే పురాతనమైనదిగా తెలుగుభాషను నిరూపించడానికి `ప్రాచీనభాష' హోదా ప్రోత్సాహమిస్తుంది. స్వదేశీ సంస్థానాలు మార్గ సంప్రదాయానికి చెందిన వేదశాస్త్రాలు, కవిత్వం, కళలు, ఆయుర్వేదంతో పాటు చేనేత మొదలైన వృత్తులు, జానపద కళలను కూడా ప్రోత్సహించారు. ముఖ్యంగా కొన్ని పంటలు, చేతివృత్తులు, జానపదకళలు, ఔషధాలు ఆయా ప్రాంతాల, సంస్థానాల ప్రత్యేకతను చాటడమే కాదు, ఆదాయ వనరులుగా ఉండేవి. చేనేత వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు మన ఎగుమతులలో అధికశాతంగా ఉండేవని బ్రిటీష్ వారు పేర్కొన్నారు. వేదాల అధ్యయనాన్ని దేవాదాయశాఖ, భాష, సాహిత్యాల అధ్యయనాన్ని విశ్వవిద్యాలయాలు, సంగీత-సాహిత్య, లలితకళల అభివృద్ధిని ఒకప్పుడు అకాడమీలు, ఇప్పుడు తెలుగు విశ్వవిద్యాలయం కొనసాగిస్తున్నాయి. `మన జనాభాలో నలభై శాతం నిరక్షరాస్యులు. అందువల్లనే తెలుగు బతికి ఉంది' అనే వాస్తవాన్ని ఎమెస్కో ప్రచురణకర్త మాతృభాషా దినోత్సవ సందర్భంగా దూరదర్శన్ లో జరిగిన చర్చలో పేర్కొన్నారు. ఈ నలభై శాతమూ ఉత్పత్తి రంగానికి చెందిన రైతులు, మత్స్యకారులు, చేనేత మొదలైన వృత్తుల వారు. వీరి సామర్థ్యం మీదనే మన అభివృద్ధి ఆధారపడి ఉంది. వ్యవసాయం, మత్స్యపరిశ్రమ, పశుపాలన, చేనేత, కమ్మరి, కుమ్మరి, కంసాలి వృత్తులకు సంబంధించిన విజ్ఞానాన్ని వ్యవసాయ, పశుగణాభివృద్ధి, సాంకేతిక విశ్వవిద్యాలయాలు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, హస్తకళల అభివృద్ధి సంస్థలు అభివృద్ధి చేస్తున్నాయి. ఈ రంగాలలో పనిచేసేవారంతా పాశ్చాత్య శాస్త్రాలను చాలా వరకు ఆంగ్లమాధ్యమంలో చదివినవారు. వీరు నిరక్షరాస్యులైన గ్రామీణులతో కలిసి పనిచేయాలి, ఉత్పత్తి పెంచాలి. వీరికి ఏ మేరకు దేశీయ విజ్ఞానం గురించి అవగాహన, జ్ఞానం, పరిభాషతో పరిచయం అవసరం, గ్రామీణులను అర్థం చేసుకోవడంలో వారు భావనాపరంగా, భాషాపరంగా ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? నిరక్షరాస్యులైన గ్రామీణుల వాడుకలో అటు ఆంగ్లపదాలు, ఇటు తెలుగుపదాలు ఎటువంటి మార్పులకు లోనవుతాయి? ఏ మేరకు ఈ మార్పులు అవగాహనను, వ్యక్తీకరణను కుంటుపరుస్తున్నాయి? తెలుగు అకాడమీ పాఠ్యగ్రంథాలలో పారిభాషిక పదాలు ఏ మేరకు ఉద్యోగులు, శాస్త్రవేత్తలు, జనసామాన్యం వాడుతున్నారు? ఏయే సందర్భాలలో మాండలికాన్ని, ఆంగ్లపదాలను వాడుతున్నారు? ఈ విషయాలపై ఎవరూ ఆలోచించడం లేదు.

Be first to comment on this Article!

< < Previous   Page: 2 of 6   Next > >  



News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2026 TeluguPeople.com, All Rights Reserved.

 
SAS Training