మ్యూజిక్ స్టార్టయింది తరువాత పాట మొదలయింది. కళ్ళు జిగేల్మన్నట్టుగా లైట్లు ఒక్కసారిగా పైన బడ్డాయి. అనుకున్నట్టుగా సాంగ్ బాగా వచ్చింది. డైరెక్టర్ తో సహా అందరూ హాపీ ఫీలయ్యారు .
తన స్పెషల్ విషెస్ రూపకి చెప్పి మరో ఫ్లోర్ కి వెళ్ళిపోయాడు అనాటి ప్రసిద్ద డైరెక్టర్. అందరూ రూప ని మెచ్చుకున్నారు ఆమె అభినయాన్ని.
ఈ మధ్య ఏం జరిగిందో ఎమో కొంత కోలాహలం జరిగింది. పేరున్న హీరోయిన్ పక్కన సహనటిగా డ్యాన్స్ చేసిన రూపని డైరెక్టర్ మెచ్చుకోవడమ్ సదరు హిరోయిన్ కి నచ్చలేదుట. అదీ కారణం. అందర్లో బిర్యాని పాకెట్ అందుకుని అలసిపోయిన రూప తినడం నీళ్ళపాకేట్ ని నోటి తో చించి తాగేయగానే ఫ్లోర్ లోంచి ఆఫీస్ బాయ్ రూప కోసం కేకేసాడు. ఆశ్చర్యపోయి రూప ఫ్లోర్లోకి వెళ్ళి రెండు నిమిషాల్లో బైటకొచ్చింది కోపంగా. ఆమె వెంట ఆఫీస్ బాయ్ సైతం వచ్చేసి రూపచేతిలో డబ్బు ఉంచినప్పటికిని రూప మాత్రం ఆ డబ్బుని వాడి మొహాన గొట్టేసి 'ఈ డబ్బులు సైతం ఆ హిరోయిన్ కే ఇచ్చేయ్' అంటూ విసవిసవెళ్ళిపోయింది సహనటి రూప.
రూప అద్భుతంగా నటించడం నచ్చని హీరోయిన్ నిర్మాతకి చెప్పి ఆ సినిమాలోంచి రూపని తొలగించడం రూప కోపానికి కారణమయ్యింది.