TeluguPeople
  are the trend-setters
Videos
Cinema Gallery
News in Pix
Events and Parties
Sports
Travel / Leisure


Commissioning of Frigate INS Taragiri

Cape Size Bulk Carrier at Vizag port

AP MPS meet President Droupadi Murmu

HUDCO two day workshop on UiWIN

Nara Lokesh with Palla and Ganta
 
Articles: TP Features
మరాఠీ- తెలుగు అనుబంధం
- Site Administrator
< < Previous   Page: 3 of 4   Next > >  
ధనిక పార్శీలు, గుజరాతీల స్థాయికి ఎదిగిన 18 శ్రీమంత గృహస్థులు తెలుగువారేనని చరిత్ర నమోదు చేసింది. వీరిని జ్యోతిరావు ఫూలే ఆలోచనా విధానం బలంగా ప్రభావితం చేసినందున తెలుగు సమాజాల సమగ్ర అభివృద్ధికి వీరు చేసిన కృషి వర్ణనాతీతం. ప్రసిద్ధ మరాఠీ చరిత్రకారులు డాక్టర్ వై.డి.ఫడ్కే, డాక్టర్ మనోహర్ కదం, ప్రసిద్ధ ప్రగతిశీల మరాఠీ రచయిత బాబా ఆడావ్ రాసిన గ్రంథాల ద్వారా మహారాష్ట్రలో తెలుగువారు చేసిన సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ గొప్పతనాలన్నీ బయటకు వచ్చాయి. `ముంబయి నిర్మాణంలో తెలుగువారి యోగదానం' అనే ప్రసిద్ధ పరిశోధన గ్రంథాన్ని డాక్టర్ మనోహర్ కదమ్ రాశారు. జోతిరావు ఫూలే రాసిన ప్రసిద్ధ `గులాంగిరీ' గ్రంథాన్ని రామయ్య వెంకయ్య అయ్యవారు అనే ప్రసిద్ధ కాంట్రాక్టుదారుడు, సాహితీపరుడు, ఫూలే ఆప్తమిత్రుడు మూడుసార్లు ముద్రించి ప్రసిద్ధి చేశాడు. బాబా అడావ్, రామయ్య వెంకయ్య రాసిన `ఈశ్వరునికి ప్రార్థన' మూల గ్రంథాన్ని 1983లో వెలికితీసి తెలుగువారి గొప్పతనాన్ని చాటి చూపాడు. 150 సంవత్సరాల క్రితం రాసిన ఎన్నో గ్రంథాలను ఈ మధ్యకాలంలో బయటికి తేవడం ఎంత క్లిష్టమైన పనో, చరిత్ర, సాహిత్యకారులకు తెలిసినదే. 1926లో తెలుగు సమాచార పత్రిక (మరాఠీలో) మకర సంక్రాంతి సందర్భంగా 424 పేజీలతో ప్రసిద్ధ తెలుగు రచయిత శంకర్ రావు పర్శా విడుదల చేశాడు. అందులో డాక్టర్ అంబేద్కర్, డాక్టర్ కేత్కర్, ప్రొఫెసర్ మాధవరావు ఆల్ తేకర్, రావ్ బహదూర్ చింతామణి, కేశవరావు పాద్యేలు రాసిన వ్యాసాలున్నాయి. ఆంధ్రపత్రిక సంపాదకుడు కాశీనాధుని నాగేశ్వరరావు (ముంబయిలో స్థాపించిన), జన్మభూమి సంపాదకుడు డాక్టర్ పట్టాభి సీతారామయ్య, లీడర్ పత్రిక సంపాదకుడు చింతామణి, డాక్టర్ అంబేద్కర్, మాడపాటి హనుమంతరావు పంతులు లాంటి గొప్ప వ్యక్తుల పేర్లను ప్రస్తావించిన కృతజ్ఞతల పత్రం అందులోనే ఉంది. ఆనాటి ఇంగ్లీషు, మరాఠీ, తెలుగు దినపత్రికలు 14 -1-1926 నుంచి 3-2-1926 వరకు తెలుగు పత్రిక గొప్పతనాన్ని వర్ణిస్తూ, స్తుతించి ప్రసిద్ధం చేశాయి. శంకర్ రావు పర్శా `ఇంద్రప్రకాశ్', `జ్ఞానోదయ' మరాఠీ పత్రికలకు వ్యాసాలు రాస్తూ సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించినవాడు. `తెలుగు వాఙ్మయం', `తెలుగు ప్రజల లేఖలు', `ఒక ఉపేక్షిత రాజకీయకవి', `ఆంధ్ర ఉద్యమం' లాంటి ప్రసిద్ధ గ్రంథాలను మరాఠీలో రాశాడు. ఏప్రిల్ 6, 1933 రోజున ఆయన దివంగతుడయిన వేళ వివిధ దినపత్రికలు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించాయి. స్త్రీల కోసం తొలి విశ్వవిద్యాలయం స్థాపించిన మహర్షి కర్వేతో ఆర్.డి.బండార్కర్ పరిశోధన సంస్థతో, విల్లింగ్ టన్ వాడియా లాంటి ప్రసిద్ధ విద్యాసంస్థలతో పర్శాకు అతి దగ్గరి సంబంధాలుండేవి. ఆయన మరణానంతరం ముంబయిలో స్థాపించిన `తెలుగు ఫ్రీ' లైబ్రరీకి వెయ్యి పుస్తకాలను, ఐదువేల రొక్కాన్ని విరాళంగా ఆయన సతీమణి అందజేశారు.

Read 1 Comment(s) posted so far on this Article!

< < Previous   Page: 3 of 4   Next > >  



News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2026 TeluguPeople.com, All Rights Reserved.

 
SAS Training