TeluguPeople
  are the trend-setters
Videos
Cinema Gallery
News in Pix
Events and Parties
Sports
Travel / Leisure


Commissioning of Frigate INS Taragiri

Cape Size Bulk Carrier at Vizag port

AP MPS meet President Droupadi Murmu

HUDCO two day workshop on UiWIN

Nara Lokesh with Palla and Ganta
 
Articles: Drama
నరకానికి పూలదారి!?
- Mr. pyyetisrinivasarao srinivasulu
< < Previous   Page: 5 of 15   Next > >  
(చంచలరావు బూతు పుస్తకం చూస్తాడు) సిల్ : గురవయ్య పాచిక పారింది! (చంచలరావు బూతు పుస్తకాన్ని తెరుస్తాడు. Symbolic music starts. Sexని రెచ్చగొట్టే Forcible foreign music ఉంటే బాగుంటుంది.) సిల్ : చంచలరావ్! తెరిచావు బూతు పుస్తకాన్ని. ఇప్పుడు నీకు విచ్చలవిడిగా చరించే రమణి కావలసి వచ్చిందా? 'భ్రష్ఠస్య కామాగతి:' అన్నారు. ఆలశ్యం దేనికి? విటుడివి కూడా అయి పూర్ణభ్రష్ఠుడివి అయిపో! మందు అందించిన గురవయ్య ఈ సాయమూ చెయ్యకపోడు! [వీధి గుమ్మం దగ్గర గాజుల గలగలలు వినిపిస్తాయి. చంచలరావు తూలుతూ వీధి గుమ్మం వైపు వెళ్తాడు. ఎల్.ఎఫ్.లో అందమైన అమ్మాయి పక్కన గురవయ్య (సైగలు) చంచలరావుని తూలకుండా గురవయ్య పట్టుకుంటాడు జాగ్రత్తగా తీసికెళ్లి, చంచలరావు చేతిని ఆ అమ్మాయి భుజంపై వేయించి ఇద్దరినీ ఆర్.ఎఫ్.లోని గదిలోకి పంపి నవ్వుకుంటాడు. (నవ్వు కనిపిస్తుంది. వినిపించదు.) Symbolic music ends. బ్రాందీసీసా సరంజామాను సర్దుకుని గురవయ్య వీధిలోకెళ్లబోతుంటాడు. ఇంతలో అంతవరకూ అప్పుడప్ప్పుడు కళ్లు మాత్రమే కనిపించేలా చూస్తున్న చంచలరావు కొడుకు చంద్రం ప్రవేశించి ఆర్.ఎఫ్.లో ఉన్న తండ్రి గదికేసి వెళ్లబోతాడు. చంద్రం ఆర్.ఎఫ్.కేసి వెళ్లడం గురవయ్య చూస్తాడు. వెంటనే చంద్రాన్ని ఆపి, అతడి చేతిలో అయిదు రూపాయల నోటుంచి, వీధిలోనికి తీసికెళ్లడానికి ప్రయత్నిస్తాడు. కాని, చంద్రం ఆ అయిదు రూపాయల నోటును నేలకేసి కొట్టి, తండ్రి గదిలోకి వెళ్లబోతాడు. గురవయ్య నేల మీద పడ్డ 5 రూపాయల నోటుని తీసి చంద్రం జేబులో కుక్కి కొడతానన్నట్లు చెయ్యెత్తి బెదిరించి వీధిలోనికి అంటే ఎల్.ఎఫ్.లోనికి లాక్కు వెళతాడు. ఆర్.ఎఫ్.లోపల నవ్వులూ - కిలకిలలూ. స్టేజి మీద లైట్లు ఆరి పోతాయి!] [(ఇంతవరకూ మైమ్ గేమ్ నడిచింది. ఇప్పుడే మొదటి డైలాగ్ లు. అవీ గదిలోంచి వినిపిస్తాయి)] స్త్రీ గొంతు : ఏవిటండీ? మీరు మరీ అంత ఇది?! చంచలరావు : (తాగిన మైకంలో ముద్దగా) డాళింగ్! నువ్వు కూడా సిగ్గుపడుతున్నావే? స్త్రీ : ఏం? నేను మాత్రం స్త్రీని కానా?! చం : నేను మెచ్చిన నాకు నచ్చిన స్త్రీవి నువ్వే! ఇదిగో ఈ ఆస్తీ, అంతస్థూ, నా సర్వస్వం నీ కోసమే! అంతా నీ పాదాల దగ్గరే!! {స్టేజి పై ఎర్రదీపం వెలిగి, ఆరి, వెలిగి, వెలిగి ఆరుతుంటుంది.} సిల్ : ఇలా ఎన్నో పగళ్లూ, ఎన్నో రాత్రులూ గడిచిపోయాయి. తనను పరికించే గూఢచారుల మాట పూర్తిగా మర్చిపోయాడు చంచలరావు. అతని అంతరాత్మ ఏనాడో నశించింది. కాని.. అతని పాపం బద్దలయ్యే రోజొచ్చింది. కప్పిపుచ్చుకున్న తప్పు నిప్పులా రాజుకుంది. అతని పాపం అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న అతని భార్య కంటపడింది. ఇంట్లో పెనుతుఫాను రేగింది!

Be first to comment on this Article!

< < Previous   Page: 5 of 15   Next > >  



News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2026 TeluguPeople.com, All Rights Reserved.

 
SAS Training