 |
are the trend-setters |
|
|
|
|
|
|
Articles: Drama | తొలకరి పలకరింపులు - Site Administrator
| |
కలవలోలు ఏల బావ - కమ్మగ డిలవరి అవ్వని అమ్మి
ఆలంటికి ఆలెల్తరు - మాకెందుకు సాయపడ్తరు
బుర్రన్నది నీకు బావ - బుద్ధిలేదు అందల
పాపన్న : పలకరింపుకేన రార - పల్లకోవొయి బావ
తొలకరి పిలకలే - తరువాత పంటలోయి రావ
ఇంట్లోంచి సూరప్ప బయటకొచ్చి సూరన్ననుద్దేశించి
కంసాలోడింటికెళ్ళి - మంచం దిగ్గొట్టించు
పాపన్న సాయంతో - మంచం నులకను నేయించు
కుమ్మరోడింటికెళ్ళి - బొగ్గుల కుంపటి బెత్తాయించు
కోమటోడింటికెళ్ళి - పురిటి సామాన్లు కట్టించు
పల్లక కూకుంటే - పనులవుతాయేటి మళ్ళ
చుట్టాలున్నారు ఇంట్లో - వంటింట్లో కెళ్ళాలినేను..
సూరన్న : పాపన్న బావ రోవోయి - పనిచెబుతాను నీకు
పాపన్న : దొరికినాను సవకగ - పదవోయి బావ
పొద్దున్న లేచి నేను - ఎవరి ముఖం చూసినానో
దొరికిపోయినాను నీకు - అమిరిపోనాను అప్పకు
సూరన్న : ఎందుకోసం దిగినావో - వేళ చూసి వచ్చినావు
అక్కచెల్లిల్నిచ్చినావు ఆపాటికి - సేవ చెయ్యవేటి బావకు
నా చెల్లిల్ని నీకిచ్చినాను - ఎకరం భూమి ఇచ్చినాను
నీ సూరప్పకు ఇస్తానన్న - పసుకు కుంకమెగ్గొట్టినావు
అసలు వడ్డీ లెక్కగట్టి - నీ ముక్కు పిండనా ఏటి?
ఆ మాట ఎత్తితే - ముక్కుత్తావు మూల్గుతావు
ఈపాటికి సాయానికి -ఎనకెనక నక్కుతావు
వర్షం ఎగ్గొట్టీసింది. తూరుపు దిక్కునుండి ఎండ పలకరించేస్తుంది. మిట్ట మధ్యాహ్నమయ్యింది. కూడు తినాల... కడుపు కాలిపోతంది. టీ సుక్కేనా పోసిందిగాదు సూరప్ప. ఇంట్లో పురిటి సన్నాహాలు జరుగుతున్నాయి. అంతా గడబిడగా ఉంది. మంత్రసానిని పిలవడానికి ఎవర్నో పురమాయించింది సూరప్ప. ఒక గుంటెవరో వావిలాకులు తెచ్చి ఇచ్చింది. మరొకర్తె పసుపు దంచుతోంది.
ముక్కుల్తో, మూల్గులుతో ఇంటికొచ్చిన వాళ్ళందరినీ పలకరిస్తోంది డిలవరీ అవబోతున్న పిల్ల. ఇంతలో మంతరసానొచ్చింది. వీధివైపు తెరుచుకున్న తలుపులు దడేల్ మని మూతపడ్డాయి.
| Be first to comment on this Article!
| |
|
|
 |
(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.
|
|
|
|
|