 |
are the trend-setters |
|
|
|
|
|
|
Articles: Drama | తొలకరి పలకరింపులు - Site Administrator
| |
రాత్రంతా వాన చినుకులు రాల్తనే ఉన్నాయి. చల్లని గాలులు, తీపి తీపి చినుకుల్ని కుడిచి, మట్టిలో వరి విత్తనాలు కదుల్తున్నాయి. తెల్లవారుజాముకల్లా మట్టిలో చల్లిన గింజలూ, నేలలో కునుకు తీస్తున్న రకరాకల విత్తులూ, ఉబ్బరించి, పగిలి తెల్లని మొలకలు పొడిచి, భూమిని పలకరిస్తున్నాయి.
గడప (వరండా లేద అరుగు) లో ఒకమూల బొంత కప్పుకొని పడుకున్న సూరన్నకు మెలకవొచ్చింది. పసిబిడ్డ ఏడుపు రకరకాలుగా వినబడుతోంది. పిల్లలు నవ్వినా, ఏడ్చినా, ఆ శబ్దాల్ని ఏడుపులే అని పిలుస్తాది లోకం. ఏడుపు లాగున్నాదే... మగ గుంటడు పుట్టాడు గావాల్న. బాడిసరకం (కష్టబాటు పని) చెయ్యాల్సి వస్తోందని పుట్టుకుతోనే ఏడుస్తున్నాడు... ఆహా.. ఆ యేడుపు నవ్వినట్టుగున్నాది... ఆడగుంటగాని, కొంపతీసి పుట్టేసిందేటి... ఇల్లాకత్తల (ఇంటి వెనుకకు) వెళితే గాని అసలు సంగతి తెలవదు గొణుక్కుంటూ వెళ్ళాడు సూరన్న.
సూరప్ప : లచ్చివోరంతోటి... మాలచ్చి పుట్టింది... ఓలిమాయమ్మే...
పిల్లని ముద్దులాడేస్తోంది గావాల... ఆ శబ్దాలు వినబడ్డాయి సూరన్నకు.
అనుకున్నదంతా అయ్యిందీ అనుకున్నాడు సూరన్న.
కొంత సేపటికి జలగడగిన ముత్యంలాగుంది తొలిపొద్దు. మరి కొంతసేపటికి - తూరుపున మలిపొద్దు... పాలపెదవులతో పసిబిడ్డ ముద్దెట్టుకుంటే, మరకలు పడ్డ ముత్తెం లాగుంది. ముద్దు తీరక బుగ్గల్ని కందిపోయేటట్టు చిక్కేస్తే, ఎలాగ కనిపిస్తాయో బుగ్గలు... అలావుంది ఎరుపు మరకల తూరుపు.
గడిచిన రాత్రిపూట, తనింటికెళ్ళిపోయిన పాపన్న - మెడకు అడ్డంగా కత్తవను మోపుకొని, ఏం పని మిగిలిందో... గాబరాగా పారొస్తన్నాడు-
ఏటోయ్! సూరన్న బావ! మనవరాలేనా! పలకరించేడు..
నీ అశుభం నోరంట, ఏమాటొస్తే అదేగదోయ్
పాపన్న : శుభం పలకరా అంటే... చెల్లిముండకు పెల్లెప్పుడున్నాడట... నీకేలోయ్ బాద! ఆ పిల్ల ఆళ్లదీ... నీ సొంత మనవరాలైతే ఏడాలా...
ఈడి సీటనోరుతోటి శాపనార్ధాలు ప్రారంభం అనుకున్నాడు సూరన్న. పొలాల్లోంచి అరుపులు, తోటల్లోంచి కూతలు, ఇటింటా అలికిడ్లూ... పసిగుంటల ఏడ్పులు ఉయ్యాలల్లో. ఆవులు ఉచ్చలు పోసీసి... పొదుగులు సేపేస్తున్నాయి.... దూడలు తమ మెడకట్టుకు తలలు తెగిపోతాయేటోనని, ఆలోచించక అంబా... అంబా అని అరుపులు. చెంబెట్టుకొని గట్టోరకైనా వెళ్ళనివ్వడం లేదు.
చిటపట తెలుగక్షరాల - చినుకులో చినుకులో
పలకరింపుకొచ్చినాయి - తెలుగులోన మొనకలు
ఎవడాడు. చెరువుగట్టు దిగియిటు వస్తున్నది. ఈరకాడు సీతప్పుడు లాగున్నాడు. పాపన్న బావకు తోడు ఈడొకడు. తెల్లారనివ్వరు.. తిండేలకి వచ్చేస్తారు. ఇంటికాడున్న కష్టం సుఖం వీళ్ళకు తెలియదు.
సూరన్న : యేటి సీతప్ప బావ - ఇలా వచ్చేసినావు
ఏడో మాసం నిండలేదు - కోడలు కన్నదేంటీ సూరన్న.
నీ కిగటం నాకు సంకటం - వినవోయి సూరన్న బావ
ఈ మద్దిన నీ కొడుకు మా ఇంటికాసి ఒచ్చినాడు? సీతప్పడు.
నీ ఇంటికాసి వచ్చిండేటని - నీకు అడగుబోతన్నను
పెల్లం మీదున్న రోకు - తల్లితంద్రుల మీదుంటద
సీతప్పుడు : పురుడయినాక కూతురు - కాపరానికి వెళ్ళనంటుంది
ఎందుకలాగంటే - ఏడుస్తూ కూకుంటది
ఏటైనా చెప్పినాడ - నీ తోటి నీ కొడుకు
ఎందుకిలాగ అవుతుందని - అడగడానికొచ్చాను
సూరన్న : గత్తుక్కుమన్నాడు సూరన్న. కొడుక్కేంటి పట్టుకుంది. కోడలేటిసేసింది
ఏం చావొచ్చిందిర నాయనో. ఏటయ్యిందిరో ఈరకాడ..
సీతప్పుడు : కొడుకును కంటాననీ - నాకుతురన్నాదట
కూతుర్నే కనమని - నీ కొడుకు అన్నాడట
కొడుకునే కంటే - కాపరానికొద్దన్నాడట -
సూరన్న : మంచీ చెడ్డా లేదాడికి - మక్కిలిరగంతానాడికి
కూతురు కావాలాడికి - కొడుకక్కర్లేదా? ఆడికి?
ఆడమ్మ మొగుడు చేస్తాడా - యవసాయం గివసాయం
ఆగడమా ఆడికి - అలుసైపోయానాడికి
కోడలి దగ్గరకొస్తానుండు - కొడుకునే కనమంటానుండు
ఆడదాయి పెంకం ఆడికి - మా ఆడదాన్ని వాయిస్తానుండు
అగ్గిమీద గుగ్గిలంమైపోతున్నాడు సూరన్న. పాపన్న దగ్గరకొస్తన్నాడు. వికటాల్తో సంపేస్తాడాడు. దూరంగొ పొమ్మని సైగ చేశాడు. ఇంతలో తలుపు తీసి వీధిలోకి వచ్చింది సూరప్ప. సీతప్పడ్ని చూసి
ఏమిరయ్యా సీతన్నా - ఎలాగుంది కోడలు
ఏడోనెల పురుడొస్తే - ఏనుగు పుడతాదిరో
తొమ్మిదిలో పురుడొస్తే - శ్రీ లచ్చిం పుడతాదిరో
సూరన్న : నోరు ముయ్యు నోరుముయ్యి - పాపమ్మ కూతురా
పొట్ట చింపితె అక్షరం లేదు - భవిష్యత్తు చెబుతావేటి
చచ్చిందాక, ఈ చాపలమోత - తప్పనియ్యవేటే
స్మశానం కెళ్ళిందాక - నేను వ్యవసాయం చెయ్యాలేటే
నీకు శ్రీ లచ్చిమి వస్తాది - నా చెక్కా ముక్కా పట్టికెల్తది
బిచ్చమెత్తుకుందువూ - బీపి వాచిపోగలదెళ్ళవే
సూరప్ప : ఆ మడిసితోటి యేటిగాని - ఈ జంతిలెల్లి అవతల గడపకొచ్చీమీ. ఏలయ్యింది కూడెడతాను. పురుటిల్లు... ఏటొండలేదు. పప్పూ, బంగాళదుంప కూరొండినాను...చుట్టపోడివి... చూసినావా ఇల్లంతా ఎంత గందరగోళంగుందో...
| Be first to comment on this Article!
| |
|
|
 |
(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.
|
|
|
|
|