 |
are the trend-setters |
|
|
|
|
|
|
Articles: Drama | తొలకరి పలకరింపులు - Site Administrator
| |
చూడి ఆవు ఈనడానికి సిద్ధంగా ఉన్నట్టుంది. పిల్లలకి పాలు కావాలి గదా? సూరన్నకు లేత జున్నంటే ఇష్టం. కట్టువిప్పి ఈనబోతున్న ఆవును సాలలోకి తీసుకెళ్ళి వదిలింది సూరప్ప. ఒకపక్క ఆవు ఈనుతుంటే, మరోపక్క మంచంపైన సూరన్న కునుకు దీస్తన్నడు. కలలో మనవరాలు పుట్టినట్టు జూసి తుపుక్కున లేచి చుట్టూ చూశాడు.... ఆడదూడను కంటున్నది. ఎంతో ఆనందపడి సూరప్పను పిలిచాడు... అప్పటికే ఆమె మరగబెట్టిన నీళ్ళు గోలెం తెచ్చిపెట్టింది. పురిటి ఆవుకు పత్యం కుడితె (దాణా) తెస్తోంది. ఆడదూడ నేలనపడి `అంబా' అని పలకరించింది. సాల పెణకమీద చిటపటా... దడదడా తొలకరి చినుకులు పడి పలుకరిస్తున్నాయి తెలుగుభాషలో.
ప్రపంచమంతా ఆడమయం. లేకపోతే పుట్టుగెక్కడిదీ! అనుకున్నాడు సూరన్న. వీధి వాకిట్లోకొచ్చాడు. పాపన్నను కేకేసి ఈనిని ఆవూ, పుట్టిన దూడనూ శుభ్రం చేసేపని అప్పగించాడు. తొలకరి చినుకులు వానగా మారినట్టుంది. బ్యాగును ఊపుకుంటూ, తడుచుకుంటూ కొడుకు పరిగెత్తుకొని రాడవం చూశాడు సూరన్న - గడపల కూర్చోబెట్టి మేనకోడలు పుట్టిందని చెప్పి, కోడలికీ వీడికి మధ్య పుట్టిన తగువు తేల్చుకుందామని ఆ విషయం ప్రస్థావించాడు -
కోడలికీ నీకు మధ్యన తగువేటిర కొడకా
అది కొడుకును కంటానంటే - నువు కూతురు కావాలన్నావట
తగువు లేదు గిదువు లేదు - తంటాలి మారి యేటి సెప్పింది?
ఆడదానికి ఆడదాయి శత్రువేటి? అయ్యా
కూతుర్నీ కనమంటే, కొడుకంటాదేటి?
కొడుకునుకంటే - కాపరానికొద్దన్నను, తప్పా చెప్పయ్యా...
ఓరి, నీ తెలివి మండిపోనూ - బోసిడికీ నోరుముయ్యి
చదువేస్తే బద్దిరిగా - ఉన్నమతీ పోయిందేటి నీకు?
కొడుకు కిసుక్కున నవ్వి... బ్యాగుతీసి... అందులోంచి కాయితాలు తీసి అయ్యకు చూపించాడు. వారం దినాలకిందట కోడలి కడుపు పరీక్షలు చేయించి పురుటికి పంపించాడట కొడుకు. ఈ పరీక్షలు రిపోర్టులో... కడుపులో ఉన్నది ఆడశిశువని చెప్పిందట డాక్టరమ్మ. ఆ విషయం కోడలికి చెప్పకుండా ఆటపట్టించడానికి ఈ రకం తగువు పెట్టుకున్నాడట హాస్యానికి. ఇదంతా తెలుసుకున్న సూరన్న...
ఓరోరి కొడుక - ఎంతపనీ చేసినావు
దడదడ చినికులు - దడదడా చినుకులు
తొలకరి చినుకులు - పలకరింపు కొచ్చినాయి
సూరమ్మ : ఇందాకటనుండీ ఇదంతా పక్కన నిలబడి వింటున్న సూరమ్మ ఆడేటి సేసిండు - ఆడిస్టం అవతదేటి?
సూరన్న : ఓసోసె, ఓసోసె, ఎల్లొసె - మద్దిన దూరకు మళ్ళా
| Be first to comment on this Article!
| |
|
|
 |
(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.
|
|
|
|
|