
|
|

General Forum: Offbeat n Jokes | జోకులేసుకుందాం రా ! | |
| 1. భర్త : "పక్కింటి సుబ్బారావు ఏం తెచ్చినా నేనూ అదే తేవాలని ప్రతీరోజూ గొడవ పెట్టుకునేదానివి కదా, ఈ రొజు నేను నీ కోరిక తీర్చబోతున్నాను".
భార్య: " ఎప్పుడూ లేనిది ఈ రొజు అంత హుషారుగా వున్నారు, ఆ సుబ్బరావు అన్నయ్య ఏం తెచ్చారు?"
భర్త:" మొదటి పెళ్ళానికి విడాకులు ఇచ్చి శుభ్రంగా రెండో పెళ్ళి చేసుకున్నాడు".
భార్య :" ????"
2. లక్ష్మి :" నువ్వు ఒక్క పని కూడా శుభ్రంగా చేయడం లేదు.అందుకే రేపట్ణుంచి నిన్ను పన్లోంచి తీసేస్తున్నాను"
పనిమనిషి :" ఆ మాట అయ్యగారి చేత చెప్పించండి, ఇప్పుడే పని మానెసి వెళిపోతాను"
లక్ష్మి:" ????"
3. " చచ్చానురా బాబు,మా ఆవిడా, నా లవర్ కలిసి ఇటు వైపే వస్తున్నారు. త్వరగా పద, ఆ ఎదురు బడ్డీ వెనుక దాక్కుందాం !" పరుగులు తీయడం మొదలుపెట్తాడు గోపి.
"నిజమే, ఆ మాటే నేనూ చెబుదామనుకుంటున్నాను, పద త్వరగా దాక్కుందాం" అంటూ పరుగులు తీసాడు అతని ప్రాణ స్నేహితుడు రవి.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 26, Nov 2009 2:36:30 PM IST (1)"మన సైంటిస్టులు ఎంతో కష్ట పడి ట్రైన్ ను కనిపెట్టడం ఎంతో మంచిది అయ్యింది." అన్నాడు రాము.
" ఎందుకలా అంటున్నావు" అడిగాడు సోము.
"లేకపోతే ఎంతో ఖర్చు పెట్టి వేసిన ఈ పట్టాలన్నీ వేస్టయిపోయేవిగా " గొప్ప విషయాన్ని కనిపెట్టిన వాడిలా చెప్పాడు రాము.
(2) పెళ్ళి మగవారి జీవితంలో ఊహించని మార్పులు తెస్తుంది.ఉదాహరణకు ప్రేమికుడు పెళ్ళి కాక ముందు ప్రియురాలితో నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేనంటాడు.తీరా పెళ్ళయ్యాక నీతో ఒక్క క్షణం కూడా బ్రతకలేనంటాడు.
(3)శోభనం గదిలో అడుగుపెట్టాక "ఏమండీ మీరు జీవితం లో ఎవరినైనా ప్రేమించారా ?"అని ఆడిగింది భార్య.
"మొదటి రాత్రి ఇవన్నీ మనకు అవసరమా ?అయినా అలా ఎందుకడుగుతున్నావు?" ఆశ్చర్యంగా అడిగాడు భర్త.
"ఏంలేదు, మీరూ నాకంటే ఎక్కువమందినా లేక తక్కువ మందినా అన్నది తెలుసుకుందామని" అసలు సంగతి చెప్పింది భార్య.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 19, Nov 2009 3:48:24 PM IST కొత్తగా కంప్యూటర్ కొన్న ఒక పెద్ద మనిషి మర్నాడు ఆ షాపుకు వెళ్ళి "నా కంప్యూటర్ సరిగ్గా పనిచెయ్యడం లేదు. ఇందులో చాలా ప్రాబ్లం స్ వున్నాయని చెప్పి" ఒక పెద్ద లిస్టు ఇంజనీరుకు అందజేసాడు. అందులో వివరాలు ఈ విధంగా వున్నాయి.
1. కంప్యూటర్ లో స్టార్ట్ బటన్ వుంది గానీ స్టాప్ బటను లేదు.
2. కంప్యూటర్ లో రీ సైకిల్ బటన్ ఒకటి వుంది. కానీ నా దగ్గర స్కూటర్ మాత్రమే వుంది కాబట్టి రీ స్కూటర్ బటన్ ను ఏర్పాటు చేయగలరు.
3.కంప్యూటర్ లో మైక్రోసాఫ్ట్ ఆఫీసు అనే ప్రోగ్రాం వుంది. నేను కంప్యూటర్ ను ఇంట్లో వాడతాను కాబట్టి మైక్రోసాఫ్ట్ హౌస్ ప్రోగ్రాం ను ఇన్స్టాల్ చేయవల్సిందిగా కోరుతున్నాను.
4. కంప్యూటర్లో ఫైండ్ బటను వుంది గానీ సరిగ్గా పనిచేయడం లేదు. మా ఆవిడ బీరువా తాళం చెవులు పోగొట్టుకుంది. ఈ బటను సహాయంతో వాటిని వెదకాలని ప్రయత్నిస్తే కంప్యూటర్ జవాబివ్వడం లేదు.
5. స్క్రీను పై మై పిక్చర్స్ అని ఒక్స్ ఫోల్డర్ వుంది కానీ ఆశ్చర్యంగా అందులో నా పిక్చర్ ఒక్కటి కూడా లేదు.
6. మా అబ్బాయి మైక్రోసాఫ్ట్ వర్డ్ అప్పుడే నేర్చేసుకున్నాడు. అందుకని మైక్రోసాఫ్ట్ సెంటెన్స్ ప్రోగ్రాం ను కంప్యూటర్లో వేయవల్సిందిగా కోరుతున్నాను.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 19, Nov 2009 12:55:32 PM IST (1)ఇద్దరు పిసినిగొట్టు స్నేహితుల మధ్య సంభాషణ ఇలా కొనసాగుతోంది.
మొదటివాడు: "ణెను పెళ్ళయ్యాక భార్యను పుట్టింటికి పంపించేసి నేనొక్కడినే హనీమూన్ కు వళ్ళి సగం డబ్బు ఆదా చేసాను:
రెండోవాడు :"ఓస్ ఇంతేనా ? నేనైతే నా పెళ్ళాన్ని పక్కింటివాడితో హనీమూన్ కు పంపించేసి డబ్బు పూర్తిగా ఆదా చేసాను"
మొదటివాడికి ఈ దెబ్బకు తలతిరిగి కిందపడిపోయాడు.
(2) "అమ్మా! నీ తల వెంటుకలలో కొన్ని తెల్లగా వున్నాయెందుకని ?" అడిగాడు చింటూ.
"నువ్వు నా మాట వినకుండా నీ ఇష్టం వచ్చినట్లు అల్లరి చెసినప్పుడల్లా నా తల వెంట్రుక ఒక్టి తెల్లగా అయిపోతుంది" చెప్పింది తల్లి.
చింటూ కొంతసేపు ఆలోచించి" ఇప్పుడు అమ్మమ్మ తల వెంట్రుకలన్నీ ఎందుకు తెల్లబడిపోయాయో తెలిసింది" అని తుర్రుమన్నాడు.
(3) ఆఖరు క్షణాలలో వున్న భర్త తన భార్యను పిలిచి" నేను చచ్చిపోయాక నువ్వు నా స్నేహితుడు శేఖర్ ను తప్పక పెళ్ళి చేసుకోవాలి, అలా అని ఒట్టు వెయ్యు" అని అడిగాడు.
" అలాగే చేసుకుంటాను కాని, అతను నీకు బిజినెస్ లో పరమ శత్రువు కదా , అతనిని ఎందుకు చేసుకోమంటున్నావు?" ఆశ్చర్యంగా అడిగింది భార్య.
" ఇన్నాళ్ళూ నేను నరకం అనుభవించాను, ఇప్పుడు వాడు కూడా కొంత అనుభవించాలని" అసలు సంగతి చెప్పాడు భర్త.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 18, Nov 2009 3:08:01 PM IST పెళ్ళికి నిర్వచనం
1. "స్వామీజీ నాకు ఒక మంచి ఉపదెశం ఇవ్వండి"దీనంగా ప్రార్ధించాడు రమణ.
"వెంటనే పెళ్ళి చేసుకో.వైవాహిక జీవితం విజయవంతం అయ్యిందా జీవితాంతం సుఖపడతావు, లేకపోతే తత్వవేత్త అవుతావు" చెప్పారు స్వామీజీ.
2. మగవాళ్ళెవరూ తమంతట తాము పెళ్ళికి సిద్ధం అవరు.పెళ్ళే వారిని పెళ్ళికి సిద్ధం చేస్తుంది.స్వేచ్చాయుత ప్రపంచం నుండి బందిఖానాకు తోస్తుంది.
3. మగవాళ్ళందరికీ ఒక ఉచిత సలహా : పెళ్ళికి ముందు యోగాలో తప్పక చేరండి.సహనం,ఓర్పు, కుక్కిన పేనులా పడి వుండడం, మాటకు ఎదురు చెప్పకపోవడం వంటి సద్గుణాలను అక్కడ నేర్పుతారు.గంటల తరబడి గానుగెద్దులా ఇంటి పని, వంట పనులను హాయిగా నవ్వుతూ చేయడం ఒకరు కొట్టినా,తిట్టినా,అరిచినా అసహ్యించుకున్నా,ఓపికతో భరించడం నేర్చుకోవచ్చు.
3. ఆనందానికైనా, అశాంతికైనా పునాది వేసేది పెళ్ళి.
వినేవాళ్ళను శాసించేవారిగా,శాసించేవారిని వినేవారిగా మారుస్తుంది పెళ్ళి.
పెళ్ళవగానే మగవాడు తన పర్సుపై పట్టును కోల్పోతాడు.
పెళ్ళి అనే పంజరంలోకి వచ్చాక ఇక జీవితాంతం బయట పడడం అంటూ వుండదు.
భార్యను సంతోష పెట్టాలంటే ఇంటి పన్లన్నింటినీ ఆమె చెప్పకుండానే చేసెయ్యాలి.నచ్చకపోయినా భర్త తన అత్తవారిని పొగడడం, పుట్టింటివారిని తిట్టడం చేస్తుండాలి.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 18, Nov 2009 10:46:21 AM IST 1.పల్లెటూరి గిరీశం పట్నం వచ్చి సినిమా చూద్దామని హాలుకు వెళ్ళి కౌంటర్లో ఒక బాల్కనీ టికట్ కొన్నాడు. కొద్ది సేపటిలోనే మళ్ళీ వచ్చి ఇంకొక టికట్ కొన్నాడు. “అదేమిటి సార్ ! ఇంతకు ముందే కదా మీరి టికట్ తీసుకున్నారు, మళ్ళీ కొన్నారేమిటి?” అని ఆశ్చర్యంగా అడిగాడు టికట్లు అమ్మే వ్యక్తి.
“ నేను కొన్న టికట్టును ఆ తలుపు దగ్గర నిల్చోని వున్న ఒక పిచ్చి వెధవ తీసుకొని చింపేసి ఒక చిన్న ముక్క చేతిలో పెట్టాడు. అందెకే మళ్ళీ టికట్టు కొంటున్నాను” చుట్ట నములుతూ అసలు సంగతి చెప్పాడు గిరీశం.
గిరీశం మాటలకు బుకింగ్ లోని వ్యక్తి నోరెళ్ళబెట్టాడు.
2.“సార్ ! మీ దగ్గర మైక్రోసాఫ్ట్ హోం సిడి వుందా ?” కంప్యూటర్ షాపుకు ఫోన్ చేసి అడిగాడు వెంగళప్ప.
“మైక్రోసాఫ్ట్ హోమా ? అలాంటి సాఫ్ట్ వేర్ పేరు నేనింతవరకూ వినలేదే? అయినా అదెందుకు మీకు ?” అడిగాడు షాపతను.
“ మా ఆఫీసు కంప్యూటర్ లో మైక్రోసాఫ్ట్ ఆఫీసు వుంది. ఈ రోజే ఒక కొత్త సిస్టం ఇంటి కోసం కన్నాను, దానికి వాడదామని” అసలు సంగతి చెప్పాడు వెంగళప్ప.
3. “నేను నేర్పించిన యోగా మీ ఆయన తాగుడు వ్యసనంపై ఏమైనా ప్రభావం చూపీంచిందా ?” అడిగారు యోగా టిచర్.
“ లేకేం, బ్రహ్మాండంగా చూపించింది.ఇంతకు ముందు ఒక చోట స్థితం గా కూర్చోమి ఒక్కొక్క గుక్క తాగేవారు ఇప్పుడు తలకిందులుగా నిలబడి మొత్తం బాటిల్ ను ఒక్క గుక్కలోనే తాగేస్తున్నారు” చెప్పింది అనసూయ.
4.ఎర్రగా కాలిన చెవులతో వచ్చిన వెంగళ్ళప్పను చూసి ఆస్చర్యంతో అడిగాడు డాక్టర్. “ చెవులు ఇంతగా ఎలా కాలిపోయాయి ?” అని.
“నేను ఆఫీసు కెళ్ళే తొందరలో బట్టలు ఇస్త్రీ చేసుకుంటూ వుండగా సెల్ ఫోన్ మోగింది. ఫోనుకు బదులు ఇస్త్రీ పెట్టె తీసాను” చెప్పాడు వెంగళ్ళప్ప.
"మరి రెండో చెవి ఎలా కాలింది”
“ఆ వెధవే రెండో మారు కూడా ఫోన్ చేసాడు” అసలు సంగతి చెప్పాడు వెంగళ్ళప్ప.
5. ‘టీం ఈండియా నిన్న మ్యాచ్ లో ఓడిపోవడం వలన నాకు రెండు వేలు నష్టం వచ్చిం” బాధగా అన్నాడు గోపాల్.
“ ఏమయ్యింది ?” అడిగాడు విజయ్
“నిన్న పాకిస్తాన్ పై మ్యాచ్ లో ఇండియా గెలుస్తుందని వెయ్యి రూపాయలు పందెం కాసాను. మన జట్టు ఓడిపోయింది. డబ్బులు పోయాయి”
“మరి రెండో వెయ్యి రూపాయలు ఎలా పోయాయి?”
“ కనీసం హైలైట్స్ లోనైనా గెలుస్తుందని వెయ్యి రూపాయలు పందెం కట్టాను, అప్పుడు కూడా ఇండియా ఓడిపోయింది” అసలు సంగతి చెప్పాడు గోపాల్.
6. అమ్మాయిలు పెళ్ళయేవరకు భవిష్యత్తు గూర్చి ఆందోళన పడుతూ వుంటారు. అబ్బాయిలకు పెళ్ళయ్యిన తర్వాత భవిష్యత్తు పై ఆందోళన ప్రారంభమవుతుంది.
7. పెళ్లనేది ఎలుకల బోను వంటిది.బయట వున్నవారు లోపలికి వద్దామన్న ఆతృతతో వుంటే లోపల వున్న వారు బయటకు ఎంత త్వరగా బయటకు పారిపోదామా అని ప్రయత్నిస్తూ వుంటారు.
Posted by: Mrs. Kanaka Durga At: 17, Oct 2009 9:14:54 AM IST 1."ఏమండీ,వంటింట్లో గిన్నెల శబ్దాలు వస్తున్నాయి,దొంగలు పడి నేను వండిన వంటలన్నీ తినేస్తునట్లున్నారండీ, త్వరగా పోలీసులకు ఫోన్ చెయ్యండీ" అంటూ ఆదుర్దాగా భర్తను నిద్ర లేపింది అనసూయ.
"నువ్వు వండిన వంటలను తిని వారెక్కడికి పారిపోగలరు.నెమ్మదిగా వెళ్ళవచ్చు లేవే" అంటూ ఆవులిస్తూ తిరిగి దుప్పట్లోకి దూరిపోయాడు సుబ్బారావు.
2."అమ్మా కొంచెం అన్నం వుంటే పెట్టండి తల్లీ" అరిచాడు ముష్టివాడు.
" అమ్మగారు ప్రస్తుతం ఇంట్లో లేరు, తర్వాత రా!" పేపరు చదువుకుంటున్న రమేష్ అసహనంగా అరిచాడు.
" నేను అడిగింది అన్నంగాని అమ్మగారిని కాదండి" తిరిగి అన్నాడు ముష్టివాడు.
"మా ఆవిడ ఆఫీసు నుండి వచ్చే టైమయ్యింది, ఇక వెళ్ళు రాణీ, రేపు నేను ఇలాగే ఆఫీసు ఎగ్గొట్టి తప్పక వచ్చెస్తాను కదా, అప్పుడు మళ్ళీ ఎంచక్కా ఎంజాయ్ చెయ్యొచ్చు " మత్తుగా అన్నాడు మధు.
" ఏం పర్లేదు మధు. మీ ఆవిడ కూడా ఆఫీసు ఎగ్గొట్టి మా ఆయనతో సినిమాకి వెళ్ళడం చూసే నేను వచ్చాను.వాళ్ళు ఇంకొక రెండు గంటల వరకు రారులే, నువ్వేం దిగులు పడొద్దు" అసలు సంగతి చెప్పింది రాణి.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 14, Oct 2009 1:10:51 PM IST 1. "మీ ఆయన వారం రోజుల నుండి కనిపించడం లేదంటున్నారు కదా ! కంప్లయింట్ తో పాటు మీ ఆయన పోలికలను కూడా రాసివ్వండి. ఎంక్వయిరీ చేసి ఆచూకీ తెలుసుకుంటాం " అన్నాడు ఎస్. ఐ
" ఎత్తు ఆరడుగులు, బరువు తొంభై కిలోలు, నల్లగా , బట్ట తల, చెంపపై గాటు, పై వరుసలో మూడు పళ్ళు వుండవు. పెద్ద గోళ్ళు" అని ఒక క్షణం ఆలోచించి " వద్దు లెండి ! ఆ రూపం తలుచుకోవడానికే అసహ్యం వేస్తోంది.ఇంక ఈ కేసు సంగతి మర్చిపోండి" అని ఒక నిట్టూర్పు విడిచి బయటకు వెళ్ళిపోయింది రజని.
2. "మీఆవిడను బ్రతికించాలని శత విధాలా ప్రయత్నించాం. కాని సాధ్యం కాలేదు. డెత్ సర్టిఫికేట్ ఇవ్వమంటారా? అని అడిగాడు డాక్టర్ దైవాధీనం.
" ఆ అవసరం లేదు లెండి. ఆవిడకు మీరే వైద్యం చేసినట్లు రిపోర్టులు వున్నాయి కదా ! అవే డెత్ సర్టిఫికేట్ల క్రింద పనికి వస్తాయి" తాపీగా చెప్పాడు అయోమయం.
3. " ఏం నాన్నా! ఈ రోజు హోం వర్కు నేను చెసి పెట్టనా ? పుస్తకాలతో కుస్తీ పడుతున్న కొడుకును ప్రేమగా అడిగాడు వెంకట్రావు.
" వద్దు నాన్నా ! తప్పులతో నేను కూడా హోం వర్కును చెసుకోగలను" ఠపీమని అని తిరిగి పుస్తకాలతో తల దూర్చాడు బంటీ.
4. " త్వరలోనే మీకు కష్టాలు రానున్నాయి. అవి తట్టుకోలేక చివరకు మీరు సన్యాసం తీసుకుంటారని ఆ జ్యోతిష్కుడు చెబితే ఏమో అనుకున్నాను" అన్నాడు శేఖర్.
" ఏమయ్యింది ?" అడిగాడు మనోజ్.
" నాకు ఈ మధ్యే పెళ్ళి అయ్యింది" తాపీగా చెప్పాడు శేఖర్.
5. చాలా కాలం తర్వాత కనిపించిన స్నేహితులు ఎంతో ఆప్యాయంగా పలుకరించుకున్నారు.
" ఏరా విజయ్ ? ఎం చేస్తున్నావు?" అడిగాడు సునీల్.
" ఎంతో కష్టపడి చదివి ఎం టెక్ చేసి హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నెలకు లక్ష రూపాయలు జీతం, మరి నువ్వో?"
"కష్ట పడలేక,చదువు సంధ్యలు వంటికి పడక పదొ క్లాసుతోనే చదువు ఆపేసి, హయిగా రెసిడెన్షియల్ కాలేజిని నడుపుకుంటున్నాను,నెలకు లక్ష రూపాయల ఆదాయం" తాపీగా కిళ్ళి నములుతూ చెప్పాడు సునీల్.
6. మీకొక మంచి వార్త, ఒక చెడ్ద వార్త, ముందుగా ఏది చెప్పమంటారు ? అడిగాడు డాక్టర్ వెంగళప్ప.
"ముందు మంచి వార్తే చెప్పు" ఆసక్తిగా అడిగారు మంత్రి గారు.
" వచ్చే వారమే మీ శిలా విగ్రహ ఆవిష్కరణ మరియు సంతాప సభ" అసలు సంగతి చెప్పాడు డాక్టర్ వెంగళప్ప.
7. "ప్రతీ చిన్న పనికీ చిట పట లాడుతుంటారు,మీ ఆయన ఏం చేస్తుంటారు ?" అని అడిగింది రాధ.
" ఎండు మిరప కాయల వ్యాపారం" చెప్పింది రేఖ.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 14, Oct 2009 1:08:04 PM IST 1. టిఫిన్ చేసాక జేబులు తడుముకొని హడావిడిగా కౌంటర్ దగ్గరకు పరిగెత్తాడు సుబ్బారావు. “సార్, నా పర్సు ఇంట్లో మరిచిపోయాను.”
“ఏం పర్లేదు. ఏమైనా విలువైన వస్తువులుంటే ఇక్కడ వుంచి వెళ్ళండి. తర్వాత డబ్బులు ఇచ్చి తీసుకువెళ్దురు గాని!” చెప్పాడు కౌంటర్ దగ్గర కూర్చున్న వ్యక్తి.
“ నా దగ్గర విలువైనవి ఏమీ లేవే, ఎలా ?” సందేహం వ్యక్తం చేసాడు సుబ్బారావు.
“మరేం భయపడకండి, ఆ ఫాంటు, షర్టు గోడకు తగిలించి హాయిగా వెళ్ళండి” తాపీగా చెప్పాడు కౌంటర్ దగ్గర వ్యక్తి.
2. “ఈ రోజు స్కూలుకు రావడం అంత లేటయ్యిందేం ?” రామూని అడిగింది టిచర్.
“ ఈ వీధిలో కొత్తగా పెట్టిన బోర్డు వలన లేటయ్యింది టిచర్”
“ఆ బోర్డులో ఏం రాసుంది? “ అడిగింది టిచర్.
“స్కూలు ప్రాంతం ,నెమ్మదిగా వెళ్ళండి అని రాసుంది టిచర్” అసలు సంగతి చెప్పాడు రాము.
3. “ప్రేమించి పెళ్ళి చేసుకోవడం ఎంత తప్పో ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది”
“ఏమయ్యింది ?”
‘ప్రేమించుకొనే రోజుల్లో నీ కోసం నరకానికైనా వెళ్ళడానికి సిద్ధంగా వున్నానని అనేవాడిని. పెళ్ళయ్యాక నిజంగానే నరకం లో వున్న ఫీలింగ్ కలుగుతోంది.”
4. "డాక్టర్ గారూ, నా ఎడమ కాలు లో నొప్పి ఎక్కువగా వుంది.
"అది వయసు మీరడం వలన వచ్చిన నొప్పి లెండి.
" కానీ డాక్టర్ గారూ, నా రెండు కాళ్ళ వయసూ ఒకటే కదా ? మరి కుడి
కాలికి కూడా నొప్పి ఎందుకు రాలేదు ?"
5. మ్యూజియం లో హడావిడిగా తిరుగుతున్న వెంకటా చలం కాలు తగిలి ఒక బొమ్మ విరిగిపోయింది.
"మీరు విరగిట్టిన బొమ్మ అయిదు వందల సంవత్సరాలది తెలుసా ?" కోపంగా అరిచాడు మ్యూజియం క్యూరేటర్.
" అమ్మయ్య, ఇంకా అది ఒక కొత్త బొమ్మ అనుకొని గాభరా పడ్దానయ్యా బాబు" తాపీగా ఊపిరి పీల్చుకున్నాడు వెంకటా చలం.
6. జెనరల్ డాక్టర్ కూ , స్పెషలిస్ట్ కూ తేడా ఏమిటి"
"ఒకరు నీకున్న రోగానికి వైద్యం చేస్తారు,మరొకరు తానూ వైద్యం చేసే రోగం నీకుందనుకుంటారు"
7. "నీ పుట్టిన రోజు ఏమిట్రా రాజు" అడిగింది టీచర్.
"ఆగష్టు పధ్నాలుగు టీచర్"
"ఏ సంవత్సరం ?"
"ప్రతీ సంవత్సరం ఆగష్టు పధ్నాలుగే టీచర్" తాపీగా చెప్పాడు రాజు.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 14, Oct 2009 6:48:00 AM IST good jokes
Posted by: Mr. sek sekhar At: 13, Oct 2009 7:19:30 AM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|