
|
|

General Forum: Offbeat n Jokes | జోకులేసుకుందాం రా ! | |
| 1. “పాశ్చాత్య సంస్కృతిని ఒంట పట్టించుకున్న ఒక ఇరవై అయిదేళ్ళ అందాల భామ ఒక కంపెనీలో సెక్రెటరీ పోస్టుకు అప్లయి చేసింది. పేరు, వయస్సు,విద్యార్హత,జాతీయత వగైరా వివరాలను అప్లికేషనులో పూర్తిచేసాక “సెక్స్” అనే కాలం వద్ద ఆగిపోయింది. ఒకటి, రెండు నిమిషాలు సిగ్గుపడి చివరకు”వారానికి మూడు సార్లు మాత్రమే” అని రాసింది.
2.“ఏమిటండీ, మన పెళ్ళి రోజున నల్ల ఫ్యాంటు, నల్ల షర్టు వేసుకున్నారు?” ఆశ్చర్యంగా అడిగింది భార్య.
“జాతీయ విపతులు జరిగిన రోజున నల్ల బట్టలు ధరించడం మన రివాజు” అసలు సంగతి చెప్పాడు భర్త.
3.“ఏమిటండీ కారు అంత స్పీడుగా డ్రైవ్ చేస్తున్నారు? ఇంటికి వెళ్ళడానికి ఎవరో తరుముకొస్తునట్టు ఎందుకంత తొందర ?” అడిగింది భార్య.
“ అదేం కాదు! కారు బ్రేకులు ఫెయిలయ్యాయి. యాక్సిడెంట్ జరిగే లోపల ఇల్లు చేరుకుందామని స్పీడుగా పోనిస్తున్నాను” అసలు సంగతి చెప్పాడు భర్త,
4.“ నేను ఈ రోజు నుండి నీ దగ్గర ఏమీ దాచదలచుకోలేదు. ఫ్రాంక్ గా అన్నీ నిజాలనే చెప్పెస్తాను. నేను ముద్దు పెట్టుకున్న మొదటి అమ్మాయివి నువ్వు మాత్రం కాదు” శొభనం రోజున భార్యతో ఆవేశంగా చెప్పాడు రాజేష్.
“మీ ఫ్రాంక్ నెస్ నాకు నచ్చింది. నేనూ ఈ రోజు నుండి మీ దగ్గర అన్నీ నిజాలే చెబుతాను. మీకు అమ్మాయిలను ముద్దు పెట్టుకోవడం రాదు” తాపీగా చెప్పింది శొభన.
5.టీచర్ :” T తో మొదలయ్యే రెండు ఇంగ్లీష్ వారాల పేర్లు చెప్పరా రాము”
రాము : “ టుడే మరియు టుమారో”
టీచర్ “ ????”
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 12, Oct 2009 8:18:21 PM IST 1."పెళ్ళి చేసుకోబోయే బ్రహ్మచారులు చాలా మంది పెళ్ళయిన వారిని ప్రేమించి పెళ్ళి చేసుకోవడం మంచిదా లేక పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకోవడం మంచిదా అని అడుగుతుంటారు. ఇదంతా వట్టి ట్రాష్,భ్రమ, ఎందుకంటే ఇది ఆత్మ హత్య చేసుకోవడం మంచిదా లేక హత్య చేయబడడం మంచిదా అని అడిగినట్లుంది.
2.పెళ్ళయిన మొదటి సంవత్సరం లో భర్త మాటాడితే భార్య వింటుంది. రెండో సంవత్సరం లో భార్య మాట్లాడితే భర్త వింటాడు. మూడో సంవత్సరం నుండి ఇద్దరూ మాట్లాడుతారు కానీ పక్కింటివారు వింటుంటారు. పదో సంవత్సరం నుండి ఎవరూ మాట్లాడరు.
3.పెళ్ళికీ యుద్ధానికి తేడా ఏమిటి ?
పెళ్ళి అనేది ఒక యుద్ధం లాంటిదే. కాని అందులో ఇద్దరు కలిసి జీవిస్తునే అనుక్షణం యుద్ధం చెసుకుంటుంటారు.అలిసిపోయిన వెంటనే శత్రువులు కలిసి నిద్రపోతారు.మర్నాటి నుండి మళ్ళీ మొదలు.
Posted by: Mrs. Kanaka Durga At: 12, Oct 2009 8:15:28 PM IST 1. "ఎందుకురా సుబ్బా కత్తిని గ్యాస్ మంటలో కాలుస్తున్నావు ?" అడిగాడు పరమేశం.
"కత్తితో పొడుచుకొని ఆత్మ హత్య చేసుకుందామని" చెప్పాడు సుబ్బారావు.
"అయితే కత్తిని కాల్చదమెండుకు ?"
"ఇంఫెక్షన్ రాకుండా వుండేందుకు" అసలు సంగతి చెప్పాడు సుబ్బారావు.
2. " మీ నాన్నగారి వయస్సు ఎంత ?" గోపిని అడిగింది టీచర్.
"నావయసే టీచర్. తొమ్మిదేళ్ళు" చెప్పాడు గోపి.
"ఇద్దరిదీ ఒకటే వయసా? అదెలా సాధ్యం రా" అడిగింది టీచర్.
" నేను పుట్టినప్పుడే ఆయన నాన్న అయ్యారు టీచర్" అసలు సంగతి చెప్పాడు గోపి.
Posted by: Mrs. Kanaka Durga At: 11, Oct 2009 9:22:04 PM IST 1.“కవిని పెళ్ళి చేసుకోవడం తప్పయిపోయిందే !” ఏడుస్తూ అంది రాధ.
“ ఏమయ్యింది ? ఆస్తి, అంతస్తులు, మంచి ఉద్యోగం వున్నాయని అతనిని కావాలనే పెళ్ళి చేసుకున్నావు గా!” ఆశ్చర్యంగా అడిగింది రేఖ.
“ప్రతి రోజూ రాత్రి తాను రాసిన ఆ దిక్కుమాలిన కవితలను వినిపిస్తూ నిద్ర లేకుండా చేస్తున్నాడు ఆ హింసరాజు ” అసలు సంగతి చెప్పింది కవి బాధితురాలైన రాధ.
2.“మీ అమ్మాయిని చూసి మొదట్లో వద్దనుకొని అంతలోనే వెంటనే ఎలా ఒప్పేసుకున్నారు పెళ్ళివారు ? “ ఆశ్చర్యంగా అడిగాడు నరసింహారావు.
“ కట్నం కింద రెండు బస్తాల కంది పప్పు అదనంగా ఇస్తానని కబురు పెట్టాను, ఎగిరి గంతేసి ఒప్పేసుకున్నారు” అసలు సంగతి చెప్పాడు పరమేశం.
3."ఎందుకే అయ్యగారికి జ్వరం వస్తే అంతగా బెంబేలు పడిపోతున్నావు ?” ఆశ్చర్యంగా అడిగింది ఆండాళ్ళు.
“ ఆయన మీకెంతో నాకూ అంతే కదమ్మా, అందుకే ఈ బెంగ” అసలు సంగతి చెప్పి నాలిక్కరుచుకుంది పనిమనిషి.
4.టెస్టులన్నీ చేసాక ఈ రాత్రి కంటే ఎక్కువ బ్రతకవని సుబ్బారావుకు డాక్టరు చెప్పేసాడు. విచారంగా ఇంటికి వచ్చి ఆదమరిచి నిద్రపోతున్న భార్య అనసూయను నిద్ర లేపి” ఏమేవ్! నేను ఈ రాత్రి కంటే ఎక్కువ బ్రతకనట. కనీసం ఈ రాత్రికి కబుర్లు చెప్పుకుందామే !. నా ఈ ఆఖరు కోరిక తీర్చవే” అని ప్రాధేయపడ్డాడు సుబ్బారావు.
“ ష్! ఊరుకొండి, వెధవ సంత.నేను ఉదయమే నిద్ర లేచి మహిళా మండలి మీటింగ్ కు వెళ్ళాలి. మీరైతే లేవనఖ్ఖరలేదు కదా!” అని పెద్దగా ఆవులించి తిరిగి దుప్పట్లోకి దూరింది అనసూయ.
5.” డాక్టర్, పిప్పి పన్ను బాగా నొప్పి చేసి, ఎన్ని మందులు వేసుకున్నా తగ్గడం లేదు. చాలా బిజీగా వుండడం వలన మీ దగ్గరకు రాలేకపోయాము. ఈ రోజు కూడా ఇంకొక అప్పాయింట్ మెంట్ వుంది. ఇంజెక్షను వగైరా అక్కరలేకుండానే త్వరగా పన్ను కాస్త పీకెయ్యండి” అఘిగాడు విశ్వేశ్వర రావు.
“అబ్బో, మీకు ధైర్యం చాలా ఎక్కువనుకుంటాను. ఏ పన్నో చూపించండి, ఒక్క నిమిషం లో లాగేస్తాను” పరికరాన్ని చేతిలోకి తీసుకొని అడిగాడు పన్నుల డాక్టర్.
“రజని, డాక్టర్ గారికి ఆ పిప్పి పన్ను కాస్త చూపించు” అని భార్యతో అని గది బయటకు జారుకున్నాడు విశ్వేశ్వర రావు.
6.”ఏమండీ అల్లుడు గారికి ఆ పని చేత కాదుట. అమ్మాయి డార్జిలింగ్ నుండి ఫోన్ చేసింది. అటువంటి వ్యక్తితో జీవితాంతం కాపురం చెయ్యలేనని, విడాకులు వెంటనే కావాలని అంటోంది” ఏడుస్తూ చెప్పింది అనసూయ.
“ ఇంతకీ ఆల్లుడు గారికి ఏ పని చేత కాదుట?” గాభరాగా అడిగాడు సుబ్బారావు.
“వంట చెయ్యడం” తాపీగా చెప్పింది అనసూయ.
7.అలసత్వానికి మారుపేరైన సుబ్బారావుకు తీవ్రం గా జబ్బు చేసింది. చాలా కాలం తర్వాత డాక్టర్ దగ్గరకు వెళ్ళి చూపించుకున్నాడు. డాక్టర్ రాసి ఇచ్చిన టెస్టులను బద్ధకించి ఇంకొక రెండు నెలల తర్వాత చేయించుకొని ,ఇంకొక నెల తర్వాత వాటిని చూపించుకోవడానికి డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు.
రిపోర్టులను చూసిన తర్వాత డాక్తర్” సుబ్బారావు గారు, మీకొక బాడ్ న్యూస్.మీరు ఎక్కువ కాలం బతకరు” అని అన్నాడు.
ఆ మాటలు విన్న సుబ్బారావుకు తల దిమ్మెక్కిపోయింది. “ఏమిటి డాక్టర్ గారు మీరు చెప్పేది ? ఇంకా ఎంత కాలం నేను బతుకుతాను ?” అని అడుగగా ఆ డక్తర్ “పది” అని చెప్పాడు.
“ఏమిటి పది డాక్టర్ ? సంవత్సరాలా?నెలలా?వారాలా?సరిగ్గా చెప్పండి? గద్దించాడు సుబ్బారావు.
“తొమ్మిది, ఎనిమిది,ఏదు” లెఖ పెట్టడం ప్రారంభించాడు డాక్టర్.
8.ఒక పిచ్చాసుపత్రి క్లీనిక్ ముందు నుండి వెళ్తుండగా “పదమూడు, పదమూడు “ అంటూ పెద్దగా కేకలు వినబడ్దాయి రామారావుకు.
ఆతృత ఎక్కువై ఏమిటో కనుకుందామని ఆసుపత్రి ఆవరణ లోనికి వెళ్ళాడు. మెయిన్ డొరు వేసి వుంది. దానికి వున్న కన్నం నుండి లోనికి చూడ్డానికి ప్రయత్నించాడు. ఇంతలో అతని కళ్ళు బైర్లు కమ్మాయి. లోపల్నుంచి ఎవరో పుల్లతో అతని కళ్ళలో గట్టిగా పొడిచారు. “అమ్మా" అని బాధతో గట్టిగా అరిచి కన్నుని మూసుకోగా “పధ్నాలుగు, పధ్నాలుగు " అని మళ్ళీ కేకలు మొదలయ్యాయి.
నీతి : తనకు మాలిన ధర్మం వలదు.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 11, Oct 2009 8:54:09 PM IST 1."అమ్మాయికి, అబ్బాయికీ మధ్య వుండే ఒక తేడా చెప్పు?" కొంటెగా అడిగాడు కిరణ్ తన ప్రేయసి భానుని
" అబ్బాయి అమ్మాయిల ముందు ఇంప్రెషన్ కొట్టెయ్యడానికి ఒక రూపాయి వస్తువును రెండు రూపాయలి ఇచ్చి కాలర్ ఎగరేస్తాడు. అదే అమ్మాయి అయితే అబ్బాయి ముందు అదే ఇంప్రేషన్ కొట్టెయ్యడానికి రెండు రూపాయల వస్తువుకు గంటలకు గంటలు బేరం చేసి ఒక రూపాయికి కొంటుంది" చెప్పింది భాను.
2."మళ్ళీ ఎప్పుడు కనిపించమంటేరు డాక్టర్ గారు" అడిగాడు ఆ రోజే ఆసుపత్రి నుండి డిస్చార్జ్ అవుతున్న కాంతారావు.
" ఆర్ధికంగా నిలదొక్కుకున్న తర్వాత కనిపించు. మళ్ళీ టెస్టులు చేసి ఆసుపత్రిలో ఎప్పుడు చేరాలో చెబుతాను" అలవాటుగా అనేసి నాలిక కొరుక్కున్నాడు డాక్టర్ వెర్రి వెంగళ్ళప్ప
Posted by: Mrs. Kanaka Durga At: 7, Oct 2009 9:15:19 PM IST 1.“ఏవడే ఆ చుంచు మొహం గాడు ? మీసాలు, గెడ్డాలు కూడా లేకుండా కోతిలా వున్నాడు. వాడి వెధవ ముఖానికి సైటు కొట్టడం ఒకటి. చూడు మనల్నే ఎలా చూస్తున్నాడో ? “ ఈసడింపుగా అంది రేఖ.
“ ఓహ్, అతనా ! అతను నాకు అన్నయ్య వరస అవుతాడులే. బెంగుళూరులో సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. నెలకు లక్ష రూపాయలు జీతం.శెలవల కోసం నిన్నే ఈ ఊరొచ్చాడు” అసలు సంగతి చెప్పింది రాధ.
“ ఓహ్ గ్రేట్, ఎంత అందమైన పెర్సనాలిటీనో, షారూఖ్ ఖాన్ కూడా ఇతని ముందు దిగదుడుపే, కంప్లీట్ షేవింగ్ లో ఇంకా సూపెర్బ్ గా వున్నాడు.కాస్త పరిచయం చెయ్యవే బాబూ , నీకు పుణ్యం వుంటుంది” బ్రతిమిలాడసాగింది రేఖ.
2.“ఈ రోజు నుండి కాస్త ప్రశాంతం గా నిద్రపోదామనుకుంటున్నాను, మిమ్మల్ని వెంటనే వచ్చి కలవచ్చునా ?” ఫోన్ లో అడిగాడు రమేష్.
“ అలాగే తప్పకుండా రండి. కానీ నేను డాక్టర్ని కాదు. లాయర్ని” ఆశ్చర్యంగా చెప్పాడు వెంకట్రావు.
“ కరక్టే నండి. నాకు అర్జంటుగా డైవోర్స్ కావాలి” అసలు సంగతి చెప్పి ఫోన్ పెట్టేసాడు రమేష్.
3.” ప్రియా , నీ చెంపలు ఎంతో నున్నగా వున్నాయి,రోజుకు ఎన్ని సార్లు షేవింగ్ చేస్తావు?” మత్తుగా అడిగింది రజని.
“ ఒక ఇరవై సారులు చేస్తాను”
“ నీకేమైనా పిచ్చి గానీ పట్టిందా, రోజుకు ఇరవై సార్లు షేవింగా ?” ఆశ్చర్యంగా అడిగింది రజని.
“ అవును, నేను సెలూన్ లో పని చేస్తాను” అసలు సంగతి చెప్పాడు గణేశ్.
4.”అడ్డమైన బేవార్సు వెధవలతో స్నేహం చేయవద్దని మా నాన్నగారు చెప్పారు” గర్వంగా అన్నాడు రవి.
“ కరక్టే, అందుకే నేను నీతో ఈ రోజు నుండి స్నేహం మానెస్తున్నాను, బై, బై” అంటూ వెళ్ళిపోయాడు శ్రీను.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 7, Oct 2009 8:53:27 PM IST 1.“నర్సమ్మా ! పోస్ట్ మార్టం లో ప్రాక్టికల్స్ కోసం నాలుగు బాడీలను రేపు పన్నెండింటి కల్లా సప్లయి చేస్తామని ఆ మెడికల్ కాలేజీ వాళ్ళకు ఫోన్ చేసి చెప్పు” అన్నాడు డాక్టర్ దైవాధీనం
“అదెలా సాధ్యం సార్ ?” అడిగింది నర్స్.
“ రేపు ఉదయం మనకు నాలుగు ఆపరేషన్లు వున్నాయి కదా ! మధ్యాహ్నం కల్లా ఆ బాడీలను వాళ్ళకు ఇచ్చెయ్యవచ్చు” అసలు సంగతి చెప్పాడు డాక్టర్.
2." ఆడవాళ్ళ దగ్గర ఆచి తూచి మాట్లాడాలిరా !"
“ ఏమయ్యింది ?”
“ ఆ మధ్య కోపంలో నువ్వు చాలా అందంగా వుంటావని మా ఆవిడతో జోక్ చేసా! అప్పటి నుండి ఇరవై నాలుగు గంటలూ కోపంగా వుంటోంది. ఆ ముఖం చూడలేక చస్తున్నా”
3." ఈ సబ్బు వాడితే మురికి పోయి శుభ్రం గా అవుతుందని చెప్పావు. ఎంత అరగదీసినా ఈ షర్టు కున్న మురికి పోలేదు చూడు” కోపంగా షర్టును విసిరి కొట్టి అరిచాడు సుబ్బారావు.
“ ఎక్కువగా అరవకండి సార్ బి పి పెరిగి పోగలదు. నేనన్నది మీరు సరిగ్గా అర్ధం చేసుకోలేదు ! మురికి షర్టుకు పోతుందని ఎప్పుడు చెప్పాను ? ఈ సబ్బును చూడండి, ఎలా తళ తళ లాడుతుందో ?” తాపీగా అసలు సంగతి చెప్పాడు షాపు వాడు.
4.“ఏమిట్రా వాంతులకు విరేచనాలకు అన్నేసి బిళ్ళలు కొనుక్కెళుతున్నావు ? ఇంట్లో ఎవరికి ఏమయ్యింది ? అడిగాడు వెంకట్రావు.
“ ఎవరికీ ఏమీ అవకూడదనే వీటిని తీసుకెళ్ళుతున్నాను. నిన్నటి నుండి మా ఆవిడ కవితలు రాసి మాకు వినిపించడం మొదలెట్టింది. కాస్త ముందు జాగ్రత్త అవసరం కదా” అసలు సంగతి వివరించాడు నాగేశ్వరరావు.
5.“ డాక్టరు గారు. ఒళ్ళంతా నొప్పులుగా వుంది, అప్పాయింట్ మెంటు తీసుకోలేదు, కాస్త పరీక్ష చెయ్యరా ?” అందరినీ తోసుకొని గదిలోకి వచ్చి అడిగింది ఇరవై ఏళ్ళ రేఖ.
“ ఓకె, కాస్త బట్టలు వదులు చేసి ఆ టేబిల్ మీద పడుకొండి” చెప్పాడు విజయ్ రేఖ అందాన్ని కళ్ళతోనే జుర్రుకుంటూ.
“ నొప్పులు నాకు కాదు సార్, మా అమ్మగారికి”
“ సారి. ఇప్పుడు అప్పాయింట్ మెంట్ ఇవ్వడం కుదరదు. సాయంత్రం తీసుకు రండి” చికాకుగా అన్నాడు విజయ్.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 5, Oct 2009 7:32:50 PM IST (1)"పూల కొట్లో పనిచేసేవాడిని పెళ్ళి చేసుకోవడం తప్పయిపోయిందే " ఏడుస్తూ చెప్పింది కనకం.
"ఏం చేస్తున్నారు మీ ఆయన" లక్ష్మి.
"తల్లో ఫూలు పెట్టుకున్నప్పుడల్లా పదేసి నిమిషాలకొకసారి వాటిపై నీళ్ళు జల్లుతున్నాడు. రొంప, దగ్గు ,జ్వరం ఇత్యాది రొగాలతో చస్తున్నాను" ముక్కు చీదుకుంటూ చెప్పింది కనకం.
(2)" మీరిద్దరూ మొగుడూ పెళ్ళాలంటే నమ్మ బుద్ధి కావడం లేదు. అసలు సంగతి చెప్పండి, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు" లాడ్జిలో రైడింగ్ చేస్తుండగా పట్టుబడిన ఒక జంటను గద్దించి అడిగాఘు ఎస్.ఐ మీసాల్రావ్.
" మాది ఈ ఊరేనండి బాబు. మా ఆయనకు నేను పెళ్ళాన్ని. పక్కింటి పెళ్ళానికి ఈయన మొగుడు.మమ్మల్ని మొగుడు పెళ్లాలనే అంటారు కదా" అసలు సంగతి లాజికల్ గా చెప్పింది పెల్లాం.
(3) ఒక ప్రభుత్వ కార్యాలయం ముందు ఒక బోర్డుపై ఈ విధం గా రాసి వుంది- " దయచేసి గట్టిగా మాట్లాడకండి".
ఫైళ్ళపై సంతకం కోసం చెప్పులరిగేలా తిరిగిన ఒక వ్యక్తి చివరకు విసుగెత్తి కొన్ని పదాలను ఈ విధం గా ముందు చేర్చాడు- " మేము నిద్ర పోతున్నాం" .
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 5, Sep 2009 3:01:09 PM IST "మీకు ట్రీట్ మెంట్ పూర్తయ్యింది.టెన్షన్లు రాకుండా ఒక ఆర్నెల్లపాటు జాగ్రత్తగా వుండండి.ఫీజు అయిదు వందలివ్వండి” అని అడిగాడు డాక్టర్ దైవాధీనం.
“ సారీ డాక్టర్ ! టెన్షన్ వచ్చే పనులు చెయొద్దని మీరేగా చెప్పారు. దయచేసి ఫీజు అడిగి టెన్షన్ తెప్పించవద్దు” అని వెళ్లిపోయాడు మహేష్.
Posted by: Mrs. Kanaka Durga At: 5, Sep 2009 10:55:49 AM IST http://www.youtube.com/watch?v=OzswMV1r6q4
Posted by: Mr. karan karan At: 2, Sep 2009 2:41:43 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|