
|
|

General Forum: Offbeat n Jokes | జోకులేసుకుందాం రా ! | |
| 1. “మీ వారేం చేస్తుంటారు ? “అడిగింది రంజని బజార్లో చాలా కాలానికి కనిపించిన తన చిన్ననాటి స్నేహితురాలు వాణిని..
“ కంటికి కనిపించిన వస్తువులను మాయం చేస్తుంటారు”
“అయితే మీవారు మెజీషియనా?” ఆశ్చర్యంగా అడిగింది రంజని
“ఆదేంకాదు, మా వారు చీకటి పడ్డాక దొంగతనాలు చేస్తుంటారు” అసలు సంగతి చెప్పింది వాణి.
2 .రామూ,మన దేశం లో బ్రిటీషు వారి పాలన ఎక్కడ మొదలై ఎక్కడ పూర్తయ్యిందో అందరికీ చెప్పు” అడిగారు సోషల్ టీచర్ మూర్తి గారు.
“ మన హిస్టరీ బుక్ లో 30 వ పేజీలో ప్రారంభమై 101 వ పేజీతో ముగిసింది సార్” తడుముకోకుండా చెప్పాడు రాము.
3. “పిప్పి కట్టిన ఈ రెండు పళ్ళను పీకడానికి ఎంత ఫీజు తీసుకుంటారు డాక్టర్ ? “ అడిగాడు రాజేష పళ్ళ డాక్టర్ జగన్నాధాన్ని.
“ కన్సల్టేషన్ తో కలిపి మూడు వందలు” చెప్పాడు డాక్టర్ జగన్నాధం.
“అయ్యబాబోయ్ ! అంత కన్నా బస్టాపులో ఏ అమ్మాయి చున్నీనో లాగడం బెటర్”అంటూ వెళ్ళిపోయాడు రాజేష్.
“ ఆ! “ అంటూ నోరు తెరుచుకొని వుండిపోయాడు పళ్ళ డాక్టర్ జగన్నాధం.
4. వేగంగా వచ్చి రన్ వే పై పెద్దగా శబ్దం చేసుకుంటూ కుదుపుతో విమానం ఆగింది.
“ కాస్త నెమ్మదిగా ఆపాల్సింది” అంటూ కోపైలెట్ ను హెచ్చరించాడు పైలెట్.
“ నేనా ! విమానాన్ని మీరు లాండ్ చేస్తున్నారనుకున్నానే?” ఆశ్చర్యం గా వ్యక్తం చేసాడు కోపైలెట్.
వీరిద్దరి సంభాషణ విన్న ఎయిర్ హోస్టెస్ కళ్ళు తిరిగి ఢామ్మని కింద పడిపోయింది.
Posted by: Mrs. Kanaka Durga At: 1, Sep 2009 4:41:59 PM IST " ఈ మధ్య అడుక్కోవటానికి రావడం లేదు ఎందుకు ?" అడిగింది అనసూయ
" అయ్యగారికి ఒంట్లో బావులేక మీరు వంట చేసేవారని తెల్సింది.తెలిసి,తెలిసి అనారోగ్యం కొని తెచ్చుకోవడం ఎందుకని రావడం మానెసాను !" తాపీగా చెప్పాడు బిచ్చగాడు.
Posted by: Mrs. Kanaka Durga At: 18, Aug 2009 2:46:02 PM IST 1.”పాల వ్యాపారం చేసే వాడి కూతుర్ని పెళ్ళి చేసుకోవడం తప్పయిపోయిందిరా బాసూ” విచారం గా అన్నాడు గోపి.
“ఏమయ్యిందిరా ? ‘ అడిగాడు గణేష్.
“ శోభనం రాత్రి పాలగ్లాసు ఇచ్చి డబ్బులు అడిగిందిరా మా ఆవిడ” అసలు సంగతి చెప్పాడు గోపి.
2.“నిన్న సాయంత్రం బాబి గాడు నన్ను చెప్పుతో కొడతానంటే ఫ్రెండ్ వయ్యుండి ఊరుకున్నావెందుకురా ?” కోపంగా అడిగాడు మనోహర్
“ వాడు అప్పుడు మరీ పాత చెప్పులు వేసుకున్నాడు అందుకని రియాక్ట్ అవడమెందుకని వూరుకున్నాను. ఈసారి మంచి చెప్పులు వేసుకొని వచ్చినప్పుడు నిన్నేమైనా అంటే చీరేస్తాను” పల్లీలు తింటూ తాపీగా అన్నాడు అన్నారావు.
3.ప్రేమ విఫలమైనందువలన ఆత్మ హత్య చేసుకోవాలనుకున్న ప్రేమికుల మధ్య సంభాషణ :
“ముందు నేను బిల్డింగ్ నుండి దూకాలా ?ఎందుకు” అడిగింది రాజి.
“ ఏం లేదు. నేను దూకేసాక నువ్వు మనసు మార్చుకుంటే కష్టం కదా! అందుకని. పైగా మా నాన్న ఇంత కంటే మంచి సంబంధాలను తెస్తానన్నాడు” గబుకున్న అనేసి నాలిక కరుచుకున్నాడు కిషోర్.
4.“ ఈ రోజు రాత్రి ఏడున్నరకు పార్కు ఏరియాలో లైట్లు ఆర్పేయాలా , ఎందుకు” ఆశ్చర్యంగా అడిగాడు లైన్ మెన్.
“ఆ టైంలో నేను, నా గర్ల్ ఫ్రెండ్ పార్కుకు వెళ్ళబోతున్నాం. మా ఆవిడ ఆ టైముకు అదే ఏరియాకు వస్తుంది. దొరికితే చంపేస్తుంది, కాస్త కోపరేట్ చెయ్యవయ్యా బాబు” అంటూ ప్రాధేయపడ్డాడు మూర్తి.
Posted by: Mrs. Kanaka Durga At: 17, Aug 2009 4:16:38 PM IST 1. " నేను ఈ రోజు చాలా గొప్ప పని చేసానోయ్” గర్వం గా అన్నాడు సుబ్బారావ్.
“ ఏం చేసారండీ ?” ఆశ్చర్యంగా అడిగింది అనసూయ.
“ అనారోగ్యం తో ఇంటి పనులు చేసుకోలేక సతమతమౌతున్న నీకు తోడూ నీడగా వుండేందుకు మీ చెల్లెల్ని పెళ్ళి చేసుకొని ఇంటికి తీసుకువచ్చాను” అసలు సంగతి చెప్పాడు సుబ్బారావ్.
“ఆ !”
2.“ స్కూలు ఎడ్మిషన్ల కోసం పరుగులెత్తే పేరెంట్స్ ను చూస్తుంటే నీకు ఎవరు గుర్తుకొస్తున్నారు” అడిగాడు రాజు
“ ఆవుల వెంట పరుగులెత్తే దూడలు గుర్తుకొస్తున్నాయి నాకు” తాపీగా చెప్పాడు వాసు.
3.“ “మంచి టీచర్ కావాలంటే ఏం చెయ్యాలో కాస్త చెబుతారా ?” విమ్రతతో అడిగాడు ఆ రోజే ఉద్యోగం లో చేరిన అప్పారావు.
“ అంతే ఏమిటయ్యా నీ ఉద్దేశ్యం ? చెడ్డ టీచర్లు కూడా వుంటారా ? “ కోపం గా అడిగాడు సీనియర్ టీచర్ అయిన రామారావు.
“ మీరు ఉన్నారు కదా సార్. నా ఉద్దేశ్యం లో నేను మీలా కాకూడదనే ముందు జాగ్రత్త కోసం అడుగుతున్నాను సార్” అసలు సంగతి చెప్పాడు అప్పారావు.
Posted by: Mrs. Kanaka Durga At: 17, Aug 2009 11:43:24 AM IST 1." నేను రోజుకు ఆరేడు కవితలు రాసి పారేస్తుంటాను తెలుసా !" గర్వం గా చెప్పాడు అభ్యుదయ కవినని చెప్పుకొనే కామేశ్వరరావు.
" రాసి అవతల పారేస్తేనే మంచిది. వాటిని పత్రికలకు పంపించడం, రేడియోలలో , కవితా గోష్టులలో చదవడం చేస్తే మెదడు వాపు వ్యాధులు గట్రా వచ్చే ప్రమాదముంది." అసలు సంగతి చెప్పాడు రవీంద్ర.
2."నాకూ మా ఆవిడకు గొడవ వస్తే కొద్ది నిమిషాలలోనే సమసిపోతుంది తెలుసా !" కాలర్ ఎత్తుకొని గర్వంగా అన్నడు వాలేశ్వరరావు.
" అరే మీరెంతో గ్రేట్ రా! ఆ కిటుకేదో నాక్కూడా చెప్పకుడదా. మా ఇద్దరి మధ్య గొడవ గనుక లేస్తే గంటలకు గంటలు నడుస్తుంది" దీనంగా అడిగాడు పిచ్చేశ్వరరావు.
"ఏముంది, వెరీ సింపుల్. గోడవ మొదలైన వెంటనే మా ఆవిడకు దొరకకుండా నేను మంచం కిందకు దూరిపోతాను. నన్ను పట్టుకోలేక ఆ అప్పడాల కర్రను అవతల పారేసి మా ఆవిడ వెళిపోతుంది. ఆ తర్వాత నేను తాపీగా బయటకు వచ్చి ఆవిడ కోపం తగ్గేవరకు కాళ్ళు పట్టుకునే వుంటాను.అంతే ! ఆవిడ ఐసైపోయి నన్ను క్షమించేస్తుంది." అసలు సంగతి చెప్పాడు వాలేశ్వరరావు.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 21, Jul 2009 2:19:57 PM IST 1.“ఏయ్ ! హేండ్సప్ ! చేతులు పైకెత్తి స్ట్రైట్ గా నిలబడు, అసలు కదలొద్దు. లేకపొతే షూట్ చేసెస్తాను” రివాల్వర్ చూపిస్తూ అరిచాడు బందిపోటు దొంగ భీమారావు.
“ చేతులు నొప్పిగా వున్నాయి ,అస్సలు పైకెత్తలేను, ఏం చేస్తావో చేసుకో? “ ఆసక్తిగా అన్నాడు రాజారావు
“ చెప్పిన విధం గా చెసి నన్ను కన్ ఫ్యూజ్ చెయ్యకుండా కాస్త కోపరేట్ చెయ్యవయ్యా బాబూ ! నాకసలే ఈ వృత్తి కొత్త. నీలాంటి పెద్ద మనుష్యులు కాస్త సహాయం చెసి నాకు కాంఫిడెన్స్ ఇవ్వాలి లేకపోతే ఈ వృత్తిలో రాణించలేను” అసలు సంగతి చెప్పాడు భీమారావు.
2.“ ఆ దొంగ బస్సులో అంత రష్ లో నీ జాకెట్లో చెయ్యి పెట్టి పర్సు కొట్టెస్తుంటే చూస్తూ ఎలా ఊరుకున్నావే ? గట్టిగా కేకలు పెట్టి వాడిని పట్టించక పొయ్యావా ?” ఆశ్చర్యం గా అడిగింది రేఖ
“ ఆ దొంగ వెధవ జాకెట్లో చెయ్యి పెట్టింది పర్సు కోసమని నేను అనుకోలేదు, అందులే అరవలేదు” అసలు సంగతి ఐస్ క్రీం తింటూ తాపీగా చెప్పింది సృజన.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 15, Jul 2009 5:04:18 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|