
|
|

General Forum: Offbeat n Jokes | జోకులేసుకుందాం రా ! | |
| 1. "నా హృదయం మొబైల్ లాంటిది, నువ్వు అందులో సిం కార్డువు" తన్మయత్వంతో అంది రాధ.
"ఈ రొజు నాకు హిమాలయలు అధిరోహించినంత ఆనందంగా వుంది రాధా. ఈ జన్మకు ఈ అనుభూతి చాలు " ప్రేమ పారవశ్యంతో ఊగిపోతూ అన్నాడు మధు.
" మరీ అంత ఆనంద పడిపోకు. మంచి ఆఫర్ దొరికితే సిం కార్డును మార్చేస్తాను" ఠక్కున చెప్పింది రాధ.
2. "సార్. మా తోటలో ఎవరో బాంబు పెట్టారు సార్! ఎప్పుడు పేలుతుందోనని భయంగా వుంది" ముచ్చెమటలు పోస్తుండగా చెప్పడు పరాధీనం.
" ఏం పర్లేదు. రెండు మూడు రొజుల్లో ఎవ్వరూ దానిని క్లెయిం చెయ్యక పోతే ఎంచక్కా మిరే వుంచేసుకోవచ్చు" యధాలాపంగా అనేసి ఫోన్ డిస్కనెక్ట్ చేసేసాడు ఇనెస్పెక్టర్ దైవాధీనం.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 11, Aug 2010 11:44:06 AM IST 1. " తెలుగులో నెంబర్ వన్ రచయిత అయ్యుండి ఇంత అర్ధం పర్ధం లేని చంఢాలమైన కధ ఎలా రాసారు? "అడిగింది భార్య తన భర్తను.
" మన అబ్బాయిని ఒక మంచి ఇంగ్లీష్ కధను నెట్ నుండి డౌన్ లోడ్ చెసి ఇమ్మంటే నిద్ర మత్తులో పేజీలను ముందు వెనుక చేసేసాడు. ఇదేదో వెరైటి కధ అనుకొని నేను యధాతధంగా అనువాదం చేసేసాను" అసలు సంగతి చెప్పాడు రచయిత మురళి.
2."ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తూ లెఖ్ఖలు వేస్తున్నారు ?"అడిగింది ఆండాళ్ళు కొత్తగా మంత్రి అయిన భర్తతో.
" వచ్చే అయిదేళ్ళ కాలంలో ఎంత సంపాదించాలి, అవి ఎవరెవరి పేరు మీద రాయాలి అన్న లెఖ్ఖలను ముందుగానే వేసుకుంటున్నాను" అసలు సంగతి చెప్పారు మంత్రివర్యులు.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 6, Aug 2010 1:48:44 PM IST 1. రాణి: " నా బర్త్ డేకి రింగ్ ఇస్తానని చెప్పి ఆ రాజు గాడు భలే మోసం చేసాడు"
రాధ : " ఏం చేసాడు?"
రాణి: పొద్దున్నే ఒక నా సెల్ ఫోన్ కు ఒక రింగ్ ఇచ్చి కట్ చేసాడు దొంగ రాస్కేల్"
రాధ :" ????"
2. " హేండ్సప్, రెండు చేతులు పైకెత్తి నిలబడు. తర్వాత మెడలో గొలుసు, వేలి వుంగరం, జేబులో పర్సు అన్నీ ఒకటొకట్టే తిసి ఇచ్చెయ్యి, లెకపోతే కాల్చేస్తాను " రివాల్వరు చూపిస్తూ అన్నాడు గంగయ్య.
" రెండు చేతులు పైకెత్తాక నువ్వు చెప్పినవన్నీ ఎలా అయ్యా తీయడం, నాకేమైనా నాలుగు చేతులు వున్నాయనుకున్నావా?" విసుకున్నాడు సుబ్బారావు.
"అబ్బా లాజిక్ చెప్పి నన్ను కంఫ్యూస్ చెయ్యకయ్యా. కాస్త తెలివి వుపయోగించి కోపరేట్ చెయ్యు. రెండేళ్ళ ట్రైనింగ్ తర్వాత ఇదే నా మొదటి ప్రయత్నం. సక్సెస్ అవకపోతే కాన్ ఫిడెన్స్ దెబ్బ తింటుంది" బ్రతిమిలాడాడు గంగయ్య.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 6, Aug 2010 10:45:35 AM IST 1. "మగవాడు ఇద్దరు ఆడవాళ్ళను పెళ్ళి చెసుకుంటే కష్టాలలో పడతాడా?" అడిగాడు వంశీ ఫేమస్ లాయర్ గోపాలరావును.
"ఒక్కరిని చేసుకున్నా పీకల్లోతు కష్టాలలో పడతాడు" బుర్ర గోక్కుంటూ నసిగాడు లాయర్.
2. " ఏమిటి నాన్నా నువ్వు. ఏ తండ్రయినా సాధారణం గా చెడ్డవాళ్ళతో ఫ్రెండ్ షిప్ చెయ్యవద్దంటాడు కాని నువ్వేంటి? మంచివాళ్ళతో ఫ్రెండ్ షిప్ వద్దంటున్నావు?" కోపంగా అడిగాడు రాజు.
" నీతో స్నేహంచేసి వాళ్ళు చెడిపోకూడదన్నదే నా కోరిక " పేపరు చదువుకుంటూ చెప్పాడు పుల్లారావు.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 5, Aug 2010 4:02:48 PM IST 1." మా ఆయన ఈ మధ్య నా మాట బొత్తిగా వినకుండా తోక జాడించడం మొదలెట్టాడు.అందుకే ఆయనను మళ్ళీ కంట్రోల్ లోకి తెచ్చుకునే వుపాయం ఆలోచించాను" గర్వంగా అంది చిత్ర.
" ఏమిటో త్వరగా చెప్పవా ? దానిని నేను కూడా అమలు చేసి నా మొగుడిని కూడా కంట్రోల్ లో పెట్టేస్తాను"ఆత్రంగా అడిగింది రంభ.
" రేపట్నుంచి ఆయన చేత మానిపించి కొంత కాలం నేనే వంట చేద్దామనుకుంటున్నాను" నెమ్మదిగా అసలు సంగతి చెప్పింది చిత్ర.
2."ఇంటర్వ్యూలో అన్ని ప్రశ్నలకు కరెక్ట్ ఆన్సర్లు చెప్పినా ఉద్యోగం రాలెదనుకో ! అప్పుడు నీ ఫీలింగ్స్ ఎలా వుంటాయి?" అడిగాడు ఒక ఇంటర్వ్యూ బొర్డు మెంబరు.
" ఏముంది ? నలుగురు పలికి మాలిన చెత్త సన్నాసులతో ఒక అరగంట కాలక్షేపం చేసాననుకొని సర్ధి చెప్పుకుంటా" బబుల్ గం నములుతూ చెప్పాడు రాకెష్.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 2, Aug 2010 1:12:28 PM IST 1. "ఏమయ్యా, అలా చీటికీ మాటికీ దొంగతనాలు చేసి దొరికిపోయి జైలుకు రాకపోతే హాయిగా ఒళ్ళు వంచి పని చేసుకొని బ్రతక వచ్చు కదా" ఇరవయ్యోసారి జైలుకు వచ్చి ఖైదీ గంగయ్యతో అన్నడు జైలర్.
"భలేవారే సార్! మేము మా వృత్తి మానేస్తే ఇంక మీకు పనేం వుంటుంది ?మీ లాంటి వాళ్ళకు ఉద్యోగాలు ఎలా దొరుకుతాయి? " వినయంగా అడిగాడు గంగయ్య.
2. " ఏమోయ్, నేనలా విశ్వం ఇంటికి వెళ్ళొస్తాను ! కాస్త తలుపేసుకో" అన్నాడు కవి రామ్మూర్తి.
"అలా ప్రతీ రోజూ వెళ్ళి అతనికి మీ కవిత్వం వినిపించి చిత్ర హింసలకు గురి చెయ్యకపోతే గానీ మీకు మనశ్శాంతి వుండదా ఏం" అసహనంగా అడిగింది కాంతమ్మ.
" ఏం చెయ్యమంటావు చెప్పు? నా దగ్గర రెండు వేలు అప్పు తీసుకొని రెండేళ్ళు దాటుతున్నా తీర్చే మాటే ఎత్తడం లేదు. ఈ టార్చర్ భరించలేక, నన్ను వదిలించుకోవడానికైనా అప్పు తీరుస్తాడేమోనన్న ఆశ!" అసలు సంగతి చెప్పాడు రామ్మూర్తి.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 31, Jul 2010 3:36:57 PM IST 1. " మా ఆవిడ నస భరించలేక చస్తున్నాను.ఆయన నోరు మూతపడే మార్గం చెప్పండి !"డాక్టర్ని అడిగాడు పిచ్చేశ్వర రావు.
"ఏముంది వెరీ సింపుల్.మౌనంగా వుంటే చాలా అందంగా వున్నావు అని ఒక కాంప్లిమెంట్ ఇచ్చేస్తే సరి!"సలహా ఇచ్చాడు డాక్టర్ సలహాల రావు.
2."రాత్రింబవళ్ళు అడ్డమైన గాడిద చేసే మా ఆయననే జన్మ జన్మల వరకు మొగుడుగా పొందాలంటే ఏం చెయ్యాలి స్వామీ ?" అడిగింది కాంతమ్మ స్వామీజీని.
" మరేం లేదమ్మా,గార్ధభ వ్రతం అనే ఒక ప్రశిస్థమైన వ్రతం వుంది. దానిని నిష్టతో ఒక సంవత్సరం పాటు ఆచరించితే నీ సంకల్పం వెరవేరుతుంది" సెలవిచ్చారు స్వామీజీ.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 29, Jul 2010 3:44:47 PM IST 1. నెలరోజుల ట్రీట్ మెంట్ తర్వాత డిశార్జి అయ్యాడు పుల్లారావు. " సార్ ! మళ్ళీ ఎప్పుడు చెకింగ్ కు రమ్మంటారు?" డాక్టర్ని అడిగాడు.
" ఈ ట్రీట్ మెంట్ కోసం చెసిన అప్పుల్ని తీర్చేసి ఆర్ధికంగా కాస్త కోలుకున్నాక మళ్ళీ కనిపించు. ట్రీట్ మెంట్ మొదలెడదాం" యధాలాపంగా చెప్పాడు డాక్టర్ జలగలరావు.
2.. "వచ్చే జన్మలో కూడా నాకు మనశ్సాంతి, సుఖ సంతోషాలు, స్వేచ్చా స్వాతంత్రాలు వుండేలా లేవురా సుబ్బారావు" దిగులుగా అన్నాడు పుల్లారావు.
"ఏమైంది, ఎందుకిలా అనుకుంటున్నావు ?" అడిగాడు సుబ్బారావు.
" వచ్చే జన్మలో కూడా నన్నే మొగుడుగా కావాలని నా భార్య వ్రతం మొదలెట్టింది" ఏడుపు గొంతుతో అసలు సంగతి చెప్పాడు పుల్లారావు.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 27, Jul 2010 12:47:59 PM IST jaDji: muddaayi guLLO nagalu doMgiliMchalEdani rujuveiMdi. kanuka pOlIsuvaaru peTTina kEsu koTTivEyaDameinadi
muddaayi: ayitE aanagalni nEnu ammukOvachchaaMDi
Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 27, Jul 2010 12:31:07 PM IST 1. "ఆఫీసులో ఎంత లెటైనా ఇంటి సామాను, కూరగాయలు నేనే తీసుకెళ్ళాలి. చెయ్యలేక చస్తున్నాననుకో" బాధగా అన్నాడు రామం.
" నీ పని చాలా బెటర్. నా పరిస్థితి మరీ ఘోరంగా వుంది. సామానులతో పటు, వంట పని, పాచి పనీ కూడా ఎంత రాత్రైయినా నేనే చెయ్యాలి. లెకపోతే నోట్లోకి ఫుడ్డు, బెడ్డు మీద నిద్ర వుండదు" మరింత బాధగా చెప్పాడు విశ్వం.
2. నెలరోజుల ట్రీట్ మెంట్ తర్వాత డిశార్జి అయ్యాడు పుల్లారావు. " సార్ ! మళ్ళీ ఎప్పుడు చెకింగ్ కు రమ్మంటారు?" డాక్టర్ని అడిగాడు.
" ఈ ట్రీట్ మెంట్ కోసం చెసిన అప్పుల్ని తీర్చేసి ఆర్ధికంగా కాస్త కోలుకున్నాక మళ్ళీ కనిపించు. ట్రీట్ మెంట్ మొదలెడదాం" యధాలాపంగా చెప్పాడు డాక్టర్ జలగలరావు.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 26, Jul 2010 11:15:39 AM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|