
|
|

General Forum: Religion | bhagavantuniki bhaktuniki madhya anusandhaanamainadi EnTi?? | |
| జైబాబా
గీతానామసహస్రం
నకర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః
నకర్మఫల సం యోగం స్వభావస్తు ప్రవర్తతే
ఆత్మ దర్శనమందిన ఙ్ఞాని కి కర్తృత్వములేదు,కర్మఫల సం యొగము లేదు ,కారణ మేమన ప్రకృతి ప్రేరణ వలన అన్ని జరుగును.అతను సత్కర్మలు నిష్కామ బుధ్ధితో చేయును ఫలితమును భగవదర్పితము చేయును.సూర్యకిరణములు వస్తువులను కనబడునట్లు చేయును కాని ఆ కిరణాలకు వస్తువుల మాలిన్యము అంటని విధముగానే ఆత్మఙ్ఞానికి కర్మఫల సం యోగ ముండదు.ఆత్మ సాక్షాత్కారము శరీర పతనానికి ముందే జరగాలి,దాని కొరకు ప్రతివ్యక్తి ప్రయత్నము చేయాలి లేకుండిన సృష్టిలోని అనేక లోకాలలో మళ్ళీ మళ్ళీ శరీర ధారణ చేయవలసి వస్తుందని కఠోపనిషత్ హెచ్చరించుచున్నది.
Posted by: Mr dyvadhinam yaddanapudi At: 24, May 2011 8:51:48 PM IST జైబాబా
గీతానామసహస్రం
సర్వ కర్మాణి మనసా సన్న్యస్యా22స్తే సుఖం వశీ
నవద్వారే పురే దేహీ నైవ కుర్వ న్నకారయన్
అన్ని పనులలో ఇంద్రియాలను అదుపులో పెట్టుకొనిన ఆత్మవంతుడు తానేమీ చేయుట లేదను త్యాగ బుధ్ధి కలిగి సతతము ఆత్మానందము పొందుచుండును.దేహము తాను కాదని ఆత్మానందముతో తృప్తి పొందును.తొమ్మిది ద్వారముగలపురములో దేహి అనగా పురుషుడు(ఆత్మ)తాను కదలకుండానే శరీరావయములను కదిలించి పనులు నిర్వర్తించును,ఇతని వర్తనను భాగవతమందు పురంజనోపాఖ్యానమున కధగా వివరించారు.అనగా అనగా పురంజనుడనే రాజు భోగాలు అనుభవించుటకు పురము వెతుకుచుండగా ఒక నవద్వారములుగల పురము దాని వెలుపల తోటలో అందమైన యువతిని చూచెను.ఆమెతో పదిమంది పురుషులు చెలికత్తెలు అనుసరించి వస్తున్నారు,వారిలో ఒక్కొక్కడు నూరుమందికి నాయకుడు.ఆమెకు కావలిగా ఐదుతలల పాము ముందునడుస్తున్నది.ఆమెను చూచి అడుగగా పురుషులు స్నేహితులని స్త్రీలు చెలికత్తెలని ముసలిపాము తాను నిద్రించినప్పుడు మేలుకొని పురమును రక్షించునని తెలిపి పురంజనుని వివాహమాడినది ఆపురములో పైభాగమున ఏడు క్రిందిభాగమున రెండు ద్వారములుకలవు.ఆ పురుషుడు ద్యుమంతుడనే చెలికానితో ఆద్వారములనుండి విభ్రాజితమనే వనమునకు,అవధూత అనే స్నేహితునితో సౌరభమనే విషయమునకు వెళ్ళుచుండును. శృతధరునితో దక్షిణ పాంచాలమునకు,అసురి అనే పడమటి వాకిలినుండి దుర్మదునితో కూడి గ్రామకము అనే దేశానికి పోవుచుండును..అంతఃపురములో విషూచీనముతో కలిసి భార్యా పుత్రుల వల్ల కలిగిన మోహాది అనుభూతులు పొందుతాడు.ఈ విధముగా కామాసక్తుడై బుధ్ధి అనే పట్టపు దేవిచే మోసగింపబడి చివరికి పతనమగును. పురంజనుడనగా పురుషుడు అనగా జీవుడు.అవిఙ్ఞాతుడనె మిత్రుడనగా ఈశ్వరుడు.పురం అనగా శరీరం.పురుషుడు బుధ్ధినాశ్రయించి విషయ సుఖాలు అనుభవించును.ఉత్తమ స్త్రీ అనగా బుధ్ధి.బుధ్ధికి స్నేహితులు పదిమంది పురుషులనగా ఙ్ఞాన కర్మ కారణాలగు ఇంద్రియగుణాలు.చెలికత్తెలు అనగా ఇంద్రియ వ్యాపారాలు.ప్రాణమే ఐదుతలల పాము.బృహదల్భుడనగా మనసు,పాంచాల దేశమనగా శబ్దాది పంచ విషయములు.అవిర్ముఖుడనగా కన్ను,విభ్రాజితమనగా రూపం,ద్యుమంతుడనగా నేత్రేందియము,అవధూత అనగా ముక్కు,అసురి అనగా జనననాంగం, గ్రామకం అనగా రతి,దుర్మదుడనగా యోని ,విషూచి అనగా మనసు అనే సంకేతాలతో సంసార విషయాలను ఆధ్యాత్మిక సంకేతము తో సూచించడమైనది.
Posted by: Mr dyvadhinam yaddanapudi At: 20, May 2011 11:20:21 PM IST జైబాబా
గీతానామసహస్రం
యుక్తః కర్మ ఫలం త్యక్త్వా శాంతి మాప్నోతి నైష్ఠికీ మ్
అయుక్తః కామ కారేణ ఫలే సక్తో నిబధ్యతే !!
వివేకి కర్మ ఫలితమును విడచి అంతఃకరణ శుధ్ధికి సత్కర్మలాచరించును,శాంతిని పొందును.అవివేకి కర్మ ఫలము లాశించి సత్కర్మలాచరించుచు కర్మ బధ్ధుడగు చున్నాడు.ఈ అనిత్య ప్రపంచం లో పరివర్తన శిలమైనది ఏ దేది కలదో అనగా ప్రకృతి ప్రవాహం లో భగవంతుడొకడే చలనరహిత ఆదారము కాన ఉన్నదంతా అతనిచే ఆవరింపబడవలెను అని తెలుసుకొనినవాడే వివేకి.
ప్రాకృతభోగాలకు మనసు వశమగుటే మనసుకు పట్టిన మాహారోగము-ఈ భవరోగ నివారణకు కావాలి మంచిమందు-అట్టి దివ్య ఔషధము పరమాత్మే కనుక ఓం ఔషధాయనమః అని విష్ణువును స్తుతించుట.
నిష్కామ కర్మాచరణ ఫల త్యాగము ప్రకృతి బంధాలు తొలగి శాంతి పొంది తదుపరి జనన మరణ చక్రమునుండి విడివడుటకు తోడ్పడును.
ఓం ఈశావాస్య మిదగ్ం సర్వం యత్కించ జగత్యాంజగత్
తేనక్త్యేన భుంజీ థా మాగృధః కస్యస్వి ద్థనం
అంతా పరమాత్మదే అని ధృఢ నిశ్చయమే త్యాగము.ఆ త్యాగ బుధ్ధి ఆత్మ సాక్షాత్కారమునకు మన శ్శాంతికి తోడ్పడుతుంది కనుక ఆవిధముగా పోషణ చేసుకో అని వైరాగ్య బోధ ఈశావాస్య ఉపనిషత్ చేయుచున్నది.
Posted by: Mr dyvadhinam yaddanapudi At: 18, May 2011 10:16:16 PM IST జైబాబా
గీతానామ సహస్రం
కాయేన మనసా బుధ్యా కేవలై రింద్రియై రపి
యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా2త్మశుధ్ధయే !!
చిత్తనిగ్రహము కలవాడు మనసు,బుధ్ధి,ఇంద్రియాలతో సత్కర్మలు ఫలాపేక్ష వదలి బ్రహ్మమే తానను ధృఢ ఙ్ఞానము కొరకు చేయుచున్నాడు.
మనసులో ఆలోచనా తరంగాలు ఎగసి పడుచుండును.
"సయ దేవ మనసా" ఇది నాకు కావాలని కోరుతుంది మనసు.మనిషి మనసుకు వసుడైయున్నాడు.మనసు కన్న సం కల్పము,దానికన్న బుధ్ధి గొప్పది.
"ప్రతి బోధ విదితం మత అమృతతత్వం హి విందతే"
మనస్సు చెందే ప్రతివికారం ద్వారాను దానిని అనుభవములోని విషయములాగా భావించుతాడు"ఆత్మనా విందతే వీర్యం విద్యా విందతే 2అమృతం"
ఆత్మ ద్వారా నిజమైన బలాన్ని ఙ్ఞానం ద్వారా అమరత్వం పొందుతాడు అనగా దివ్య చైతన్య స్థితి పొందుతాడు. అని కేన ఉపనిషత్ తెలుపుచున్నది. నిజమైన బలము దేహ బలముకాదు,నిజమైన బలము ఆత్మ బలము మాత్రమే.అసలు ఆత్మన్ అనగా స్వకర్మ ఫలమును భుజించేవాడు ఆత్మ(అత్తిస్వకర్మఫలమితివా ఆత్మా)
ఆతతి సంసరతీ త్యాత్మా-సంసారమందే ఎప్పుడూ చరించేవాడు
ఆత్మా యత్నో ధృతి బుధ్ధి స్వభావో బ్రహ్మ వర్ష్మచ-ఆత్మ శబ్దమునకు యత్నము,ధైర్యము,బుధ్ధి,స్వభావము,పరమాత్మ,జీవాత్మ అని పేర్లు.ఆత్మ ఎడతెరిపిలేక దేహాలు మారుస్తూ తిరుగుతుందని అమరకోశములో వివరణ.
Posted by: Mr dyvadhinam yaddanapudi At: 16, May 2011 11:18:23 PM IST జైబాబా
గీతానామసహస్రం
బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతియః
లిప్యతే న స పాపేన పద్మపత్ర మివాంభసా !
ఏ వివేకి సత్కర్మలను నిష్కామ బుధ్ధితో జేయుచూ కర్మఫలమును పరమేశ్వరునకు అర్పించునో అట్టివానిని మార్గమునకు అడ్డంకులు లేకుండా జేయుచూ పరిపాలన కొనసాగించును.అధర్మ ప్రవర్తనులను తొలగించుట పరిపాలనలో భాగమే.ధర్మరక్షణ కొరకు తనను తానే సృజించుకొని శిష్టులను రక్షించుట దుష్ట శిక్షణ జేయును.
సర్వగతముగా నున్న బ్రహ్మమునెఱిగినవారు తామరాకుమీద నీరు అంటని విధముగా పుణ్యపాపములకు బధ్ధులు కారు.
జీవి రొగాన్న బడుట సహజము,రోగ విముక్తుడగుటకు కావాలి మందు-దానినే ఔషధమనెదరు-అన్నిరోగాలకు మించిన రోగము భవరోగము అనగా సంసార బాధలు,వీటి నివారణకు దివ్య ఔషధము భగవన్నామ చింతనే.కనుక విష్ణు భగవానుని ఓం ఔషధాయనమః అని స్తుతించుట
శుభములు ఇచ్చువారు సురలు అట్టి సురలను సర్వ భూతాలను పరిపాలించు సురేశ్వరుడు.
Posted by: Mr dyvadhinam yaddanapudi At: 13, May 2011 5:52:50 PM IST సాయి గీతం గేయ రచన రాయసం సుభద్రాదేవి
సాయి షిర్డీ సాయి
నీ నామమేఎంతో హాయి --సాయిషిర్డి..!!
ద్వారకామాయి వాసా ఓ సాయి బాబా
పిలిచేమయ్యా తలచేమయ్యా సాయి ..!!సాయి షిర్డీసాయి..!!
నిత్యము నీవే సత్యమునీవే
నాలో వెలిగే దైవమునీవే
గానము నీవే ప్రాణము నీవే
ఙ్ఞానము నీవే గమ్యము నీవే
నను బ్రోచే భారము నీదే
కంటి చూపు లేనివారికి కన్నుల వెలుగే నీవయా
ఆశ నిరాశల జీవితానికి జీవన జ్యోతివి నీవయా ..సాయి షిర్డీసాయి..!!
Posted by: Mr dyvadhinam yaddanapudi At: 30, Apr 2011 1:34:08 PM IST జైబాబా
గీతానామసహస్రం
నైవ కించిత్ త్కరోమీతి యుక్తో మన్యేత తత్త్వవిత్
పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్నశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్
నిజమైన ఙ్ఞాని ప్రహ్లాడుడు.పానీ యంబుల్ ద్రావుచున్,గుడుచుచున్,భాషించున్ హాసలీలానిద్రాదులు సేయుచుం దిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పాదపద్మ యుగళీ చింతామృతాస్వాద సంధానుండై యుండేవాడు-ఆత్మతత్త్వము
తెలుసుకున్న బ్రహ్మఙ్ఞానము కలిగిన యోగి,చూచుచూ,వినుచూ,తాకుచూ,వాసనచూచుచూ,తినుచూ,నడుచుచూ,నిద్రించుచూ,శ్వాస పీల్చుచూ విడచుచూ బ్రహ్మతత్త్వ చింతన చేయుచూ తానేమి చేయుట లేదని తలంచును. .
Posted by: Mr dyvadhinam yaddanapudi At: 30, Apr 2011 12:32:05 PM IST జైబాబా
గీతానామసహస్రము
సన్న్యాసస్తు మహాబాహో దుఖః మాప్తు మయోగతః
యోగ యుక్తో మునిర్ర్బ్రహ్మ న చిరేణా 2ధిగచ్చతి
యోగానుష్టానము లేని సన్న్యాసము దుఖః కరము అసాధ్యము. చిత్తనిగ్రహము యోగ నిష్ట వలన సాధ్యము,చిత్త నిగ్రహముతో సతతము పరమాత్మను మననము చేయు ఙ్ఞాని అచిరకాలములోనే బ్రహ్మైక్య స్థితి పొందగలడు.సాధన లేకుండా ఙ్ఞానము పొందుట అసాధ్యమని పరమాత్మ సూచన.అనుష్టానము తాబేలు నడకవంటిది ఙ్ఞాన సముపార్జన తొందరగా పొందుదామని అనుష్టానము చేయకుండా సన్న్యాసము స్వికరించుట కుందేలు గెంతులాగా అనుసరించాలని ప్రయత్నించుటే.మనసు కూడా కుందేలు గెంతిన విధముగా ప్రవర్తించును .మనసును నియంత్రింపజేయు శక్తి పరమాత్మకే గలదు గనుక పరమాత్మకి శశిబిందువని నామము. .
Posted by: Mr dyvadhinam yaddanapudi At: 25, Apr 2011 10:26:55 PM IST జైబాబా
గీతానామ సహస్రము
యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగై రపి గమ్యతే
ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి సపశ్యతి !!
ఏ మోక్షస్థానము తత్త్వఙ్ఞానులచే పొందబడుచున్నదో సంసార బాధ్యతలు యోగ నిష్ట తో ఆచరించువారును పొందుచున్నారు.తత్త్వఙ్ఞానము నిష్కామ కర్మయోగము రెండునూ ఒకే లక్ష్యము(మోక్షప్రాప్తి)అని చూచేవాడు తత్త్వాన్ని తెలిసికొనిన నిజమైనఙ్ఞాని .మనసు గలవాడు మనిషి.పని చేయుటకు తత్త్వమాలోచించుటకు మనసే ప్రధానము.మనసు అమృత భాండము కావాలి.దానిలో అమృతము నింపేది అమృతాంశుడు.
శ్లో.!! అమృతాంశూధ్భవో భానుః శశి బిందుః సురేశ్వరః
ఔషధం జగత్సేతుః సత్యధర్మ పరాక్రమః !!
తాత్త్వికముగా చంద్రుడు మనసునకు అధిష్టాన దేవత.అమృత తుల్యమైన ఆలోచనలు మనిషి వ్యక్తిత్త్వాన్ని సూర్యకాంతివలె ప్రకాశమానము.
Posted by: Mr dyvadhinam yaddanapudi At: 24, Apr 2011 10:28:52 AM IST ne^nu e^mi po^sTu che^sinaa main pe^jilo^ raavaTle^du endukilaajarugutundi e^ to^lu mandam takkuva edavale^daa edavamma prabhaavamanuko^vaalaa? ne^nasale^ mo^Tugaanni e^mi telavano^nni
Posted by: Mr. Bhaskar At: 28, Mar 2011 1:09:16 AM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|