Discussion on Offbeat n Jokes in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Offbeat n Jokes
ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి
< < Previous   Page: 20 of 169   Next > >  


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
నసున మనసై బ్రతుకున బ్రతుకై మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన్న అదే భాగ్యము అదే స్వర్గము ఆశలు తీరని ఆవేశములో ఆశయాలలో ఆవేదనలో చీకటి మూసిన యేకాంతములో తోడొకరుండిన్న అదే భాగ్యము అదే స్వర్గము నిన్ను నిన్నుగ ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నించుటకు నిన్ను నిన్నుగ ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నించుటకు నేనున్నానని నిండుగ పలికే తోడొకరుండిన్న అదే భాగ్యము అదే స్వర్గము చెలిమియే కరువై వలపే అరుదై చెదరిన హృదయమే శిల యై పోగా నీ వ్యధ తెలిసి నీడగ నిలిచి తోడొకరుండిన్న అదే భాగ్యము అదే స్వర్గము || మనసున || చిత్రము : డా.చక్రవర్తి గానం : ఘంటసాల రచన : అత్రేయ సంగీతం : సాలూరి రాజేశ్వర్‌రావు

Posted by: Mr. Siri Siri At: 17, Mar 2009 5:45:02 PM IST
హూ ముక్కుమీద కోపం నీ ముకానికే అందం నా బుంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం అడపదడప ఇద్దరు అలిగేతేనే అందం అలకతీరి కలిసేదే అందమైన బంధం సిన్నదాని బుగ్గలకు సిగ్గొస్తే అందం ఆ బుగ్గమీద సిటికేసి దగ్గరొస్తె బంధం ఈడొచ్చిన పిల్లకు జోడుంటే అందం ఈడుజోడు కుదిరినాక మూడుముళ్ళె బంధం తల్లీగోదారికీ ఎల్లువొస్తె అందం ఎల్లువంటి బుల్లోడికి పిల్ల గౌరి బంధం చిత్రం : మూగమనసులు గానం : జమునారాణి రచన : ఆత్రేయ సంగీతం : కె.వి.మహదేవన్

Posted by: Mr. Siri Siri At: 17, Mar 2009 5:43:33 PM IST
రేపంటి రూపం కంటి పూవింటి చూపుల వంటి నీ కంటి చూపుల వెంట నా పరుగంటి రేపంటి వెలుగే కంటి పూవింటి దొరనే కంటి నా కంటి కళలూ కలలు నే సొమ్మంటీ నాతోడు నీవైయుంటే నీ నీడ నేనేనంటి.. ఈ జంట కంటే వేరే లేదు లేదంటి నీపైన ఆశలు వుంచి ఆపైన కోటలు పెంచి నీకోసం రేపూ మాపూ వుంటిని నిన్నంటి రేపంటి... నే మల్లెపువ్వై విరిసి నీ నల్లని జడలో వెలసి నీ చల్లని నవ్వుల కలసి వుంటే కాయలాంటి నీ కాలిమువ్వల రవళి నా భావి మోహన మురళి ఈ రాగసరళి తరలిపోదాం రమ్మంటి రేపంటి... నీలోని మగసిరితోటి నాలోని సొగసుల పోటి వేయించి నేనే ఓడిపోని పోమ్మంటి నేనోడి నీవే గెలిచి నీ గెలుపు నాదని తలచి రాగాలు రంజిలు రోజే రాజీ రమ్మంటి రేపంటి .... చిత్రం : మంచి -చెడు గానం : ఘంటసాల, ఫై.సుశీల రచన : ఆత్రేయ సంగీతం : విశ్వనాధన్ - రామమూర్తి

Posted by: Mr. Siri Siri At: 17, Mar 2009 5:41:23 PM IST
ఓ.. భావి భారత భాగ్య విధాతలారా.. యువతీ యువకులారా... స్వానుభవమున చాటు నా సందేశమిదే.. వారెవ్వా.. తాదిన్న తకదిన్న తాంగితటకతక తరికితకతోం పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని చల్లగ కాలం గడపాలోయ్ ఎల్లరి సుఖము చూడాలోయ్ మీరెల్లరు హాయిగ ఉండాలొయ్ కట్నాల మోజులో మన జీవితాలనే బలిచేసి కాపురములు కూల్చు ఘనులకు శాస్తి కాగా పట్నాల పల్లెల దేశదేశాల మన పేరు చెప్పుకుని ప్రజలు సుఖపడగా తాధిన్న తకధిన్న తాంగిటతకతక తరికటకతోం ఇంటా బయటా జంట కవులవలె అంటుకు తిరగాలోయ్ తరంపం కంటిపాపలై దంపతులెపుడు చంటి పాపలను సాకాలోయ్ నవభావములా.. నవరాగములా.. నవజీవనమే నడపాలోయ్ భావకవులవలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్... పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని చల్లగ కాలం గడపాలోయ్ ఎల్లరి సుఖము చూడాలోయ్ మీరెల్లరు హాయిగ ఉండాలొయ్ చిత్రం : పెళ్లి చేసి చూడు గానం : ఘంటసాల రచన : పింగళి నాగేంద్రరావు సంగీతం : ఘంటసాల

Posted by: Mr. Siri Siri At: 17, Mar 2009 5:40:04 PM IST
ఆహ నా పెళ్ళియంటా ఓహొ నా పెళ్ళియంటా ఆహ నా పెళ్ళంట, ఓహొ నా పెళ్ళంట నీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టాం టాం టాం వీరాధి వీరులంట ధరణీ కుబేరులంటా భోరు భోరు మంటు మా పెళ్ళివారు వచ్చిరంట వీరాధి వీరులంట ధరణి కుబేరులంట భోరు భోరు మంటు మా పెళ్ళివారు వచ్చిరంట అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బో హహ్హహ్హహ్హ ఆహ నా పెళ్ళియంటా ఓహొ నా పెళ్ళియంటా ఆహ నా పెళ్ళంట, ఓహొ నా పెళ్ళంట నీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టాం టాం టాం బాలా కుమారులంట చాలా సుకుమారులంట బాలా కుమారులంట చాలా సుకుమారులంట పెళ్ళికొడుకు నన్ను చూసి మురిసి మూర్ఛ పోవునంట అయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యో హహ్హహ్హహ్హ ఆహ నా పెళ్ళియంటా ఓహొ నా పెళ్ళియంటా ఆహ నా పెళ్ళంట, ఓహొ! నా పెళ్ళంట నీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టాం టాం టాం తాళిగట్ట వచ్చునంట తాళిగట్ట వచ్చునంట తగని సిగ్గునాకంట సా ద ని స మ మ మా ప ద ప మ గ తాళిగట్ట వచ్చునంట.. పపప ద మమమ ప దదద మరిగమప తాళిగట్ట వచ్చునంట.. తథొం థొం థొం థొం! తక ధీం ధీం ధీం థక థొం థక ధీం థ అటు తంతాం ఇటు తంతాం తంతాంతంతాం తాం స ని ద ప మ గ రి స తాళిగట్ట వచ్చునంటా తాళిగట్ట వచ్చునంటా తగని సిగ్గునాకంట మేలిముసుగు చాటుతీసి దాగుడు మూతలాడునంట అహహహహహ, అహహహహహ, ఆహహహహహహహహ చిత్రం : మాయాబజార్ గానం : ఘంటసాల, పి.సుశీల రచన : పింగళి సంగీతం :ఘంటసాల

Posted by: Mr. Siri Siri At: 17, Mar 2009 5:37:08 PM IST
మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే తెలుపక తెలిపే అనురాగము నీ కనులనే కనుగొంటిలే నీ మనసు నాదనుకొంటిలే || మౌనముగా || కదిలీ కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే ఆ... కదిలీ కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే ఆనందముతో అమృతవాహినిని ఓలలాడి మైమరచితిలే || మౌనముగా || ముసిముసి నవ్వుల మోము గని నన్నేలుకొంటివని మురిసితిలే ఆ... ఆ... ఆ... ముసిముసి నవ్వుల మోము గని నన్నేలుకొంటివని మురిసితిలే రుసరుసలాడుచు విసరిన వాల్జడ వలపు పాశమని వెదరితినే || మౌనముగా ||

Posted by: Mr. Siri Siri At: 17, Mar 2009 5:34:15 PM IST
చాంగురే...చాంగురే బంగారు రాజా చాంగు చాంగురే బంగారు రాజా మజ్జారే మగరేడా మత్తైన వగకాడా అయ్యారే! నీకే మనసియ్యలని వుందిరా || చాంగురే || ముచ్చటైన మొలక మీసముంది భళా అచ్చమైన సింగపు నడుముంది జిగీ బిగీ మేనుంది సొగసులొలుకు మోముందిమేటి దొరవు అమ్మక చెల్ల నీ సాటి ఎవ్వరునుండుట కల్ల || చాంగురే || కైపున్న మచ్చకంటి చూపు అది చూపు కాదు పచ్చల పిడిబాకు పచ్చల పిడిబాకో విచ్చిన పువురేకోగుచ్చుకుంటే తెలుస్తుందిరా మనసిచ్చుకుంటే తెలుస్తుందిరా || చాంగురే || గుబులుకొనే కోడెవయసులెస్స దాని గుబాళింపు ఇంకా హైలెస్సా పడుచు దనపు గిలిగింత గడుసు గడుసు పులకింతఉండనీయవేమి సేతురా కై దండలేక నిలువలేనురా || చాంగురే || చిత్రం : శ్రీ కృష్ణ పాండవీయం గానం : జిక్కీ రచన : సి. నారాయణరెడ్డి సంగీతం : పెండ్యాల

Posted by: Mr. Siri Siri At: 17, Mar 2009 5:31:32 PM IST
మదన మనోహర సుందర నారి మధుర ధరస్మిత నయనచకోరి మందగమన జిత రాజమరాళి నాట్యమయూరి ఈ ఈ ఈ ఈ ఈ అనార్కలి అనార్కలి అనార్కలి ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ అ రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏలరా రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏలరా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ రాజశేఖరా రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏలరా రాజశేఖరా మనసు నిలువ నీదురా మమత మాసిపోదురా మనసు నిలువ నీదురా మమత మాసిపోదురా మధురమైన బాధరా మరపురాదు ఆ ఆ ఆ ఆ రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏలరా రాజశేఖరా కానిదాన కాదురా కనులనైన కానరా కానిదాన కాదురా కనులనైన కానరా జాగుసేయనేలరా వేగ రావదేలరా జాగుసేయనేలరా వేగ రావదేలరా వేగ రార వేగ రార వేగ రార చిత్రం: అనార్కలి గానం : ఘంటసాల, జిక్కి

Posted by: Mr. Siri Siri At: 17, Mar 2009 5:30:08 PM IST
పులకించని మది పులకించు వినిపించని కథ వినిపించు అనిపించని ఆశల వించు మనసునే మరపించు గానం మనసునే మరపించు.. రాగమందనురాగ మొలికి రక్తి నొసగును గానం రేపు రేపను తీపి కలలకు రూపమిచ్చును గానం చెదిరిపోయే భావములకు చేర్చి కూర్చును గానం జీవ మొసగును గానం .. మది చింత బాపును గానం .. వాడిపోయిన పైరులైనా నీరు గని నర్తించును కూలిపోయిన తీగయైనా కొమ్మ నలిమి ప్రాకును కన్నె మనసు ఎన్నుకొన్న తోడు దొరికిన మరియు దోర వలపే కురియు... మది దోచుకొమ్మనీ తెలుపు //పులకించని// చిత్రం : పెళ్ళికానుక గానం : జిక్కి రచన : ఆత్రేయ సంగీతం : ఏ.ఎం.రాజా

Posted by: Mr. Siri Siri At: 17, Mar 2009 5:28:46 PM IST
ఓ ఓ ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట వినరావమ్మ ఓ ఓ ఓ ఓ మరుమల్లెలలో మావయ్య మంచి మాట సెలవీవయ్య పున్నమి వెన్నెల గిలిగింతలకు తూగిన మల్లెల మురిపాలు నీ చిరునవ్వుకు సరికావమ్మ ఓ ఓ ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ ఎవరన్నారు ఈ మాట వింటున్నాను నీ నోట తెలిసీ పలికిన విలువేనా ఓ ఓ ఓ ఓ మరుమల్లెలలో మావయ్య వలచే కోమలి వయ్యారాలకు కలసే మనసుల తియ్యదనాలకు కలవా విలువలు సెలవీయ ఓ ఓ ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ పై మెరుగులకే భ్రమపడకయ్య మనసే మాయని సొగసయ్య గుణమే తరుగని ధనమయ్య ఓ ఓ మరుమల్లెలలో మావయ్య మంచి మాట సెలవీవయ్య ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ చిన్న మాట వినరావమ్మ చిత్రం : దొంగరాముడు గానం : ఘంటసాల, జిక్కి

Posted by: Mr. Siri Siri At: 17, Mar 2009 5:27:51 PM IST
< < Previous   Page: 20 of 169   Next > >  
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.