Discussion on Offbeat n Jokes in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Offbeat n Jokes
ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి
< < Previous   Page: 21 of 169   Next > >  


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
యాడికెళ్ళిందో నా ఎంకి నన్ను యాది మరిసిందో నా ఎంకి బతుకు భారమై బస్తీ కెళ్ళిందో బాట తప్పి తాను ఆగమయ్యిందో || యాడి || కళ్ళ ముందరా--తిరిగినప్పుడూ కాయ కష్టమే -- సేసినప్పుడూ కన్నీరంటే -- ఎరుగలేము ఎంకి -- నా కంటి రెప్పలా -- సూసుకున్నానే || యాడి || నీట నారు నాట -- పొలము వెళ్ళగా దొబ్బ మీసం దొర -- దారి కాసెనా పట్టెడు గాసము -- సేతిన బోసి పాము పడకలా --నిన్ను దాచేనా || యాడి || నాల్గు దిక్కులా -- సిమ్మ సీకట్లూ నువ్వు పిలిచే -- ఆరుప్ప పప్పుల్లూ నిన్ను గాన నా -- కళ్ళు చాలవూ నిన్ను పిలువ నా -- పిలుపు చాలదూ || యాడి || ఆకసమ్మునా -- హాయిగా పోయే అందమయినా -- పక్షులారా జాలి దలచి మీరయినా -- నా ఎంకికి కబురంపరా || యాడి ||

Posted by: Mr. Siri Siri At: 17, Mar 2009 5:26:29 PM IST
చల్లని రాజా! ఓ చందమామా! నీ కథలన్ని తెలిశాయి ఓ చందమామా! నా చందమామా! పరమేశుని జడలోన చామంతిని నీలి మేఘాలనాడేటి పూబంతిని నిను సేవించెదా నను దయచూడవా? ఓ వన్నెల వెన్నెల నా చద్నమామా //చలని// చల్లని రాజా! ఓ చందమామా! నీ కథలన్ని తెలిశాయి ఓ చందమామా!నా చందమామా నిను చూసిన మనసెంతో వికసించుగా తొలి కోరికలెన్నో చిగురించగా ఆశలూరించునే చెలికనిపించునే చిరునవ్వుల వెన్నెల కురిపించునే చల్లని రాజా! ఓ చందమామా! నీ కథలన్ని తెలిశాయి ఓ చందమామా! నా చందమామా! చిత్రం :ఇలవేలుపు గానం : ఏ.ఎం.రాజా, జిక్కి

Posted by: Mr. Siri Siri At: 17, Mar 2009 5:23:05 PM IST
nEnu ninnentagaanO pEmittunnaanu subbuu !

Posted by: Mr. Siri Siri At: 17, Mar 2009 5:17:59 PM IST
siri siri gaaru, mee svanta prEma kata seppanDi, vinipeTTi amaram chEstaam. pakka pakkanE iddarinee paatipeTTE(pOyaaka) prayatnam chEstaamani kooDaa haamee istunnaa :P

Posted by: Subba Rao A At: 14, Mar 2009 7:17:27 AM IST
ఆయ్ ! ఒకరికి పప్పిట్టం ఒకరికి చారిట్టం మరొకరికి సాంబారిట్టం. కానీ.. అందరికీ పేమకతలంటే ఇట్టం !! అందుకే మీ అందరికోసం.. ఈ విందు భోజనం... గోదారంత పెద్దదైన గోదారోల్ల పేమతో ! --సిరి సిరి అమర "ప్రేమ" గాధ... జననం... మరణం.... ఈ రెండిటి చక్రభ్రమణంలో సదా సజీవంగా సాగే మానవేతిహాసంలో అమరత్వం సిద్ధించినది ఏదైనా ఉందీ అంటే... ఇది ప్రేమ ఒక్కటే. కొందరి మనస్సుల్లో సర్వసా`దారణంగా ఒక సందేహం ఉంటుంది. ఈ సష్టిలో సర్వం ఏదో ఒకనాడు నాశనం కాక తప్పనప్పుడు మరి ప్రేమ మాత్రం అమరం ఎందుకు అవుతుంది? దీనికి సరైన సమా`దానం ఒక్కటే. ఈ ప్రపంచమే ప్రేమ అనే భావనతో సష్టించబడింది. అటువంటప్పుడు ప్రేమ ఎలా మరణిస్తుంది! మన దేశంలోనే కాదు. దేశదేశాలలోనూ జ్ఞానులు ఏనాడో ఉద్ఘోషించారు - మత్యువు సైతం జీవనానికి ఒక రూపాంతరమే అని! కాబట్టే మరణాలు సంభవించినంత మాత్రాన మానవ జీవనం ఆగలేదు. అది కొనసాగుతునే ఉంది. మానవాళి మనుగడకు హదయస్పందన ప్రేమ. ఉఛ్వాసనిశ్వాసలు ప్రేమ. సెయింట్‌ వాలెంటైన్‌ ప్రేమ అనే సందేశాన్ని ఈ ప్రపంచానికి చాటి లోకం వీడారు. కానీ ఆయన ప్రేమ ఇప్పటికీ అమరంగానే నిలిచిపోయింది. ప్రేమకు మరణం లేదు. వాలెంటైన్‌ మాత్రమే కాదు. మరెందరో ప్రేమికులు తమ ప్రాణాలు సైతం త్యాగం చేసి తమ ప్రేమకు అమరత్వాన్ని సంపాదించుకున్నారు. అలాంటి వారిలో ఎందరో లైలా-మజ్నూలు, అంబికాపతి - అమరావతి, సోహ్న - మహివాలా వంటి వారు. వాళ్ళు వెళ్లిపోయి వందల ఏళ్లు గడుస్తున్నా... వారి ప్రేమపథంలోనే ముందుకు సాగడానికి ఇప్పటికీ యువప్రేమికులు తపించడానికి కారణం ఒక్కటే... ప్రేమకు మరణం లేదన్న సత్యం వారికి తెలియడమే! లైలా - మజ్నుల ప్రేమ గాధ అమర జీవులైన లైలా-మజ్ను ప్రేమికులు. అరేబియా దేశానికి చెందినవారు. వీరిద్దరూ భౌతికంగా లేకపోయినా ఇప్పటికి శాశ్వతంగా బతికున్నారనడానికి, వీరి ప్రేమే ఓ చక్కని ఉదాహరణ. షాఅమారి కుమారుడైన కైసిన్‌ మరో పేరే మజ్ను. ఇతడి జాతకాన్ని చూసిన జ్యోతిష్కుడు `` ఇతడు ప్రేమకోసమే పుట్టాడని'' నిర్థారణగా చెప్పాడు. అది భరించలేని షాఅమారి రోజు భగవంతుణ్ణి. ``తన కుమారుడి జాతకం అబద్ధం కావాలని'' ప్రార్థించేవాడు. మజ్ను మొట్ట మొదటిసారి నాజత్‌షా కుమార్తె లైలాను మసీదులో చూశాడు. తన తొలి చూపులోనే మనసు పారేసుకున్నాడు. ఇది గమనించిన మసీదులోని మత గురువులు మజ్నును మందలించారు. తరచు మసీదులో లైలాను కలుసుకుంటూ, అదే ధ్యాసలో ఉండిపోయేవాడు. లైలా కూడ మజ్నును ప్రేమించడం వల్ల వారిద్దరి మధ్య విడదీయరానంతగా ప్రేమ నాటుకుపోయింది. ఈ విషయం తెలుసుకున్న లైలా తల్లిదండ్రులు, లైలాను ఇంట్లోనే నిర్భంధించేవారు. లైలాకు దూరమైన మజ్ను పిచ్చివాడిలా మానసికక్షోభకు గురై అనారోగ్యం పాలయ్యాడు. వీరి ప్రేమను అర్థం చేసుకోని పెద్దలు వీరిని విడదీయడమేగాక లైలాను ``భగత్‌'' కిచ్చి పెళ్ళి చేశారు. అయినప్పటికి లైలా తన మనసును మార్చుకోలేదు. భార్యా భర్తల మధ్య అనురాగము కొరవడడంతో, భగత్‌కు సందేహం కలిగి లైలాను నిలదీశాడు. లైలా తన గాధను వివరించి విడాకులు కోరింది. ఆమె ఇష్టానుసారం భగత్‌ విముక్తి ప్రసాదించాడు. విడిపోయిన లైలా, మజ్ను మళ్ళి కలుసుకున్నారు. ఇది చూసి భరించలేని పెద్దలు, వారిని కలుసుకోనీయకుండా అడ్డుపడేవారు. ఈ బాధ భరించలేని లైలా ప్రాణాలు విడిచింది. ఈ వార్త విన్న మజ్ను కూడా తక్షణమే ప్రాణాలు విడిచాడు. వీరిద్దరి చావుతో లోకం కళు్ళ తెరిచింది. వారి పవిత్రప్రేమను వెలుగు చూసిన పెద్దలు, మత గురువులు, తదితరులు `` ఈ లోకంలో కలిసి బతకలేని వీరిద్దరు, కనీసం పరలోకంలోనైనా కలిసుండాలి '' అని లైలా సమాధి పక్కనే మజ్ను సమాధి కట్టారు. ప్రేమకు చావులేదని వారి పవిత్ర ప్రేమ ఈ లోకానికి చాటి చెబుతుంది. ఈ ప్రపంచం ఉన్నంతవరకు వీరి ప్రేమ విరాజిల్లుతుంది. ఇప్పటికీ ప్రేమికులు వీరి సమాధి స్థలాన్ని పవిత్ర స్థలంగా భావిస్తున్నారు. ప్రేమ అమరం అఖిలం. ప్రేమ అమరం అఖిలం. ప్రేమంటే ... ప్రేమంటే దేవుడు (God is Love). అది "రెండు మనసుల కలయిక. 'ఆద్యంతము లేని అమరానందమే ప్రేమ.. ఏ బంధము లేని అనుబంధమే ప్రేమ.. ప్రేమ దివ్య రాగము.. ప్రేమ దైవ రూపము' అంటాడు మహా కవి ఆత్రేయ. ప్రేమలో రకాలు * తల్లి ప్రేమ లేదా మాతృ ప్రేమ: తల్లికి కన్న పిల్లలపై ఉన్న ప్రేమ. * సోదర ప్రేమ లేదా భాతృ ప్రేమ: ఒకే తల్లికి పుట్టిన పిల్లలైన సోదరులు మధ్య ఉండే ప్రేమ. * ప్రేమికుల ప్రేమ: ఎటువంటి రక్తసంబంధం లేని ప్రేమికుల మధ్యన ఉండే ప్రేమ. * జంతువుల ప్రేమ: మనుషులకు జంతువులపై ఉండే ప్రేమ. బైబిల్ లో ప్రేమ * దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ దేవుని నుండి వస్తుంది. ప్రేమించే వాడికి దేవుడు తెలుసు. ప్రేమించలేనివాడికి దేవుడు తెలియడు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి మనం పరస్పర ప్రేమతో ఉండాలి. పరస్పర ప్రేమతో ఉండేవారిలో దేవుడు నివసిస్తాడు. పరస్పర ప్రేమ వల్లనే పరిపూర్ణత సిద్ధిస్తుంది. దేవుడే ప్రేమ. ప్రేమలో జీవించేవాడు దేవునిలో జీవిస్తాడు. ప్రేమలో భయంఉండదు. పరిపూర్ణత పొందిన ప్రేమ భయాన్ని పారదోలుతుంది. భయపడేవ్యక్తి ప్రేమలో పరిపూర్ణత పొందలేడు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటూ తన పొరుగువాడిని ద్వేషించేవాడు అబద్దీకుడు. కనిపిస్తున్న మనిషిని ప్రేమించలేనివాడు కనిపించని దేవుడినికూడా ప్రేమించలేడు (1యోహాను 4)

Posted by: Mr. Siri Siri At: 12, Mar 2009 3:16:07 PM IST
ప్రేమలోనూ పరీక్షలు తప్పవు జీవితంలోని అన్ని బంధాలు లాగానే ప్రేమలోనూ కొన్ని సార్లు పరీక్షలు ఎదురవుతుంటాయి. ఇలాంటి పరీక్షలకు భయపడిపోయి వెనకడుగు వేసేవారు తమ ప్రేమ బంధానికి ఇక అక్కడితో ఫుల్‌స్టాప్ పెట్టేయాల్సి వస్తుంది. అయితే ఎవరైతే ఈ పరీక్షలకు ఎదురు నిలబడి పోరాడుతారో వారే చివరకు ప్రేమలో విజయం సాధిస్తారు. అసలు ప్రేమంటే ఓ అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు నచ్చామంటూ చెప్పేసుకుంటే పూర్తయ్యే కార్యం కాదు. అసలు తమ మధ్య నిజమైన ప్రేమ ఉందన్న విషయాన్ని వారు నిరూపించుకోవాల్సిందే ఒకరికొకరు నచ్చిన తర్వాతనే. ఎందుకంటే అమ్మాయి, అబ్బాయి ఒకరిని ఒకరు ఇష్టపడితే వారి మధ్య ప్రేమ చిగురిస్తుంది. కానీ ఆ ప్రేమ పరిపూర్ణత సాధించాలంటే మాత్రం వారు జీవితంలో కొన్ని పరీక్షలు ఎదుర్కోక తప్పదు. కాలం ఎంత ఆధునికత సంతరించుకున్నా చాలావరకు ప్రేమలకు తల్లితండ్రుల ఆమోదం, సమాజ ఆమోదం లభించదు. ఎందుకంటే ఆయా కాలమాన పరిస్థితులకు తగ్గట్టు ప్రేమికులకు ఎవో కొన్ని సమస్యలు వచ్చి పడుతుంటాయి. ఇలాంటి సమయంలో ఎవరైతే ప్రేమ కోసం సమస్యలకు ఎదురొడ్డి నిలబడతారో వారే జీవితాంతం తమ ప్రేమను కాపాడుకోగలరు. అలాగే అలాంటివారిలో మాత్రమే నిజమైన ప్రేమ ఉందన్న విషయం కూడా ఎదుటివారికి అర్ధమవుతుంది. కానీ నేటి కాలమాన పరిస్థితుల్లో చాలామంది చిన్నపాటి సమస్యలకే తమ ప్రేమకు గుడ్‌బై చెప్పేస్తుంటారు. అసలు అలాంటి వారికి సమస్య అన్నది కేవలం కారణం మాత్రమే. సమస్యను కారణంగా చూపించి తాము అంతకాలం సాగించిన ప్రేమ? బంధాన్ని వదిలించుకోవాలని అలాంటివారు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటివారు అసలు సమస్యలేమీ రాకపోయినా సరే తమ ప్రేమకు ఏమాత్రం కట్టుబడి ఉండరు. వీరి దృష్టిలో ప్రేమ అన్నది కేవలం ఆకర్షణ మాత్రమే. ఆకర్షణ అనేది తీరగానే వీరి దృష్టిలో ప్రేమ వ్యవహారం ఓ పనికిమాలినదిగా కన్పిస్తుంది. అయితే ఎలాంటి కాలమాన పరిస్థితుల్లో అయినా సరే ప్రేమ అనే బంధం ఏర్పడిన తర్వాత దానిని జీవితాంతం కాపాడుకోవాలని, ప్రేమ బంధాన్ని జీవనబంధంగా మార్చుకోవాలని ప్రయత్నించేవారు ఉంటూనే ఉంటారు. అలాంటివారు ప్రేమ విషయంలో ఎలాంటి ఆటంకాలు ఎదురైన భయపడిపోకుండా వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు. అలా తమ ప్రేమలో ఏర్పడిన చిక్కుల్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించేవారు చాలావరకు అంతిమంగా విజయం సాధించితీరుతారు. అసలు ప్రేమ అంటేనే కాస్తో కూస్తో సమస్యలు లేకుండా విజయం వరించదు. ప్రేమలో అడుగుపెట్టిన ప్రతివారికీ ఇది అనుభవమే. అయితే ప్రేమలో నిజాయితీ, ఒకరిపట్ల ఒకరికి విడదీయలేని అనుబంధం ఉన్నవారు మాత్రమే తమ ప్రేమను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాంటివారు మాత్రమే అంతిమంగా ప్రేమలో విజయం సాధిస్తారు.

Posted by: Mr. Siri Siri At: 12, Mar 2009 2:58:21 PM IST
ప్రేమలోనూ వివేకం అవసరం ప్రేమ అనే భావం రెండు మనసుల్లో చిగురించి అది బలపడిందంటే ఇక వారి మధ్య అన్యోనత కూడా పెరిగిపోతుంది. ఓర చూపులు, చూపుల సైగలు, పెదవి దాటని భావాలతో మొదలయ్యే ప్రేమ కావ్యం కొన్ని పేజీల తర్వాత పరిపూర్ణత సంతరించుకుంటుంది. దాంతో ప్రేమికుల మధ్య అంతకుముందు ఉన్న అంతరాలు ఒక్కొక్కటిగా చెదిరిపోవడం ప్రారంభమవుతుంది. అలా అంతరాలు చెదిరిపోవడం ప్రారంభమయ్యాక ప్రేమికుల మధ్య ప్రారంభంలో ఉన్న బిడియాలు సైతం మాయమవుతాయి. బిడియం మాయమైపోవడంతో ప్రేమికులు తమ మదిలోని భావాలను గానీ, తమలోని ఆలోచనలను గానీ తమవారితో స్వేచ్ఛగా పంచుకోగల్గుతారు. ఈ నేపథ్యంలో ఒకరి గురించి మరొకరికి మరింత వివరంగా అర్ధమయ్యే ఆస్కారం ఏర్పడుతుంది. ఇలా కొద్ది కొద్దిగా ప్రేమ మైకం వారిని కమ్ముకున్న సమయంలో అంతకాలం మదిలో దాగిన చిలిపి కోరికలు సైతం బంధనాలు తెంచుకుని బయటపడడానికి సిద్ధమవుతాయి. అయితే ఇలాంటి తరుణంలోనే ప్రేమికుల మధ్య వివేకం చిగురించాల్సిన అవసరం ఉంది. ప్రేమించుకునే సమయంలో ఒకరి చేతిలో ఒకరు చేయి వేసి అలా నడిచి వెళ్లడం, బైకుపై షికారుకెళ్లడం, ఒకరి కౌగిళ్లో ఒకరు వాలిపోవడం తరహా సంఘటనలు ఎక్కువయ్యే సమయానికే ప్రేమికులిద్దరూ తమ జీవిత బంధం గురించి ఓ స్థిర నిశ్చయానికి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రేమ దశలో ప్రేమికుల మధ్య పైన చెప్పినవన్నీ కొనసాగుతున్నాయంటే అంతకంటే ముందున్న విషయాలు సైతం కావాలని మనసు ఆరాటపడుతోందనే విషయాన్ని గ్రహించి తీరాలి. అలా గ్రహించినపుడు ఇక వారు తమ ప్రేమలో మరో ఘట్టంలోకి అడుగు పెట్టాల్సిన సమయం ఆసన్నమైందనే అర్థం. ప్రేమ తర్వాత ఘట్టం అంటే పెళ్లి అని అందరికీ తెలిసిందే. ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంతో కొనసాగించితేనే ఆ ప్రేమకు పరిపూర్ణత లభిస్తుంది. అలా కాకుండా కేవలం ప్రేమలోకంలోనే ఉండిపోతామన్న పేరుతో ముద్దూ మురిపాల దశనుంచి మరికాస్త ముందుకెళ్లి ఆపై జీవితంలో ఒకటి కాలేక బాధపడేకంటే ప్రేమ దశలో కాస్త వివేకంతో వ్యవహరించడం చాలా ఉత్తమం. ఎందుకంటే ప్రేమ అనేది జీవిత బంధానికి సంబంధించి ఓ తియ్యని కల లాంటిది. అది జీవితాంతం మనల్ని సంతోష పెట్టగలిగే ఓ మధుర కావ్యంగా ఉండాలి గానీ జీవితాంతం వెంటాడే భయంగా ఉండరాదు. అలా ప్రేమ అనేది భయాన్ని కాకుండా జీవితంలో ఆనందాన్ని కల్గించాలంటే ప్రేమించే దశలో ప్రేమికులకు కాస్త వివేకంతో ప్రవర్తించక తప్పదు.

Posted by: Mr. Siri Siri At: 12, Mar 2009 2:55:36 PM IST
నిజమైన ప్రేముంటే... ప్రేమిస్తూనే ఉండండి ప్రేమ అనే రెండక్షరాల పదం ఈ జగత్తులో ఓ తరిగిపోని నిధిలాంటింది. శక్తి ఉండి తోడివేస్తే సముద్రం అడుగునైనా చూడొచ్చోమో గానీ ఎన్ని యుగాలు గడిచినా ప్రేమ లోతేంటో మాత్రం ఎవరికీ తెలియదు. అందుకే ప్రేమంటే ఇదేనంటూ ఎందరు నిర్వచించినా ఇంతకు మించి మరేమీ లేదంటూ మరికొందరు తేల్చేసినా ప్రేమలో మునిగినవారు మాత్రం లోతుకు చేరలేక ఒడ్డుకు రాలేక సతమతమవుతుంటారు. అంతటి మహత్యం ప్రేమలో ఉంది కాబట్టే ప్రేమభావంలో మునిగినవారు ఈ లోకాన్ని సైతం మర్చిపోతుంటారు. తన మనసుకు నచ్చిన చెలి కళ్లముందు ఒక్కసారి కన్పిస్తే ఇక ఆ క్షణం సరికొత్తగా జన్మించి ఆ నెచ్చెలి ప్రేమ కోసం ఏం చేయడానికైనా ఏ తీరం చేరడానికైనా మగవారు సిద్ధమై పోతుంటారు. అలా అష్టకష్టాలు పడి నచ్చిన చిన్నదాన్ని చేరుకున్నాక... ఆమె మనసును సైతం గెల్చుకుని ఆమెలోనూ ప్రేమభావాన్ని రగిలించాక... ఇన్నాళ్లు తాను పడ్డ తపన ఆమెలోనూ ప్రారంభం అయ్యాక... ఇక మరేమీ లేదన్నట్టు కొందరు అక్కడే నిల్చిపోతుంటారు. కానీ నిజమైన ప్రేమ ఎప్పుడూ ఎక్కడా ఆగిపోదు. ""ఎగసిపడే కడలి కెరటంలా ప్రేమ సైతం నిత్యం అలా మనసు తీరాన్ని తాకుతూనే ఉంటుంది. ""అలా తాకే ఆ ప్రేమ తాలూకు ఆ స్పర్శను ప్రేమికులు గుర్తించగల్గితే ఇక వారి జీవితంలో ప్రేమ అనేది ఎప్పటికీ సమసిపోదు. అయితే చాలామంది అబ్బాయిలు ప్రేమ కోసం ఎంతగానో తపిస్తారు. దానికోసం నచ్చిన అమ్మాయి వెంట తిరగడానికి ఏమాత్రం సంకోచించరు.

Posted by: Mr. Siri Siri At: 12, Mar 2009 2:51:34 PM IST
ప్రేమకు ఆకర్షణ ప్రారంభం మాత్రమే ప్రేమ గురించి చాలామంది చాలాసార్లు చెప్పినా అది ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని సంపాదించుకుంటూ ఉంటుంది. అందుకే ఇద్దరి హృదయాల్లో చిగురించే ప్రేమ ఇలా ఉంటుందని ఎంతమంది ఉదాహరణలు చెప్పినా మరో కొత్త కోణంలో, మరో కొత్త మార్గంలో ప్రేమ జనిస్తూ ఉంటుంది. అయితే ప్రేమ జనించడానికి కారణం ఏదైనా, మార్గం ఏదైనా ఆ ప్రేమను ఓ మానసిక బంధంగా ప్రేమికులు మార్చుకోగల్గితేనే అది జీవనబంధం అవుతుంది. అలాంటి బంధమే జీవితం చివరివరకు కొనసాగగలుగుతుంది. ముందుగా చెప్పుకున్నట్టు ప్రేమ ఎన్ని మార్గాల్లో జనించినా అందులో ఆకర్షణ అనే కారణం ప్రధానమైందని అందరూ ఒప్పుకునేదే. ""భౌతికశాస్త్రవేత్తలు చెప్పినట్టు ఈ విశ్వంలో ఏ పదార్థం కూడా శూన్యంలోంచి కొత్తగా పుట్టుకురాదు. కొత్తగా పుట్టిన ప్రతీది అంతకు ముందు మరో రూపంలో ఈ విశ్వంలో ఖచ్చితంగా ఉండి ఉంటుంది. "" ఒకరిని చూచినపుడు ఎదో తెలియని ఆకర్షణ మనల్ని వారివైపు నుంచి దృష్టి మరల్చనీయకుండా చేయవచ్చు. అలా మనల్ని దృష్టి మరల్చనీయకుండా చేసిన అంశం ఏదా అంటూ ఆలోచిస్తే అది ఏదైనా కావచ్చు. ఆకర్షించే రూపం, ఎదుటివారిలోని చలాకీతనం, చూపుల్లోనే భావాలు తెలిపే చక్కని కళ్లు, ముద్దెట్టుకోవాలనిపించే నునులేత చెక్కిళ్లు, అలా చూస్తూ ఉండాలనిపించే చక్కని సౌష్టవం.... ఇలా ఎదుటివారిలో ఆకర్షించే అంశం ఏదైనా కావచ్చు. ఆ అంశం మనకు ఎదుటివారిపై ప్రేమ ఏర్పడేలా చేయవచ్చు. తరచి చూస్తే ఎదుటివారిపై ప్రేమ అనే భావం మనలో కలగడానికి కూడా ఓ కారణం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం కూడా. భౌతికశాస్త్రవేత్తలు చెప్పినట్టు ఈ విశ్వంలో ఏ పదార్థం కూడా శూన్యంలోంచి కొత్తగా పుట్టుకురాదు. కొత్తగా పుట్టిన ప్రతీది అంతకు ముందు మరో రూపంలో ఈ విశ్వంలో ఖచ్చితంగా ఉండి ఉంటుంది. అయితే కొన్ని సార్లు కొత్త పదార్థం తయారీకి కారణభూతమైన పూర్వ పదార్థం ఏది అనే విషయం మనకు తెలియకపోవచ్చు. ఇప్పటివరకు చెప్పిన ఈ శాస్త్ర సత్యం ప్రేమ విషయంలోనూ వర్తిస్తుంది. మనసు అంతరాల్లో ఏమూలో మనకు నచ్చిన అంశం ఎదుటివారిలో కన్పించినపుడు ఒక్కసారిగా మన హృదయం స్పందించడం ప్రారంభిస్తుంది. అలా ఒకర్ని చూచినపుడు ప్రారంభమైన హృదయస్పందన వారు కన్పించిన ప్రతిసారీ మనలో కన్పించగల్గితే, అలాగే ప్రతిసారీ ఆ స్పందన తీవ్రత ఎక్కువైతే అదే చివరకు ప్రేమగా మారుతుంది. అయితే మనలో ప్రేమ కల్గడానికి ఆకర్షణ అనే అంశం ఓ కారణమైనా ప్రేమబంధం బలపడడానికి మాత్రం అది సరిపోదు. ""మనకు నచ్చిన వ్యక్తిని మన మనసు కూడా ఇష్టపడడం అనే ప్రక్రియ ప్రేమికులిద్దర్లోనూ జరిగితే ?... ఇక వారి ప్రేమబంధం ఎంతటి అపురూప బంధంగా మారుతుందో మనం ఊహించుకోవచ్చు. "" అంతకుమించిన మరో బంధమేదో ప్రేమికుల మధ్య చోటు చేసుకుంటేనే ఆ ప్రేమ నిజమైనదవుతుంది. అలాంటి బంధం ఏదంటే అది మానసిక బంధం అని చెప్పవచ్చు. అందరూ చెప్తుంటారు నేను నా మనసు చెప్పినట్టే చేస్తుంటాను... అంటే ప్రతి మనిషి తన మనసు చెప్పినట్టు చేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు అనేది ఇక్కడ సుస్పష్టం. మనిషిగా ఆకర్షింపబడి మనకు నచ్చిన మనిషి మన మనసుకు కూడా నచ్చితే ? ఆ మనిషికి మనం జీవితంలో ఎంత ప్రాధాన్యం ఇస్తాం అనే విషయం ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. అదేసమయంలో ఇలా మనకు నచ్చిన వ్యక్తిని మన మనసు కూడా ఇష్టపడడం అనే ప్రక్రియ ప్రేమికులిద్దర్లోనూ జరిగితే ?... ఇక వారి ప్రేమబంధం ఎంతటి అపురూప బంధంగా మారుతుందో మనం ఊహించుకోవచ్చు. అలా ఆకర్షణతో మొదలైన ప్రేమబంధం మానసిక బంధంగా పరిణితి సాధిస్తే ఆ ప్రేమికుల జీవితం కవులు కావ్యాల్లో చెప్పినట్టు, ప్రతి ఒక్కరు కలల్లో ఊహించినట్టు నిజంగానే అద్భుతంగా కొనసాగుతుంది.

Posted by: Mr. Siri Siri At: 12, Mar 2009 2:48:29 PM IST
ప్రేమ బంధంలోనూ సర్దుబాటు అవసరం పెళ్లి లాగానే ప్రేమలో కూడా భిన్న దృవాల నుంచి వచ్చిన ఓ స్త్రీ, పురుషుడు కలిసి సహజీవనం చేయాల్సి ఉంటుంది. పెళ్లి తరహా కొన్ని బాధ్యతలు, మరికొన్ని సంబంధాలు లేకపోయినా ప్రేమలో సైతం అప్పుడప్పుడూ కొన్ని గిల్లి కజ్జాలు ఏర్పడడం సహజం. అయితే శృతిమించి రాగాన పడనంతవరకు ఈ రకమైన చిన్న చిన్న గిల్లి కజ్జాలు సైతం ప్రేమ బంధం బలీయం కావడానికి తోడ్పడుతాయి. అన్ని రకాల బంధాల్లో లాగానే ప్రేమ బంధంలో సైతం కొన్నిసార్లు అపార్థాలు, అనుమానాలు చోటు చేసుకోవచ్చు. నువ్వు చేసే పనులేం బాగోలేదు... అంటూ ప్రియుడిపై ప్రేయసి కోప్పడే దశ నుంచి... నాకు నీ వరసేం నచ్చడం లేదు అంటూ ప్రేయసిపై ప్రియుడు యుద్ధానికి సిద్ధమయ్యేవరకు ఇలాంటివి చోటు చేసుకోవచ్చు. """పెళ్లి అంటే పదిమంది సాక్షిగా ఏర్పడిన ఓ బంధమని నమ్మినంతగా ప్రేమ అనేది రెండు మనసుల సాక్షిగా ఏర్పడిన బంధమని చాలామంది ఆలోచించకపోవడమే. """" అయితే ప్రారంభంలోనే చెప్పుకున్నట్టు ఈ చిన్న గొడవలేవీ కూడా పెరిగి పెద్దవి కానంతవరకు వారి ప్రేమ బంధానికి వచ్చిన ఢోకా ఏం లేదు. ఎటొచ్చీ చిన్న గొడవలు సైతం చినికి చినికి గాలివానగా మారినపుడే ప్రేమబంధం కూడా బలహీనపడి విడిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే ప్రేమబంధాన్ని కాపాడుకోవాలన్నా కూడా కొన్ని రకాల సర్దుబాట్లు, కొన్ని రకాల పట్టువిడుపు ధోరణులు తప్పవు మరి. ఎదురుగా కూర్చున్నవారి గురించి ఓ రెండు నిమిషాల్లో తెల్సుకుని పెళ్లికి సిద్ధమైనట్టే కేవలం కళ్లు, మనసు స్పందించినపుడు ప్రేమించడానికి సిద్ధమవుతాం. అయితే పెళ్లిలో ఇద్దరూ ఒకే సమయంలో ఒకరికొకరు నచ్చి పెళ్లికి సిద్ధమైతే ప్రేమలో మాత్రం ఇద్దరూ కలిసి ప్రేమ జీవులుగా మారడానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే నువ్వు నాకు నచ్చావంటూ ఒకరు చెప్పగానే ఎదుటి వ్యక్తి కూడా వారి ప్రేమను అంగీకరించడం అనేది దాదాపు అసాధ్యం. అయితే ఎదుటి వ్యక్తిలోని నిజాయితీ, తనమీద ఉండే ప్రేమ భావం లాంటివి బలీయమని తేలినపుడే ఆ ఎదుటివారు కూడా వారి ప్రేమను అంగీకరించడం జరుగుంది. అంటే ఒకర్ని ప్రేమించడానికి ముందే వారిని గురించి మనం కొద్దో గొప్పో తెల్సుకునే ముందుకు అడుగేయడం జరుగుతోంది అన్నమాట. """పెళ్లి బంధమైనా, ప్రేమ బంధమైన వేర్వేరు ఆలోచనలతో, వేర్వేరు కుటుంబాలనుంచి వచ్చి కలిసిన ఇరువురి బంధమే. కాబట్టి ఇద్దరూ ఒకేలా ఆలోచించాలి, ఇద్దరూ ఒకేలా ప్రవర్తించాలి అని కోరుకోవడం దురాశే అవుతుంది. """ మరి అలాంటి సందర్భాల్లో పెళ్లి కంటే ప్రేమ బంధాలే ఎందుకు ఎక్కువగా విఫలం అవుతున్నాయి అని ప్రశ్నించుకుంటే దానికి సమాధానం చెప్పడం సులువే. పెళ్లి అంటే పదిమంది సాక్షిగా ఏర్పడిన ఓ బంధమని నమ్మినంతగా ప్రేమ అనేది రెండు మనసుల సాక్షిగా ఏర్పడిన బంధమని చాలామంది ఆలోచించకపోవడమే. పెళ్లి బంధమైనా, ప్రేమ బంధమైన వేర్వేరు ఆలోచనలతో, వేర్వేరు కుటుంబాలనుంచి వచ్చి కలిసిన ఇరువురి బంధమే. కాబట్టి ఇద్దరూ ఒకేలా ఆలోచించాలి, ఇద్దరూ ఒకేలా ప్రవర్తించాలి అని కోరుకోవడం దురాశే అవుతుంది. కానీ నీ కోసం నేను... అంటూ ఇద్దరూ కాస్తో కూస్తో సర్ధుకుపోవడం ప్రారంభిస్తే అది ఏ రకమైన బంధమైనా దీర్ఘకాలం కొనసాగే అవకాశముంది. అయితే ఇక్కడ మరో అంశం గురించి కూడా చర్చించాల్సిన అవసరముంది. ఎదుటివారి కోసం నేనెందుకు మారాలి. ఆమాత్రం స్వాతంత్ర్యం నాకు లేదా అంటూ ప్రశ్నించేవారికి పైన చెప్పిందంతా ఒట్టి వ్యర్థమైన విషయంగా అన్పించవచ్చు. ఇక్కడ సర్ధుబాటు అంటే ఓ బంధానికి కట్టుబడ్డ వారిద్దరికి మాత్రమే సంబంధించింది. ఆ బంధంలో ఉన్నవారు శరీరాలు వేరైనా మనసులు ఒక్కటిగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇందులో వేరే వారి కోసం నేను మారాలా అన్న ప్రశ్నకు తావే లేదు. ఎటొచ్చీ ఈ సర్దుబాటు అనే ధోరణి బంధంలోని ఇద్దరి వ్యక్తులోనూ ఉంటేనే వారి మధ్య ఎలాంటి గొడవలొచ్చినా వారి బంధం బలహీనమయ్యే అవకాశం ఎంతమాత్రం ఉండదు.

Posted by: Mr. Siri Siri At: 12, Mar 2009 2:44:29 PM IST
< < Previous   Page: 21 of 169   Next > >  
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.