Discussion on Offbeat n Jokes in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Offbeat n Jokes
ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి
< < Previous   Page: 22 of 169   Next > >  


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
ప్రేమ భావాన్ని ఆవిష్కరించండి ప్రేమభావం మదిని కమ్మిన వేళ ఆ ప్రేమను సొంతం చేసుకోవడానికి తపించని మనసు ఉండదంటే అతిశయోక్తి కాదేమో. ఈ విషయంలో స్త్రీ, పురషుడు అన్న బేధం లేదు. ఎందుకంటే ప్రేమభావం అనేది తొలిచూపులోనే మనసు తలుపు తట్టే ఓ మధురమైన అతిథి. హృదయపు తలుపు తెరిచి ఆ అతిథిని ప్రేమగా ఆహ్వానించడం తప్ప కాదనడానికి ఏ మనిషి తరం కాదు. అందుకే ప్రేమభావం మదిని చేరినపుడు స్త్రీ అయినా పురుషుడైనా ఒకేలా స్పందిస్తారు. తమలో ప్రేమభావాన్ని తట్టిలేపిన ఎదుటివారి ప్రేమను సొంతం చేసుకోవడానికి ఆ క్షణం నుంచి పరితపిస్తారు. అయితే ఈ విషయంలో అబ్బాయిలు కాస్త ధైర్యంగా ముందడుగు వేసి తమ మనసులోని భావాన్ని నచ్చిన అమ్మాయి వద్ద వ్యక్తం చేయగల్గుతారు. ఎటొచ్చి అమ్మాయి విషయంలోనే కాస్త ఇబ్బంది తలెత్తుతుంది. అబ్బాయి చెప్పినంత సులువుగా అమ్మాయి తన ప్రేమను వ్యక్తం చేయలేందు. "తనకు నచ్చినట్టు ఉండే అమ్మాయి, తనకు బాగా తెలిసిన అమ్మాయి ఇంతకంటే తాను ఇష్టపడడానికి వేరే ఏ కారణం కావాలి ?" ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నానంటూ ఓ అబ్బాయి నచ్చిన అమ్మాయి దగ్గర చెబితే అది హీరోయిజం అవుతుంది. కానీ అమ్మాయి అలా చెప్పిందంటే ఇతరుల మాట అటుంచి ఆ అబ్బాయే ఆమెను తప్పుగా అర్ధం చేసుకునే అవకాశముంది. అందుకే చాలామంది అమ్మాయిల ప్రేమ మౌనంగానే మిగిలిపోతుంది. కానీ కాస్త సరైనతీరులో ముందుకు వెళ్లగల్గితే అమ్మాయి సైతం నచ్చిన చెలికాడిని సులభంగానే సొంతం చేసుకోవచ్చు. మీకు నచ్చిన పురుష పుంగవుడు ఎంతటి మేథావి అయినా కొన్ని విషయాల్లో అతనూ సాధారణ మగాడే. అందుకే మొదట అతనిలోని మగాడిని మీ వైపు చూచేలా చేయండి. అందుకోసం మీరేమీ ఇబ్బందికరమైన కార్యాలు చేయాల్సిన అవసరం లేదు. కాస్త అందంగా, ఇంకాస్త ఆకర్షణీయంగా అతని దృష్టిలో పడండి. కానీ మీ మనసులోని భావాన్ని మాత్రం బయటపడనీయకండి. అలా కొన్ని ప్రయత్నాలు కొనసాగించారంటే ఎప్పుడో ఒకప్పుడు అతను మీ వైపు ఆకర్షితంకాకపోడు. అప్పుడు మెల్లగా అతనిని మాటల్లో దించండి. సానిహిత్యం పెరిగేకొద్దీ అతనికి నచ్చినరీతిలో మీరు కన్పించండి. ఇవన్నీ యాదృచ్చికంగా అతనికంటపడేటట్టుగా ప్రయత్నించండి. ఆమాత్రం చేయగల్గితే చాలు. తనకు నచ్చినట్టు ఉండే అమ్మాయి, తనకు బాగా తెలిసిన అమ్మాయి ఇంతకంటే తాను ఇష్టపడడానికి వేరే ఏ కారణం కావాలి అనే భావన అతనిలో కలిగేలా చేయండి. ఇంకేముంది అటుపై వచ్చే ఏ వాలంటైన్ డే రోజునో లేక మీ పుట్టినరోజు నాటి ముందురోజో మీ ప్రియుడు మీ వద్దకు వచ్చి రేపు నేను నీకు ఊహించలేని ఓ బహుమతి ఇస్తాను అని చెప్పకుండా పోడు. ఆ బహుమతి ఎంటో మీరు ముందే ఊహించగలరు. అయినా ఆ ఒక్కరోజు మీరు కాస్త ఓపికపట్టండి. మరుసటిరోజు నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకూ ఇష్టమైతే జీవితాంతం నేను నీకు తోడుగా ఉంటా అని అతను చెప్పినపుడు ఇక ఆలోచించకుండా వెళ్లి అతని హృదయంపై వాలిపోండి. ఆపై మీ మధ్య మాటలు అవసరం లేదు. ఇరు హృదయాల్లో నిండిపోయిన ప్రేమభావం మీకు మాట్లాడే అవసరాన్ని కల్గించకపోదు. ఆ క్షణం వరకు మాటలతో భావాలు పంచుకున్న మీరు మౌనంగానూ, కను సైగలతోనూ భావాల్ని పంచుకోగల్గుతారు.

Posted by: Mr. Siri Siri At: 12, Mar 2009 2:39:00 PM IST
ప్రేమ మైకంలో మనసు పలికే మౌనరాగం ప్రేమంటే ఏమని ప్రశ్నిస్తే ప్రతి ఒక్కరూ ఒక్కో అభిప్రాయాన్ని వెలిబుచ్చుతారు. ప్రేమ అన్న పదాన్ని అందరి పెదాలు ఒకేలా ఉచ్చరించినా ఆ భావం మనసులో చేరినపుడు వారి నుంచి వచ్చే అభిప్రాయాలు మాత్రం అనేక రకాలుగా ఉంటాయి. విశ్వంలోని ప్రతి అంశంపై వివిధ అభిప్రాయాలున్నట్టే ప్రేమ మీద కూడా ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం. ప్రేమ గొప్పదంటూ వాదించేవారు ఉన్నట్టే దానివల్ల కష్టాలే తప్ప సుఖాలేదీ అని వాదించేవారూ ఉన్నారు. అయితే ఇదంతా ప్రేమ అనే వృత్తానికి వెలుపల ఉన్నవారికి సంబంధించింది. తొలిసారిగా ప్రేమభావం మదిలో ప్రవేశించి ప్రేమ అనే వృత్తంలోకి అడుగుపెట్టినపుడు ఆ మనిషి మనసులో పుట్టే ఆలోచనలు ఎదుటివారికి అర్థం కావడం కొంచెం కష్టమే. ప్రేమ అనే భావం మనసులో ప్రవేశించాక ఆ మనిషి చాలాకాలం పాటు భౌతిక సమాజానికి కాస్త దూరంగానే బ్రతికేస్తాడు. తనలోని ప్రేమభావం, ఆ ప్రేమను మరింత బలీయం చేసుకోవడానికి తానేమీ చేయాలి, తన ప్రేయసి లేదా ప్రియుడ్ని ఎలా సంతృప్తి పరచాలి... ఇలా సాగుతుంటాయి ఆ మనిషి యొక్క ఆలోచనలు. ""ప్రేమ గురించి గంటలు గంటలు ఉపన్యాసాలు దంచేసేవారు సైతం తమ ప్రేమ విషయాన్ని వెల్లడించాలంటే మాటలేరానట్టు తడబడిపోతుంటారు. "" అందుకే ప్రేమలో పడ్డవారిలో అప్పటివరకు ఉన్న ప్రవర్తనకు, ఆ తర్వాత ప్రవర్తనకు మధ్య స్పష్టమైన వ్యత్యాసం కన్పిస్తుంది. తనలోకి ప్రవేశించిన ప్రేమ మైకంలో మునిగిపోయి ఆ ప్రేమలోకంలో విహరించే సదరు వ్యక్తి తన చుట్టూ ఉన్న వారి సంగతి సైతం మర్చిపోతుంటాడు. ఈ పరిస్థితిలో అతన్ని కదిలిస్తే ప్రేమ గురించి అతను చెప్పే భావాలను గ్రంధస్తమే చెయ్యొచ్చు. అంత తీవ్రంగా ఉంటుంది మనిషిలోని ప్రేమభావం. అదేసమయంలో ఒక వ్యక్తికి సంబంధించిన ప్రేమ భావానికి ఎదుటివారినుంచి కూడా అంగీకారం లభిస్తే ఇక ఆ వ్యక్తి ఆనందానికి హద్దే ఉండదు. నిరంతరం అదే ధ్యాసలో, అదే తలపులతో బ్రతికేస్తుంటాడు. ఇంతలా ఓ మనిషిని ప్రభావితం చేసే ప్రేమభావం ప్రేమించిన వారి సన్నిధిలో మాత్రం మౌనానికే పరిమితమౌతుంది. అందుకే శతకోటి భావాలతో ప్రేయసి వద్దకు చేరిన ప్రియుడు ఆమె సన్నిధిలో మూగవాడైపోతుంటాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ చెప్పడానికే పదాలు వెతుక్కోవాల్సిన పరిస్థితిలో ఇక హృదయంలో వెల్లువెత్తుతున్న తలపుల్ని ఆమె వద్ద ఎలా వివరించగలడు. అందుకే ప్రేమ మైకం కమ్మేసిన వేళ మనసు మాత్రం మౌనానికే పరిమితమౌతుంది. ప్రేమలో పడ్డ మనిషి భౌతికంగా భావావేశానికి గురవుతుంటే వారి మనసు మాత్రం ఎందుకు మౌనానికి పరిమితమవుతుంది అంటే... అదేమరి ప్రేమ గొప్పతనమంటే. ప్రేమ గురించి గంటలు గంటలు ఉపన్యాసాలు దంచేసేవారు సైతం తమ ప్రేమ విషయాన్ని వెల్లడించాలంటే మాటలేరానట్టు తడబడిపోతుంటారు. ప్రేమభావాన్ని తెలపాల్సిన హృదయం మౌనాన్ని ఆశ్రయించిన తర్వాత ఇక వారు ఎలా మాట్లాడగలరు. ప్రేమభావానికి మెదడు బీజాలు వేసినా దాన్ని పెంచి పోషించేది మనసే. అయితే ఆ ప్రేమభావాన్ని తెలపాలంటే మాత్రం ఎందుకే చిత్రంగా మనసు మూగదైపోతుంది. కానీ ఆ మనసు సైతం కొన్నాళ్లకు మాటలు నేరుస్తుంది. ఎప్పుడంటారా మనం మనసు పడ్డవారు మన ప్రేమభావాన్ని అర్థం చేసుకుని మనసు తంత్రుల్ని శృతి చేసినవేళ మౌనరాగాన్ని విడిచిపెట్టే మన మనసు వసంతం వేళ కోయిలలా కొత్త సంగీతాన్ని వినిపిస్తుంది.

Posted by: Mr. Siri Siri At: 12, Mar 2009 2:35:33 PM IST
శరీరాల స్పర్శ కాదు ప్రేమంటే కాలం ఆధునికంగా మారినట్టే ప్రేమ సైతం ప్రస్తుత కాలంలో ఆధునికత సంతరించుకుంది. ఒకప్పుడు ప్రేమంటే ఉన్న భావం, అర్ధం అన్నీ ప్రస్తుతం పూర్తిగా మారిపోయాయి. జీవనంలోనూ, జీవితంలోనూ వేగం పెరిగిపోయాక మనుషికి సంబంధించిన ఆలోచనలు, భావాల్లో సైతం పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. ఈ కోవలో ప్రేమ అనే భావానికి సైతం మనిషి పూర్తిగా అర్థం మార్చేశాడు. ప్రేమ అనేది మనసులు కలిసే ప్రక్రియ అనే దశ దాటి ప్రేమ పేరుతో శరీరాలను ఏకం చేసే దుస్సాంప్రదాయం నేటి కాలంలో చోటు చేసుకుంది. ఒకప్పుడు ప్రేమ పేరుతో హద్దులు దాటేవారి సంఖ్య పరిమితంగా ఉంటే నేటికాలంలో మాత్రం ప్రేమ పేరుతో హద్దులు దాటనివారి సంఖ్య పరిమితంగా ఉండడం విశేషం. "ఈ తరం ప్రేమ అంతే బాసూ... నేటికాలంలో చాలామంది దృష్టిలో ప్రేమ కూడా వ్యాపార లావాదేవీగా మారిపోయింది. తమ అవసరాన్ని తీర్చుకోవడానికి ప్రేమను ఓ సాధనంగా ఉపయోగిస్తున్నారు. " కొన్నాళ్ల క్రితం వరకు ఒకరిని చూచి తమ మనసులో కలిగిన ఆకర్షణ, ఇష్టాన్ని ప్రేమగా భావించి దాన్ని జీవితాంతం కాపాడుకోవడానికి ప్రయత్నించేవారు. అలాగే ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య ప్రేమ అనే బంధం కొనసాగుతున్నా పెళ్లి అయ్యే వరకు సమాజం విధించిన కట్టుబాట్లను దాటకుండా ఉండేందుకు వారు ప్రయత్నించేవారు. కానీ నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మనసులో కలిగింది ఇష్టమో లేక వ్యామోహమో కూడా తెలియక ముందే దానికి ప్రేమ అనే పేరు పెట్టేసి యవ్వనం అయినా దాటకముందే అబ్బాయి, అమ్మాయిలు హద్దులు దాటడానికి సిద్ధమైపోతున్నారు. అంతేకాకుండా వారు చేసే ఆ పనికిమాలిన పనులకు నాగరికత, ప్రపంచీకరణ, స్వేచ్ఛ అనే పేర్లు పెట్టుకుని వారిని వారే మోసం చేసుకోవడం కాకుండా మరికొందరు తమలా తయారయ్యేందుకు సైతం కారణమవుతున్నారు. అయితే ఈ విషయంలో కేవలం యువతను మాత్రమే నిందించాల్సిన పనిలేదు. చుట్టూ ఉన్న వాతావరణం, కళ్లముందు కన్పించే కొన్ని అంశాలు వారు అలాంటి పనులు చేయడానికి దోహదం అవుతున్నాయి. అందుకే నేటికాలంలో చాలామంది దృష్టిలో ప్రేమ కూడా వ్యాపార లావాదేవీగా మారిపోయింది. తమ అవసరాన్ని తీర్చుకోవడానికి ప్రేమను ఓ సాధనంగా ఉపయోగిస్తున్నారు. వయసు పొంగులో కలిగే కొన్ని రకాల శారీరక వాంఛలు తీర్చే ఓ సాధనంగానే చాలామంది యువత నేడు ప్రేమను సైతం భావించడం నిజంగా దురదృష్టకరం. అందుకే ఒకటి రెండుసార్లు పరిచయనికే ఐలవ్యూ చెప్పేసుకుని పార్కులు, పబ్బులు, డిస్కోలు అంటూ కలిసి తిరగడానికి సిద్ధమైపోతున్నారు. అయితే ఇలాంటి వాళ్లు వారి ప్రేమ బంధాన్ని జీవితాంతం కాపాడుకునేందుకు ప్రయత్నించేవారైతే వారు చేసే పనిని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ""నిజమైన ప్రేమను గుండెల నిండా నింపుకుని దాన్ని జీవితాంతం కాపాడుకునేందుకు ప్రయత్నించే జంటలు లేకపోలేదు. అయితే అలాంటివారి సంఖ్య బహు అరుదుగా మాత్రమే ఉండడం నిజంగా దురదృష్టకరం."" కానీ వీరిలో చాలామంది ప్రేమ అవసరం తీరగానే ఆవిరైపోతోంది. ప్రతి ఏడాదీ క్లాస్ మారినట్టు ప్రేమ, ప్రేమికుడు లేదా ప్రియుడు మారిపోతున్నారు. ఒకరిపై ప్రేమ కలిగినంత తొందరగానే వారిపై అయిష్టతను కూడా ప్రదర్శించేస్తున్నారు. అలాగే ఒకరిపై అయిష్టత కలిగి ప్రేమబంధం వద్దనుకునేంత లోపునే మరొకరితో ప్రేమ అంటూ చెట్టాపట్టాలేసుకుని తిరగడానికి సిద్ధమైపోతున్నారు. అయితే నిజమైన ప్రేమ ఎప్పటికీ తన స్వచ్ఛతను, తన పవిత్రతను కోల్పోదని చెప్పేందుకు వీలుగా నిజమైన ప్రేమను గుండెల నిండా నింపుకుని దాన్ని జీవితాంతం కాపాడుకునేందుకు ప్రయత్నించే జంటలు లేకపోలేదు. అయితే అలాంటివారి సంఖ్య బహు అరుదుగా మాత్రమే ఉండడం నిజంగా దురదృష్టకరం.

Posted by: Mr. Siri Siri At: 12, Mar 2009 2:31:30 PM IST
ప్రేమకోసం డిమాండ్ : కాదు సమంజసం యవ్వనంలోని ఓ అబ్బాయికి అమ్మాయిపై, అమ్మాయికి అబ్బాయిపై కలిగే ప్రేమకున్న బలం చెప్పడానికి వీలులేనిది. వర్ణించడానికి భాషలేనిది. అలాంటి ప్రేమలో పడ్డవారు అనుభవించే అనుభూతి వారికి మాత్రమే సొంతమైంది. అలాంటి ప్రేమలో సంభవించే కష్టాలు, బాధలు సైతం ప్రేమికులకు సుఖాలుగాను, ఆనందాలుగానూ అనిపిస్తాయి. అందుకే ప్రపంచంలో ప్రేమ అనే ఆ భావం ఏనాటి నుంచో ప్రారంభమై నేటికీ నిత్య యవ్వనంతో అనుక్షణం ఎవరో ఒకరి మనసులోకి అడుగు పెడుతూనే ఉంటోంది. అలాంటి మధురమైన ప్రేమ మనసు తలుపు తట్టినప్పుడు అందుకు కారణమైన వారికోసం మనిషి తపించిపోతుంటాడు. "ఒకటి మాత్రం మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఒకరిలో ప్రేమ ఏర్పడి మరొకరిలో ప్రేమ ఏర్పడకపోతే ప్రేమ పేరుతో ఎదుటివారిని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. " తమ మనసులో ప్రేమ చిగురించడానికి కారణమైన వారూ తమ ప్రేమను అంగీకరించాలని ప్రేమలోకంలో తమతో కలిసి అడుగులు వేయాలని తామిద్దరే ఉండే ప్రేమలోకంలో మరెవరూ అడుగుపెట్టరాదని ఇలా అనేకరకాలుగా సాగుతుంటుంది ప్రేమలో పడ్డ మనిషి ఆలోచనలు. జీవితంలో ఓ అమ్మాయి, అబ్బాయి ఎదురుపడినప్పుడు ఇద్దరిలో హటాత్తుగా ప్రేమ చిగురించవచ్చు. ఇలాంటి సందర్భాలు చాలా అరుదు. అలాగే ఇద్దరు ఎదురైనప్పుడు ఒకరిలో ప్రేమభావం చిగురించవచ్చు. అయితే మరొకరిలో ఎలాంటి భావం చిగురించకపోవచ్చు. జీవితంలో ఇలాంటి సందర్భాలే ఎక్కువగా జరుగుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో తమలో పుట్టిన ప్రేమ భావం ఎదుటివారిలోనూ పుట్టేలా చేసి అటుపై ఇద్దరూ ప్రేమలోకంలో విహరించాలంటే అందుకు చాలాకాలం నిరీక్షించాల్సి ఉంటుంది. ఎదుటివారితో చనువు ఏర్పడి వారిలోనూ ఎదుటివారిపై ఆకర్షణ ఏర్పడి చివరకు అది ప్రేమగా మారాలంటే కొంత సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఒకరిలో మాత్రమే చిగురించిన ప్రేమ మరొకరిలో ఎంతకాలమైన ఎంతగా ప్రయత్నించినా చిగురించకపోవచ్చు. ఇందుకు అనేక కారణాలుంటాయి. ఆ కారణాలు ప్రస్తుతం ఇక్కడ అనవసరం. మరి ఒకరిలో మాత్రమే ప్రేమ పుట్టి మరొకరిలో ప్రేమ పుట్టకపోతే అలాంటి ప్రేమ పరిస్థితి ఏంటి అంటే ఖచ్చితమైన సమాధానం చెప్పలేం. ""నిజమైన ప్రేమంటే... ప్రేమకోసం ఎదుటివారిపై అఘాయిత్యానికి సైతం ప్రయత్నించడం అనేది మనిషిలోని రాక్షసత్వానికి ప్రతీకే గానీ స్వచ్ఛమైన ప్రేమకు సంకేతం కాదు. ఎందుకంటే నిజమైన ప్రేమ తనవారి క్షేమాన్ని కాంక్షిస్తుందే కానీ వారిని నాశనం చేయాలని ఎప్పటికీ అనుకోదు. "" అలాంటివారు తమ ప్రేమను చంపేసుకోవాలా అంటే దానికి కూడా సమాధానం చెప్పలేం. ఎందుకంటే రెండూ దాదాపు క్లిష్టమైన ప్రశ్నలే. కానీ ఒకటి మాత్రం మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఒకరిలో ప్రేమ ఏర్పడి మరొకరిలో ప్రేమ ఏర్పడకపోతే ప్రేమ పేరుతో ఎదుటివారిని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. ప్రేమ అనేది మనసు లోతుల్లోంచి అకస్మాత్తుగా పుట్టాలి. అలా పుడితేనే ప్రేమ పదికాలాలపాటు నిలిచి ఉంటుంది. అలా కాకుండా నాలో ప్రేమ పుట్టింది కాబట్టి నా ప్రేమను ఒప్పుకుని నువ్వూ నన్ను ప్రేమించు అంటూ బ్రతిమాలో, భయపెట్టో ఎదుటివారి ప్రేమను పొందాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. అలా పొందే ప్రేమ ఎక్కువకాలం నిలబడదు. అయితే ప్రస్తుత రోజుల్లో ప్రేమ పేరుతో ఎదుటివారిని బాధ పెట్టడం రివాజుగా మారింది. నువ్వు నాకు నచ్చావ్ కాబట్టి నేనూ నీకు నచ్చి తీరాలి. అలా కాకుంటే నీ అంతు చూస్తా అంటూ తిరిగే రౌడీ బాబుల ఆగడాలు పెరిగిపోయాయి. ఇలాంటి వికృత పోకడలకు కారణాలేవైనా ఈ ధోరణి మాత్రం హర్షనీయం కాదు. ప్రేమ అనేది మనలో చిగురించినపుడు దానికోసం మనిషి నిరీక్షించగలగాలి. ఎంతకాలం అంటే ఈ జన్మలో దక్కకుంటే మరో జన్మవరకైనా వేచి ఉండాలి. అంతేకానీ ప్రేమించమంటూ ఎదుటివారిని ఇబ్బందిపెట్టి పొందేది ప్రేమకాదు. అలాంటి ప్రేమకోసం ఎదుటివారిపై అఘాయిత్యానికి సైతం ప్రయత్నించడం అనేది మనిషిలోని రాక్షసత్వానికి ప్రతీకే గానీ స్వచ్ఛమైన ప్రేమకు సంకేతం కాదు. ఎందుకంటే నిజమైన ప్రేమ తనవారి క్షేమాన్ని కాంక్షిస్తుందే కానీ వారిని నాశనం చేయాలని ఎప్పటికీ అనుకోదు.

Posted by: Mr. Siri Siri At: 12, Mar 2009 2:28:35 PM IST
ఎప్పటికైనా సత్యానిదే గెలుపు ఒకానొక ఊర్లో సోమయ్య అనే రైతు ఉండేవాడు. అతడి ఇంట్లో చాలా ఆవులు, గేదెలు ఉండేవి. వాటిలో గోమాత అనే ఆవు ఉండేది. అది చాలా సాధు జంతువు. ఎప్పుడు కూడా తోటి పశువులతో, గేదెలతో గొడవలు పడకుండా, అన్నింటితో కలసి చాలా ఐకమత్యంతో జీవించేది. ఒకరోజు అడవిలో గోమాత ఒంటరిగా మేత మేస్తుండగా, పక్కనే దాక్కుని ఉన్న పెద్దపులి ఒకటి మీదపడి తినేందుకు సిద్ధమైంది. దాన్ని గమనించిన గోమాత ఏ మాత్రం భయపడకుండా... "పులిరాజా...! కాస్తంత ఆగు. ముందుగా నేను చెప్పే మాటలు విను. ఇంటి దగ్గర నాకొక బిడ్డ ఉంది. ఆ లేగదూడ పుట్టి నాలుగు రోజులు కూడా కాలేదు. పాలుతాగే ఆ పసికందు ఇంకా పచ్చిక తినడం కూడా నేర్చుకోలేదు. నీవు దయతలచి నన్ను విడిచిపెట్టినట్లయితే నా బిడ్డకు కడుపునిండా పాలు ఇచ్చి వచ్చేస్తాను. ఆ తరువాత నువ్వు నన్ను తీరిగ్గా తిందువుగానీ" అని చెప్పింది. మాట తప్పను పులిరాజా..! "ఓ పులిరాజా..! నువ్వు అలా అనుకోవడం సరికాదు. నేను అబద్ధాలు చెప్పేదానిని కాను. ఒకసారి మాట ఇచ్చి తప్పితే ఆ బ్రతుకు బ్రతికి ప్రయోజనం లేదు. అలాంటి వారికి ఎప్పటికైనా చావు తప్పదు. ఆకలిగొన్న నీకు ఆహారమై తృప్తి కలిగిస్తే మంచిదే కదా...! నీకు ఉపకారం... గోమాత మాటలు విన్న పులి పెద్దగా నవ్వి... "ఆహా... ఏమి మాయమాటలు చెబుతున్నావు. ఇంటికి వెళ్ళి, బిడ్డకు పాలు ఇచ్చి తిరిగి వస్తావా..? అడవిలో ఉన్నంత మాత్రాన నాకు తెలివి లేదనుకోకు. నేనేం వెర్రిదాన్ని కాను" అని కోపంగా సమాధానం ఇచ్చింది. "ఓ పులిరాజా..! నువ్వు అలా అనుకోవడం సరికాదు. నేను అబద్ధాలు చెప్పేదానిని కాను. ఒకసారి మాట ఇచ్చి తప్పితే ఆ బ్రతుకు బ్రతికి ప్రయోజనం లేదు. అలాంటి వారికి ఎప్పటికైనా చావు తప్పదు. ఆకలిగొన్న నీకు ఆహారమై తృప్తి కలిగిస్తే మంచిదే కదా...! నీకు ఉపకారం చేసిన దాననవుతాను. అయితే ఒక్కసారి నా బిడ్డను చూసి, ఆకలి తీర్చి రావాలనేదే నా చివరి కోరిక" అని చెప్పింది గోమాత. ఆవు చెప్పిందంతా ఓపికగా విన్న పెద్దపులి... సరే ఈ ఊర్లో ఉండే జంతువులలో ఎంతమాత్రం నీతి ఉందో కనుక్కుందామని.. సరేనని చెప్పింది. దీంతో పరుగు పరుగున ఇంటికి వెళ్ళిన గోమాత తన బిడ్డను తనివితీరా చూసుకుని, కడుపునిండా పాలిచ్చింది. తన బిడ్డతో "నాయనా...! బుద్ధిమంతుడిగా, మంచితనంతో జీవించు. తోటివారితో స్నేహంగా ఉంటూ, ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధాలాడకుండా ఉండు. మంచి ప్రవర్తనతో గొప్ప పేరు తెచ్చుకోవాలి" అంటూ బుద్ధులు చెప్పి, అడవికి చేరుకుంది గోమాత. గోమాత చూసిన పెద్దపులికి చాలా ఆశ్చర్యం వేసింది. తన ప్రాణాలకంటే ఇచ్చిన మాట ముఖ్యం అనుకున్న ఈ ఆవు ఎంతగొప్ప గుణం కలిగినది. ఇంతగొప్ప సత్యవంతురాలిని చంపి తింటే తనకే పాపం చుట్టుకుంటుందని మనసులో అనుకున్న పులి, ఆవును మెచ్చుకుంటూ... తన బిడ్డతో కలిసి సంతోషంగా జీవించమని చెప్పి ఇంటికి వెళ్లిపోమని చెప్పింది. పెద్దమనసుతో తన బిడ్డడి దగ్గరకు తనను పంపించేసిన పెద్దపులికి కృతజ్ఞతలు చెప్పి, అక్కడినుంచి బయటపడింది గోమాత.

Posted by: Mr. Siri Siri At: 12, Mar 2009 2:22:33 PM IST
pani yEmee lEni siri siri raasinavaaTini Sreemati vennelagaaru pogiDitE Emoutundi? gOdaarOlla daaram lO sirivennela vastundi !

Posted by: Mr. Siri Siri At: 12, Mar 2009 2:18:13 PM IST
ప్రేమను ప్రతిబింబించే ప్రేమ లేఖ.. ప్రేమ అన్నది ఒక శాశ్వత భావన. ఈ భావనలేని సమయాన్ని ఊహించడం దుర్భరం. సఫలమైన ప్రేమ కబుర్లు మనసును పులకింపచేస్తాయి. అలాగే ప్రేమ విఫలమైనా అందులోని త్యాగం మన కళ్ళముందు ప్రతిఫలిస్తూనే ఉంటుంది. మరి ఈ భావనలకు ప్రత్యక్ష సాక్ష్యాలే ప్రేమ లేఖలు. ఇందులో పెద్ద, చిన్న తేడా లేదు. మరి అలనాటి ప్రేమికుల ప్రేమలేఖలను పరికిద్దామా... అబ్రహం లింకన్‌ ప్రేమ లేఖ ఈ లెటర్‌తో కలిపి ముందు రెండు లెటర్లు వ్రాయడం ఆరంభించాను. రెండింటి వల్ల నాకు తృప్తి కలగలేదు. అవి నీకు పంపకుండానే చింపేసాను. మొదటి లేఖ కొంచెం కూడా హూందాగా లేదు. రెండవది కొంచెం ఎక్కువ అయ్యింది. ఇప్పుడు ఈ లేఖ ఎలా ఉన్నా పంపాలని నిర్ణయించుకున్నాను. స్ప్రింగ్‌ ఫీల్‌‌డలో జీవితం చాలా కష్టంగా వుంది. నేను నా జీవితంలోని ప్రతి దశలోను ఒంటరి తనం అనుభవిస్తు వచ్చాను. అదే విధంగా ఇక్కడ కూడ ఒంటరితనం తప్పలేదు. ఇక్కడకు నేను వచ్చిన తర్వాత ఒకే ఒక స్త్రీ నాతో మాట్లాడడం జరిగింది. అదికూడ నాతో మాట్లాడడానికి కాదు, నా దగ్గరకు రావలసిన అవసరం ఏర్పడి నాతో మాట్లాడినది. నేను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గిర్జా వెళ్ళలేదు బహుశ ఇప్పట్లో వెళ్ళనేమో. నేను అందరితోనూ ముహాభావంగా ఉంటున్నాను. ఎందుకంటే ఎదుటివానితో ఏవిధంగా వ్యవహరించాలో నాకు తెలియదు. మనం అనుకున్నట్లు స్ప్రింగ్‌ ఫీల్‌‌డలో మనం ఏ విధంగా ఉండాలని భావించామో అలా జరగదని చెప్పడానికి విచారం వ్యక్తం చేస్తున్నాను. నువు్వ ఇక్కడ సంతోషంగా ఉండలేవని నేను భయపడుతున్నాను... ఇక్కడ ఉండగలవని నీకు నమ్మకం ఉందా..? తలచుకుంటే ఏ స్త్రీ అయినా సరే నా జీవితంలో అడుగుపెట్టి సంతోష పడుతుంది. అలా జరగాలని నేను కోరుకుంటున్నాను. లేనట్లయితే నా దురదృష్టం. నీతో జీవించివున్నా నా జీవితం బాధగానే ఉంది. నాకు నీలో విచారపు ఛాయలు కనిపిస్తే నా సుఖమంతా వృధా. కనుక సరదాకి కూడా ఆ మాట అనవద్దు. బహుశా నేను నిన్ను తప్పుగా అర్ధం చేసుకున్నానేమో. ఇదే నిజమైతే బాగున్ను. ఇక ఈ విషయం వదిలెద్దాం. నీవు నన్ను సరగ్గా అర్ధం చేసుకుంటే ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలని కోరుకుంటున్నాను. నువ్వు నిజంగా నాతో జీవించేందుకు సిద్ధమైతే నేను చెప్పేది నీవు పాటించాలి. నీకు కష్టపడ్డం తెలియదు. కనుక నేను చెప్పినట్లు చేయకపోవడమే మంచిది. ఈ జీవితం నీ ఊహలకు తగినట్లుగా లేదు. అయినా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటావని అనుకుంటున్నాను. నిర్ణయం తీసుకున్నాక నీ ఉద్దేశం ప్రకారం నేను నిన్ను అనుసరిస్తాను. ఈ లేఖ అందించిన తర్వాత నీవు నాకు ఒక పెద్ద ఉత్తరం రాయవలసిందిగా కోరుతున్నాను. నీవేం రాయాలనుకుంటే అదే వ్రాయు. కనీసం నా జీవితంలో అది ఒక మంచి స్నేహితురాలిగా పనిచేస్తుంది. నీ లింకన్‌

Posted by: Mr. Siri Siri At: 12, Mar 2009 2:11:33 PM IST
eksalenT anDii bahuSaa aa padam saripOdanukunTaa

Posted by: Mrs. Vennela...:) At: 12, Mar 2009 2:08:31 PM IST
నల-దమయంతుల ప్రేమకథ విదర్భ దేశానికి రాజైన భీముని పుత్రిక దమయంతి మరియు నిషిధ రాజాధిపతి వీరసేనుని కుమారుడు నలుడు. ఒకరి గుణగుణాలను గురించి ఒకరు తెలుసుకుని నలదమయంతులు ప్రేమలో పడతారు. నలుని ఊహాచిత్రాన్ని మదిలో ప్రతిష్ఠించుకుంటుంది దమయంతి. ఈ నేపథ్యంలో దమయంతికి అర్హుడైన వరుని కోసం విదర్భరాజు భీముడు స్వయంవరం ప్రకటిస్తారు. నలునితో పాటు స్వర్గాధిపతి ఇంద్రుడు, వరుణుడు, అగ్ని మరియు యమధర్మరాజు స్వయంవరానికి విచ్చేసి దమయంతిని పరిణయమాడలని ఉవ్విళ్లూరుతారు. అంతటితో ఆగక దమయంతి ప్రేమకు పరీక్ష పెడుతున్నట్లుగా దేవతలు నలుగురు నలుని రూపంలో స్వయంవరంలో పాలు పంచుకుంటారు. స్వయంవరంలో ఐదుగురు నలమహారాజులు పాల్గొనటాన్ని చూసి విదర్భ రాజసభ విస్తుపోతుంది. ఇటువంటి సంకట సమయంలో ఇష్టదైవాన్ని ప్రార్ధించిన దమయంతి, మదిలో ప్రతిష్ఠించుకున్న తన ప్రియతముడు నలమహారాజు కనులముందు కదలాతుండగా, ఐదుగురిలో తన ఊహకు సరితూగుతున్న నలుని మెడలో వరమాల వేస్తుంది. అతడే అసలైన నలమహారాజు. దమయంతి నిష్కల్మషమైన ప్రేమకు మెచ్చిన దేవతలు నిజరూపాన్ని ధరించి జగతికి ఆదర్శంగా నిలిచిన ఆ ప్రేమజంటను ఆశీర్వదించి అంతర్ధానమవుతారు. ఇరురాజ్యాల ప్రజల ఆనందోత్సాహాల నడుమ నలదమయంతుల వివాహం అంగరంగవైభోగంగా జరుగుతుంది. శనిప్రభావం ఎంతటి వారినైనా అధోగతి పాల్జేస్తుంది. ఇందుకు నలుడు మినహాయింపు కాదు. శనిప్రభావంతో, సోదరుడైన పుష్కరుని చేతిలో జూదంలో ఒడిపోయిన నలుడు రాజ్యభ్రష్టుడువతాడు. నలదమయంతులు కారణవశాన విడిపోతారు. తొలుత ఒక రాజ ప్రాసాదంలో చెలికత్తెగా చేరిన దమయంతి, అనంతరం తన తల్లిదండ్రల పంచన చేరుతుంది. నలుని జాడ తెలుసుకొనుట కొరకు భీమరాజు దమయంతికి స్వయంవరం ప్రకటిస్తాడు. ఇదిలా ఉండగా దమయంతిని వీడిన నలుడు అడవులలో తిరుగుతుండగా కర్కోటకమనే సర్పం నలుని కాటేస్తుంది. దీంతో నలుని దేహఛాయ నలుపురంగులోకి మారిపోతుంది. నలుడు కురిపి అవుతాడు. నలుని ఎవ్వరూ గుర్తించలేని పరిస్థితి తలెత్తుంది. బాహుకుని పేరుతో రధసారధిగా మారి విదర్భ రాజ్యానికి చేరుకుంటాడు నలుడు. పవిత్ర ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే దమయంతికి వికృతరూపంలోని నలుని ఇట్టే గుర్తించింది. కలసిన జంట ఆనందానికి అంతేలేదు. శనిప్రభావం తొలగింది. నలుని వికృతరూపం మాయమై నిజరూపం కలిగింది. పుష్కరునితో మరోసారి జూదమాడిన నలుడు కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి దక్కించుకుంటాడు. దమయంతి కేవలం రూపవతియే కాదు నలుని ప్రేమ పట్ల అచంచలమైన అనురాగాన్ని ప్రదర్శించి నిజమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచింది. స్వయంవరంలో దేవతల సౌందర్యానికి లోనుకాక నలుని వరించింది దమయంతి. అంతేకాక వికృతరూపంలోని నలుని బాహ్యరూపాన్ని కాక అంతఃసౌందర్యానికి ప్రాధాన్యతను ఇచ్చి స్వచ్ఛమైన ప్రేమకు దమయంతి తార్కాణమైంది.

Posted by: Mr. Siri Siri At: 12, Mar 2009 2:08:09 PM IST
aay ! intaku mundOsaari ee katani seppEnu kadanDE ! enakkelli suuDanDi kaavaltE. ippuDu seppEdi ErE rakangaanannamaaTanDi .ErE rakangaa anTE .gOdarOlla baasalO kaadannamaaTanDi..aay !.meerE suuDanDi..mari . శకుంతలాదుష్యంతుల ప్రేమకథ రమణీయమైన ఘట్టాలతో అందరిని రంజిల్లపచేసే శకుంతలాదుష్యంతుల ప్రేమకథ మహాభారతంలోనిది. మహాభారతంలోని ఇతివృత్తాన్ని ఆధారంగా చేసుకుని మహాకవి కాళిదాసు అజరామరమైన రీతిలో "అభిజ్ఞానశాకుంతలం" నాటకాన్ని రచించాడు. అరణ్యానికి వేటకై వచ్చిన పురా వంశజుడైన దుష్యంత మహారాజుకు ముని పుత్రిక, ఆశ్రమకాంత శకుంతల తారసపడుతుంది. తొలిచూపులోనే ప్రేమలో పడిన వారిరువురు శకుంతల తండ్రి అనుమతి లేకుండానే గాంథర్వ రీతిలో ప్రకృతి మాత సాక్షిగా వివాహమాడుతారు. దుష్యంతుడు తన రాజ్యానికి తిరిగి వెళ్ళవలసిన సమయం ఆసన్నమవుతుంది. శకుంతలను రాజస్థానానికి చేర్చేందుకు అవసరమైన పరివారాన్ని పల్లకి తోడుగా పంపుతానని దుష్యంతుడు, శకుంతలకు మాట ఇస్తాడు. తమ వివాహానికి గుర్తుగా ఒక ఉంగరాన్ని దుష్యంతుడు, శకుంతలకు అందజేసి రాజ్యానికి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉండగా రుషులలో కోపిష్టి అయిన దుర్వాసుడు ఆతిథ్యం పొందేందుకై శకుంతల ఆశ్రమానికి వస్తాడు. అయితే దుష్యంతుని తలపులలో మునిగిపోయి ఊహాలోకంలో విహరిస్తున్న శకుంతల, దుర్వాసుని రాకను గుర్తించదు. శకుంతల ఏమరుపాటుకు ఆగ్రహించిన దుర్వాసుడు "నీవు ఎవరినైతే తలుచుకుంటున్నావో, వారు నిన్ను మరిచిపోదురుగాక" అని శపిస్తాడు. తన తప్పును తెలుసుకున్న శకుంతల శాపవిమోచన మార్గాన్ని తెలుపవలసిందిగా దుర్వాసుని అర్థిస్తుంది. "మీ ఇరువురికి సంబంధించిన ఏదైనా వస్తువును చూడటం ద్వారా నీ భర్త నిన్ను గుర్తిస్తాడు" అని శాపవిమోచన మార్గం తెలిపి వెడలిపోతాడు దుర్వాసుడు. రోజులు దొర్లిపోతుంటాయి. శకుంతలను తీసుకువెళ్ళడానికి రాజస్థానం నుంచి ఎవ్వరూ రారు. గర్భవతి అయిన శకుంతలను దుష్యంతుని దగ్గరకు చేర్చేందుకు శకుంతుల తండ్రి సమాయత్తమవుతుంటాడు. అదేసమయంలో తమ ప్రేమకు గుర్తుగా దుష్యంతుడు ఇచ్చిన ఉంగరాన్ని శకుంతల నదిలో పోగొట్టుకుంటుంది. తన ముందుకు వచ్చిన శకుంతలను శాపప్రభావంతో దుష్యంతుడు గుర్తుపట్టలేకపోతాడు. దుష్యంతుని నిరాకరణకు గుండె పగిలిన శకుంతల తనను భూమిపై నుంచి తీసుకుపోవలసిందిగా దేవతలను కోరుకుంటుంది. అదేసమయంలో, శకుంతల జారవిడుచుకున్న ఉంగరాన్ని మింగిన చేప ఒక జాలరి వలలో పడుతుంది. చేపను కోసిన జాలరికి ఉంగరం కనపడుతుంది. ఉంగరాన్ని తీసుకువచ్చి దుష్యంతమహారాజుకు జాలరి అందిస్తాడు. అంతటితో శాపప్రభావం సమసిపోవడంతో దుష్యంతుడు, శకుంతలను గుర్తిస్తాడు. అపరాధ భావంతో పశ్చాత్తాపానికి గురైన దుష్యంతుని, శకుంతల క్షమిస్తుంది. ప్రేమ జంట ఒకటవుతుంది. వారి అనురాగాల పంటగా శకుంతల ఒక మగశిశువుకు జన్మనిస్తుంది. భరతుడనే పేరుతో పిలవబడిన అతని నుంచి భారతదేశానికి ఆ పేరు సంప్రాప్తిస్తుంది.

Posted by: Mr. Siri Siri At: 12, Mar 2009 2:02:07 PM IST
< < Previous   Page: 22 of 169   Next > >  
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.