
|
|

General Forum: Offbeat n Jokes | ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి | |
| ee kadhEdO baavunnaTTundE...puurtigaa chadavalEdu..
http://blog.vikatakavi.net/2008/09/
Posted by: Mr. Siri Siri At: 11, Mar 2009 8:37:09 PM IST నీరూ-నిప్పూ ప్రేమించుకున్నాయి. పెళ్లి చేసుకోవాలనుకున్నాయి. అయితే వాటికున్న పరస్పర వ్యతిరేక లక్షణాలే పెళ్లికి అడ్డంగా నిలిచాయి. నిప్పు తాకితే నీరు ఆవిరై పోతుంది. నీరు నిప్పుపై పడితే చల్లారి పోతుంది. మరి పెళ్లి చేసుకోవడం ఎట్లా..? అని అవి దీర్ఘంగా ఆలోచించాయి.
ఎంతకీ దారీ, తెన్నూ తెలియక పోవడంతో.. తమ తమ చుట్టాలను సంప్రదించాయి నీరూ, నిప్పూ. నీరేమో తన బంధువులైన వానను, మంచును అడిగింది. అవి సలహా చెప్పక పోవడమే గాకుండా, “మనకు వాటికి జన్మ జన్మల వైరం ఎట్లా కుదురుతుందంటూ” కోప్పడ్డాయి.
నిప్పేమో తన బంధువులైన పిడుగును, అగ్ని పర్వతాన్ని అడిగింది. అవి కూడా నిప్పుమీద ఇంతెత్తున లేచాయి. నీరూ, నిప్పు ప్రేమను ఎవరూ అర్థం చేసుకోలేదు. పైగా, అదెలా సాధ్యం అని వీటినే ప్రశ్నించాయి, కోప్పడ్డాయి, కుదరదన్నాయి.
అందరిలాగే పెళ్లి చేసుకుని, పిల్లా జెల్లలతో హాయిగా ఉండాలనుకుంటున్న నీరూ, నిప్పూ ఆశ తీరే దారే కనిపించలేదు. చివరికి మేధావి అయిన ప్రకృతిని తన అధీనంలోకి తీసుకున్న కార్మికుడి వద్దకెళ్లి… ఎలాగైనా సాయం చేయమని అడిగాయి.
అతను ఆలోచించి.. సరేలే.. మీ ఇద్దరికీ పెళ్లి నేను చేస్తాను అని హామీ ఇచ్చాడు. చెప్పినట్లుగా పెళ్లి ముహూర్తం నిర్ణయించి, ఇరువైపులా చుట్టాలను పిలిచాడు. పెళ్లి వచ్చిన చుట్టాలు ఈ పెళ్లి వద్దని, ప్రమాదకరమని కార్మికుణ్ణి హెచ్చరించాయి. నానా రాద్ధాంతం చేశాయి.
అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఉన్న కార్మికుడు పెద్దలను ఒప్పించాడు. ఎంతో వైభవంగా పెళ్లి జరిపించాడు. నీరూ, నిప్పును బాయిలర్ అనే కొత్త ఇంట్లో కాపురం ఉంచాడు. ఎవ్వరూ కాదన్నా కూడా తమకు సాయంగా నిలిచి పెళ్లి చేసిన కార్మికుడికి మనసారా కృతజ్ఞతలు చెప్పాయి నీరూ, నిప్పూ…
ఇద్దరూ అన్యోన్యంగా కాపురం చేసుకోసాగారు. వీరికి ఆవిరి అనే కొడుకు పుట్టాడు. ఈ ఆవిరి గాడికి నీటి గొప్పతనం, సముద్రం తెలివితేటలు.. పిడుగు, అగ్ని పర్వతాల శక్తి సామర్థ్యాలు వచ్చాయి. ఆవిరిగాణ్ణి చూసి అందరూ సంతోషపడ్డారు. వీడేమో చక్కగా రైళ్లను నడుపుతున్నాడు, ధాన్యం దంచుతున్నాడు. ఎన్నెన్నో ఘనకార్యాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు.
నీరూ, నిప్పూలకు పెళ్లి చేయటమే ప్రమాదమని వారించిన బంధుమిత్రులు.. ఇతర ప్రజానీకం అందరూ ఇప్పుడేమో ఆవిరిగాణ్ణి మెచ్చుకుంటున్నారు. ఇంత పెద్ద సాహసం చేసి రెండింటినీ కలిపిన కార్మికుడికి కృతజ్ఞతలు చెబుతున్నారు.
Posted by: Mr. Siri Siri At: 11, Mar 2009 7:55:25 PM IST ఏమయ్యింది మనకు
ఆశలు, ఆశయాలు అంతేనా
గాల్లో కట్టిన మేడల్లాగే
అవి కూడా ఇంతేనా…!
అప్పట్లో నీ సాహచర్యం
రోజు రోజుకీ ప్రకాశవంతమై
ప్రేమ, నవ్వులు, శ్రద్ధ
ఇలా చెప్పుకుంటూపోతే
దినదిన ప్రవర్థమానమే..!
నా వద్ద సంతోషాలెన్నీ ఉన్నా
అవన్నీ నువ్విచ్చినవే కదా…!
కమ్మటి కలలు ఎన్ని కన్నా
అవన్నీ నీ వల్లనే కదా….!
నేను అమితంగా ఇష్టపడే
ఒక్కగానొక్క అపురూప నేస్తానివి
ఎప్పటికీ కావాలనుకునే
అరుదైన విరజాజి పువ్వువి..!
మరలాంటిది ఏమయ్యింది మనకు..?
ఏ నిశిరాతిరి నిద్దురలో
మబ్బుతెరలు కమ్మేశాయో.. ఏమో
వెలుగు రేఖలు విచ్చుకునేలోపే
జరగాల్సినదంతా జరిగిపోయింది
మనసులు తేలికై
దూరాలు దగ్గరై
నవ్వుల పువ్వులు
నిండు దోసిళ్లలో
కొలువయ్యేదెప్పుడో…!
మళ్ళీ ఏదో ఒకరోజు
నిన్ను చేరెంతవరకూ
ఆగదు ఈ పయనం..
Posted by: Mr. Siri Siri At: 11, Mar 2009 7:48:02 PM IST మర్చిపోలేనన్నావు కానీ..
క్షమించటం మరిచావు
అయినప్పటికీ…
నీ స్నేహం కావాలి
నిజంగా నీకు తెలుసో లేదోగానీ
ఊపిరాగిపోయేదాకా నీ స్నేహం కావాలి
నువ్వు నా పక్కన లేని రోజున
కాలం కదుల్తోందా అనిపిస్తుంది
నీ తియ్యటి పిలుపులను
అంతం లేని కబుర్లను
కలిసి తిరిగిన ప్రాంతాలను
పంచుకున్న ఆనందాలను
కళ్లు కన్నీటి సంద్రాలయినప్పుడు
నేనున్నానని ధైర్యం చెప్పే
నులివెచ్చటి నీ స్పర్శను
అన్నింటినీ… అన్నింటికీ
దూరంగా జరిగిపోయినట్లు
గుండెల్లో ఒకటే బాధ…
ఆరోజేం జరిగిందో…
ఎందుకు వాదులాడామో
ఎందుకు దూరమయ్యామో
మాటల గాయాలు
మళ్లీ వెనక్కి రావు
కానీ..
అన్నింటినీ మర్చిపోయి
మళ్లీ తిరిగొస్తావని
నన్ను మన్నిస్తావనీ…
మళ్లీ నిన్ను చూసే
అదృష్టాన్ని ప్రసాదిస్తావని
చెమర్చిన కళ్లతో ఎదురుచూస్తూ…!
Posted by: Mr. Siri Siri At: 11, Mar 2009 7:45:21 PM IST http://lekhini.org/
Posted by: Mr. Siri Siri At: 11, Mar 2009 7:33:44 PM IST ఎవరు నెర్పేరమ్మా ఈ కొమ్మకు
పూలిమ్మని రేమ్మ రేమ్మకు
యెంత తొందరలే హరి పూజకు
ఫ్రొద్దుపొడవక ముందె పూలిమ్మని
కొలువయితివా దేవి నా కోసము !!2!!
తులసీ..తులసీ దయా పూర్ణ తలచి
మల్లెలివి నా తల్లి వరలక్ష్మి కి!!2!!
మొల్లలివి నన్నేలు నా స్వామికి
యేలీల సేవింతు యేమనసు కీర్తింతు!!2!!
సీతమనసే నీకు సింహాసనం
ఒక పూవ్వు పాదాల ఒక దివ్వె నీ వ్రాలా!!2!!
ఒదిగి నీయేదుట …ఇదే వందనం ఇదే వందనం.
Posted by: Mr. Siri Siri At: 11, Mar 2009 7:32:54 PM IST ఒంటరిగా దిగులు బరువు మోయ బోకు నేస్తం
మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం
కష్టం వస్తేనేగద గుండెబలం తెలిసేది
దుఃఖానికి తలవంచితే తెలివికింక విలువేది
మంచైన చెడ్డైనా పంచుకోను నేలేనా
ఆమాత్రం అత్మీయతకైన పనికిరాన
ఎవ్వరితో ఏమాత్రం పంచుకోను వీలు లేని
అంతటి ఏకాంతమైన చింతలేమిటండి
రుద్రవీణ
Posted by: Mr. Siri Siri At: 11, Mar 2009 7:27:59 PM IST ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళా
చెలరేగింది ఒక రాసలీలా
ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళా
చెలరేగింది ఒక రాసలీలా
యెదలోని సొదలా ఎలరేటి రొదలా
కదిలేటి నదిలా కలల వరదలా
యెదలోని సొదలా ఎలరేటి రొదలా
కదిలేటి నదిలా కలల వరదలా
చలిత లలిత పద కలిత కవిత లెగ
సరిగమ పలికించగా
స్వర మధురిమ లొలికించగా
సిరిసిరి మువ్వలు పులకించగా
ఝుమ్మంది
నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశీ
నటియించు నీవని తెలిసీ
నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశీ
నటియించు నీవని తెలిసీ
ఆకాశమై పొంగే ఆవేశం
కైలాశమే వంగే నీకోసం
ఝుమ్మంది
మెరుపుంది నాలో - అది నీ మేని విరుపు
ఉరుముంది నాలో - అది నీ మువ్వ పిలుపు
చినుకు చినుకులో చిందు లయలతో
కురిసింది తొలకరి జల్లు
విరిసింది అందాల హరివిల్లు
ఈ పొంగులే ఏడు రంగులుగా
ఝుమ్మంది !!
Posted by: Mr. Siri Siri At: 11, Mar 2009 7:27:07 PM IST ఏ పారిజాతమ్ములీయగలనో సఖీ
గిరి మల్లికలు తప్ప గరికపూవులు తప్ప
ఏ కానుకలను అందించగలనో చెలీ
గుండెలోతుల దాచుకున్న వలపులు తప్ప
జగతిపై నడయాడు చంచలా వల్లికా
తరుణి ఆకృతి దాల్చు శరదిందు చంద్రికా ….
శరదిందు చంద్రికా,.,,
నీవు లేని తొలి రాతిరి నిట్టూర్పుల పెను చీకటి
నీవు లేని విరి పానుపు నిప్పులు చెరిగే కుంపటి
విరులెందుకు సిరులెందుకు
మనసు లేక మరులెందుకు
తలపెందుకు తనువెందుకు
నీవు లేక నేనెందుకు … నీవు లేక నేనెందుకు …
Posted by: Mr. Siri Siri At: 11, Mar 2009 7:19:41 PM IST ఆడుతు పాడుతు పనిజేస్తుంటే అలుపూ సొలపేమున్నది
ఇద్దరమొకటై చేయికలిపితే మనకు కొదవేమున్నది
ఆడుతు పాడుతు పనిజేస్తుంటే అలుపూ సొలపేమున్నది
ఇద్దరమొకటై చేయికలిపితే మనకు కొదవేమున్నది
ఒంపులు తిరిగి ఒయ్యారంగా ఊపుతు విసరుతు గూడేస్తుంటే
ఒంపులు తిరిగి ఒయ్యారంగా ఊపుతు విసరుతు గూడేస్తుంటే
నీ గాజులు ఘల్లని మోగుతుంటె నా మనసు ఝల్లుమంటున్నది
నా మనసు ఝల్లుమంటున్నది …
ఆడుతు పాడుతు పనిజేస్తుంటే అలుపూ సొలపేమున్నది
ఇద్దరమొకటై చేయికలిపితే మనకు కొదవేమున్నది
తీరని కోరికలూరింపంగా ఓరగంట నను చూస్తూ ఉంటే
తీరని కోరికలూరింపంగా ఓరగంట నను చూస్తూ ఉంటే
చిలిపి నవ్వులు చిందులు తొక్కి ..
చిలిపి నవ్వులు చిందులు తొక్కి సిగ్గుముంచుకొస్తున్నది
నునుసిగ్గుముంచుకొస్తున్నది
ఆడుతు పాడుతు పనిజేస్తుంటే అలుపూ సొలపేమున్నది
ఇద్దరమొకటై చేయికలిపితే మనకు కొదవేమున్నది
చెదరి జారిన కుంకుమ రేఖలు పెదవుల పైన మెరస్తు ఉంటే
చెదరి జారిన కుంకుమ రేఖలు పెదవుల పైన మెరస్తు ఉంటే
తీయని తలపులు నాలో ఏమో
తీయని తలపులు నాలో ఏమో తికమక చేస్తు ఉన్నవి
ఆహ తికమక చేస్తు ఉన్నవి
ఆడుతు పాడుతు పనిజేస్తుంటే అలుపూ సొలపేమున్నది
ఇద్దరమొకటై చేయికలిపితే మనకు కొదవేమున్నది
మాటల్లో మోమాటం నిలిపి రాగంలో అనురాగం కలిపి
మాటల్లో మోమాటం నిలిపి రాగంలో అనురాగం కలిపి
పాట పాడుతుంటే నా మది పరవశమైపోతున్నది
పరవశమైపోతున్నది … ఆఆఆఆఆఆ… ఆఆఆఆఆఆఆ
ఆడుతు పాడుతు పనిజేస్తుంటే అలుపూ సొలపేమున్నది
ఇద్దరమొకటై చేయికలిపితే మనకు కొదవేమున్నది
Posted by: Mr. Siri Siri At: 11, Mar 2009 7:18:19 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|