
|
|

General Forum: Religion | bhagavantuniki bhaktuniki madhya anusandhaanamainadi EnTi?? | |
| జైబాబా గీతానామ సహస్రము
యోగయుక్తోవిశుధ్ధాత్మా విజితాత్మా జితేంద్రియః
సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి నలిప్యతే !!
పరి శుధ్ధమగు ఆత్మ వంతుడు జితేంద్రియుడు,సర్వ భూతములందున్న చైతన్య రూపుడైన పరమాత్మతనయందు గలడని ధృఢ నిశ్చయము గల
బ్రహ్మ ఙ్ఞాని ధర్మ బధ్ధములగు కర్మలు చేయుచున్నను ప్రకృతి ప్రకంపనలకు అశాంతి నొందడు. జీవిత చర్య కేవలము జీవుడి బాధ్యత.ఎల్లప్పుడూ మనస్సును అదుపున నుంచుకొనినఙ్ఞానికి సారధికి లొంగిన మంచి గుఱ్ఱాలవలె ఇంద్రియాలు వశమై యుండును.అతని పలుకులు స్పష్టాక్షరములు.అతని నాదము ప్రణవమే.అతని మాటే మంత్రము.అతని చూపులే చంద్ర కిరణాలు.అతని వర్తన సూర్య కాంతి(భాస్కర ద్యుతి).. పరమాత్మ లక్షణాలు విష్ణు సహస్రము లో వివరించిన నామాలకు ఙ్ఞానికున్న లక్షణాలకు తేడా యుండదు.
Posted by: Mr dyvadhinam yaddanapudi At: 27, Mar 2011 0:30:18 AM IST జై బాబా
గీతానామ సహస్రము
ఎరుపు తెలుపు నలుపు మూడు రంగుల ఒక స్త్రీ యున్నదట.ఆమె తన లాగా యుండే అనేక మందిని ఉత్పత్తి చేస్తుందిట.ఆమె కు పుట్టుక లేదు చావు లేదు. ఆమె యందు అనురక్తుడైన జీవుడు ఆమె ప్రక్కనే పరుండి అనుభవిస్తుండగా,వేరొకడు ఆమె ప్రక్కనే పరుండినా ఆ సుఖాలు అశాశ్వతమని ,దుఃఖానికి కారణాలని ఆమెను అనుభవించడని శ్వేతాశ్వరోపనిషత్ నందలి కధ.ఆ స్త్రీ ప్రకృతి,మూడు రంగులు తెలుపు,ఎరుపు,నలుపు అవి సత్త్వ ,రజ తమో గుణాలు.ఆమె ప్రక్కన పరుండే వారు జీవాత్మ పరమాత్మ.జీవులఙ్ఞానులై ప్రకృతికి లోనగుదురు,పరమాత్మ ప్రకృతి తత్త్వానికి అతీతుడు .ఆమె కు పుట్టే సంతతి మూడు రంగులు కలిగి,మూడు గుణాల బధ్ధులై జనన మరణాలకు లోనగు చుందురు.యోగస్తుడైన ఙ్ఞానిని,భోగ లోలుడైన గృహస్తుని ఈ ఇద్దరి పురుషులలో మనము చూడ గలము. గుడ్డి వాడు కుంటి వాడు స్నేహితులు కుంటివాడు తాను చూచిన విషయములు గుడ్డివానికి చెప్పును,గుడ్డివాడు కుంటి వానిని తన భుజములపై నెక్కించుకొని తాము తలచిన చోటికి వెళ్ళెదరు.ఆ విధముగనె యోగము సాంఖ్యము సహజీవన చేయ వచ్చును.
Posted by: Mr dyvadhinam yaddanapudi At: 21, Mar 2011 11:19:18 PM IST .జై బాబా
గీతానామ సహస్రము
సాంఖ్య యోగౌ పృధ గ్బాలాః ప్రవదంతి న పండితాః
ఏక మప్యాస్థిత స్సమ్య గుభయో ర్విం ంథ తే ఫలం
సాంఖ్యము వేరు యోగము వేరని బాలు రనెదరు కాని పండితులనరని గీత లో చెప్పబడినది.లక్ష్యమొకటైనప్పుడు సాంఖ్య మైనా యోగ మార్గమైనా ఒకటే.కర్మాచరణకు ఙ్ఞానము,ఙ్ఞానికి కర్మాచరణ పరస్పరావలంబములే కనుక నొక దాని కొకటి విడచి యుండదు.ఆది అంతము గల కర్మలు అనాది యగు మోక్ష సాధనకు పనికి రావని కర్మల పై ఔదాసీన్న్యాని వైరాగ్యాన్ని సన్న్యాసులు అలవర్చు కొని అక్షర తత్త్వమైన పరా విద్యని తెలుసు కొనెదరు.అట్టి వానిని బుధ్ధః అనెదరు. అనగా ధర్మ ఙ్ఞాన గుణ సంపన్నులు .అట్టి వారి చే సేవింపబడు విష్ణువునకు బుధ్ధః అని సహస్ర నామావళి లో నొక నామము.
Posted by: Mr dyvadhinam yaddanapudi At: 18, Mar 2011 11:34:39 PM IST జైబాబా
గీతానామ సహస్రము
ఒకే చెట్టు మీద ప్రాణ స్నేహితులై రెండు పక్షులున్నవిధముగనే గృహస్తు యోగ నిష్టుడై కర్మాచరణ చేయవచ్చును.శరీరమను చేట్టు న జీవాత్మ పరమాత్మ అను రెండు పక్షులుండును.పరమాత్మ లేని దే జీవాత్మ యుండదు కనుక సూర్యుడు సూర్య ప్రతి బింబము వలె పరమాత్మ జీవాత్మలు శరీరములో ప్రాణ స్నేహితుల వలె నుండును.పరమాత్మ రూపమైన పక్షి దాని నే మనము ఆత్మ అనెదము దేనిని ఆశించకుండా సాక్షీభూతము గా యుండును-రెండవ పక్షి రూపమైన జీవాత్మ చెట్టు పండ్లను ఆశ తో తినుచుండును.కర్మను చేసేది కర్మ ఫలము అనుభవించేది మనసు అదే జీవాత్మ అనే పక్షి-అది ప్రతి పనికి తానే కర్తనని భోక్త నని భావించుతూ సుఖ దుఖఃములకు లోనగు చుండును.ఒక పక్షి ప్రతి జీవి లోను కర్మకు అనుభవానికి ముఖ్య కారణ మైన మనస్సు అని మరొక పక్షి శుధ్ధ చైతన్య మైన ఆత్మ యని పండితులనెదరు.మనస్సు ఆత్మ వైపు దృష్టి సారించినప్పుడు ద్వైత భావము నశించి బ్రహ్మానందము అనుభవించును.ఆత్మ నిగ్రహము కల సన్న్యాసులు,సత్యము,తపస్సు,ధ్యానము ఙ్ఞానము,బ్రహ్మ చర్యము కొనసాగించుచూ ఆత్మ సాక్షాత్కారము పొందుచున్నారు.అని ముండకోపనిషత్తు బోధ. అతి కష్ట మైన తపస్సు ఏ దనగా ఇంద్రియాలను మనస్సును ఆత్మ పైన కేంద్రీకరించి నిలపుటే.శరీరమును తపింప చేయుటే తపస్సు కాదు,శౄజనాత్మక శక్తి కలుగ చేయుట కూడ తపస్సు లో ఒక భాగము.
Posted by: Mr dyvadhinam yaddanapudi At: 15, Mar 2011 0:07:54 AM IST జై బాబా
గీతానామ సహస్రము
విషయ ప్రాబల్యము వలన కోరికలు కలిగి వాటి సంగమము తో అవి కనీస కోరికలని తలచి అవి తీర నందుకు బాధ పడుట సహజమే.ఆ క్షణికా నందము తదుపరి వాటి లోని గుణ దోషములను గుర్తించగలము.అప్పుడు మనకు వైరాగ్య చింతన సంత్రుప్తి కలిగి పరతత్త్వము వైపు మనసు మళ్ళించ గలము .పరతత్త్వ చింతనలో మనకు నిరుత్షాహము గాని,దోషము గాని యుండు అవకాశముండదు.పర చింతన తో నిష్కామ కర్మాచరణ వలన మనసు,వాక్కు,క్రియ పరిణితి చెంది త్రికరణ శుధ్ధి కలుగును.సూర్య తాపమునకు మనము భరించ లేని విధముగనే సూర్యుని వలె పరమాత్మ తపిం ప చేయు గుణముండుట చే ప్రతాపనాయనమః అని స్తోత్రము చేయు చున్నాము.మనము ఆహారము సమయమునకు తీసుకొనకుండా,ఉపవాసములతో శరీరము తపింప చేయుచున్నాము,మన పనులు స్వార్ధ పూరితములు,పరమాత్మ చేతలు లోక హితములు.
• సన్న్యాసిని గుర్తించడానికి కాషాయ వస్త్ర ధారణ,బ్రహ్మ చర్యము,జుట్టు తిసి వేసుకొని బోడిగుండు తో నుండుటవలన పోలీసు దుస్తులు ధరించిన వారిని పోలీసులుగా సులభము గా గుర్తించినట్లు సన్న్యాసి వేష ధారణ ప్రాచీన శాస్త్ర పధ్ధతుల ప్రకారము ఏర్పడియుండెను-అంత మాత్రమున వేష భాషలకు ప్రాముఖ్యమిచ్చి సన్న్యాసి ఎవరో సంసారెవరో నిర్నయించుట కుదరదు-సన్న్యాసమునకు ముఖ్యమైనది మనో నియంత్రణ,వస్త్ర ధారణ చేయుట సులభము,మనో నియంత్రణ బహు కష్టము.
Posted by: Mr dyvadhinam yaddanapudi At: 11, Mar 2011 11:35:05 PM IST జై బాబా
గీతానామ సహస్రము
భగవానుని వివక్త అని కీర్తించెదము-(అనగా దేనితోను సంగమము లేకుండా యుండే వాడా అని)మనము మాత్రము కోర్కెలు తీరాలనే పట్టుదల కలిగి యుండే ధ్ధృఢ సంకల్పముతో నిత్య్ జీవితము గడుపుచున్నాము-అట్టి సంగమమువదలిన వాడు వివక్తుడు.సంగమము బంధ హేతువని తెలిసి నిష్కామముగా భగవంతుని చింతన తో తన విధులు నిర్వర్తించే వాడే నిత్య సన్న్యాసి.
ఙ్ఞేయస్స నిత్య సన్న్యాసి యో నద్వేష్టి న కాంక్షతి
నిర్ద్వంద్వోహి మహా బాహో సుఖం బంధా త్ప్రముచ్యతే
సదా బ్రహ్మభావన కలిగి ఙ్ఞాని సుఖ దుఃఖాలకతీతుడై సంసార బంధమునుండి శీఘ్రముగా విడివడును
.గ్రుహస్థుడు సంసార బంధము వదలించుకొనుటకు సన్న్యాసము స్వీకరించకుండనే తన ధర్మములు
నిష్కామముగా నిర్వర్తించు కొనుచు సదా భగత్ చింతనతో సంసార బంధము అతి త్వరగా విడిపించుకొన గలడు-అనగా మనకున్న చికాకులు అతను తనకు కలుగ కుండా జాగ్రత్త పడ గలడు.(అదే బంధ విమోచన) ఇది గ్రుహస్తాశ్రమము స్వీకరించకుండా సన్న్యాసిగా మారిన వాని కన్న గ్రుహస్తునకు
సులభమగును.ఇద్దరు వ్యక్తులలో ఒకరు సన్న్యాసము మరొకరు నిష్కామ కర్మ యోగము అవలంభించిన వారి సాధనలలో మనకు వ్యత్యాసము కనబడవచ్చు,అదే ఒకే వ్యక్తి నిష్కామ కర్మాచరణ చేయు చున్నప్పుడు అతని లొ గ్రుహస్త ధర్మము సన్న్యాస ధర్మము మనము వీక్షించ గలము. ఏది శాశ్వతము,మనో ప్రశాంతతకు నిత్య శాంతికి ఏ విధమైన కార్యాచరణ కావాలి అను చింతనకు మనకు
కావాలి ఙ్ఞాన జ్యోతి ప్ర కాశము.అది నొసగే ప్రకాశాత్మ పరమాత్మ.
Posted by: Mr dyvadhinam yaddanapudi At: 9, Mar 2011 2:33:05 PM IST jai baabaa
Thanks for your encouragement
Posted by: Mr dyvadhinam yaddanapudi At: 8, Mar 2011 11:07:51 PM IST chaala baaga cheputunnaaru.
Pure mind,Pure body will lead u to God. Purity is God.
When there is no purity in the water ,in the air there is no formation of ("shukla dhaatuvu"=pure mineral).pure body.
So never expect pure body where u get ojhas(strength)
"mana jnanakarmedriya shakti saaraamshamu ojhassu."
when there is no ojhassu no tejassu (jeeva kala)
i kaliyugam lo bhagavatuni anusamdhaanamu chese(kalise) praskti ledu.
iDI BAAGA TELESINA KALIYUGA VAASULU BHAGAVATUNI TAMA KORIKALU TIRCHUKONE YAMTRAMUGAANE UPAYOGISTUNNARU.
EMDUKAMTE OJASSU ,TEJASSU YE YUGAMULONU KOLIPONIDI BHAGAVAMTUDU OKKADE.
Posted by: Mrs. shaloo At: 7, Mar 2011 5:40:21 PM IST జైబాబా
గీతానామ సహస్రము
మన చిత్త వృత్తులు భావము భావ వికారము,అహంకారము ముతోడను,సత్త్వ రజో తమో గుణాల ప్రభావము కలిగి ప్రవర్తించును.శారీరక శక్తి ఓజస్సుకు,మానసిక సక్తి తేజస్సుకు కలదని,ఈ రెండు శక్తులను ప్రసరింప జేయునది ద్యుతి యని తెలిపెదరు.మన ఙ్ఞానకర్మేంద్రియ శక్తి సారాంశము ఓజస్సు.ఇది శుక్ల ధాతువు తో కలిసి యుండును. తేజస్సు నే కాంతి యందురు.ప్రతి జీవి యందలి జీవ కళే తేజస్సు.తేజస్సు చైతన్యమైన స్వయం ప్రకాశము.పరమాత్మ తేజస్సు ముందు వేయి సూర్యుల కాంతి కూడ వెలవెల బోవును-అందుకే "నతద్భాసయతే న సూర్యో న శశాంకో"అని భగవానుడు గీత లో పలికెను.తేజము అనుశబ్దమునకు నీరని అర్ధము కలదు.సూర్య భగవానుడు తన కిరణముల తో సముద్ర జలములగు ఉప్పునీటిని పీల్చి మేఘాల ద్వారా మంచి నీటిని వర్షింప జేయు చున్నాడు.సూర్య తేజస్సు వలన 84 లక్షల జీవ రాశులకు భుక్తి(భోజనము) దొరుకు చున్నది."ఆదిత్యో వై తేజ ఓజో బలం" అని నారాయణ శృతి. ఓజస్సు తేజస్సు విరజిమ్మే సర్వాంగ సంపద కలది ద్యుతి.రాగ ద్వేషాలకు దూరముగా నున్న ప్రముఖ సన్న్యాసులలో ఓజస్సు తేజస్సు ద్యుతులను కాంచగలము.
Posted by: Mr dyvadhinam yaddanapudi At: 7, Mar 2011 3:43:33 PM IST జై బాబా
గీతానామ సహస్రము
ఙ్ఞానముకర్మానుష్టానమందుపయోగించుట శ్రేయస్కరమని భగవానుని వచనము.ఓజస్సు,తేజస్సు,ద్యుతి కావాలి మనిషికి. కర్మాచరణకు శారీరక బలము కావాలి అది ఓజస్సు వలనను,ఙ్ఞానము వలన మనోవికాసము చెంది తేజస్సు,మనసు పరమాత్మ చింతనకు మళ్ళించుటకు ఆధ్యాత్మిక శక్తి నిచ్చేది ద్యుతి.
ఓజస్తేజో ద్యుతి ధరః ప్రకాశాత్మా ప్రతాపనః
బుధ్ధః స్పష్టాక్షరో మంత్రః చంద్రాశు ర్భాస్కరద్యుతిః
ఓం ఓజస్తేజో ద్యుతి ధరాయనమః అని కీర్తించెదము భగవానుని.భ్గవానుని అంశ మానువుడు గనుక ఈ మూడు శక్తులు వారసత్వముగా అతనికి చెందును.ఆహార నియమముతో ఓజస్సు,ఇంద్రియ నిగ్రహమున తేజస్సు,వివేక వైరాగ్య చింతనచే ద్యుతి పెంపొందును.
Posted by: Mr dyvadhinam yaddanapudi At: 4, Mar 2011 4:08:44 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|