
|
|

General Forum: Offbeat n Jokes | ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి | |
|
తారంగం తారంగం
తాండవకృష్ణా తారంగం
వేణూనాధ తారంగం
వేనకటరమణా తారంగం
వెన్నలదొంగా తారంగం
చిన్నికృష్ణా తారంగం.
Posted by: Mr. Siri Siri At: 7, Jan 2009 11:48:15 AM IST chemma chekkaa chEraDEsi moggaa !
చెమ్మచెక్క, చేరడేసిమొగ్గ,
అట్లుపొయ్యంగ, ఆరగించంగ,
ముత్యాల చెమ్మచెక్క ముగ్గులెయ్యంగ,
రత్నాల చెమ్మచెక్క రంగులెయ్యంగ,
పగడాల చెమ్మచెక్క పందిరెయ్యంగ
పందిట్లో మాబావ పెండ్లి చెయ్యంగ,
సుబ్బరాయుడు పెండ్లి, చూచివద్దాం రండి,
మావాళ్ళింట్లో పెండ్లి, మళ్ళీ వద్దాం రండి,
దొరగారింట్లో పెండ్లి
దోచుకువద్దాం రండి.
Posted by: Mr. Siri Siri At: 7, Jan 2009 11:47:20 AM IST bujji mEka bujji mEka !
బుజ్జి మేక బుజ్జి మేక
యేడకెళ్తివి
రాజుగారి తొటలో మేతకెళ్తిని
రాజుగారి తొటలో యేమి చూస్తివి
రాణిగారి పూతోట సొగసు చూస్తిని
Posted by: Mr. Siri Siri At: 7, Jan 2009 11:46:23 AM IST gOrinka paaTa !
ఓ అ(బ్బా)మ్మాయి నెత్తిమీద గోరింక
చెప్పకు చెప్పకు చెడిపోతావు
చెపితే నీ ముక్కు తెగ్గోస్తా,
దూలం మీంచి దూకిస్తా,
పందిరిమీంచి పాకిస్తా,
కంచం అన్నం తినిపిస్తా,
కడివెడునీళ్ళు తాగిస్తా !
Posted by: Mr. Siri Siri At: 7, Jan 2009 11:45:03 AM IST Enugamma Enugu !
ఏనుగమ్మా ఏనుగు
ఏ ఊరొచ్చింది ఏనుగు?
మా ఊరొచ్చింది ఏనుగు.
ఏం చేసింది ఏనుగు?
మంచినీళ్ళు తాగింది ఏనుగు,
ఏనుగు ఏనుగు నల్లన్న,
ఏనుగు కొమ్ములు తెల్లన్న,
ఏనుగుమీద రాముడు
ఎంతో చక్కని దేవుడు.
Posted by: Mr. Siri Siri At: 7, Jan 2009 11:44:13 AM IST aTla taddi paaTa !
అట్ట్ల తద్దోయ్ ఆరట్లోయ్
ముద్దపప్పోయ్, మూడట్లోయ్
చిప్ప చిప్ప గోళ్ళు
సింగరయ్య గోళ్ళు
మా తాత గోళ్ళు
మందాపరాళ్ళు
అట్ట్ల తద్దోయ్ ఆరట్లోయ్
ముద్దపప్పోయ్, మూడట్లోయ్
Posted by: Mr. Siri Siri At: 7, Jan 2009 11:42:54 AM IST అయిదు వ్రేళ్ళు
చుట్టాల సురభి - బొటనవ్రేలు
కొండేల కొరివి - చూపుడు వ్రేలు
పుట్టు సన్యాసి - మధ్య వ్రేలు
ఉంగరాలభొగి - ఉంగరపు వ్రేలు
పెళ్ళికి పెద్ద - చిటికెన వ్రేలు
Posted by: Mr. Siri Siri At: 7, Jan 2009 11:40:59 AM IST గచ్చ కాయలు
ఒక్కటి ఓ చెలియా
రెండూ రోకళ్ళు
మూడు ముచ్చిలికా
నాలుగు నందన్నా
అయిదు బేడల్లు
ఆరుంజవ్వాజి
ఏడు ఎలమంద
ఎనిమిది మనమంద
తొమ్మిది తోకుచ్చు
పది పటనేడు
Posted by: Mr. Siri Siri At: 7, Jan 2009 11:40:05 AM IST ఎండలు కాసే దెందుకురా
మబ్బులు పట్టే టందుకురా
మబ్బులు పట్టే దెందుకురా
వానలు కురిసే టందుకురా
వానలు కురిసే దెందుకురా
చెరువులు నిండే టందుకురా
చెరువులు నిండే దెందుకురా
పంటలు పండె టందుకురా
పంటలు పండే దెందుకురా
ప్రజలు బ్రతికే టందుకురా
ప్రజలు బ్రతికే దెందుకురా
స్వామిని కొలిచే టందుకురా
స్వామిని కొలిచే దెందుకురా
ముక్తిని పొందే టందుకురా
Posted by: Mr. Siri Siri At: 7, Jan 2009 11:39:06 AM IST బండోయమ్మ బండి
బండికి కుచ్చులు తెండి
సుబ్బారాయుడు పెండ్లి
చూచివత్తాం రండి
అమ్మ నాకు బువ్వ
అరచేతిలో గవ్వ
నీళ్ళమీద నిప్పు
అల్లరి పిల్లల ఒప్పు
చేయబోకు తప్పు
చేస్తే కాలిచెప్పు
Posted by: Mr. Siri Siri At: 7, Jan 2009 11:37:50 AM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|