
|
|

General Forum: Offbeat n Jokes | ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి | |
| చెన్నపట్నం, చెరుకుముక్క
నీకోముక్క, నాకోముక్క
భీముడుపట్నం, బిందెలజోడు
నీకో బిందె, నాకో బిందె
కాళీపట్నం, కాసులజోడు
నీకోకాసు, నాకోకాసు
Posted by: Mr. Siri Siri At: 7, Jan 2009 11:36:56 AM IST చిట్టిపొట్టి మిరియాలు
చెట్టుకింద పోసి
పుట్టమన్ను తెచ్చి,
బొమ్మరిల్లు కట్టి,
బొమ్మరింట్లో
బొగం పాప కన్నది
బిడ్డతలకు చమురులేదు
నా తలకు నూనెలేదు
అల్లవారింటికి
చల్లకుపోతే
కలవారి కుక్క
బౌ మన్నది
నా కాళ్ళ గజ్జెలు
ఘల్లుమన్నవి !
Posted by: Mr. Siri Siri At: 7, Jan 2009 11:35:30 AM IST కాళ్ళాగజ్జీ, కంకాలమ్మా
వేగులచుక్కా, వెలగమొగ్గా
మొగ్గాకాదు, మోదుగనీరు,
నీరూగాదు, నిమ్మలవారి,
వారీగాదు, వావింటాకు,
కూరాగాదు, గుమ్మడిపండు,
పండుగాదు, పాపిడిమీసం,
లింగులిటుకు, పందిమాల్నిపటుకు,
రాజుగారితోట్లో యేముందంటే,
పువ్వో, మొగ్గో, పుచ్చుకుంటే దెబ్బ,
కాల్దీసి కడగాబెట్టు
Posted by: Mr. Siri Siri At: 7, Jan 2009 11:34:24 AM IST వానా వానా వల్లప్ప
వాకిలి తిరుగూ చెల్లప్ప
కొండమీది గుండురాయి
కొక్కిరాయి కాలువిరిగె
దానికేమి మందు
వేపాకు పసుపూ
వెల్లుల్లిపాయ
నూనెలో మడ్డి
నూటొక్క సారి
పూయవోయి నూరి
పూటకొక్కతూరి
Posted by: Mr. Siri Siri At: 7, Jan 2009 11:33:01 AM IST చప్పట్లోయ్ తాళాలోయ్
దేవుడిగుళ్ళో మేళాలోయ్
పప్పూ బెల్లం దేవుడికోయ్
పాలూ నెయ్యీ పాపాయికోయ్
గోవిందుడమ్మా
గోపాలుడమ్మా
కొబ్బరీ బెల్లమ్ము
కొనితెచ్చినాడే
ఏడాది కొకసారి
ఇటువచ్చినాడే
పల్లెటూళ్ళుగాన
చెల్లిపోయింది
గొల్లవాళ్ళముగాన
కూడి వచ్చింది
పట్నవాసములోన
పనికివస్తుందా
Posted by: Mr. Siri Siri At: 7, Jan 2009 11:31:29 AM IST పిల్లమ్మ కన్నుల్లు బీరపువ్వుల్లు
అబ్బాయి కన్నుల్లు కలువరేకుల్లు
కలువరేకులవంటి నీ కన్నులకును
కాటుకలుపెట్టితే నీకు అందమ్ము
ఏడువకు ఏడువకు వెఱ్ఱి అబ్బాయి
ఏడుస్తె నీ కళ్ళు నీలాలు కారు
నీలాలు కారితే నే జూడలేను
పాలైన కారవే బంగారు కళ్ళు
Posted by: Mr. Siri Siri At: 7, Jan 2009 11:29:54 AM IST పప్పుపెట్టి, పాయసంపెట్టి,
అన్నంపెట్టి, అప్పచ్చిపెట్టి,
కూరపెట్టి, ఊరగాయపెట్టి,
నెయ్యివేసి, ముద్దచేసి,
తినిపించి, తినిపించి,
చేయిగడిగి, మూతిగడిగి,
తాతగారింటికి దారేదంటే,
ఇట్లాపోయి, ఇట్లాపోయి,
మోచేతిపాలెం ముందర్నించి,
ఇట్లాపోయి, ఇట్లాపోయి,
ఇదిగో ఇదిగో, వచ్చాం వచ్చాం,
చక్కా వచ్చాం, చక్కా వచ్చాం,
చక్కిలిగిలిగిలి, చక్కిలిగిలిగిలి.
చక్కిలిగిలిగిలి, చక్కిలిగిలిగిలి.
Posted by: Mr. Siri Siri At: 7, Jan 2009 11:28:31 AM IST గుమ్మాడమ్మా గుమ్మాడీ,
ఆకుల్లువేసింది గుమ్మాడీ,
పూవుల్లు పూసింది గుమ్మాడీ,
పండ్లు పండిందమ్మ గుమ్మాడీ,
అందులో ఒకపండు గుమ్మాడీ,
అతి చక్కనీ పండు గుమ్మాడీ,
ఆ పండు యెవరమ్మ గుమ్మాడీ,
మా చిట్టి తండ్రమ్మ గుమ్మాడీ !
Posted by: Mr. Siri Siri At: 7, Jan 2009 11:27:07 AM IST సీతమ్మ వాకిటా
చిరుమల్లె చెట్టు
చిరుమల్లె చెట్టేమొ
చితుకచూసింది
చెట్టు కదలాకుండ
కొమ్మవంచండి;
పట్టి పూవులుకోసి
బుట్ట నింపండి
అందులో పెద్దపూలు
దండ గుచ్చండి,
దండ తీసుకువెళ్ళి
సీత కివ్వండి.
దాచుకో సీతమ్మ
దాచుకోవమ్మ
దాచుకోకుంటేను
దోచుకొంటారు
దొడ్డి గుమ్మములోన
దొంగలున్నారు.
Posted by: Mr. Siri Siri At: 7, Jan 2009 11:26:09 AM IST చిట్టిబొమ్మల పెండ్లి చేయవలెననగా,
శ్రింగారవాకిళ్ళు సిరితోరణాలు,
గాజుపాలికలతో, గాజుకుండలతో,
అరటి స్తంభాలతో అమరె పెండ్లరుగు.
చిన్నన్న పెట్టెనే వన్నెచీరల్లు,
పెద్దన్న పెట్టెనే పెట్టెల్లసొమ్ము,
నూరుదునె బొమ్మ, నీకు నూటొక్కకొమ్ము,
పోతునే బొమ్మ నీకు పెన్నేఱునీళ్ళు
కట్టుదునె బొమ్మ,నీకు కరకంచుచీర,
తొడుగుదునే బొమ్మ, నీకు తోపంచురవిక,
ఒడిబియ్యం పెడుదునే, ఒడిగిన్నె పెడుదు,
అత్తవారింటికీ పోయి రమ్మందు
అత్తచెప్పినమాట వినవె ఓ బొమ్మ,
మామచెప్పినపనీ మానకే బొమ్మ,
రావాకుచిలకమ్మ ఆడవే పాప,
రాజుల్లు నీచేయి చూడవచ్చేరు.
Posted by: Mr. Siri Siri At: 7, Jan 2009 11:25:10 AM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|