
|
|

General Forum: Offbeat n Jokes | ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి | |
| ఘల్లుఘల్లుఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లుఝల్లుఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు
నల్లమబ్బు చల్లనీ చల్లని చిరుజల్లు
పల్లవించనీ నేలకి పచ్చని పరవళ్ళు
ఘల్లుఘల్లుఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లుఝల్లుఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
ఎల్లలన్నవే ఎరగని వేగంతో వెళ్ళు
ఘల్లుఘల్లుఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లుఝల్లుఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు
లయకే నిలయమై నీ పాదం సాగాలి
మలయానిల గతిలో సుమబాలగతూగాలి
వలలో ఒదుగునా విహరించే చిరుగాలి
సెలయేటికి నటనం నేర్పించే గురువేడి
తిరిగే కాలానికి తీరొకటుంది
అది నీ పాఠానికి దొరకను అంది
నటరాజస్వామి జటాజూటిలోకి చేరకుంటే విరుచుకుపడు సురగంగకు విలువేముంది విలువేముంది
ఘల్లుఘల్లుఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లుఝల్లుఝల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు
దూకే అలలకు ఏ తాళం వేస్తారు
కమ్మని కలలపాట ఏ రాగం అంటారు
అలలకు అందునా ఆశించిన ఆకాశం
కలలా కరగడమా జీవితాన పరమార్ధం
వద్దని ఆపలేరు ఉరికే ఊహని
హద్దులు దాటరాదు ఆశలవాహిని
అలుపెరగని ఆటలాడు వసంతాలు వలదంటే విరివనముల పరిమళముల విలువేముంది విలువేముంది
Posted by: Mr. Siri Siri At: 6, Jan 2009 11:34:01 AM IST ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది
నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే ఇదేం గారడీ
నేను కూడ నువ్వయానా పేరుకైనా నేను లేనా
దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన
నిద్దర తుంచే చల్లని గాలి వద్దకు వచ్చి తానెవరంది
నువ్వే కాదా చెప్పు ఆ పరిమళం
వెన్నెల కన్నా చల్లగ ఉన్న చిరునవ్వేదో తాకుతు ఉంది
నీదే కాదా చెప్పు ఆ సంబరం
కనుల ఎదుట నువ్వు లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా
ఎవరు ఎవరితో ఏమన్నా నువ్వు పిలిచినట్టనుకున్నా
ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా
ఏమిటౌతోందో ఇలా నా ఎద మాటున
దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన
కొండల నుంచి కిందికి దూకే తుంటరి వాగు నాతో అంది
నువ్వు అలా వస్తూ ఉంటావని
గుండెల నుంచి గుప్పున ఎగసే ఊపిరి నీకో కబురంపింది
చెలి నీకై చూస్తూ ఉంటానని
మనసు మునుపు ఎపుడూ ఇంత ఉలికి ఉలికి పడలేదు కద
మనకు తెలియనిది ఈ వింత ఎవరి చలవ ఈ గిలిగింత
నాలాగే నీక్కూడ అనిపిస్తూ ఉన్నదా
ఏమి చేస్తున్నా పరాకే అడుగడుగునా
దీని పేరేనా ప్రేమ అనే ప్రియ భావన
Posted by: Mr. Siri Siri At: 6, Jan 2009 11:32:38 AM IST ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటె ఒప్పుకోవు ఇంకెలాగె సత్యభామ
నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామ
అనుకున్నా తప్పు కదా మోమాటం ముప్పు కద
మనసైతే ఉంది కదా మన మాటేం వినదు కద
పంతం మానుకో భయం దేనికో
వద్దన్నకొద్ది తుంటరిగా తిరగకలా నా వెనక
నిద్దర్లో కూడ వంటరిగా వదలవుగా
నన్నాశపెట్టి ఈ సరదా నేర్పినదే నువ్వు గనక
నా కొంగు పట్టి నడవనిదే కుదరదుగా
అడుగడుగున ఎదురైతే ఏ దారి తోచదుగా
అటు ఇటు ఎటు తేల్చవుగా మన కథ నువు తొందరగా
ప్రతీ చోట నీ నవ్వే పిలుస్తోందిగా
ఆమాయకంగ చూడకలా వేడుకలా చిలిపి కల
అయోమయంగ వెయ్యకలా హాయి వల
నీ మీదకొచ్చి ఉరితాడై వాలదుగా వాలు జడ
దానొంక చూస్తే ఎందుకట గుండె ధడ
మరి మరి శృతి మించి ఇలా నను మైమరపించకలా
తడబడి తల వంచి ఇలా తలపును అణిచేస్తే ఎలా
మరేం చెయ్యనే నీతో ఎలా వేగనే
Posted by: Mr. Siri Siri At: 6, Jan 2009 11:31:09 AM IST ఒక్క సారి చెప్పలేవా నువ్వు నచ్చావని
చెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసని
మన గుండె గుప్పెడంత తన ఊహ ఉప్పెనంత
ఒదిగుండమనక వదిలేయమంటు బతిమాలుకున్న వేళ
వెన్నెలేదో వేకువేదో నీకు తెలుసా మరి
నిదురపోయే మదిని గిల్లి ఎందుకా అల్లరి
చందమామ మనకందదని ముందుగానె అది తెలుసుకుని
చేయిజాచి పిలవద్దు అని చంటిపాపలకు చెబుతామా
లేనిపోని కలలెందుకని మేలుకుంటె అవి రావు అని
జన్మలోనె నిదరోకు అని కంటిపాపలకు చెబుతామా
కలలన్నవి కలలని నమ్మనని
అవి కలవని పిలవకు కలవమని
మది మీటుతున్న మధురానుభూతి మననడిగి చేరుతుందా
అందమైన హరివిల్లులతో వంతెనేసి చిరుజల్లులతో
చుక్కలన్ని దిగి వస్తుంటే కరిగిపోని దూరం ఉందా
అంతులేని తన అల్లరితో అలుపులేని తన అలజడితో
కెరటమెగిరి పడుతూ ఉంటే ఆకాశం తెగి పడుతుందా
మనసుంటే మార్గం ఉంది కద అనుకుంటే అందనిదుంటుందా
అనుకున్నవన్ని మనకందినట్టే అనుకుంటే తీరిపోదా
Posted by: Mr. Siri Siri At: 6, Jan 2009 11:29:58 AM IST నా చెలియ పాదాలు హంసలకే పాఠాలు
తాను పలికితె చాలు తేనె జలపాతాలు
ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు వేస్తూ అల్లుకుంటుంది
ముత్యాల ఝల్లు మృదువైన ముల్లు మదిలో గుచ్చుకుంటుంది
ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది
చెక్కిళ్ళలోని నొక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది
పట్టపగలెవరైనా రాతిరిని చూస్తారా
తన కురులు చూపిస్తా అవుననక ఛస్తారా
గుండెల్లో భోగి మంటలా ఎండల్లో లేత వెన్నెల
కొండల్లో ఏటి పరుగులా దూకుతున్న లయలో
గుమ్మంలో సందె వెలుగులా కొమ్మల్లో కొత్త చిగురులా
మబ్బుల్లో వెండి మెరుపులా ఆమెకెన్ని హొయలో
అలా నడిచి వస్తూంటే పూవుల వనం
శిలైపోని మనిషుంటే మనిషే అనం
గాలుల్లో ఆమె పరిమళం ఊపిరిలో నిండి ప్రతి క్షణం
ఎటు ఉన్నా నన్ను వదలదే ఎలా తప్పుకోను
గుర్తొస్తే ఆమె పరిచయం కవ్వించే పడుచు పసిదనం
రెప్పల్లో కైపు కలవరం ఎలా దాచుకోను
కలో కాదో నాకే నిజం తేలక
ఎలా చెప్పడం తాను నాకెవ్వరో
అదిరి పడకయ్యా ఇది ఆమె మాయ
ఇది కవిత కాదబ్బా మన్మధుడి దెబ్బ
Posted by: Mr. Siri Siri At: 6, Jan 2009 11:29:00 AM IST చెలియా నీవైపే వస్తున్నా
కంట పడవా ఇకనైనా ఎక్కడున్నా
నిద్దర పోతున్న రాతిరినడిగా
గూటికి చేరిన గువ్వలనడిగా
చల్లగాలినడిగా ఆ చందమామనడిగా
ప్రియురాలి జాడ చెప్పరేమని
అందరినీ ఇలా వెంట పడి అడగాలా
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా
అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణం
అరెరే పాపమని జాలిగా చూసే జనం
గోరంత గొడవ జరిగితె కొండంత కోపమా
నన్నొదిలి నువ్వు ఉండగలవ నిజం చెప్పవమ్మా
నువ్వు నా ప్రాణం అని విన్నవించు ఈ పాటని
ఎక్కడో దూరానున్న చుక్కలే విన్నాగాని
కదిలించలేద కాస్త కూడ నీ మనస్సుని
పరదాలు దాటి ఒక్కసారి పలకరిచవేమే
Posted by: Mr. Siri Siri At: 6, Jan 2009 11:27:03 AM IST మువ్వలా నవ్వకలా ముద్దమందారమా
ముగ్గులో దించకిలా ముగ్ధసింగారమా
నేలకే నాట్యం నేర్పావే నయగారమా
గాలికే సంకెళ్ళేశావే
నన్నిలా మార్చగల కళ నీ సొంతమా
ఇది నీ మాయ వల కాదని అనకుమా
ఆశకే ఆయువు పోశావే మధుమంత్రమే
రేయికే రంగులు పూశావే
కలిసిన పరిచయం ఒకరోజే కదా
కలిగిన పరవశం యుగముల నాటిదా
కళ్ళతో చుసే నిజం నిజం కాదేమో
గుండెలో ఏదో ఇంకో సత్యం ఉందేమో
నన్నిలా మార్చగల కళ నీ సొంతమా
ఇది నీ మాయ వల కాదని అనకుమా
నేలకే నాట్యం నేర్పావే నయగారమా
గాలికే సంకెళ్ళేశావే
పగిలిన బొమ్మగా మిగిలిన నా కథ
మరియొక జన్మగా మొదలౌతున్నదా
పూటకో పుట్టుక ఇచ్చే వరం ప్రేమేగా
మనలో నిత్యం నిలిచే ప్రాణం తనేగా
మువ్వలా నవ్వకలా ముద్దమందారమా
ముగ్గులో దించకిలా ముగ్ధసింగారమా
ఆశకే ఆయువు పోశావే మధుమంత్రమే
రేయికే రంగులు పూశావే
Posted by: Mr. Siri Siri At: 6, Jan 2009 11:25:37 AM IST అమ్మలాలపైడి కొమ్మలాల ఏడి ఏవయ్యాడు జాడలేడియ్యాల కోటితందనాల ఆ నందలాల
గోవులాల పిల్లంగోవులాల గొల్లభామలాల యేడనుంది ఆలనాటి నందనాల ఆనందలీల
ఔరా అమ్మకచెల్ల ఆలకించి నమ్మడమెల్లా
అంత వింత గాథల్లో ఆనందలాల
బాపురే బ్రహ్మకు చెల్ల వైనమంత వల్లించవల్ల
రేపల్లె వాడల్లో ఆనందలీలా
అయినవాడే అందరికి అయినా అందడు ఎవ్వరికీ
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా ఛాంగుభళా
నల్లరాతి కండలతో కరుకైనవాడే
వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడే
నల్లరాతి కండలతో కరుకైనవాడే ఆ నందలాల
వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడే ఆనందలీలా
ఆయుధాలు పట్టను అంటూ బావ బండి తోలిపెట్టే ఆ నందలాల
జాణజానపదాలతో ఙానగీతి పలుకునటే ఆనందలీల
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా ఛాంగుభళా
ఆలమందకాపరిలా కనిపించలేదా ఆ నందలాల
ఆలమందు కాలుడిలా అనిపించుకాదా ఆనందలీల
వేలితో కొండను ఎత్తే కొండంత వేలు పట్టే ఆ నందలాల
తులసీదళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా ఛాంగుభళా
Posted by: Mr. Siri Siri At: 6, Jan 2009 11:24:32 AM IST చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలి
మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండే దారికి
వెళ్ళనివ్వరా వెన్నెలింటికి
విన్నవించరా వెండిమింటికి
జోజో లాలి జోజో లాలి
జోజో లాలి జోజో లాలి
మలిసంధ్య వేళాయే చలిగాలి వేణువాయే
నిదురమ్మా ఎటుబోతివే
మునిమాపు వేళాయే కనుపాప నిన్ను కోరే
కునుకమ్మా ఇటు చేరవే
నిదురమ్మా ఎటుబోతివే
కునుకమ్మా ఇటు చేరవే
గోధూళి వేళాయే గూళ్ళన్నీ కనులాయే
గువ్వల రెక్కలపైనా రివ్వూరివ్వున రావే
జోలపాడవా బేలకళ్ళకి
వెళ్ళనివ్వరా వెన్నెలింటికి
జోజో లాలి జోజో లాలి
పట్టుపరుపులేల పండువెన్నెలేల
అమ్మ ఒడి చాలదా బజ్జోవే తల్లి
పట్టుపరుపేలనే పండువెన్నెలేలనే
అమ్మ ఒడి చాలునే నిన్ను చల్లంగ జోకొట్టునే
నారదాదులేల నాదబ్రహ్మలేల
అమ్మ లాలి చాలదా బజ్జోవే తల్లి
నారదాదులేలనే నాదబ్రహ్మలేలనే
అమ్మ లాలి చాలునే నిన్ను కమ్మంగ లాలించునే
చిన్నిచిన్ని కన్నుల్లో ఎన్నివేల వెన్నెల్లో
తీయనైన కలలెన్నో ఊయలూగు వేళల్లో
అమ్మలాలపైడి కొమ్మలాల ఏడి ఏవయ్యాడు అంతులేడియ్యాల కోటితందనాల ఆ నందలాల
గోవులాల పిల్లంగోవులాల గొల్లభామలాల యాడనుంది ఆలనాటి నందనాల ఆనందలీల
జాడచెప్పరా చిట్టితల్లికి
వెళ్ళనివ్వరా వెన్నెలింటికి
జోజో లాలి జోజో లాలి
చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలి
మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండే దారికి
Posted by: Mr. Siri Siri At: 6, Jan 2009 11:22:11 AM IST ఆకాశ గంగా దూకావె పెంకితనంగ
జల జల జడిగ తొలి అలజడిగ
తడబడు అడుగా నిలబడు సరిగా
నా తలకు ముడివేస్తున్నా నిన్నాపగా
కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు విసిరావె
చిలకమ్మ గొంతెత్తి తీయంగ కసిరావె
చిటపటలాడి వెలసిన వాన
మెరుపుల దారి కనుమరుగైనా
నా గుండె లయలో విన్నా నీ అలికిడి
ఈ పూట వినకున్నా నా పాట ఆగేనా
ఏ బాటలోనైనా నీ పైటనొదిలేనా
మనసుని నీతో పంపిస్తున్నా
నీ ప్రతి మలుపు తెలుపవె అన్నా
ఆ జాడలన్నీ వెతికి నిన్ను చేరనా
ఆకాశ గంగ నిన్ను ఆపలేనే ఇంక
ముగిసిన కథగా మిగలని స్మృతిగ
కదలవె త్వరగా కడలికి జతగ
ఈ మంచు కొండని విడచి వెళ్ళాలిగా
Posted by: Mr. Siri Siri At: 6, Jan 2009 11:20:53 AM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|