Discussion on Offbeat n Jokes in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Offbeat n Jokes
ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి
< < Previous   Page: 39 of 169   Next > >  


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
ఉన్నట్టా లేనట్టా ఉండుంటే నిన్నేట్టా చేరాలె సిరి తునుక విన్నట్టా లేనట్టా వింటుంటే నా మాట ఊకొట్టవే చిలక నిదర చెడిన ఎద కుదుట పడదు కద ఏదో చేసుంటావే నువ్వు అమ్మాయీ అన్యాయంగా తెలుసుకోనీ ఆకాశవాణి చెలియ వైనాన్ని అడుగుపోనీ ఆ చిన్నదాన్ని నన్ను కలవమని ఏమంత పని ఉందని పారిపోయింది సౌదామిని ఏ సంగతీ చెప్పక మెరుపుతీగా! నీ మెలిక నాలో మిగిలిపోయిందే చిలిపి సైగా! నా మనసు నీతో వలస పోయిందే నువ్వు తాకినట్టుండగా ఓ తడి గొంతు వదిలావుగా మరచి పోనివ్వక

Posted by: Mr. Siri Siri At: 6, Jan 2009 11:19:30 AM IST
మూతి ముడుచుకున్నదే మువ్వంటి మైన అరె మబ్బేల దిగనంది ముత్యాల వాన మాట వరసకైనా తనకు చెప్పనంటు గీటుదాటకన్నా లెక్కచేయనంటు ఆమె గారి చేయి జారి మనసు గాని పారిపోయిందా ఏమైనా రానందా రమ్మన్నా సన్నాయిలా వినిపిస్తున్నవా చెవికొరికి పోయే చిరుగాలులు జడివానలా అనిపిస్తున్నవా జడపూల చాటున తడి ఊహలు ఇన్నాళ్ళు నువ్వైన చూసావటే నీక్కూడ ముద్దొచ్చే అందాలు ఇవ్వాళె నీకు తెలిసాయటే ఛీపాడు అనిపించు అర్ధాలు ఇంతలో ఇంతలా ఎంత వింత మార్పు వచ్చిందే నీలోన బాగుందే ఏమైనా ఉయ్యాలకే ఉలుకొచ్చిందట ఒళ్ళోంచి నువ్వు దిగి వెళ్ళావని పట్టీల అడుగే అలిగిందట చెట్టెక్కడం మానుకున్నావని పైటొచ్చి నీ జట్టు కట్టుకుందనీ ఆటాడె ఈడింక చేరనన్నది పారాణి కేమంత బరువుందని పాదాన్ని పరిగెత్తనీయకున్నది గుండెలో గువ్వలా తెంచుకున్న నిన్ను పిలిచిందే ఓ మేన పంపాలే ఏమైనా

Posted by: Mr. Siri Siri At: 6, Jan 2009 11:17:12 AM IST
ంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తు పట్టే గుండెనడుగు ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా తెలిస్తే ప్రతిచోట నిను నువ్వే కలుసుకొని పలకరించుకోవా కనపడేవెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రమంటారు అడగరేం ఒక్కొక్క అల పేరు మనకిలా ఎదురైన ప్రతివారు మనిషనే సంద్రాన కెరటాలు పలకరే మనిషీ అంటే ఎవరూ సరిగా చూస్తున్నదా నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది చుట్టు అద్దాలలో విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నది నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు నీ చూపుల్లో లేదా మన్ను మిన్ను నీరు అన్నీ కలిపితే నువ్వే కాదా కాదా ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా తెలిస్తే ప్రతిచోట నిను నువ్వే కలుసుకొని పలకరించుకోవా మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై నీడలు నిజాల సాక్ష్యాలే శత్రువులు నీలోని లోపాలే స్నేహితులు నీకున్న ఇష్టాలే ఋతువులు నీ భావ చిత్రాలే ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం మోసం రోషం ద్వేషం నీ మకిలి మదికి భాష్యం పుట్టుక చావు రెండే రెండూ నీకవి సొంతం కావు పోనీ జీవితకాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కానియ్యి

Posted by: Mr. Siri Siri At: 6, Jan 2009 11:15:32 AM IST
వంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం కష్టం వస్తేనేగద గుండె బలం తెలిసేది దుఃఖానికి తలవంచితె తెలివికింక విలువేది మంచైనా చెడ్డైనా పంచుకోను నే లేనా ఆ మాత్రం ఆత్మీయతకైన పనికిరానా ఎవ్వరితో ఏమాత్రం పంచుకోను వీలులేని అంతటి ఏకాంతమైన చింతలేమిటండి చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది గుండెల్లో సుడి తిరిగే కలత కథలు చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది కోకిలల గుంపుల్లో చెడబుట్టిన కాకిని అని అయిన వాళ్ళు వెలివేస్తే అయినానేకాకిని చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది పాట బాట మారాలని చెప్పడమే నా నేరం గూడు విడిచి పొమ్మన్నది నన్ను కన్న మమకారం వసంతాల అందం విరబూసే ఆనందం తేటి తేనె పాట పంచెవన్నెల విరి తోట బ్రతుకు పుస్తకంలో ఇది ఒకటేనా పుట మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ళ బాట చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది ఏటి పొడవునా వసంతమొకటేనా కాలం ఏదీ మరి మిగితా కాలాలకి తాళం నిట్టూర్పుల వడగాలుల శృతిలో ఒకడు కంటినీటి కుంభవృష్టి జడిలో ఇంకొకడు మంచు వంచనకు మోడై గోడు పెట్టువాడొకడు వీరి గొంతులోని కేక వెనుక ఉన్నదేరాగం అనుక్షణం వెంటాడే ఆవేదన ఏ రాగం అని అడిగిన నా ప్రశ్నకు అలిగినాప్త కోకిల కళ్ళు ఉన్న కబోదిలా చెవులు ఉన్న బధిరుడిలా నూతిలోని కప్పలా బ్రతకమన్న శాసనం కాదన్నందుకు అక్కడ కరువాయెను నా స్థానం చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది అసహాయతలో దడదడలాడే హృదయ మృదంగధ్వానం నాడుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం ఎడారి బ్రతుకున నిత్యం ఛస్తూ సాగే బాధల బిడారు దిక్కు మొక్కు తెలియని దీనుల వ్యదార్ధ జీవన స్వరాలు నిలువునా నన్ను కమ్ముతున్నాయి శాంతితో నిలువనీయకున్నాయి ఈ తీగలు సవరించాలి ఈ అపశృతి సరిచేయాలి జనగీతిని వద్దనుకుంటూ నాకు నేనె పెద్దనుకుంటూ కలలో జీవించను నేను కలవరింత కోరను నేను నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోస్తాను నేను సైతం ప్రపంచాజ్యపు తెల్లరేకై పల్లవిస్తాను నేను సైతం నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేను నేను సైతం నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేను సకల జగతిని శాశ్వతంగా వసంతం వరియించుదాక ప్రతీ మనిషికి జీవనంలో నందనం వికశించుదాక పాత పాటను పాడలేను కొత్త బాటను వీడిపోను నేను సైతం నేను సైతం

Posted by: Mr. Siri Siri At: 6, Jan 2009 11:14:31 AM IST
నేనని నీవని వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా నేను నీ నీడనీ నువ్వు నా నిజమనీ ఒప్పుకోగలరా ఎపుడైనా రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే అడ్డుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే మొదటి సారి మదిని చేరి నిదర లేపిన ఉదయమా వయసులోని పసితనాన్ని పలకరించిన ప్రణయమా మరీ కొత్తగా మరో పుట్టుక అనేటట్టుగా ఇది నీ మాయేనా పథము నాది పరుగు నీది రథము వేయరా ప్రియతమా తగువు నాది తెగువ నీది గెలుచుకో పురుషోత్తమా నువ్వే దారిగా నేనే చేరగా ఎటూ చూడక వెనువెంటే రానా

Posted by: Mr. Siri Siri At: 6, Jan 2009 11:13:12 AM IST
ఓకే అనేశా దేఖో నా భరోసా నీకే వదిలేశా నాకెందుకులే రభస భారమంతా నేను మోస్తా అల్లుకో ఆశాలత చేరదీస్తా సేవ చేస్తా రాణిలా చూస్తా అందుకేగా గుండెలో నీ పేరు రాశా తెలివనుకో తెగువనుకో మగ జన్మ కదా కథ మొదలనుకో తుది వరకు నిలబడగలదా పరిగెడదాం పదవే చెలీ ఎందాక అన్నానా కనిపెడదాం తుది మజిలి ఎక్కడున్నాం ఎగిరెళదాం ఇలనొదిలి నిన్నాగమన్నానా గెలవగలం గగనాన్ని ఎవరాపినా మరోసారి అను ఆ మాట మహారాజునైపోతాగా ప్రతి నిమిషం నీ కోసం ప్రాణం సైతం పందెం వేసేస్తా పాత ఋణమో కొత్త వరమో జన్మ ముడి వేసిందిలా చిలిపితనమో చెలిమి గుణమో ఏమిటీ లీలా స్వప్నలోకం ఏలుకుందాం రాగమాలా అదిగదిగో మదికెదురై కనబడలేదా కథ మొదలనుకో తుది వరకు నిలబడగలదా పిలిచినదా చిలిపి కల వింటూనే వచ్చేశా తరిమినదా చెలియనిలా పరుగుతీశా వదిలినదా బిడియమిలా ప్రశ్నల్ని చెరిపేశా ఎదురవదా చిక్కు వల ఏటో చూశా భలేగుందిలే నీ ధీమా ఫలిస్తుందిలే ఈ ప్రేమ అదరకుమా బెదరకుమా పరదా విడిరా సరదా పడదామా పక్కనుంటే ఫక్కుమంటూ నవ్వినాడా ప్రియతమా చిక్కులుంటే బిక్కుమంటూ లెక్క చేస్తామా చుక్కలన్నీ చిన్నబోవా చక్కనమ్మా మమతనుకో మగతనుకో మతి చెడిపోదా కథ మొదలనుకో తుది వరకు నిలబడగలదా

Posted by: Mr. Siri Siri At: 6, Jan 2009 11:11:41 AM IST
అదే నీవు అదే నేను అదే గీతం పాడనా అదే నీవు అదే నేను అదే గీతం పాడనా కథైనా కలైనా కనులలో చూడనా కొండా కోన గుండెల్లో ఎండావానలైనాము కొండా కోన గుండెల్లో ఎండావానలైనాము గువ్వ గువ్వ కౌగిల్లో గూడు చేసుకున్నాము అదే స్నేహము అదే మోహము అదే స్నేహము అదే మోహము ఆది అంతం ఏదీ లేని గానము నిన్నా రేపు సందెల్లో నేడై ఉందామన్నావు నిన్నా రేపు సందెల్లో నేడై ఉందామన్నావు కన్నీరైన ప్రేమల్లో పన్నీరౌదామన్నావు అదే బాసగా అదే ఆశగా అదే బాసగా అదే ఆశగా ఎన్నిన్నాళ్ళీ నిన్న పాటే పాడను

Posted by: Mr. Siri Siri At: 6, Jan 2009 11:09:38 AM IST
జీవితమంతా ఒక క్షణమైతే ప్రేమంతా ఒక చుమ్బనమైతే ఆ క్షణాన్ని దాస్తా నీ కోసం చుమ్బనాన్ని దాస్తా నీ కోసం ఈ నిర్జన జగదాలయ శిథిలాల్లో కాలేకాలపు కడ కొసవరకూ నేను ఎదురుచుస్తా నీ కోసం సిరులన్నీ ఒక మానికమైతే విరులన్నీ ఒక కోరకమైతే మానికాన్ని దాస్తా నీ కోసం కోరకాన్ని కోస్తా నీ కోసం ఈ నిర్జన జగదాలయ శిథిలాల్లో కాలేకాలపు కడ కొసవరకూ నేను ఎదురుచుస్తా నీ కోసం నా గానం జ్వలితానలమైతే నా ప్రాణం చలితానిలమైతే కావి మాత్రమిస్తా నీ కోసం తావి తేనే మోస్తా నీ కోసం ఈ నిర్జన జగదాలయ శిథిలాల్లో కాలేకాలపు కడ కొసవరకూ నేను ఎదురుచుస్తా నీ కోసం

Posted by: Mr. Siri Siri At: 6, Jan 2009 11:04:13 AM IST
"Who do you turn to when the only person in the world that can stop you from crying, is exactly the one making you cry ??"

Posted by: Mr. Siri Siri At: 6, Jan 2009 10:59:48 AM IST
"Love is when hurting her will hurt you more."

Posted by: Mr. Siri Siri At: 6, Jan 2009 10:56:51 AM IST
< < Previous   Page: 39 of 169   Next > >  
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.