
|
|

General Forum: Offbeat n Jokes | జోకులేసుకుందాం రా ! | |
| 1. " మా ఆవిడది భలే క్యారెక్టర్ లే" అన్నాడు రామేశం
" ఏమైంది" అడిగాడు గిరీశం.
" నిన్న రైలు కింద పడతానని పట్టాల మీద కాస్సేఫు నిలబడింది. రెండు గంటల తర్వాత అటువైపు వచ్చిన ఒక రైలు పట్టాలు తప్పింది" అసలు సంగతి చెప్పాడు రామేశం.
2. " చూడమ్మా, రేప్ జరిగాక పోలీస్ స్టేషన్ కు వెళ్ళి కంప్లయింట్ ఇవ్వక నా దగ్గరకు వచ్చావెందుకు ?" అడిగారు జిల్లా జడ్జి గారు.
"అక్కడికి వెళితే మళ్ళీ సామూహిక మానభంగం చేస్తారేమోనని భయమేసి మీ దగ్గరకు వచ్చాను సార్" అసలు సంగతి చెప్పింది ఆ అమ్మాయి.
3." ఒరేయ్ బంటి,మీ తమ్ముడు చూడు ఎప్పుడూ నవ్వుతుంటాడు, మరి నీదో, ఎప్పుడూ ఏడుస్తునట్లుగా వుంటుంది" కోపంగా అన్నాడు హోం ట్యుషన్లు చెప్పే రాజు.
" మరి వాడికి మీ గోల లేదు కద సార్" అసలు సంగతి చెప్పాడు బంటి.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 17, Apr 2010 2:21:07 PM IST rAjanna-----Emdi subbannA...sempalaTTA vAsipOyinayyi..gavajabillalEmO DAkTaruki sUpimchukOnnA.....
subbanna----------EmdilEdu rAjannAAmaddEla mAyamma sachchipOyinAdigadannA....ninna podduTEla jagananna mAyimTi kochchimDannA OdArpu yAtramTa...vachchinOLLamtA jaganannatO pATu mAyimTOlladari sempalU nimirEsinArannA...sUDu yimTOllamdariki nAlekkanE sempalu vAsipOyinAyannA...ninnaTElanimchii niillukUDA tAgalEka pOtannAmannA noppitO....
Posted by: Mr. karan karan At: 13, Apr 2010 10:43:52 AM IST 1. " మా ఆయన నెత్తికి అరవై ఏళ్ళొచ్చినా ఒక్క తెల్ల వెంట్రుక కూడా లేదు తెలుసా" గొప్పలు చెప్పుకుంది ఆండాళ్ళు.
" అబ్బా ! అంత వయసు వచ్చినా జుత్తు తెల్లబడకుండా అలా నల్లగా ఎలా వుంది? ఆ చిట్కా ఏదో కొంచెం చెబితే మా ఆయనపై నేను కూడా ప్రయోగిస్తాను" ఆసక్తిగా అడిగింది మీనాక్షమ్మ.
" జుత్తు నల్లగా వుందని నేనెప్పుడు అన్నాను ? ఆయన నెత్తిపై ఒక్క వెంట్రుక కూడా లేకపోతేను" అసలు సంగతి నెమ్మదిగా చెప్పింది ఆండాళ్ళు.
2. "మీ పెర్సనల్ అసిస్టెంట్ ఈ నెల నుండి జీతం వెయ్యి రూపాయలు పెంచమని డిమాండ్ చేస్తోంది సార్" వినయం గా అన్నాడు గుమాస్తా గుర్నాధం.
"పెంచకపోతే ఏం చేస్తుందట" కోపంగా అడిగాడు మేనేజర్ మరిడేశ్వరరావు.
"సాయంత్రాలు మీరిచ్చే స్పెషల్ డిక్టేషన్లు తీసుకోవడానికి మన కంపెని గెస్ట్ హవుసుకు రావడం మానెస్తుందట సార్" చేతులు నలుపుకుంటూ అసలు సంగతి చెప్పాడు గుర్నాధం.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 12, Apr 2010 2:53:52 PM IST 1. " నాకు గొప్ప ఉద్యోగం ఎప్పుడు వస్తుందో కాస్త చెప్పు" హస్త సాముద్రికుడిని అడిగాడు రాజు.
" అదే గనక తెలిస్తే అడ్డమైన వెధవల చేతులు పట్టుకొని జాతకాలు ఎందుకు చెప్పుకుంటాను" తనలో తాను గొణుకున్నాడు సిద్ధాంతి.
2." నువ్వు ఊటీ వెళ్ళవటగా బాగా ఎంజాయ్ చేసావా?" అడిగాడు నీరజ్
" ఎంజాయా పాడా ?నాతో మా ఆవిడ వచ్చింది కదా, రోజంతా దానిని కట్టుకున్నందుకు నన్ను నేను తిట్టుకోవడంతోనే సరిపోయింది" విచారంగా అసలు సంగతి చెప్పాడు ధీరజ్
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 10, Apr 2010 2:10:01 PM IST navvula viMdu idi maatraM. pratAp gaaru, durga gaaru, taata gaariki naa abhinandanalu.
Posted by: Bullibasu Bullibasu At: 10, Apr 2010 1:45:53 AM IST 1. "పోస్టాఫీసులో పని చేసేవాడికి తెలిసి కూడా అప్పివ్వడం తప్పయిపోయింది" విచారంగా అన్నాడు అజయ్.
"ఏమయ్యింది ?" ఆసక్తిగా అడిగాడు విజయ్.
" ఏడాది కింద వెయ్యి రూపాయలు అప్పిచ్చాను. ఎప్పుడు బాకీ తీర్చమని అడిగినా ఆరేళ్ళ తర్వాత వడ్డితో సహా రెట్టింపు ఇస్తానని అంటున్నాడు" అసలు సంగతి చెప్పాడు విజయ్.
2. "ఏమిటి డైరక్టరు గారు, స్వంత సినిమా ప్రివ్యూ చూడడానికి మన నిర్మాత గారు బయలు దేరుతుంటే వద్దన్నారట ఎందుకు" అడిగాడు అసిస్టెంట్ డైరక్టరు.
" ఆయన అసలే హార్ట్ పేషెంట్, నేను తీసిన సినిమా ఫైనల్ ప్రింట్ చూస్తే తట్టుకోలేడనిపించింది, అందుకే వద్దన్నాను" అసలు సంగతి చెప్పాడు డైరక్టర్.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 9, Apr 2010 4:00:45 PM IST 1." ఈ రోజుల్లో పిల్లలు తెలివి మీరిపోయారురా సుబ్బారావు" బాధగా అన్నాడు వెంకట్రావు
"ఏమైంది ?" అడిగాడు సుబ్బారావు.
" మా అబ్బాయిని పెద్దయితే ఏమవుదామనుకుంటున్నావు రా నాని అని అడిగితే ఏమన్నడో తెలుసా?" ఆగాడు వెంకట్రావు.
"ఏమన్నాడేమిటి?" ఆశ్చర్యంగా అడిగాడు సుబ్బారావు.
" మీ పెంపకం బావుంటే ఏ డాక్టరో లేక ఇంజనీరునో అవుదామనుకుంటున్నాను డాడీ అని జవాబిచ్చాడు" చెప్పాడు వెంకట్రావు.
2. "మీ అబ్బాయికి పోలియో ఎప్పుడొచ్చింది" ఆశ్చర్యంగా అడిగింది రజని.
"పోలియో కాదు పాడు కాదు,వాళ్ళ స్కూలులో డాన్స్ ప్రోగ్రాములో పాల్గొనేందుకు ట్రైనింగ్ ఇస్తున్నారు, అప్పటి నుండి ఇదే వరస.శరీరంలో జాయింట్లు అన్నీ కదిలిపోయేలా నడుస్తున్నాడు.చూసే వాళ్ళు దడుసుకొని చస్తున్నారు" బాధగా చెప్పింది శ్రీలత.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 2, Mar 2010 7:54:56 PM IST 1. డాక్టర్ గారు !నేను ఈ ఆపరేషన్ తర్వాత బ్రతుకుతానంటారా ?" అడిగాడు అయోమయం
' వంద శాతం బ్రతుకుతారు. ఆ గ్యారంటీ నేను ఇవ్వగలను" బల్ల గుద్ది చెప్పాడు డాక్టర్ వెటకారం.
" అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారు డాక్టర్ గారు?" ఆశ్చర్యంగా అడిగాడు అయోమయం.
" సాధారణంగా నేను చేసే ఆపరేషన్ లలో పదిమందిలో తొమ్మిది మంది బ్రతకరు. నిన్ననే నా తొమ్మిదో పేషెంట్ చచ్చిపోయాడు. అందుకే అంత నమ్మకంగా చెప్పగలుగుతున్నాను " అసలు సంగతి చెప్పాడు డాక్టర్ వెటకారం.
2."సారి, మా ఆఫీసులో పనులేమీ లేవు.అందుకని మీకు ఉద్యోగాం ఇవ్వలేను" చెప్పాడు మేనేజర్ సుబ్బారావు.
"అలా అయితే నేను మీకు చక్కగా సరిపోతాను సార్. నాకు మీరు ఉద్యోగం ఇస్తే పనులు ఇవ్వమని అడగనే అడగను. కాం గా ఒక మూల కూర్చోని పల్లీలు తింటూ టైం పాస్ చేసేస్తాను.నెలయ్యే సరికి మీరు జీతం ఇస్తే చాలు" బ్రతిమిలాడుకున్నాడు శ్రీశాంత్.
3. "క్లాసులో సన్నాసి దద్దమ్మ ఎంకమ్మ గాళ్ళు ఎవరైనా వుంటే లేచి నిలబడండి" వెటకారంగా అడిగాడు తెలుగు ఫ్రొఫెసరు అయోమయం.
క్లాసులో చాలా సేపు నిసబ్దం రాజ్యమేలిన తర్వాత లేచి నిలబడ్డాడు విక్రం.
" యు ఆర్ రియల్లీ గ్రేట్. ఇప్పుడు నిన్ను ఒక సన్నాసి దద్దమ్మ అని ఎందుకనుకుంటున్నావో క్లాసుకు వివరించి చెప్పు" అడిగాడు అయోమయం.
"నేను అనుకోవడం కాదు సార్, క్లాసులో మీరొక్కరే చాలా సేపు నిలబడి వుండడం చూసి భరించలేక కంపెనీ నేను నిలబడ్డాను సార్" అసలు సంగతి చెప్పాడు విక్రం.
అంతే ! సదరు ఫ్రొఫెసరు గారి ముఖంలో కత్తి వాటుకు నెత్తుటి చుక్క లేదు.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 27, Feb 2010 3:01:32 PM IST aarELLa kurraaDu aame vaMka dIxagaa chUsi chivaraki daggaraku veLLi
aamTI mI poTTa aMta ettugaa vuMdEmiTi ani aDigaaDu
lOpala baabu vunnaaDu aMdaame
nijamaa!
avunu nijaMgaa vunnaaDu
aabaabu maMchivaaDEnaa?
aahaa! chaalaa maMchivaaDu
mareitE aMta maMchi vaaNNi eMduku tinEsaaru mIru?
Courtesy Silican India
Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 13, Feb 2010 5:49:39 PM IST అక్కడ రోడ్లు & భవనాల మంత్రి కి మెకానిక్కులు మరియు ఆటోమొబైల్ వాళ్ళంతా కలిసి ఘన సన్మానం చేస్తున్నారు.
" ఒరేయ్! మంత్రికి వాళ్ళంతా కలిసి సన్మానం ఎందుకు చేస్తున్నారు?"
"ఏం లేదురా! మినిస్టర్ పుణ్యమాని వాళ్ళందరి వ్యాపారాలు బాగా జరుగుతున్నాయట! ఆయనే రోడ్లు బాగుపరిస్తే వారి కి
ఇంతలా వ్యాపారాలు జరుగవు కదాని!"
-posted by K.Raghuveer
Posted by: Mr. Kacham Raghuveer At: 12, Feb 2010 2:59:16 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|