
|
|

General Forum: Religion | bhagavantuniki bhaktuniki madhya anusandhaanamainadi EnTi?? | |
| జైబాబా
గీతానామ సహస్రము
భగవానుడు మానవునికి కర్మ చేయు అధికారము మాత్రమే యున్నదని,నిష్కామ కర్మ ఆచరించు ఆత్మ విదుని కర్మలు బంధించవని తెలుపుచూ,నిత్య సన్న్యాసి లక్షణములను వివరించు చున్నాడు.
మనలో ఆరుగురు శత్రువులున్నారు-వారే కామ,క్రోధ,లోభ,మోహ మద,మాత్సర్యాలు.వీటి ప్రభావమును అణచటానికి సంసారులైనా సన్న్యాసులైనా నిత్యము ప్రయత్నించాలి.కోరికల మీద విరక్తి కలిగి వాటిని త్యజించిన వానికి ద్వేషముండదు.
ద్వందములగు సుఖ దుఃఖములు,లాభనష్టములు,జయాపజయములు-సుఖ దుఃఖములు మనసుకు,లాభనష్టములు బుధ్ధికి,జయాపజయములు శరీరమునకు సంబంధించినవి-వీటికి అతీతుడైన వాడు బంధముల నుండి తేలికగా విడివడు చున్నాడు-అట్టివాడు సంసార జీవితము గడుపుచున్నా నిత్య సన్న్యాసి యని భగవానుడిచట తెలిపెను.
Posted by: Mr dyvadhinam yaddanapudi At: 24, Feb 2011 9:41:40 PM IST జైబాబా
గీతానామ సహస్రము
మోక్ష కాముల మార్గమును ప్రకాశింప జేయు ప్రకాశనుడని విష్ణు సహస్రము న గలదు.కర్మలు సన్న్యశించిన సన్న్యా సుల లక్షణాలను తెలిపిన ముండకోపనిషత్ సారమును ఈ అధ్యాయమున వివరించుట జరిగినది.
సన్న్యాసః కర్మయోగశ్చ నిశ్శ్రేయస కరా వుభౌ
తయోస్తు కర్మ సన్న్యాసా త్కర్మ యోగో విశిష్యతే
కర్మ సన్న్యాసమును కర్మయోగమును మోక్ష దాయకములైనను,కర్మయోగము శ్రేష్టమైనది.
మన భరత వర్షము కర్మ భూమి గనుక కర్మాచరణ తప్పని సరి.కర్మ చేయుటకే అధికారమున్నదనికర్మఫలాసక్తి కూడదని.కర్మలు మానవద్దని రెండవ అధ్యాయమున భగవానుడు చెప్పియున్నాడు.ఈ నవ విధ సృష్టిలో మానవ సృష్టి తొమ్మిదవది.మానవులు రజో గుణ ప్రేరణ చే అన్ని పనులు కర్తృత్వ మారోపించుకొని వాతావరణమునకు లొంగి కర్మబధ్ధులై పనులు చేయుచున్నారు.ఇంతవరకు అర్జునుడు ఫలాపేక్ష తో కర్మలాచరించి విషాదమునకు గురియగుట చే నిష్కామ కర్మాచరణ కర్మ సన్న్యాసము కంటె మంచిదని వివరించుచుండెను.
Posted by: Mr dyvadhinam yaddanapudi At: 20, Feb 2011 8:33:34 PM IST అవతార మూర్తి భుజాలు అందమైనవి,లోకమునకు ఆనందము కలిగించేవి,శివధనుర్భంగము గావించిన రాముని సుందరబాహువులు,,గోవర్ధనగిరి చిటికన వ్రేలి మీద నెత్తి"శైలాంభోనిధి జంతు సంయుత ధరా చక్రంబు పైబడ్డ నా కేలల్లాడదు" అనే బాల క్రిష్ణునుని చిన్ని చేతులు సుభుజాలే.
జలనిధిలో మునిగిన ధరణిని చేతుల తో పైకెత్త గలడు,ఇంద్రుని కొరకై చేయి జాపి బలి చక్రవర్తిని దానమడుగ గలడు.చేతులెన్నైనా పరమాత్ముని చేతలు ఈ నాటికి అందరికి చిర స్మరణీయము
ఇంద్రాది దేవతల మహేంద్రుడు.ధనమున్న వాడు,భక్తుల దరిద్ర నాశనము చేయువాడు,వారి హృదయ కుహరములందు నివసించుట చే వసుదః,వసుః అని కీర్తించబడుచున్నాడు.కిరణములే చేతులుగా మలచుకొనే శిపి విష్టుడు.అంతకంతకు పెరిగే బృహద్రూపము,తన ధాటికెవరు ఆగలేని ధుర్ధరుడు,మధుర వాగ్మి పరమాత్మ.(వాక్చతురుడు),ఆయన వాక్కులు శృతి సాగరపు అలలే.మహేంద్రుడై,అడిగన వారి అర్హతలబట్టి నొసగే వసుః,ఎన్ని రూపాలైనా ధరించి అన్నిటా వెలుగులు చిమ్మే ప్రకాశనుడు.
Posted by: Mr dyvadhinam yaddanapudi At: 14, Feb 2011 9:12:35 PM IST జై బాబా
గీతానామ సహస్రము
కర్మాచరణకు అనువైన చేతులు కావాలి..కమలాక్షు నర్చించు కరములు కరములు.సాలంకృత బాహుడు శ్రీ మహావిష్ణువు,ఆజానుబాహువుడు కోదండ రాముడు.అర్జునునకు కనబడిన విరాట్ రూపములో
అనేక బాహువులున్నా,విరాట్ పురుషుడు రెండు చేతులతో పది వ్రేళ్ళను ఒక్క మారు తెరచి చూపుతాడని "అత్యతిష్టత్ దశాంగులం"అని ఋగ్వేద మంత్రము తెలుపుచున్నది.అట్టి బాహువులకు(బాహుభ్యాముత తే నమః)నమస్కారము.త్రిభుజము లోని భుజములను బాహువులనెదరు.పైధాగరస్ అను మహాశయుడు త్రిభుజము బొమ్మ నుండి సృష్టి రహస్యములు వివరించెను.భూమి ఆధార స్తానము,అది ఒక సరళ రేఖ గాను,దానిని ఒక బిందువు వద్ద ఖండించుచూ ఏర్పడిన సరళ రేఖ సూర్యోదయ సూర్యాస్తమయములనులను కలిపినట్లూహించినచో,ఆ బిందువువద్ద పుట్టిన నాలుగు సమ కోణములకు ఎదురుగా నాలుగు కర్ణము లేర్పడును.అవే నాల్గు భుజములుగా విష్ణు సూక్తమున "చతుర్భిఃసాకం" అను మంత్రము లో సూచకమని పెద్దలందురు.
సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః
నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః
Posted by: Mr dyvadhinam yaddanapudi At: 8, Feb 2011 9:36:46 PM IST జై బాబా
గీతానామ సహస్రము
ప్రకృతి చే ప్రేరేపింపబడి మనుష్యులు కర్మలాచరించెదరు.పనులు చేయ క యుండుటకు గాని,చేయటానికి ప్రారంభించడానికి గాని ప్రకృతి మూలకారణము.జగద్ వ్యూహమనుసరించి ప్రకృతి పరిణామములు జరుగు చుండును,అందు మానవులు కేవలము పరికరములు వలనే ఉపయోగ బడెదరు ,.వేడి వస్తువులను పట్టుకొను పట్కారు వలె యంత్రము లోని కీలు బొమ్మలవలె వారు చేయు పనులకును సిధ్ధించు ఫలితములకును సంబంధము యుండదు.మనము చేయు పనుల మంచి చెడులు మనసుకు తెలుసు.మనసు మంచి దైన చేయు పనులు మంచివగును.మంచి మనసు గా మారటనికి మనసు ఆత్మ వైపు లగ్నము కావాలి.మనసు బాహ్యేంద్రియాలనుండి మళ్ళితే కార్యాచరణ సాధ్యమగునా-సాంఖ్యము గొప్ప దా,యోగము గొప్పదా-సాంఖ్యమనగా ఙ్ఞానము,యోగమనగా దానిని కర్మాచరణలో పెట్టుట.సాంఖ్యము సాధన చేసిన ఫలితమే యోగ ఫలితము,యోగ సాధన ఫలితమే సాంఖ్య(ఙ్ఞానులుపొందు) ఫలితము.అని గీతలొ భగవానుడు వివరించెను.
Posted by: Mr dyvadhinam yaddanapudi At: 7, Feb 2011 9:33:18 AM IST జైబాబా
గీతానామ సహస్రము
అనేక వృషాహములు అనే ధర్మాల ద్వారా సేవింపబడే వాడు విష్ణు భగవానుడు.వృషాహమనే యఙ్ఞమునకు అధి దేవుడు విష్ణువు.వృషాహమనగా తేజో మయమైన పర్వ దినము పండుగ రోజు. పరమాత్మను సేవించు ప్రతి దినము పండుగ దినమే. సత్కర్మాచరణ లో ధర్మ సంస్థాపన జరుగును..వృషః అనగా ధర్మము. ద్ధర్మాచరణకు నిచ్చెనలాగ మనకు(వృషపర్వుడు) సాధన లో తోడ్పడేది విష్ణు భగవానుడె.ధర్మావతారమే తాను,తన భక్తుల ఙ్ఞాన,సంపదల అభి వృధ్ధికి తోడ్పడే వర్ధనుడు,పొట్టివాడిగా కనిపించి అంత లోనే బ్రహ్మాండ మతిక్రమించే వర్ధమానుడు,సృజించినది తానైనా
కర్మ బంధములేని వివక్తుడు,యంత్రము తయారు చేసినవాడు యంత్రమునకు వేరుగా నున్న రీతి పరమాత్మ నిస్సంగత్వముగా ప్రవర్తించును.వేదాల నాదాలు అందించే శ్రుతి సాగరుడు.పైనామావళి పరమాత్మ ధర్మదీక్ష,అందుకు అంతకంతకు పెరిగే వర్ధమానత్వము,అంతలోనె నిస్సంగత్వము,మనకు సూచింపబడినవి.
సన్న్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి
యచ్చ్రేయ ఏతయో రేకం తన్మే బ్రూహి సునిశ్చితం
కర్మ సన్న్యాసము,కర్మ యోగాలలో ఏది శ్రేష్టమైనది అని అర్జునుని సందేహము.కర్మ సన్న్యాసము చేసి,ఆత్మ వైపు ఇంద్రియములను మళ్ళించుట మంచిదా,యోగ బుధ్ధి తో సత్కర్మ లాచరించుట మంచిదా అని సందేహము.
ధర్మస్థాపన చేయవలసినది దేవుడు,ధర్మాచరణకు పూను కొన వలసినది జీవుడు.ఉపాయము-అనగా సాధనా పరికరము తానై,ఉపేయము అనగా ఫలము తానైనవాడు.
Posted by: Mr dyvadhinam yaddanapudi At: 4, Feb 2011 10:17:21 PM IST జైబాబా
గీతానామ సహస్రము
గీత పంచమో అధ్యాయమునకు కర్మసన్న్యాస యోగమని పేరు.ఇందులో కర్మాచరణ విధానము,నిజమైన సన్న్యాసమేమిటో తెలుపబడినది.లుపబడినది.
ఒక పరి కర్మాచరణ విద్యుక్త ధర్మని చెప్పుచూ కర్మసన్న్యాసము శ్రేష్టమని పలుకుచుంటివి-ఈ రెండింటి లో ఏది శ్రేయస్కరమో తెలుపు మని అర్జునుడు భగవానుని అడుగుట జరిగినది.
ఇంతకుముందు సహితము మూడవ అధ్యాయమున ఙ్ఞానము శ్రేష్టమైన కర్మా చరణ నేనెందుకు చేయాలి అని అర్జునుడు అడుగుట జరిగినది.భగవానుడు ఉపదేశించిన యోగమొకటే-మానవుల స్వభావముల ననుసరించి అది రెండు విధములుగా-ఙ్ఞాన కర్మ మార్గములుగా మోక్షమే లక్ష్యముగా సాధకులచే అనాది నుండి ఆచరింపబడుచున్నది.ఙ్ఞాన నిష్టులను సాంఖ్యులని,కర్మాచరణులను యోగులని పిలువబడుచున్న్నారు.ఇంద్రియములు ఆత్మ వైపు లగ్నము చేయు ఙ్ఞానులు కోరేది మోక్షమే,కర్మే విధిగాభావించే సంసారులు కోరేది మోక్షమే.ఎవరికైనా సాధనలు వేరైనా వచ్చే ఫలిత మొక్కటే.ఙ్ఞానులకు ఆత్మ దర్శన మైనంతనే మనసున కోరికలు గాని చేయదగు పనులు గాని యుండవు,కర్మా చరణులకు కోరికలుండుట సహజమే,వారు ఫలాశక్తి విడచియోగనిష్ట్లై తో తమ విధులు నిర్వర్తించిన కర్మ బంధము వీడి మోక్షార్హులగుదురు.
కర్మ సన్న్యాసమనగా కర్మలను త్యజించుట కాదని,కర్మ ఫలము కోరకుండుటేనిజమైన సన్న్యాసము.ఙ్ఞానము,కర్మ కౌశలతలేని కర్మా చరణ, ఆచరణ లో పెట్టని
ఙ్ఞానాను భూతి రెండూ వ్యర్ధము లగును.
కళ్ళు,చెవులు,నోరు,కాళ్ళు,చేతులు కట్టివేసి పనులు మానినా ఆపనులమీదికి మనసు పోకుండా అరికట్టుట కష్టమని భగవానుడు తెలిపెను.ఎంతో మానశిక పరిపక్వత వస్తే కాని సన్న్యాసము సఫలత నొందదు.
Posted by: Mr dyvadhinam yaddanapudi At: 31, Jan 2011 9:09:09 PM IST జైబాబా
గీతానామ సహస్రము
ఆధ్యాత్మిక సాధనలో ఎదురగు అవరోధాలు మొదటి అద్యాయమున తెలుపబడినవి.రెండవ అధ్యాయమున ఙ్ఞానము కర్మాచరణలో జతపరచి(యోగస్త కురు కర్మాణి)విధులు నిర్వర్తించాలని తెలుపబడినది.ఈ పధ్ధతి ఆచరణ లో పెట్టే విధానము మూడవ అధ్యాయమున వివరించిరి.ప్రకృతి,పురుషుడు మన దైనందిక జీవితమున మన సాధనలో తోడ్పడేది,కాళ్ళు చేతుల తో చేయు సామాన్య కర్మలు,మనసు తో నాచరించు ఙ్ఞాన కర్మలను అకర్మలని,శాస్త్రవిరుధ్ధ కర్మలను వికర్మలని నాలుగవ అధ్యాయమున వివరింపబడెను.ఇందలి యోగము మొదట సూర్యునకు చెప్పితిని అని అనుటలో జగములోని జనానికి మొదట ఒకే మతమని అది కాలవశమున ప్రాంతాలననుసరించి,జన జీవన శైలి బేధములవలన పలు మతములుగా పరమాత్మ ఒక్కనినే సహస్ర నామాలతో పిలచిన విధముగా జనులు పలు మతాను వర్తులైరి అని గీత లోని ఈ అధ్యామువలన మనకు తెలియుచున్నది.
Posted by: Mr dyvadhinam yaddanapudi At: 29, Jan 2011 7:18:04 PM IST జైబాబా
గీతానామ సహస్రము
యోగ సన్న్యస్త కర్మాణం ఙ్ఞాన సంచిన్న సంశయం
ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ
యోగ నిష్ట తో కర్మలు చేయాలి-అనగా ఆత్మ ఙ్ఞాన అనుసంధానముతో కర్మఫలము ఆశించకుండా ఙ్ఞాన సముపార్జన తో సందేహ నివృత్తి గావించుకోని కర్మలు చేయాలి.-అట్టి వానిని కర్మలు బంధించవు.
తస్మా దఙ్ఞాన సంభూతం హృత్ స్థం ఙ్ఙ్ఞానాసి నాత్మనః
చిత్వైనం సంశయం యోగ మాత్తిష్టోత్తిష్ట భారత
అఙ్ఞానం వలన సంశయాలు కలుగును.వాటిని ఙ్ఞానమనే ఖడ్గముతో తెగ నరకి యోగ నిష్టుడవై కర్మఫలము ఆశించకుండా ఆత్మ ఙ్ఞానాను సంధానముతో కర్మలాచరించమని భగవానుని బోధ
యోగమనగా సిధ్ధించినను సిధ్ధించకున్నను సమ బుధ్ధి తో కర్మలాచరించుట. కర్మా చరణలో వచ్చే ఫలితాలకు ఒడి దుడుకులు పడకుండుటే నిస్సంగత్వం.మనతోటి వ్యక్తులతోను సన్నివేశములతోను మనకు విడదీయరానిసంబంధమున్నది.ఇది మనసు పై ఆధారపడి యుండును.రాగ ద్వేషాలు మొదలగును.దీనినే సంగమం అనెదరు.అది లేకుండుటే నిస్సంగత్వం.
ధర్మ సంస్తాపన కొరకు,శిష్ట రక్షణ దుష్ట శిక్ష ణకు అవతరించుతానని తనను కర్మ ఫలము బంధించదని,అదే విధముగా కర్మఫలాపేక్ష వదలి ఇంద్రియ మనస్సులను తన వశము నందుంచుకొని,లభించిన దానితో తృప్తి చెందిన వాడు,జయాపజయములందు,లాభ నష్టములయందు సమ బుధ్ధి కలవాడు కర్మల చే బంధింప బడడు. ఈ
అధ్యాయము ఙ్ఞాన యోగమైనా నిజానికి కర్మ యోగ రహస్యమే.కర్మ చేయుచూ ఙ్ఞానానుసంధానము చేయుట చెప్పబడినది.చేయు పని నా స్వార్ధము కొరకు కాదు ఇది భగవంతుని పని అని ఆత్మ చింతన చేయుట లోనే ఙ్ఞానము అంతర్గతముగా నున్నది.విష్ణు సహస్ర నామాలలో విశిష్ట,శిష్టకృత్,శుచి అని కలవు.ఈ అధ్యాయములో చెప్పినట్లు ధర్మసంస్థాపనలో విశిష్టుడు.ధర్మమును
నిలబెట్టే శాసన కర్త-మాలిన్య రహితుడు కనుక శుచిమంతుడు.భగవానుడు. కర్మ జీవి కూడా ఈ గుణాలు అలవర్చు కొవాలని మనకు సూచించుటకే గీతావాణి నామ సహస్రం సాధన లగుచున్నవి.
ఙ్ఞాన నావ,ఙ్ఞానాగ్ని,ఙ్ఞానతపస్స్సు,ఙ్ఞాన ఖడ్గం అని తెలుపబడినవి-మండుచున్న అగ్ని కట్టెలను బూడిద చేసినట్లు ఙ్ఞానాగ్ని సమస్త కర్మలను భస్మము చేయును
పూర్వజన్మ పాపాలు భస్మమగుటకు చేయాలి ఙ్ఞాన తపస్సు,,సంసారసాగరమీదుటకు ఙ్ఞాన నావ కావాలి,పాపమునంతను ఙ్ఞానమను తెప్ప(నావ)తో దాట గలము
సంశయములు అనగా సందేహాలు ఙ్ఙ్ఞాన ఖడ్గముతో ఛేదించాలి.ఙ్ఞాన తపస్సు చే కామ, భయ క్రోధము వాటంతటవే తొలగును,మనసు పరమాత్మయందే లగ్నమగును.కోరికలు మానవ సహజము.వాటివలన తప్పులేదు.కోరిక తీరాలనే ధ్రుఢ సంకల్పముతో మనసు పాడు చేసుకొనుటే కామము ఆ కామము మని షి పతనముకు దారి తీయును.
కర్మ యోగములో నేను చేస్తున్నాననే కర్తృత్వ భావము,ఫల త్యాగము(ఫలితము కోరకుండుట)సంగ త్యాగము(రాగ ద్వేషాలు వదలి)కర్మలు చేయాలి.రాగ ద్వేషాలు మురికి పట్టిన పాత్రలో పోసిన పాలవంటివి.అవి మనసును కలుషితము చేయును.భగవానుడు మనకు అష్ట సిధ్ధులు ఇవ్వడానికి మన మనసు కూడా శుధ్ధిగా యుండాలి.సిధ్ధ సత్య సంకల్పము మనకుండాలి.అప్పుడె మనము సిధ్ధ సాధనునుండి కోర్కెలు నెరవేర్చు కొనగలము.కార్యము ఫలించుటకు సాధనము పరమాత్మ్ మాత్రమే అని తలచే వాడు కర్మ లాచరించే ఙ్ఞాని. అన్ని కర్మలు సంసార బంధము పెంచవు.కర్మ యోగము కొత్త కర్మకు ప్రేరణ ఇవ్వదు కేవలం కర్మ చేయడము,కేవలము ఆత్మానుసంధానము చేయడము తెలుపబడినది. కర్మ చేస్తూ ఆత్మాను సంధానము చేయడం ఉత్తమమని,.ద్రవ్య యఙ్ఞము కంటె ఙ్ఞాన యఙ్ఞము శ్రేయస్కరమని వివరించిరి. నదులన్ని
సముద్రమును చేరినట్లు కర్మలన్ని `ఙ్ఞానమందే లీనమగును.ఆధ్యాత్మిక సాధన ఒక యఙ్ఞముగా చేయమని సంసారములో నున్న సాధకులకు సూచించబడినది.
Posted by: Mr dyvadhinam yaddanapudi At: 24, Jan 2011 4:03:14 PM IST unicode the posting
Posted by: Mr dyvadhinam yaddanapudi At: 24, Jan 2011 3:51:11 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|