Discussion on Offbeat n Jokes in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Offbeat n Jokes
ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి
< < Previous   Page: 43 of 169   Next > >  


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
Ornee inTaapaTaa అందనంత దూరానికి స్వర్గమే తెచ్చావు.... EnTehe ?! andakapOtE soragam endukuraa?! adsarEgaanOrE aa pErEnTiraa alaa peTTukunnaavu Sri Sri ani. ee pejalu naapErukee nee pErukee tEDaa telusukunEnta telivainOllEmee kaadu gaanee mundaa pEru maarchehe ! TAPASVI2008 ID peTTukunnaavu .kompadeesi tapassu settaavunTaavEnTiraa?! tapassu sEsinaa voraalivvanaaki dEvullevaruu richhaa ekki raaru. EndukanTE vaallandaruu kotta samvatsaraaniki gOvaa beechikeldaamaa PlOriDaa beechikeldaama ani tikamakapaDi tannukunTunnaaru. baabbaabbaabuu.. mundaa pEru maarchu naayanaa !

Posted by: Mr. Siri Siri At: 31, Dec 2008 11:02:41 AM IST
శిశిరంలో వసంతం.... అమావాశ్య రాతిరిలో వెన్నెల వై వచ్చావు, నడిరేయి జాములోకి వేకువలా వచ్చావు, ఆశలేని జీవితాన అందమైన స్వప్నమా, రంగు లేని మనసులోకి హరివిల్లు వై వచ్చావు.... రాగం లేని బ్రతుకున అనురాగమే దిద్దావు, యడారి వంటి మనసున తొలి చినుకువై కురిశావు, అర్థరహిత జీవితాన అందమైన భావమా, అందనంత దూరానికి స్వర్గమే తెచ్చావు.... తడి ఆరిన పెదవులని అమౄతమై తడిపావు, నీరెరుగని యేరులోకి గంగవలే వచ్చావు, శిశిరంలో వసంతమా, నా యెదలోని రాగమా, పదం లేని పాటలోకి పల్లవివై వచ్చావు....

Posted by: Mr. Sri Sri At: 31, Dec 2008 0:01:31 AM IST
pani lEni pillagaaDokaDu paraayi vaaDi pellaanni peti rOjuu alankarinchEvODaTanDi. okaTi kaadu renDu kaadu.. aTTaa aa bhOgOtam EDu samvatsaraalu jarigindaTanDi. sivariki aa illaalu asalu sangati seppi turrumannaadaTanDi. evaru goppa ? kallu muusukuni pooja sEsina aa pillagaaDaa ?....lEka pooja sEyinchukunnaa aa illaalaa ?!

Posted by: Mr. Siri Siri At: 30, Dec 2008 10:52:31 AM IST
సన్నగ వీచే చల్ల గా...లికి కనులు మూసినా కలలాయే తెల్లని వెన్నెల పానుపు పై ఆ...... కలలో వింతలు కననాయే సన్నగ వీచే చల్ల గాలికి కనులు మూసినా కలలాయే తెల్లని వెన్నెల పానుపు పై ఆ కలలో వింతలు కననాయే అవి తలచిన ఏమో సిగ్గాయే కనులు తెరచినా నీవాయే నే కనులు మూసినా నీవాయే కనులు తెరచినా నీవాయే నిదురించిన నా హృదయమునెవరో కదిలించిన సడి విననాయే నిదురించిన నా హృదయమునెవరో కదిలించిన సడి విననాయే కలవరపడి నే కనులు తెరువ నా కంటి పాపలో నీవాయే ఎచట చూచినా నీవాయే కనులు తెరచినా నీవాయే నే కనులు మూసినా నీవాయే కనులు తెరచినా నీవాయే మేలుకొనిన నా మదిలో యేవో మెల్లని పిలుపులు విననాయే మేలుకొనిన నా మదిలో యేవో మెల్లని పిలుపులు విననాయే ఉలికిపాటుతో కలయ వెతక నా హృదయ ఫలకమున నీవాయే కనులు తెరచినా నీవాయే కనులు మూసినా నీవేనాయే

Posted by: Mr. Siri Siri At: 29, Dec 2008 2:00:24 PM IST
నన్నిడిసి పెట్టెల్లినాడే!నా రాజు.... మొన్న తిరిగొస్తనన్నాడే! నీలుతేబోతుంటె, నీతోడె - వోలమ్మి! న యెంటె యెవరోను నడిసి నట్టుంటాదె! నన్నిడిసి పెట్టెల్లినాడే నా రాజు.... అద్దములో సూత్తుంటె అది యేటో సిగ్గమ్మి! నా యనక యెవురోను నవ్వి నట్టుంటాదె! నన్నిడిసి పెట్టెల్లినాడే నా రాజు.... సల్లని యెన్నెట్లో సాపేసి కూకుంటె... ఒట్టమ్మి - ఒల్లంత ఉలికులికిపడతాదె! నన్నిడిసి పెట్టెల్లినాడే నా రాజు.... నీతైనవోడె, నా రాతెట్ట గుంటాదో! కళ్ళలో సత్తెముగ కట్టినట్టుంటాదె! నన్నిడిసి పెట్టెల్లినాడే నా రాజు... మొన్న తిరిగొస్తనన్నాడే!

Posted by: Mr. Siri Siri At: 29, Dec 2008 1:49:55 PM IST
ఆడ నీ సుక్కాని యీడ నే గెడయేసి పడవెక్కి బద్రాద్రి పోదామా! బద్రాద్రి రాముణ్ణీ సూదామా! గోదారి గంగలో కొంగు కొంగూ గట్టి కరువుతీరా బుడక లేదామా! సరిగెంగ తానాలు సేదామా! కొత్త మడతలు కట్టుకోని పెజలో కెల్లి ’రామన్న రాముడో’ యందామా! రామకతలే పోయి యిందామా! సంబరము కెదురుంగ జంటగా నిలుసుండి సామీవోరికి దణ్ణ మెడదామా! సాప సుట్టుగ నేల బడదామా! ఈడ నీ సుక్కాని ఆడ నే గెడయేసి పడవెక్కి మన పల్లె కెడదామా! బద్రాద్రి రాముణ్ణి సూదామా!

Posted by: Mr. Siri Siri At: 29, Dec 2008 1:48:07 PM IST
పడుకుంటె నాకేటో బ్రమ పుట్టినాదీ! కడుపులో సెయ్యేసి కదిపేసినాది! ఎడతెగని జలమంట నడమనో పడవంట! పడవెక్కి నా యెంకి పయన మయ్యిందంట! పడుకుంటె నాకేటో బ్రమ పుట్టినాదీ! కడుపులో సెయ్యేసి కదిపేసినాది! యెంకేటో బ్రమ పుట్టి యెనక తిరిగిందంట! సందెగాలికి పడవ సాగిపోయిందంట పడుకుంటె నాకేటో బ్రమ పుట్టినాదీ! కడుపులో సెయ్యేసి కదిపేసినాది! నీటి గాలికి యెంకి పైటెగురుతాదంట! పడిపోయి నట్టేటో పడవెల్లి నాదంట! పడుకుంటె నాకేటో బ్రమ పుట్టినాదీ! కడుపులో సెయ్యేసి కదిపేసినాది! పిల్ల సిగలో పూలు కళ్ళిప్పినాయంట! మిడిసిపాటు దోనె మీరిపోయిందంట! పడుకుంటె నాకేటో బ్రమ పుట్టినాదీ! కడుపులో సెయ్యేసి కదిపేసినాది! మెడసాటు వూసోటి మినుకుమంటాదంట! పంతాన గంతేసి పడవ పోయిందంట పడుకుంటె నాకేటో బ్రమ పుట్టినాదీ! కడుపులో సెయ్యేసి కదిపేసినాది! అంసల్లె బొమ్మల్లె అందాల బరిణల్లె సుక్కల్లె నా యెంకి సురిగిపోయిందంట! పడుకుంటే నాకేటో బ్రమ పుట్టినాది!

Posted by: Mr. Siri Siri At: 29, Dec 2008 1:45:59 PM IST
మనిసే సాలు ! మనిసి మాటే సాలు! మనిసి వోసనే సాలు! మనిసే సాలు! ఏతాము కెదురుంగ యెంకుంటే సాలు! వొంటరిగ సిటికేసి కుంట కలిపేను!! మనిసే సాలు ! మనిసి మాటే సాలు! మనిసి వోసనే సాలు! మనిసే సాలు! యెంకి అందెల గలగ లినబడితె సాలు! కళ్ళు మూసుకు నీరు మళ్ళ కెత్తేను!! మనిసే సాలు ! మనిసి మాటే సాలు! మనిసి వోసనే సాలు! మనిసే సాలు! యెంకి గా లొకసారి యిసిరినా సాలు! తోటంత రాజల్లె తొవ్వి పోసేను!! మనిసే సాలు ! మనిసి మాటే సాలు! మనిసి వోసనే సాలు! మనిసే సాలు! అందాల నా యెంకి వుందంటె సాలు నిబ్బరముగా రేత్రి నిదురపొయ్యేను!! మనిసే సాలు ! మనిసి మాటే సాలు! మనిసి వోసనే సాలు! మనిసే సాలు!

Posted by: Mr. Siri Siri At: 29, Dec 2008 1:44:12 PM IST
ఉత్తమా యిల్లాలి నోయీ! నన్నుసురు పెడితే దోస మోయీ! నిదరలో నిను సూసి సెదిరే నేమో మనసు! పొరుగు పోరంత నా సరస కురికారంట! ఉత్తమ యిల్లాలి నోయీ......... "ఏలనే నవ్వం"ట! "ఏడుపేలే " యంట పదిమంది ఆయింత పగలబడి నారంట ఉత్తమ యిల్లాలి నోయీ......... గాలెంట వోయమ్మ! దూళెంట వోయమ్మ! యిరుగు పొరుగోరంత యిరగబడి నారంట! ఉత్తమా యిల్లాలి నోయీ........ యీబూది ఒకతెట్టే! యీ పింకొకతె తట్టె, నీలు సిలికె దొకతె! నిలిసి సూసే దొకతె! ఉత్తమా యిల్లాలి నోయీ.......... సాటు నుండే యెంఖి సబకు రాజేశావ? పదిమంది నోళ్ళలో పడమంట రాశావ? ఉత్తమా యిల్లాలి నోయీ..........

Posted by: Mr. Siri Siri At: 29, Dec 2008 1:42:25 PM IST
సాటేలా ? నీకు మాటేలా? సిన్న తనమేలా? సిగ్గేలా? ఆ సీమ యీ సీమ అంద చందాలు తిన్నంగ నిను సూసె దిద్దుకుంటారు ! సాటేలా ? నీకు మాటేలా? సిన్న తనమేలా? సిగ్గేలా? ముందు మన పాపణ్ణి కింద దిగనీరు యెంకి కో వంటారు! యెత్తుకుంటారు! సాటేలా ? నీకు మాటేలా? సిన్న తనమేలా? సిగ్గేలా? యెంకొక్క దేవతై యెలిసె నంటారు యింటింట పెడతారు యెంకి నీ పేరు! సాటేలా ? నీకు మాటేలా? సిన్న తనమేలా? సిగ్గేలా?

Posted by: Mr. Siri Siri At: 29, Dec 2008 1:40:29 PM IST
< < Previous   Page: 43 of 169   Next > >  
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.